Wednesday, November 18, 2009

Om

ఓం నమశ్శివాయ ,శివాయ నమః

ఓం కారము బ్రహ్మాయెను
హ్రీం కారము విష్ణు వయ్యె హ్రీం శివు  డయ్యెన్
ఐం కారము శ ర్వా ణిగ
శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్ .





Friday, July 31, 2009

వాయన దానం

ఇందిరా ప్రతి గ్రుహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమోనమః

తోర బంధ నం

బధ్నామి దక్షిణే హస్తే నవ సూత్రమ్ శు భ ప్రదం
పుత్ర పౌత్రా భి వృద్దించ మమ సౌభా గ్యం దేహి మే రమే .

Sunday, July 12, 2009

సువ్వి యనుచు పాడరమ్మా సుందరాంగులేల్ల గూడి ,నాగు మాట కాదె కొమ్మా
నాటి సమ్వర్త లాడే నమ్మా ,యవ్వనంబు చాల దమ్మా, ఏమీ ఎరుగని బాలికమ్మా
బువ్వ తినుట నేరదమ్మా, పువ్వు బోణిని చూడ రమ్మా , తెల్ల చీ ర కట్టేనమ్మా తోయజాక్షి ఎరుగదమ్మా
తల్లి జూచిచెప్ప గానే తల వంచి నవ్వే నమ్మా , పల్లవ పాణూలు మీరు పచ్చి యాకులు పరువరమ్మా
పాలు నెయ్యి తేగదమ్మా బాలికచే నద్దించ రమ్మా ,విప్ర వరుని పిలువ రమ్మా
విడియము సమర్పించ రమ్మా , విప్పి పంచాగామ్ము చూడ గానే యుక్త మైన నక్షత్రమమ్మా
పుత్రులు కల్గేదరనుచూ భూసురులు పల్కేనమ్మా , భాసురాంగి అత్తా వార్కి సుభ లేఖ వ్రాయ రమ్మా
కాన్చనావ రత్న రోళ్ళపసుపు కొమ్ము రోకలిచే ,పంచదార కొబ్బరినీ పడతూ లంతా దంచరంమా
కాంచనా పల్లెరములో కరము లొప్ప తోడరమ్మా, మంచి సెనగలు ,చిమ్మిలినీ పంచి పెట్ట సాగి రమ్మా .

పౌర్ణమ్మినాడైన పుట్టు భోగౌను,పాడ్యమ్మి నాడైన పడతి వేరుండు ,విదియ నాడాదితే వ్యభిచారి యగును
తదియ నాడాదితే తగు పుష్ట్టి కద్దు ,చవితి యందు కలహంబు పెంచేది యగును
బాగు పంచమి నాడు భాగ్యవతి యగు ,సష్టి నాడాదితే సతి మంతురాలు
సప్తమ్మి నాడైతే అతి జాలి మనసు ,అసుర బాగూ చేసు అష్టమ్మి నాడు
బాగు చేసును పరగ తిది నవమి నాడు ,దశమి నాడాదితే దసమంతురాలు
పరగ ద్వాదశి నాడు పాప ఖర్మౌను, తన్ను జేజే యండ్రు త్రయోదశి నాడు
తనకు హానీ కల్గు చతుర్దశి నాడు ,అతివ పురుషుని పాప మామ వాస్య నాడు
అని చెప్పి మునివరులు అరున్ధతీ తోను .కావించి రక్షతలు కనక పల్లెరముల
కావిళ్ళ తైలాల గంపల్ల పసుపు ,ఎత్త గలవారిచే ఎత్తించి రపుడు
వేయి లక్ష భాగ్యమ్ము వేలదిరో మోయ వెలది సీతా సౌత్హ వేడూ కలాయే
సుభ లగ్నమందున సుభ కరుణ జూచి సుభ కరంబగు దృష్టి జూచి హర్షముతో
పంచమ్మి గద నేడు పద్మ లోచనకు దీవెనలు,పతిభక్తి nఇలకడై తోచు
పరుల దూశిన్చదు బె భాషియగును అనంత కాలమూ ముత్తైదువూతనము
వారాలలో ఫలము చెప్పేద వినుదీ, సోమవారము నాడు సోమ పతివ్రత
మంగళ వారము నాడు మగువకు చింత ,బుధ వారము నాడు పుట్టుర్ల నెత్తు
గురు వారము నాడు గూదుసంపదలు ,శుక్ర వారము నాడు సుదతి సుఖ పదునూ
శని వారము నాడు సతి పేదరాలు ,ఆది వారము నాడు అతివ లోగౌను

చే లు ల తో ఆ డు చుండ గనుఆ వి ద చే రువున్న ముత్తైదు గనెనూ

గరిమ వేగమె పోయి కౌ శల్య కపు దూ,విన్నపము తా జేసే వేడ్కతో నపుడు

అందెలు కదలగా కుందను లడర ,హంస నడకల చేడె అతివ రావమ్మా

దిగ్గున జానకి శిరము వంచుకొని ,అత్తరో కౌ స ల్య ఎదుటనే నిలిచి

నవ్వుచూ కోడలిని నాతి తా బిలచే ,నాతి కట్టిన చీర తా విప్పి జూచె

ఎవ్వరి నంటకను హేమ పీటమున ,జవ్వని కూర్చున్ద మరియాద తో నూ

అరుంధతిని బిలపించి అపుడు కౌసల్య ,సరిగాను మన సీతసవత్తలాడే

వెలయ పంచాంగంము విప్పి జూచె నపుడు ,అమర పాదాసేవ అందముతో జేసే

Tuesday, March 24, 2009

రజస్వల పాట

బిగువాయే కుచములు ముఖము కళ ఎక్కే ముఖమున ఒక చిన్న మొటిమ తాలేచే
కొమరి ప్రాయము తోచే కోమలి కపుడు పడతికి సంస్థ ప్రాయమ్బు లాయే
పసు చూసి పమిడి చెరగులా చీర గట్టి కుసుమములు కుంకుమ రేఖ దిద్ది
ఆట కూతమ్మితో ఆనగరిలోనూ చెలులతో జానకి ఆదుచున్దగనూ

Sunday, March 8, 2009

రజస్వల పాట

శ్రీ రమణి భూసుతకు సీతవైబుట్టి కూరిమ్మి జనకునకు కూతురై పెరిగి
శ్రీ రామ చంద్రులను చెలగి పెండ్లాడి ఆ రమణి వినయముతో అత్తమామలకు
పరిచర్య చేయుచు పతిభక్తితోను పెరుగు చుండెను సీత పెంపు దివేనలా