Tuesday, September 20, 2011

యక్ష ప్రశ్నలు (తరువాయి )

ధనమును బ్రాహ్మణునకు ఎందుకు ఇయవలెను ?
ధర్మమునకు
నటకులకు ఎందుకు ఇయ్యవలెను ?
కీర్తి కొరకు
భ్రుత్యులకు ఎందుకు ఇయ్యవలెను ?
పోషించుటకు
రాజులకు ఎందుకు ఇయ్యవలెను ?
భయ నివారణకు
దేని చేత లోకము కప్పబడి యున్నది ?
అజ్ఞానము చేత
దేని చేత ప్రకాశింప కున్నది ?
చీకటి చేత
దేని చేత మానవుడు మిత్రులను విడుచుచునాడు ?
లోభము చేత
దేని చేత మానవుడు స్వర్గమును పొంద నేరడు?
సంసారము వలన
మానవుడు జీవించియు మృతుడేట్లగును?
దరిద్రుడు
రాజ్యము మృతము ఎట్లగును
రాజు లేని రాజ్యము
శ్రాద్ధము మృతము ఎట్లు అగును ?
మంత్రము లేని
యజ్ఞము మృతము ఎట్లు అగును ?
దక్షిణ లేని
లోకమునకు దిక్కు ఎవరు ?
ప్రాజ్ఞులు
జలము ఏది ?
ఆకాశము
అన్నము ఏది ?
భూమి
విషయము ఏది ?
ప్రార్ధన
శ్రాద్ధమునకు కాలము ఏది ?
బ్రాహ్మణుడు శ్రాద్ధ కాలము అగును
తపస్సునకు లక్షణములు ఏవి ?
వర్నాశ్రమమున ప్రవర్తించుట
దమమునకు లక్షణములు ఏవి ?
మనసును నిగ్రహించుట
క్షమమునకు లక్షణములు ఏవి?
సుఖ దుః ఖా దులను సహించుట
సిగ్గునకు లక్షణములు ఏవి ?
అకార్యములను చేయక ఉండుట

No comments:

Post a Comment