Sunday, January 31, 2010

పెన్నిధి

రమ ణు ల సన్నిధి పెన్నిధి
రమ ణు ల యా శ్ర మ పధంబు రమ ణీ యంబై
రమ ణు ల మనముల నిలిచిన
రమ ణు ల సేవింతు నెపుడు రాగము తోడన్ .

Saturday, January 30, 2010

అవధానము

రావూరి వంశ మండన !
కోవూ రున బుట్టి నీవు కోరిక లలరన్
ఏవూ రి వాడవైనను
మావూ రికి రండి స్వామి! మన్నన లొందన్.

అవధానము లన్నిట నీ
య వ దాన మె గొప్ప దండ్రు ఆర్యా రాధ్యా !
అవధానం బొ న రిం పుము
అవధానపు చక్రవర్తి ఆశువు గాగన్



ధన్యుడు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వా మీ !

Friday, January 29, 2010

డొంకరాయి

ఇల డొంకరాయి పురమున
వెలసిన యా రామ చంద్రు వేడుక మీ రన్
కొలిచిన నిచ్చును శుభములు
కొలువగ వే రండు మీరు కొలుతును నేనున్ .

అప్పనపల్లి

అప్పనపల్లి పురంబున
నొప్పుగ వేంచేసి నట్టియప్పరమాత్మున్
మెప్పు తొ కొలిచిన వారికి
నప్పతియే తప్పకిచ్చు నాయువు సిరులున్ .

మంగళము

మంగళ యోగి హ్రుద యాబ్జ మందిరమునకు
మంగళము సచ్చిదా నంద మయున కెపుడు
మంగళము చిత్క లా పూ ర్ణ మహిత కాంతి
మండనునకు సదా జయ మంగళంబు .

జయ శ్రీ రమణ జయ భవ హరణ
జయ జయ సన్ముని సేవిత చరణ
జ్ఞానామృతమున దీనుల దనుప గ
పూ ని నరాకృతి బొందిన పరుడవు
శాంతి భూ ములను చరియించేడు నిను
చేరి భజించెద చిన్మయ రమన .
పాద కమల మధు పానము సేయుచు
పాడేద మదుపము భంగిని రమణము
తను వాగ్మనముల నిను సేవింపుచు
ఘనతర శాంతిని గనియె ద రమణ
సుందర నందన సూ రి జనావన
వందన శతముల నందవె రమణ
కై మోడ్చుచు నా గతి నీ వను నా
గాంబను కరుణ తొ నరయవే రమణ
జయ సుఖ రూపా జయ పర మేశా
జయ జయ అరు ణాచల శ్రీ రమణ !

Thursday, January 28, 2010

గురు వర రమణ !

శాంతిం నేతుం మునింద్రా న్నిజ పద శర ణా దక్షి ణా మూర్తి రూపో
మౌనం భావం ప్రది స్య స్వ కమ థ జగత శ్చాపి జీ వా భి ద స్య
ఉక్త్వా తాదా త్మ్య భావం గురు నుతి వచసా శంకరా చార్య రూ పో
ప్యా స్తే శో ణా ద్రి మూలో గురువర ర మ ణో యః పరస్తం నమామి .

తా .జీ వ రూ ప మున నున్న జగత్తుకు త న మౌనమును జూ పి తన పాదముల నా శ్ర యించిన మునులకు
శాంతిని కలిగించుటకు దక్షి ణా మూ ర్తి రూ పమున నున్న వాడును ,గురు స్తోత్రముచే ఐ క్య భా వమును
శంకరా చార్య రూ పమున నున్న వాడును ,అరు ణా చల మూ లమున నున్న పరమ గురు వర్యుడగు
రమ ణు ని నమస్క రింతును.

Sunday, January 24, 2010

భీష్మునకు తర్ప ణము

వైయ్యాఘ్ర పద్య గోత్రాయ
సాం కృత్య ప్రవరాయచ
గంగా పుత్రాయ భీ ష్మాయ
ఆ జన్మ బ్రహ్మ చారి ణే
అ పుత్రాయ దదా మ్యే తత్
ఉదకం భీష్మ వర్మ ణే.

Saturday, January 23, 2010

జాగ్రత జాగ్రత

ఆశయా బధ్యతే లోకో ,కర్మణా బహు చింతయా
ఆయు క్షిణం న జానాతి తస్మాత్ జాగ్ర త జాగ్రత .
౪. పొన్నుకు వేరుగ భూషణ ముండునే
తన్ను విడిచి తనువేది -తన్ను
దను వను వాడ జ్ఞుడు తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు .
౫. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు నాది -గురు చెప్పక
చెప్పి తెలియగ జేసినారే , ఎవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .


ఏకాత్మ తత్వము నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు .

ఏకాత్మ పంచకము

౧ తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కనుట కను

౨ తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?

యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యీ డు పలుకు
౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు

బ్రహ్మాస్త్రము

సకల వేదాంత సారంబు సంగ్రహించి
యాత్మ చిద్వహ్నిలో బు టంబమరబెట్టి
ధ్యానమను సానబట్టిన నేనేవండ ?
ననుచు వెడలిన దివ్యాస్త్ర మగునుగాదె.

Friday, January 22, 2010

వందే గురు ........

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం .

కర్మ ఫలము

కర్మమున బుట్టు జంతువు
కర్మమునన వృద్ది బొందు కర్మమున జెడున్
కర్మమే జనులకు దేవత
కర్మమే సుఖ దుఃఖ ములకు కారణ మధిపా!

కర్మములకు దగు ఫలములు
కర్ములకు నిడంగ రాజు గాని సదా ని
ష్కర్ముడగు నీ శ్వ రుడును
కర్మ విహీనునకు రాజుగాడు మహాత్మా !



రమణ మహర్షి ప్రార్ధన

హృదయ కమల దళంబులన్ జెదరకుండ
అక్షర స్వ రూ పుండ వై యేలరు నిన్ను
కర్మ వాసన మసకచే గాంచలేక
హస్త లిఖితా క్షరము కోర నగునే రమణ !