Friday, May 7, 2010

హరి విల్లు-----షష్టి పూర్తీ

పూ జ్యులు పేరరాజు -సత్య సుందరులు
ఆ పురాణ దంపతుల జ్యేష్ట పుత్రుడ !
నాన్న ఓ నాన్న
సామాన్య కుటుంబాన జన్మించి
తెనుగు పండిట్టువై
వేల సంఖ్యల శి ష్యుల మన్ననల నందినావు
మేమునూ నీ శిష్య పరమా ణు లమే
అయినందులకు గర్వించు చున్నాము
అమ్మా ! నాన్న !
ఆది దంపతులు మాకు మీరు
మీ కనుసన్నల మెలగు చుంటిమి
మీ ఆజ్నలే మాకు శి రోదార్యములు
షష్టి .....షష్టి పూర్తి
నిండెనా అరువది వత్సరములు
కలగా ఉన్నది నాన్న !
నీ వయసును చూ స్తే
పవలు రేలు శ్ర మించినా
అలుపు సొలుపులు నిన్ను అంటవు
ఏ మి కోరవు ఏ మి వేడవు
నీవు మా పుణ్యాల పంటవు
మా కోసమె నీ జీవితమంతా
ధార వోసితివి, ఇది నిజము సుమ్ము
నీకుగా నీకు ఏమియు లేదు
నిరాడంబర జీవితము తక్క
బ్రతుకు నందలి మిట్ట పల్లము
లన్నియు నీకు సమానములే
దుఖమునకు క్రుంగి పోవుట
సుఖమునకు పొంగి పోవుటలు
నీకు సుదూరములు........
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎత్తు లేవీ లేనివాడవు
దైవ చింతన దైవ దర్శనములు
నీకు నిత్య కృత్యములు
ఈ షష్టి పూర్తి పర్వ దినాన
మా నమస్కృతు లందు కోవలె
శత వసంతము లీవు మనవలె
మీకివే మా శత కోటి వందనములు ...
ప్రేమతో ....
కిరణ్
పాపాయి
మాధవి