Sunday, February 28, 2010

మానవ సేవ

మఱువకు మానవ సేవను
మరువకు నీ బంధు జనుల మరువకు శి వునిన్
మరువకు నీ కర్తవ్యము
మరువకు నీ మాతృసేవ మహిలో నరుడా !


బాబా !

బాబాని కోరినంత నె
బాబాయే వేగ వచ్చి బాధలు తీ ర్చున్
బాబా కది సంతోషము
బాబా మా ప్రా ణ మౌట భాగ్యము మాదే .

వడ్ల గింజ

నిండార పంట చేలను
పండారిన వడ్ల గింజ పండుగ చేయన్
కండ్లార చూ సి గింజను
పండారిన ద య్యె మనసు పరిపరి విధమున్ .

చిట పటలాడు

చిటపట లాడుట మానుము
చిటపటలే క్రుంగ దీయు మేటిని నైనన్
చిటపటల వల్ల మనుజులు
జటిలముగా మారుచుంద్రు జగముల నెల్లన్ .

Friday, February 26, 2010

గో వర్ధన గిరి

గోవర్ధన గిరి ఎత్తియు
గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
గోవనితలు గోపాలురు
గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్ .

సాదర వందనాలు

వంశ మెన్న గ చాగంటి వంశ తిలక !
కోట +ఈ శ్వర కలిపిన కుదిరె పే రు
రావు అనునది నీ పేర చివర గలదు
అందుకోవయ్య ! సాదర వందనాలు .

సుందర కాండ

కాండల నన్నిట మెరుగగు
కాండము మఱి సుందరండ్రు కావ్యజ్ఞులిలన్
పండుగ రోజున చదివిన
మెండుగ యా హనుమ యిచ్చు మిత్తిని లేమిన్ .

ఏరకుమి.......

ఏరకుమి బియ్య మటులను
ఏరకుమీ కంది పప్పు ఏరకు మినుముల్
ఏరకుమి పంచదారను
ఏరకుమీ క్రింద పడిన వేరకు సుమ్మీ .

Monday, February 22, 2010

పరమాత్మ

పరమాత్మని శి వునందురు
పరమాత్మయె కార ణంబు వాయువు వీ చన్
పరమాత్మయె ది శ లన్నియు
పరమాత్మయె జీ వ కో టి పరి కిం పం గాన్.

అద్భుతానందము

ఎల్ల పనులు మాని ఏ కాగ్రచిత్తుడై
ఎవడు చేయు పూజ నిహము నందు
అట్టి నరున కిచ్చు అద్భుతా నందము
భవుని చేష్ట యదియ భవ్యము గ ను .


మామిడికుదురు

మామిడికుదురు పురంబున
మామిడి మఱి పనస పండ్లు మైమర పిం పన్
తెమ్మంటిని యా పండ్లను
నమ్మకు నై వే ద్యమిచ్చి నాకలి దీ ర్పన్.

Sunday, February 21, 2010

పరువము తో .....

ఒరులకు చేయుము సాయము
కరవైనను బంధు జనుల కడ కేగకుమా
పరులకు మర్మము సెప్పక
పరువము తో బ్రతుకు మెపుడు పాప విరోధీ !

Friday, February 19, 2010

సూరేకారము

తెచ్చితి సూరేకారము
తెచ్చితి మఱి గంధకంబు తెచ్చితి బీడున్
తెచ్చితిని యాముదంబును
తెచ్చిన మఱి నింక యేమి తేవలె జెపుమా !

Thursday, February 18, 2010

భగవాన్

మళ్లీ మళ్లీ మనిషిగా పుట్టి ఏ దో చేయాలని లేదు
మళ్లీ మళ్లీ మర ణించి స్వర్గ సుఖాలు పొందాల నీ లేదు
నిన్ను సరాసరి చేరుకునే మార్గం చూ పించు
ఆ మార్గంలో ఒంటరిగానైనా నన్ను పయనించ నీ
నాకు నీ వరాలు భోగాలు సంపద లూ వద్దు
ఎన్ని అనుభవించినా అన్నింటి నీ వదులు కోవలసినదే
అందు కే భగవాన్ ! నిన్ను నేనే మీ కావాలని కోరను
నేను ఎవరో గుర్తించే జ్ఞానాన్ని మాత్రము నాకు ప్రసాదించు .

బాబయ్య

తెలుగు సాహిత్య రంగాన్ని తీర్చి దిద్ది
నీ ది యగుశై లి నొకదాని నిగ్రహించి
తెలుగు భాషకు వన్నెను దెచ్చినావు
శే ష బాబయ్య! నే నిదె సే రికొలు తు.

Wednesday, February 17, 2010

పాపాత్ముడు

తన గుణము తనకు నుండగ
నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో
తన గుణము తెలియ కన్యుని
పనిగొని దూ షించు వాడు పాపాత్ముండున్.

లే ప్తాప్

బ్లూ మింగు డేలు నందున
మే మీ లే ప్టాపు నందు రామాయణమున్
ఏ మరు పాటుం జెందక
రాముని కథ చే యుచుంటి పారాయణగాన్.

Tuesday, February 16, 2010

మకుట ధారణ శ్లో కములు

బ్రహ్మ ణా నిర్మితం పూ ర్వం
కి రీ టం రత్న శో భీతం
అభిషిక్త పురా ఏవ
మనుస్థం దీప్త తేజసం
తస్యాం వమాయే రాజానః
క్రమద్యే నైభిషి చైతః
సభాయాం హేమ క్లుప్తాయాం
శో భితాయాం మహా ఘనైహి
రత్నైర్నావదిస్సైవ
చిత్రితాయాం సు శో భానైహి
నానా రత్న మయే పీ టే
కల్పయిత్వా యధావిదిహి
కి రీ టే న తతః పశ్యాట్
వ శి స్టీన మహాత్మనా
ఋ త్విక్ర్భుషనస్చైవ
సమయోధ్యాతా రాఘవః












Monday, February 15, 2010

వం శో ద్దారక !

అంజని వం శో ద్ధారక !
అంజలి జోడిం తు నీ కు ఆర్యారాధ్యా !
అంజనము వేసి కనుమా
అంజలిలో నేమి గలదొ అంజని పుత్రా !


Sunday, February 14, 2010

ప్రేమ పిశాచి

ప్రేమికుల దినము కావున
ప్రేమికు  లీ  రోజు మిగుల  ప్రేమాయ ణు లై
ప్రేమ ను  మునుగుచు దే లుచు
ప్రేమను  బరమార్ధ మనుచు బెంచుదు రికపైన్ 

బ్లూమింగు డేలు

బ్లూ మింగు డేలు పురమున
అమితముగా మంచు కురిసి అందము కలుగన్
హిమసంద్రము తలపించిన
ఇమ్మంచుని పొగడనిలను నేరికి తరమే ?

గుడ్బై చెప్పుట యుక్తము
గుడ్బై బ్లూ మింగు డేలు గుడ్బై నీ కున్
గుడ్బైలు కాదు యండులు
గుడ్బై యే మరల నగును గుడ్మోర్నిం గన్ .



Friday, February 12, 2010

రామ భక్త !

రామ నామము జపియించు రామ బంట !
ప్రాణ రక్షక లక్ష్మణ ప్రాణ దాత !
వాయు వేగము కలిగిన వాయు పుత్ర !
నా మనంబున నుండుమా రామ భక్త ! ..

ఆత్మ హత్యకు తలపడినట్టి నరుని
జాగుసేయక దరిజేరి జాలితోడ
బుజ్జగింతును దయగల నొజ్జవోలె
నా మనంబున నుండుమా రామ భక్త ! ..

చావు కోరిన మనుజుడు చావలేడు
నింద  లేనిదే మననుండి బొందు పోదు
కార్య కారణ ఘటనల కర్త వీ వ
నా మనంబున నుండుమా రామ భక్త !


ధర్మసంస్థాపనార్ధమై ధర ణి పుట్టె
రామ నామాభిదేయుడై రమ్య మల రె
భజన గావింతు నని శ మ్ము భక్తి తోడ
నామనంబున నుండుమా రామ భక్త ! .


ఆది మధ్యాంత రంబుల కంద కుండ
ఆక సంబంత రూ పంబు నావహించి
లంక కాల్చగ వచ్చిన రామ దూ త
నా మనంబున నుండుమా రామ భక్త ! .

రామ నామము ప్రజకుశ్రీ రామ రక్ష
కూడ బలుకుచు వ్రాయుడు కోటి మార్లు
వ్రాయ దలచితి నిక పైన వ్రాయు నపుడు
నామనంబున నుండుమా రామభక్త !




కదన రంగాన లక్ష్మ ణు క్రిందఁ బడగ
రావ ణా నుజ ప్రేర ణ దివికి నేగి
యౌషధంబును దెచ్చిన యాంజనేయ!
నామనంబున నుండుమా రామభక్త !

అలుపుసలుపులు నె రుగని  యమర వీ ర !
వట్టి ప్రేర ణ కతనన పరుగులెత్తి
రావ ణా దుల జావుకు రా ణ వీ వ
నామనంబున నుండుమా రామభక్త !

ద్రవ్య మిమ్మనినీవెంట దగులలేదు
భూములిమ్మని నీ పేరుఁ బొగడ లేదు
నేను గోరిన దొక్క టే నిన్ను సామి!
నామనంబున నుండుమా రామ భక్త !

ప్రీతి సేయక వేవంక బెట్టనేమి
కల్ప వృక్షంబు వలె నీవు కల్గ నింక
ప్రజల లక్ష్యంబు నాకేల పాండురంగ !
నామనంబున నుండుమా రామ భక్త !

నిమిష మైనను నీ యందు నిలుప లేను
కష్టములకోర్వ నాచేత గాదు నిన్ను
స్మర ణ జేసెద నా యధాశక్తి కొలది
నామనంబున నుండుమా రామ భక్త !

వెళ్లిపోయిన సిరులేవి వెంటరావు
కూ డబెట్టిన సొమ్మేది కుడువరాదు
విత్తమార్జన కతనన విర్రవీగు
నామనంబున నుండుమా రామ భక్త !



బ్రతుకు నన్నాళ్ళు చేయుదు భజన నీకు
రామ !యిప్పుడే చేయుదు నామ భజన
మర ణ మాసన్న మైనచో మఱతు నేమొ?
నామనంబున నుండుమా రామ భక్త !

నామనంబున నుండుమా రామ భక్త !
యనుచు పలుమార్లు వేడిన నాదుకోవ ?
యయిన రాముని వేడెద నప్పుఁడైన
నామనంబున నుండుమా రామభక్త !

ముక్తి కోసము నేనిన్ను మ్రొక్కుచుంటి
పుడమి పుట్టిన జనుల మెప్పులకు గాదు
పారమార్దికమునకునే బాటు పడితి
నామనంబున నుండుమా రామభక్త !

ద్రోహ చింతన చేసెడి దుర్జనులకు
మధుర మైనట్టి నీ నామ మంత్ర మరయ
మర్కటంబుల మేనుకు మలయమట్లు
నామనంబున నుండుమా రామభక్త !


కమల నాభుని మహిమలు కానలేని
తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు
నరక లోకంబు చవిచూచు నట్టి పాపి
నామనంబున నుండుమా రామభక్త !

బాల్య మందున మఱి కాక ప్రాయ మం దొ
యెప్పుఁడెక్కడ యేవేళ నేక్ష ణం బొ
మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన
నామనంబున నుండుమా రామభక్త !



తల్లిదండ్రులు భార్యయు తనయులాది
చుట్టముల మీ ది భ్రమ దీ సి చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు
నామనంబున నుండుమా రామభక్త !

ఏ ది ఎటులగు నెవరికి యెరుక తరము ?
జరుగ మానదు జగతిని జరుగు నదియ
చింత గూ డదు దానికై సుంతయైన
నామనంబున నుండుమా రామ భక్త !

వ్రాయు వ్రాతలు నుదుటన వ్రాయుమయ్య
చేయు చేతలు పుడమిని చేయు మయ్య !
కో రు కోరిక లణచిన గూర్మి పుత్ర!
 నా మనంబున నుండుమా రామ భక్త !

శ్రీ లు బొంగిన శ్రీ దేవి సిరుల నొసగు
పాలు పొంగిన గో మాతపాల నిచ్చు
సంత సమ్మును గలుగఁగ సాక నన్ను
నామనంబున నుండుమా రామ భక్త !

రాళ్ల గాజులు చేయించె రామదాస
నుచును జెప్పుట మరచి తే యమ్మ నీవు
చెప్పు మీ వార్త ప్రభునకు మెప్పు కలుగ
నామనంబున నుండుమా రామ భక్త !

ఆయురారోగ్య సంపద లన్నియిచ్చి
యవనిలో మానవుల కన్ని యాసలిచ్చి
వ్యర్ధులను జేసి తెలిపెడి వాడ వీ వె
 నా మనంబున నుండుమా రామ భక్త !


కోటి వైద్యులు గుంపు గ గూ డియున్న
మరణ కాలము నెవ్వరు మాన్ప లేరు
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన
 నా మనంబున నుండుమా రామ భక్త !

సంత సంబున నుంచుమా స్వర్గ మందు
యెచట నన్నుంచి ననుగాని నెపుడు నిన్ను
మరచి పోకుండ  నీనామ స్మరణ నొసఁగి
నామనంబున నుండుమా రామ భక్త !

బాల్య మప్పటి నుండియు భక్తి తోడ
నిన్నె సేవించు చుంటిని నిజము నమ్ము
హీనుఁ డనుసుమా నీవు నన్నేలు కొనుచు
నామనంబున నుండుమా రామ భక్త

సుగుణ మొక్కటియును లేదు జూడబోవ
యొరుల మంచిని కీర్తిని యోర్వలేను
నేరములు కాచి రక్షించ నీవ దిక్కు
నామనంబున నుండుమా రామ భక్త !

పన్నగాధిప !మురహర !పద్మనాభ !
భాను తేజుడ గోవింద భాసమాన!
భజనఁ జేయుచు నుందు నా భావ మందు
నామనంబున నుండుమా రామ భక్త !

ఏ డు కొండల మీ దున్న వెం కటే శ !
రామ ! భవహర !మురహర ! రామ చంద్ర !
యీశ !జగదీ శ ! సర్వేశ !యీయ దయను
నామనంబున నుండుమా రామ భక్త !

తెలియ జాలక కొన్నియు తెలిసి కొన్ని
పాతకంబులు జేసితి పద్మనాభ !
కలుషములు ద్రుంచి నన్నేలు కష్ట మనక
నా మనంబున నుండుమా రామ భక్త !


పుట్టి నప్పటి నుండియు పుణ్య మెరుగ
భిక్ష మొక్కని కైనను బెట్ట లేదు
నలిన దళ నేత్ర !నిన్ను నే నమ్మి యుంటి
నామనంబున నుండుమా రామ భక్త !

కమల లోచన ! నరసింహ ! కాంతి తేజ !
జీ వ కోట్లను బోషింప నీ వె కాని
వే రె యొ క దాత లేడ య్యె వెతకి జూ డ
నామనంబున నుండుమా రామ భక్త !

పచ్చి చర్మపు దిత్తిది పనికి రాదు
కాటికే గాని కొఱ గాదు గవ్వ కైన
బొందిలోనుండి ప్రాణము ల్బోవువరకు
నా మనంబుననుండుమా రామ భక్త !



చెలిమి సేయుచు సేవలు సేతు నీ కు
వే యి కష్టాలు వచ్చిన వెరవ నయ్య
దొరికితివి నాకు గొప్ప వైద్యుడవు గాన
నా మనంబున నుండుమా రామ భక్త !




కూటి కోసము పలు చోట్లు కోరు కొనుచు
దేశ దేశము లెల్లను దిరుగు చుంటి
నిలను సంసార వారధి నీ దకొరకు
నా మనంబున నుండుమా రామ భక్త !

గర్వమున గష్టపడి నిన్ను గానకున్న
సేవకుని జేసికొనవయ్య శేష శయన
మోక్ష సామ్రాజ్య మొందగా మోదమిడగ
నా మనంబున నుండుమా రామ భక్త !


సంత సమ్మున నిన్ను నే స్మరణ సేతు
నిన్నె నమ్మిన భక్తుండ నిశ్చయముగ
కోరి చిల్లర వేల్పుల గొల్వ బోను
నా మనంబున నుండుమా రామ భక్త !

పంచ కావ్యము లా యవి పటన రాదు
శాస్త్ర గ్రంధము లేవియు చదువ లేదు
తప్పు గలిగిన సద్భక్తి తక్కువౌన ?
నా మనంబున నుండుమా రామ భక్త !

భళిర నే నీ మహా మంత్ర బలము చేత
దురిత జాలము నెల్లను దోల గలను
దివ్య వైకుంఠ పదవి సాధించ గలను
నా మనంబున నుండుమా రామ భక్త !

ఆది నారాయణానుజ ! ఆంజనేయ !
పరమ సాత్వికుడైన నీ భక్త వరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రి లోన
నా మనంబున నుండుమా రామ భక్త !

ద్రవ్యమిమ్మని నీ వెంట దగుల రాను
భూ ములిమ్మని నిన్ను నే బొగడ లేను
కనక మిమ్మని నే నిన్ను కష్ట పెట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

మంద బుద్ధియు తుడనను నింద రాగ
కల్ప వృక్షంబు వలె నీవు కలిగె నాకు
ప్రజల లక్ష్యంబు నాకేల వాయు పుత్ర !
నా మనంబున నుండుమా రామ భక్త !

చిత్త శుధ్ధి గ జేసెద సేవ నీ కు
ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
పారమార్ధికమునకు నే బాటు పడుదు
నా మనంబున నుండుమా రామ భక్త !

పుణ్య వంతులు సేతురు పూజ నీ కు
భక్త వర్యులు ననిశము పొగడు నిన్ను
కాల మంతయు వమ్ముగ గడుప లేను
నా మనంబున నుండుమా రామ భక్త !

సీత జూచిన యప్పుడు సేద దేరి
గంతులు వయిచు నాడెంత గల వొ గాని
పరువు గలవాడవయ్య ప్రాబల్కు లందు
నా మనంబున నుండుమా రామ భక్త !

ఒక్క గ్రుద్దట రక్కసి నొడిపి నావు
నీ పరాక్రమ మిట్టిది నిఖిల జగము
లాజ్న మీ రక నిచ్చుట యద్భుతంబు
నా మనంబున నుండుమా రామ భక్త !

నీ దు బలమెంతొ తెలియదు నీకు నౌర
తెలియ నవ్యక్తుడవు గావు తెలిసి కొన్న
నిట్టి వాడని తెలియ లేదేవ్వరికిని
నా మనంబున నుండుమా రామ భక్త !

జీవి జీవిని భక్షింప జేసి తీవు
తెలిసె నీ రక్ష కత్వంబు దేవ దేవ
వేరె గతి లేక నిన్ను సేవింప వలసె
నా మనంబున నుండుమా రామ భక్త !

అంజని సుతుండ మారుతి ఆంజనేయ
పెట్టు పేరు లనేకముల్ పుట్టు పేరు
గురుతెరింగిన నీ మూల మెరుగ వచ్చు
నా మనంబున నుండుమా రామ భక్త !

గుణము లన్నిటి యందు సద్గుణుడ వీవు
తెలిసి మ్రొక్కెద నితరమే దిక్కు లేక
నెంచరాని గుణా ధ్యుడ వీ వె హనుమ
నా మనంబున నుండుమా రామ భక్త !

దాన ధర్మము లొన గూ ర్చ ధనము లే దు





తీర్ధ యాత్రలు సేయగ ధీ రుగాను
స్మరణ చేసెద నా యధా శక్తి కొలది
నా మనంబున నుండుమా రామ భక్త !

బ్రతుకు కోసము చేయను బాడి గమ్ము
పరుల కాంతల కోసము పరుగు లిడను
జగడ మాడెడు పని కంటె జావు మేలు
నా మనంబున నుండుమా రామ భక్త !

తనువు బోయిన తరుణాన దయను కలిగి
నరక మీ యక గాపాడు నన్ను నీవు
పరమ సంతోష మొప్పగ భజన సేయ
నా మనంబున నుండుమా రామ భక్త !

యముని దూతలు బ్రాణంబు లపహరింప
బలగ మందరు దుఖం బు బడయగాను
చుట్టమల మీ ది భ్రాంతిని చూ రగొట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

ఒకరి సొమ్ముకు దోసిలి నొగ్గ నే ర
ధనము లీయగ వచ్చిన దండు కోను
తప్పులన్నియు క్షమియింప తండ్రి వీ వ
నా మనంబున నుండుమా రామ భక్త !

దాట లేనయ సంద్రము దాటలేను
చేయ లేనయ నెయ్యము సేయలేను
చూ డ లేనయ సీతను చూడ లేను
నా మనంబున నుండుమా రామ భక్త !

కాల్చ నీ వలె లంకను గాల్చలేను
ఎగుర నీ వలె మింటికి నెగురలేను
పాడ నీ వలె భజనలు పాడలేను
నా మనంబున నుండుమా రామభక్త !

కాళ్ళు కడుగంగ నిక్కడ నీళ్లు లేవు
పూ జ సేయంగ నా కడ పూ లు లేవు
భజన మాత్రమె సేతును భక్తి తోడ
నా మనంబున నుండుమా రామ భక్త !

భజన గావింతు ననిశమ్ము భక్తితోడ
విన్నపింతును విన్నపాల్వి నయముగను
ఆలపింతును మొరలను ఆలకించి
నా మనంబున నుండుమా రామభక్త !

పాము కం టపు విషమును బట్ట వచ్చు
మనుజ రోగాలు సీఘ్రము మాన్ప వచ్చు
పుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలుప
నా మనంబున నుండుమా రామభక్త !

పరుల ద్రవ్యము మీ దన భ్రాంతి నొంద
విష్ణు దాసుల జూచిన వెక్కిరించ
పరుల కాంతల నెన్నడు పరిహ సింప
నా మనంబున నుండుమా రామ భక్త !

సేతు బంధన కీర్తిని పొందు కతన
నబ్బె నీకు పరోప కారైక ఫలము
లంతి యె కాక నీ చేత నైన దేమి
నా మనంబున నుండుమా రామ భక్త !


సీత వెదుకంగ లంకకు చేరు నిన్ను
నీ దు వేగము తెలియక నీ దు బలము
అల్పునిగ నేన్చినా రె లోకైక నాధ
నా మనంబున నుండుమా రామ భక్త !

లంక కేగిన నిను చూసి రక్కసుండు
వారి దాసులు నిన్నెంత దూరు చున్న
బంత మున్న దె నీ కిసు మంత యైన
నా మనంబున నుండుమా రామ భక్త !

మానవత్వంపు విలువలు మంట కలిపి
ఒడిసికొనుచును దలపడ యొ కరి నొ కరు
సిద్ధ పడుచుండ నే మని సెపుదు సామి
నా మనంబున నుండుమా రామ భక్త !

రామ నామము పలుకుదు రమ్య మలర
రామ భజనలు సేతును రాగ మొప్ప
నీకు కైదండ లిడుదును నీవ దిక్కు
నా మనంబున నుండుమా రామ భక్త !

రాళ్ళు కరగంగ పాడిన రావ నీవు
ఏమి చేసిన వత్తు వొ నెరుక పరచు
చేతు నదిఎల్ల నిప్పుడ చెప్పి నట్లు
నా మనంబున నుండుమా రామ భక్త !

పూ జసేతును నిప్పుడ పూజ నీ య
భజన సేతును దినమెల్ల భక్త వర్య
చేరి కొలుతును ననిశమ్ము చిత్స్వ రూ ప
నా మనంబున నుండుమా రామ భక్త !

గిట్టు మనుజుడు తప్పక పుట్టు మరల
నతని పాపంబు విడివడు నంత వరకు
మరల జన్మంబు లేకుండ మమ్ము జూడ
నా మనంబున నుండుమా రామ భక్త !


సత్య వంతుల బోధలు జనులు వినగ
శ క్తి లేదాయె నిక నీ వె సాకు మయ్య
పక్షి రారాజ మా వంటి పామరులను
నా మనంబున నుండుమా రామ భక్
పక్షి నాయక నీ కు నే భజన సేతు
పద్మ లోచన నీ మీద భక్తి లేని
మానవుడు రెండు పాదాల మహిషి యగును
నా మనంబున నుండుమా రామ భక్త

దైత్య సంహర నాయెడ దయను జూపు
దీన పోషక నాకిక దిక్కు నీ వ
 నిన్ను నమ్మిన ట్లుగనమ్మనే నె వరిని
నా మనంబున నుండుమా  రామ భక్త !
భక్త రక్షక నీ కె న్నొ ప్ర ణు తు లీ య
నా మనంబున నుండుమా రామ భక్త !

నడక మంచిది యైన చొ నరులు మెచ్చు
చదువు లెస్స గ నుండిన సభ్యు డ గును
ఆయు రారోగ్య సంపద హాయి నీ య
నా మనంబున నుండుమా రామ భక్త !

జందె మింపుగ వేసుకు సంధ్య వార్చ
బ్రహ్మ మందక కాలే డు బ్రాహ్మణుండు
ఆ శ పోవక యగునేమి యతి వరుండు
నా మనంబున నుండుమా రామ భక్త !

సంతసంబున నిత్తువా స్వర్గ సుఖము
నేను జేసిన పుణ్యాలు నన్ని జూసి
పాతకంబులు జేసిన పాపి నౌ ర
నా మనంబున నుండుమా రామ భక్త !

అడవి పక్షుల కెవ్వడా హార మిచ్చె
ఫణుల కెవ్వడు బోసెను బాలు ధరణి
పసుల కెవ్వ డొ సంగెను పచ్చ గడ్డి
నా మనంబున నుండుమా రామ భక్త !

కోతి మూకల సాయంబు కూడ గట్టి
సాగరంబున గట్టితి సేతు ఔర
యుక్తి సేయుదు వోహో నీ శ క్తి దెలిసె
నా మనంబున నుండుమా రామ భక్త !

పుడమి నందున చంచల బుద్ది వయ్యు
నెటుల నీదగు కొంచెపు నడత లెంచ
కభి నుతింతును లోకైక కపివ యనుచు
నా మనంబున నుండుమా రామ భక్త !

కొండ లన్నిటి సరి దాటి కొంచు బోయి
చిత్ర కూటాద్రి శిఖరమ్ము చేర నిలిచి
రామ సేవకు బూనిన రమ్య చరిత
నా మనంబున నుండుమా రామ భక్త !

కాండ లెల్లను సుందర కాండ మిగుల
ముఖ్య మందురు కవి వరుల్ మోద మలర
కాన ప టనంబు జేసెద కపి వరుండ
నా మనంబున నుండుమా రామ భక్త !

పాపా లె న్నిని జేసిన
పాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా
పాపాల జోలు పో నిక
పాపంబుల మీద నొట్టు పవన కుమారా !























నిన్ను భక్తులు పూ జించి నీ మ మలర
ప్రేమ పక్వాన్నము లననే పెట్టు చుండ్రు
కాన నాచేతి దొకటైన కాదు వ్యయము
నా మనంబున నుండుమా రామ భక్త !






చిన్ని కోతిగ సీతను జేరగోరి
శింశుప వృక్ష చివరన సేద దేరి
సీత దుఃఖంబు చెవులార చేది కొనిన
నా మనంబున నుండుమా రామ భక్త

కదల నీ యకుండ గట్టిగా లింగంబు
కట్టి వేయనేమి ఘనత గలుగు
భావ మందు శి వుని భావించి గొల్తును
నా మనంబున నుండుమా రామ భక్త !

గాలి వానన జెలరేగు కాళ రాత్రి
దివ్వె జూపక నిను నేను దెగడి నేని
నెగులు రగిలించి గుండెలో నెగడు వెట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

లలిత నామంబు లన్నియు లహరి గాగ
మానసంబున పరుగిడు మహతి లీ ల
రమ్య మలరంగ సేతు పారాయ ణంబు
నా మనంబున నుండుమా రామ భక్త !

ఉచ్చ నీ చంబు లెరుగక ఇచ్చ జేయు
రావణు మర్దించ పూ నిక రగులు కొనగ
లంక కేతెంచి కాల్చితి లంక పురము
నా మనంబున నుండుమా రామ భక్త !

మమత నీ లీల లటు సూచి భయము నొంది
విమత భూ వరు లందఱు విముఖు లయిరి
తగుదు వగుదు వీ ఘనతకు దంభ రూప
నా మనంబున నుండుమా రామ భక్త !

సిద్ధ సంకల్ప అవి కల్ప సీత బంట
నిష్కలంక నిరాతంక నిరుపమాంక
దీ న శ రణ్య నైపుణ్య దీ న బంధు
నా మనంబున నుండుమా రామ భక్త !

బలిమి రావణు సీత నుంబప హరింప
నీ కు నిజ కార్యము భరం బె నిర్వహింప
నిఖిల దైవత కార్యముల్ నిర్వ హించ
నా మనంబున నుండుమా రామ భక్త !

రాముడ వతార పురుషుగ రాక వలన
లంక సాధించితిరి గాని లావు చేత
నిర్జరా రుల గెలువంగ నెవరి తరము
నా మనంబున నుండుమా రామ భక్త !

నీ బలము నీకు తెలియదు
నీ బలమును జెప్ప వలయు నితరులు నీ కున్
నీ బల మనితర సాధ్యము
నీ బలమును మించి లేడు నెవడు ను హనుమా
నా మనంబున నుండుమా రామ భక్త !

వాయు పుత్రుని బలమును వాడు నెరుగ
ఇతర పురుషులు జెప్పిన నింత లగును
చెప్ప సరివోవ సుగ్రీవు నొప్పు ననఘ
నా మనంబున నుండుమా రామ భక్త !


నిన్ను చూ తును దురాన నిచ్చ లలర
నిన్ను సేవింప దలపడ నెప్పు డైన
ఎదుట నుండంగ భయ ప డి యేగువాడ
నా మనంబున నుండుమా రామ భక్త !

జగము లన్నియు నీ కు వశ్యము లటంటి
వీవు నిజ దాస వ శ్యు డ వెంత ఘనత
దాస దాసాను దాసుండ లాస్య మొప్ప
నా మనంబున నుండుమా రామ భక్త !

ఎవ్వ రింటికి బోయిన నేమి ఫలము
ఉన్నచో నుండి సిరుల పెంపొందు కొందు
నిన్ను కోరుదు శరణము నీ వ దిక్కు
నా మనంబున నుండుమా రామ భక్త !

భువన మోహన మూర్తివి భూరి గాను
ఎంచ దేవర దైవమా యీ వె కాన
చూ ప ర కు నీ దు మహిమను జూప గలవు
నా మనంబున నుండుమా రామ భక్త !

మారుతా త్మజ కపి వర మర్క టే శ
పరమ సాత్వికు లైన భక్త వరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రిలోన
నా మనంబున నుండుమా రామ భక్త !

శ్రీ రామ దూతం శిర సా నమామి
భళిర నే నీ మహా మంత్ర బలము చేత
దివ్య వైకుంఠ పదవి సాధించ గలను
నా మనంబున నుండుమా రామ భక్త !

తిరిగి నన్నాళ్ళు తిరిగితి తిరము లేక
కాన రాదాయె నిన్ను నా కన్ను దోయి
భజన జేయుదు నీ మీద భక్తి కలుగ
నా మనంబున నుండుమా నామ భక్త !

ఆయు రారోగ్య సంపద లన్నియిచ్చి
ఈ యవలసిన భక్తిని నీ య వైతి
చేతు లారంగ పూజలు సేతు నీకు
నా మనంబున నుండుమా రామ భక్త !

భక్తి లేకున్న నుండెను ముక్తి తపన
ముక్తి కోసమె తనువుపై రక్తి కలిగె
చేతు పూజలు నికనైన చేతు లార
నా మనంబున నుండుమా రామ భక్త !

ఆలు బిడ్దల విడనాడి యడవి కేగి
మంచె కట్టుకు కూర్చుండి మడత వేసి
నిన్నె ధ్యానింతు నని శంబు నిష్ఠ తోడ
నా మనంబున నుండుమా రామ భక్త !

పండు యనుకొని సూర్యుని ప ట్ట బోవ
కాలి నీ మూతి యెర్ర గ కంది బోయె
అంత సాహసంబది యేల యౌర నీ కు
నా మనంబున నుండుమా రామ భక్త !

లంక దహియించు సమయాన రావణుండు
నిన్ను బంధించి దెమ్మని యాన తీ య
యేల బుద్దిగ నేగితి నీవు సామి
నా మనంబున నుండుమా రామ భక్త !























Thursday, February 11, 2010

దొడ్డవరము

దొడ్డ వరమున వెలసిన దొడ్డ దేవ !
వేంకటే శ్వర! మమ్ముల జక్క జూ డు
వంద నంబులు మీ కివె వందలాది
రామ !హరిహర !మురహరి ! రమ్య చరిత !

Wednesday, February 10, 2010

ఆశీ స్సులు

గురువుల మ్రొక్కెద నిరతము
గురువుల సేవింతు నెపుడు కోరను దేనిన్
కోరక నె నిచ్చు గురువులు
మరువక యా శీ స్సు లెపుడు మన్నన లడరన్

Tuesday, February 9, 2010

అనంతుడు

పరమ ఋషి పుంగవుల పరంపరల యందె
అతని బ్రతుకు కప్పురపు టారతి గ వెలుగు
ఆది మధ్యాంత రహితుడనంతుడ తడు
అతని వయసును గ ణి యింపు నలవియౌనె?
అతని జీ వన దీ తీ ర్ధమవధి గలదె?

కర్షకుడు

బ్రతుకు బాటను తీ ర్చి దిద్దెడు పరమ గురుడవు నీవె గా
బరువు బాధ్యత లెరుగ జే సెడి పార్ధ సారధి నీవెగా
బ్రతుకు నావను సంద్రపు తీ రము చేర్చు నావికుడివెగా
హృదయ క్షేత్రములందు ప్రేమ పండించు కర్షకు డీవె గా .

పరమ గురువు--గురు పంచకము

ధర్మ సంస్థాప నార్ధమై ధర ణి లోన
మతములును వర్గముల యొక్క మసకలేని
ఆచరణ శీలమైనట్టి ఆర్ష శక్తి
ప్రజల కందించినట్టి శ్రీ పరమ గురువు .

౧.సూ చన గురువు
౨.వాచక గురువు
౩.బోధక గురువు
౪.పరమ గురువు
౫.నిషిద్ధ గురువు

నమస్కారమ్సు మాస్టర్ ఇకే .

లేవులేవాయె ఇక మాకు లేవు నీవు
కృష్ణ మాచార్య !మమ్ముల కృపను జూ డు
మీ దు పలుకులు మాకిక మధుర స్మృతులు
వందనంబులు గొనుమయ్య !వందలాది .

ఆ  ది దంపతులు

ఆ ది దంపతులైనట్టి ఆది దేవు
లాయు రారోగ్య సంపద లన్నియిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత!
ఇమ్మహాత్ముల గారు ణ్య మింపు మీర.

దీ పావళి

దీ పాలెన్నియొ వెలుగును
దీ పావళి నాడు మిగుల దే దీ ప్యముగా
రూ పాయలగును మెండుగ
పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

Monday, February 8, 2010

కలి దోష నివారణము

కర్కో త కస్య నాగస్య దమయంత్యా నలస్యచ ,
ఋతు పర్ణస్య రా జ ర్షే హ కీ ర్తనం కలి నాశ నం .

పరుండు నపుడు ----స్తోత్రము

రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
శ యనే యః ప టే న్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి .

Saturday, February 6, 2010

సైంటూ లోయుస్

ది .౧౪-౧ ౨౦౧౦ వ తేది రాత్రి సెయింట్ లోయజ్ కి వచ్చి హిల్టను హోటలులో బస చేసి మరునాడు ఉదయము అక్కడకు దగ్గరలో గల ఒక పెద్ద ఆర్చి ని చూసి టిక్కెట్టు కొని లిఫ్టు ద్వారా పైకి వెళ్ళాము .అది ౬౦౦ అడుగుల ఎత్తు. పైనుండి కిందకు చూస్తే కారులు ఆట బొమ్మల వలె కని పించాయి .అక్కడ మిసిసిపి మిస్సోరి నది ప్రవ హించు చున్నది .అది చూసికుని బయలు దేరి వచ్చి మధ్య దారిలో అబ్రహాం లింకన్ మ్యుజియం చూద్దామను కున్నాము .సమయా భావముచే చూడ కుండగానే రాత్రి ౭ గంటలకు ఇంటికి చేరాము .అక్కడక్కడ ఫోటోలు కూడా కిరణ్ తీసాడు .

మెరామెక్ గుహలు-ఇతర స్థలములు

ది .౧౪-౧-౨౦౧౦ తేది గురువారము ఉదయము ౧౦ గంటలకు బయలు దేరి సాయంత్రము ౪-౧౫ నిమి ష ములకు మె రా మె క్ గుహలకు చేరి కొంటిమి .౪-౩౦ నిమి ష ముల తర్వాత ఆ గుహల లోనికి ప్రవే శ ము లేదు .మా తర్వాత ఒక జంట వచ్చిరి .టిక్కె ట్టులు కొని లోపలకు వెళ్లి తిమి .ఆ గుహల క్రింద నుండి మె రా మెక్ అను నది ప్రవ హించు చున్నది .ఆ నది యెంతో లోతు లేక పోయిననూ కరెంటు దీ పాల మూ లంగా చాల లోతు ఉన్నట్లు గా కన బడు చున్నది .లోపల కొండ తాలూకు ద్రవపూం చారలు మఱ్ఱి ఊ డల వలె చాల బాగున్నవి .కరెంటు దీ పపు కాంతు ల తొ మెరియు చున్నవి .ఇద్దరు దొంగలు దోచుకున్న ధనముతో ఆ గుహ లోనికి వెల్లిరట. దానిని స్థా నికులు చూఛి ఆ గుహను యాత్రా స్థ లము గా మార్చిరట.ఆ గుహలు వేల సంవత్సరముల క్రిందటే ఏ ర్ప ద్దాయిట. ఒక ఫార్మేషను రావడా నికి సుమారు ౧౦౦ సంవత్సరములు పడుతుందట.ఆ గుహలను జే మ్సు అను దొంగ కని పెట్టాడుట .ఆ గుహ మొత్తము ౭ ఫ్లో రులు .౫ వ ఫ్లో రు వరకు మాత్రమే అనుమతి ఉంది .ఒక చోట సినిమా దియేటరు వలె ఫార్మేషను ఉంది .దానిని కరెంటు దీ పాలతో ఉంది .చివరగా అమెరికా దేశపు జెండా బాగా వెలుగులో కనిపించినది .అది చూసి రాత్రికి హిల్టన్ హోటల్ కి వెళ్లి ఆ రాత్రి అక్కడ బస చేసాము .
ఉగాది శుభా కాంక్షలతో కేంపు ============
ది .౧౬-౩-౨౦౧౦ వ తే ది ఉగాది రోజున కిరణ్ తో సియా టెల్సుకు విమానములో
వెల్లి తిమి .మైక్రో సాఫ్టు అధిపతి యైన బిల్ గే ట్సు స్వగ్రామము .అక్కడ గల వాషింగు తన్ లేకు దరినే ఆయన ఇల్లు ఉందిట .ఆ సాయంత్రానికి హోమ్ ఉడ్ స్యూట్సు అను హోటలు కి వచ్చితిమి .అక్కడకు దగ్గర గా నే రెడ్ మాండు సిటి గలదు .అది యే మైక్రో సాఫ్టు .బిల్ గే ట్సు ప్రపంచ ధనికులలో రెండవ వాడు .నిన్న ఓ హేర్ విమానాశ్రయములో
విమాన మెక్కి డెన్వెర్ విమానా శ్ర యములో దిగి అక్కడ ఒక గంట విరామము .మరల
అక్కడ విమానమెక్కి సియాటేల్సు లో దిగి కారులో రెడ్మాండు వెళ్లి అక్కడ మయూరి
అను నెల్లూరు వారి హోటలు లో లంచు చేసి సియాటేల్సు వెళ్లి రూంకి వెళ్ళాము
ఈ రోజు అనగా ౧౭-౩-౨౦౧౦ తేదిన కారు హేండు ఓవరు చేయడానికి డౌన్ టౌన్ కి వెళ్లి హేండు ఓవరు చేసాము ;కారు పార్కింగు కు ౧౦ లేదా ౧౨ ఫ్లోరులు ఉంటాయి .
ఈ షియా టెల్ వాషింగుతన్ స్టేటు లో ఉన్నది .ఇక్కడి బస్సులు కరెంటు ద్వారా
నడుస్తాయి .ఈ సిటి లోనే విమానములు తయారగును .ఇక్కడ నుండియే అన్ని దేశాలవారు విమానాలను కొనుక్కుంటారు .ఇక్కడి భవనములు ఒక్కొక్కటి సుమారు ౫౦ ,౬౦ ఫ్లోరు లు ఉంటాయి .కారు పార్కిన్గుకే ౧౦ ,౧౫ ఫ్లోరులు ఉంటాయి .
౧౯-౩-౨౦౧౦ న మధ్యాహ్నము హోటలు వారి కారు లొ వెస్టు లేకు సెంటరు కి
వెళ్లి అక్కడ మోనో రైలు సెంటరు దగ్గర రైలు ఎక్కి స్పేసు నీ డు టవరుకు వెళ్లి
లిఫ్టులో పైకి ఎక్కాము .ఆ టవరు ౫౨౦ అడుగుల ఎత్తు ఉన్నది .అక్కడ పైన చూస్తే
పసిఫిక్కు మహా సముద్రపు ఓడల రేవును చూసాము .అక్కడ దూ రానికి మంచు
పర్వతాలు కనిపించాయి .సాయంత్రము ౪ గంటలకు ఇంటికి చేరాము .
హోటలు అడ్రస్సు =హోము ఉడ్ స్యూట్సు బై హిల్టన్ ,సియాటిల్ -కాన్వెన్షన్ సెంటర్
పిక్ స్ట్రీట్ ,౧౦౧౧ పిక్ స్ట్రీట్ ,సియాటెల్ ,డబ్ల్యు ఏ .౯౮౧౦౧ .-౧-౨౦౬-౬౮౨-౮౨౮౨.

ది .౨౦-౩-౨౦౧౦ వ తేది శనివారము మధ్యాహ్నము కారులో ఎవరెట్టు అను సిటీకి
వెళ్ళాము .కారు రఘు అను కిరణు స్నేహితుడు . అతడు రెడ్మాండు లో ఉంటాడు .
అతని ఇంటికి టూరు అయిన తరువాత వెళ్లి మయూరి హోటలులో టిఫిను చేసాము .
ఎవరెట్టు లో గ్రౌండ్ ఫ్లోరులో విమానముల నమూనాలు విడి విడి భాగాలుగా చూపించిరి
అవి బ్లోయింగు విమానములు .అది అతి పెద్ద విమానాల కర్మాగారము . తరువాత
బస్సు లో ౭౪౭ నెంబరు విమానములు తయారు చేయు షెడ్డు కి వెళ్ళాము .అక్కడ
అయిదారు విమానములు తయారగు చున్నవి .అది ఒక పెద్ద షెడ్డు .మొత్తము
అరవయి లక్షల మంది ఉద్యోగులు .అది చూసిన తరువాత ౭౮౭ నెంబరు విమానములు తయారు చేయు షేడ్డుకి వెళ్ళాము .అక్కడ ఏడెనిమిది విమానములు
తయారగు చున్నవి .౭౭౭ నెంబరు విమానమును మన భారత దేశము కొనుగోలు
చేసినదని సూ చనగా ఆ విమానము మీద ఎయిరు ఇండియా అని వ్రాయ బడినది .
అక్కడ ౭౩౭ ,౭౪౭,౭౬౭,౭౭౭,౭౮౭, నెంబరుల విమానములు తయారు చేయు చున్నారు .విమానముల ఫ్రంటు పైలట్టు ఉండు భాగము .మధ్యన పాస్సింజరులు
ఉండు భాగము చివర భాగము సామానులు వేయు భాగములు విడి విడిగా ప్రదర్శన
లో భద్ర ప ర చిరి .౭౪౭ నెంబరు విమానము ఎక్కువ టెక్నాలజీతో ను ౭౮౭ నెంబరు
విమానము తక్కువ టెక్నాలజీ తో తయారు కాబడుతోంది అని చెప్పారు .
సియా టెల్ లో కూడ ఒక మినీ బోయింగు విమానము లు తయారు చేయు కర్మాగారము ఉన్నది.

ది. ౨౭-౩-౨౦౧౦ తేది .శ నివారము ౧౦౦ మైళ్ళ దూరము లొ గల మౌంట్ రైయనిర్
అను చోటికి కారు లొ వెళ్ళాము .అది ఒక పెద్ద కొండ .౨౪౦౦౦ అడుగుల ఎత్తులో
ఉన్నది .ఎత్తులో హిమాలయముల కన్నా సగము .అది అంతయు మంచు
మయము .కొండయె మంచు కొండ. మంచు కొండ పైకి ఎక్కాను .దిగడము కష్ట మైనది.

రె యినీ రు కొండ చూసితి
రె యి నీ రె మంచు మయము రేయిం బగలున్
రె యి నీ రొక కైలాసము
రె యి నీ రే మూడు మైళ్ళు నెత్తున నుండెన్ .

దారి పొడుగున నడవులు దారి యియ్య
పైను వృక్షాల సొగసుకు బైర్లు కమ్మ
సాగినది మాదు పయనము సంత సమున
భరత దే శ పు వాసిగా భాగ్య మదియ .

కొండ దారికి ప్రక్కల గోడ లుండె
గోడ లన్నియు మంచు తొ కూడి యుండె
చూడ ముచ్చట గొల్పును చూపరులకు
చూడ మీరును వేవేగ రండి తరలి.

శి ఖరముల మిన్న రెయనీ రు శి ఖర మరయ
కొండ కొండల నడుమన నొదిగి యుండె
వర్ణ ణీ యంబు గాదది నలువ కైన
చిత్రములు గాదె యీ శ్వర కృతము లకట .

ఎవరెస్టు శి ఖర మయ్యది
ఎవరెస్టును నెక్క గలమ ఏనాడైనన్
ఎవరెస్టు పొడవు నరయగ
నీ వనియే మైళ్ళు నార నిప్పుడ యనఘా !


ది.౨౮-౩-2010వ తే ది .ఆదివారము మౌంటు హెలెను అను అగ్ని పర్వతము గే ట్లు మూసి వేయడము చేత అక్కడకు వెల్ల లేదు. తుల్పి టౌను కు వెళ్ళాము. అది స్కాగితు వాలీ .అక్కడ అనేక రకముల పూ లు మనోహరము గా ఉన్నవి.మొక్కల ఆకులు ప్లాస్టిక్కును పో లి యున్నవి. అక్కడ గుర్తుగా రంగు రంగుల పతంగములు ఆకా శ మున రెప రెప లాడు చున్నవి.అక్కడి నేల యంతయు నల్ల రేగడి నే ల.అక్కడి పూ లు ముదురు ఎరుపు ,తెలుపు,పింకు కలరు, పర్పులు కలరు ఉండి అన్నియు కలువ పూ ల వలె యున్నవి.అక్కడ ఉన్న పూ ల రకములు.ఆరంజి క్లొ,కాస్మో , అలస్క స్టార్ ,హావరోన్,కేన్దిaఆపిలు , మే జిక్ లావెండర్ , మున్లైట్టు ,ఆరెంజు ,నంబర్ ౫౨౬ , పింకు గ్లోరి మొద లుగా చాల రకములు గలవు.

రకరకముల పూ మొక్కలు
రకరకముల పూ లతోటి రంగులు విచ్చన్
సకలము తోటను జూచితి
నాస్కా జితు వేలి నందు నబ్బుర మయ్యెన్ .

















Friday, February 5, 2010

జగతః పితరౌ వందే ........

వాగార్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .

Tuesday, February 2, 2010

తోటకాస్టకం

విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహితో పని షడ్ కదితార్ధ నిధే
హృదయే కలయే విమలం చర ణం
భావ శంకర దేశిక మె శర ణం 1

కరుణా వరు ణా లయ పాలయ మాం
భవ సాగర దుఃఖ విధూన హ్రదం
రచయాకిల దర్శన తత్వ విధం
భవ శంకర దేశిక మె శరణం 2

భవతా జనతా సుఖితా భవితా
నిజ బోధ విచారణ చారుమతే
కలయే శ్వర జీ వ వివేక విధం
భవ శంకర దేశిక మె శరణం ౩

భవఎవ భవానిధి మె నితరం
సమ జాయత చేతసి కౌతి కత
మమ వారయ మోహ మహా జల ధిం
భవ శంకర దేశిక మె శరణం ౪.

సుకృతే ధికృతే బహుధా భవతో
భవితా సమ దర్శన లాలసతా
అతి దీ నమిమాం పరి పాలయమాం
భవ శంకర దేశిక మె శరణం ౫.

జగ ధీ మవితుం కలితా కృ ధయో
వి చ రంతి మహామాహ సచ్చలతా
అహి మాం షురి వార్హ విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణం ౬.

గురు పుంగవ పుంగవ కేతనతే
సమతా మయతాం నహి కోపి సు ధీ
శర ణా గత వత్సల తత్వ నిధే
భవ శంకర దేశిక మే శరణం ౭.

విదితా ఖిల నమయా విష ధైక కలా
నచ కించన కాంచన మస్తి గురో
దృ త మేవ విదేహి కృ పాం సహజం
భవ శంకర దేసికమే శరణం ౮.