Sunday, July 12, 2009

సువ్వి యనుచు పాడరమ్మా సుందరాంగులేల్ల గూడి ,నాగు మాట కాదె కొమ్మా
నాటి సమ్వర్త లాడే నమ్మా ,యవ్వనంబు చాల దమ్మా, ఏమీ ఎరుగని బాలికమ్మా
బువ్వ తినుట నేరదమ్మా, పువ్వు బోణిని చూడ రమ్మా , తెల్ల చీ ర కట్టేనమ్మా తోయజాక్షి ఎరుగదమ్మా
తల్లి జూచిచెప్ప గానే తల వంచి నవ్వే నమ్మా , పల్లవ పాణూలు మీరు పచ్చి యాకులు పరువరమ్మా
పాలు నెయ్యి తేగదమ్మా బాలికచే నద్దించ రమ్మా ,విప్ర వరుని పిలువ రమ్మా
విడియము సమర్పించ రమ్మా , విప్పి పంచాగామ్ము చూడ గానే యుక్త మైన నక్షత్రమమ్మా
పుత్రులు కల్గేదరనుచూ భూసురులు పల్కేనమ్మా , భాసురాంగి అత్తా వార్కి సుభ లేఖ వ్రాయ రమ్మా
కాన్చనావ రత్న రోళ్ళపసుపు కొమ్ము రోకలిచే ,పంచదార కొబ్బరినీ పడతూ లంతా దంచరంమా
కాంచనా పల్లెరములో కరము లొప్ప తోడరమ్మా, మంచి సెనగలు ,చిమ్మిలినీ పంచి పెట్ట సాగి రమ్మా .

No comments:

Post a Comment