Wednesday, October 26, 2011

దీపావళి కి

కాల్చిరి టపాసు కాయలు
కాల్చిరి మఱి చిచ్చు బుడ్లు కాల్చిరి జువ్వల్
కాల్చిరి కాకర వత్తులు
కాల్చిరి యిక చాల యె న్నొ కలకల మంచున్ .

Tuesday, October 25, 2011

భీమకుడు

రాజుల నందరి కంటెను
రాజును మఱి భీమ కుండు రారా జేలే
రాజను పదమున కర్ధము
రంజిల్లగ జేయు వాడు రాష్ట్రపు ప్రజలన్ .

నరకుడు

అయ్యెను పండుగ మనలకు
అయ్యధముని చావు కతన నానందంతో
చయ్యన పిన్నలు పెద్దలు
తియ్యంగా బంచు కొనిరి తేనెల రొట్టెల్ .
(ఇక్కడ అధముడు అనగా నరకాసురుడు ,పండుగ అనగా దీపావళి )

Monday, October 24, 2011

Univercities in Andhra pradesh

1.Achrya N.G.Ranga Agril.Rajendra nagar
2.Andhra univercity-waltair
3.central institute of english&forein languages o.u campus
Hyderabad
4.DR.B.R.A MBEDKAR open university,jubili hills
5.Dravidian university,kuppam
6.University of hyderabad-hyderabad
7.Javaharlal nehru Technogilical university,hyderabad
8.Kakayiya University-warrangal
9.Moulana Azad Urdu University-hyderabad
10.Nagarjuna University-Guntur
11.Nizam Institute of Medical Sciences-panjagutta
12.N.T.R. University of health Sciences-vijayawada
13.Osmania University-Hyderabad
14.Potti Sreeramulu Telugu Univarsity-Lalita kala kshetram-
Public gardens
15.Rashtreya Vidya Petha-Tirupati
16.Sri Krishnadevaraya University-Anantapur
17.Sri Padmavati Mahila Viswa vidyalayam-Tirupati
18.Sri Satya Sai Institute of higher learning-prasanti nilayam
Anantapur
19.Sri Venkateswara iNSTITUTE OF MEDICAL SCIENCES-Tirupati
20.Sri Venkateswara University-Tirupati

Saturday, October 22, 2011

దుశ్చర్యలు

దుశ్చర్యలు గావించుచు
పశ్చాత్తాపంబు వొంద ఫల మేదియునున్
నిశ్చయము కలుగ కుండుట
నిశ్చింత తొ మానుకొనుము దుశ్చర్యలునున్ .

నరుడా !

కులమును రూపును గుణమును
గల కాంతల లోన మున్ను గా నెన్న బడుం
గల కంటికి సంతతియును
గలుగును మఱి మంచిగాను దెలియుము నరుడా !

Wednesday, October 19, 2011

కులకాంత

కులమును రూపము గుణమును
కలిగిన కులకాంత కెపుడు కలుగును శుభముల్
కలుగును సంతతి చక్కని
కలుగుటయే కాక వారు గణనను బొందుర్.

Sunday, October 16, 2011

యాపిలు తోటలు

15-10-౨౦౧౧ తేది శనివారము ఉదయము ౧౦ గంటలకు బయలుదేరి హార్వర్డ్
అను పల్లెటూరికి ౧౨ గంటలకు వెళ్ళాము .అక్కడ యాపిలు తోటలు చూడ ముచ్చటగా
ఉన్నవి.అక్కడ ఉన్న సిబ్బంది మమ్ములను ట్రాక్టరు మీద తోటల దగ్గరకు తీసుకొని
వెళ్ళిరి . మేము ట్రాక్టరు దిగి తోటలోనికి వెళ్లి చెట్ల నుండి యాపిలు కాయలు
కోసుకొని తిన్నన్నితిని వాళ్ళు అమ్మిన కవరు నిండా వేసుకొని తిరిగి వచ్చితిమి .
అక్కడ పిల్లలు ట్రైను , గుర్రాల మీద తిరగడము లాంటి కొన్ని ఆటలలో పాల్గొని
ఉల్లాసముగా కనిపించిరి . తరువాత మేము పట్టుకొని వెళ్ళిన లంచిని తిని
తిరుగు ప్రయాణము అయి దారి లో లేక్ జెనేవా చూసి ,తర్వాత ఒక హోటలు కి
వెళ్లి కాఫీ త్రాగి ఇంటికి బయలుదేరి సాయంత్రము గంటలకు వచ్చితిమి .

Friday, October 7, 2011

గీత

గీతా పారాయణమును
ప్రత్యేకందావు లందు ప్రత్యేకముగా
ప్రతి దినమును నొనరించిన
గీతా నాధుండు నుదుట గీతను మార్చున్ .

Thursday, October 6, 2011

అవధానము

అవధానము లన్నిట నీ
యవధాన మె గొప్ప దండ్రు ఆర్యారాధ్యా !
అవధానంబొన రింపుము
రావూ రీ వేంకటేశ ! రసికుల సభలోన్ .

కలకాలము

కాలము విలువను నెరుగుము
కాలము నిల సాగుచుండు కాలుని వలనన్
కాలమును వమ్ము సేయక
కలకాలము హాయి గుండు పిల్లల తోడన్

Wednesday, October 5, 2011

నరుడా !

తన శాంతమె తన మిత్రుడు
తన శాంతమె తనకు తోడు తన బంధువునున్
తన శాంతమె తన దైవము
తన శాంతమె తనను కాచు తధ్యము నరుడా !

Tuesday, October 4, 2011

సెవెన్ వండర్స్ ఆఫ్ హైదరాబాద్

బిర్లా మందిర్
చార్మినార్
గోల్కొండ ఫోర్ట్
హుస్సేన్ సాగర్
రామోజీ ఫిలిం సిటి
సాలార్ జంగ్ మ్యూజియం
శిల్పారామం

Sunday, October 2, 2011

గృహస్థ ధర్మములు

దేవతార్చన
మాతా పిత సేవ
మానవ సేవ
అతిధి సేవ
పశు పక్ష్యాదులను ,వృక్షములను కాపాడడము
స్వాధ్యాయము
శాస్త్రములు ,పురాణములు చదవడము
ఋషులకు కృతజ్ఞత చూపడము

Saturday, October 1, 2011

అష్ట మహిషులు

రుక్మిణి
సత్యభామ
జాంబవతి
కాళింది
మిత్ర వృంద
నాగ్నజితి