Wednesday, November 30, 2011

ప్రా ర్ధన

12 comments:

  1. అమ్మ ! శారద !యమ్మల కమ్మ వమ్మ !
    నిన్ను సేవించు మనుజుడు నేగు దివికి
    కాన నేనును సేవింతు కరుణ జూడు
    సకల గుణముల కిరవైన శారదాంబ
    ---------------------------

    దండమయా శివ శంకర
    దండమయా సాంబ నీ కు దండము శంభో
    దండమయా నీలాంబర
    దండమయా గరళ కంట దండము భవుడా!
    -----------------------------------------

    విఘ్నముల నిత్తు నందురు
    విఘ్నాధిప నిన్ను జనులు విఘ్నము లీయా
    విఘ్నముల నాకు నీయకు
    విఘ్నాధిప నిన్ను గొలుతు వేలుగ భక్తిన్ -
    -----------------------------------

    ReplyDelete
  2. పలుకుదును రామ భక్తని
    పలికించెడి వాడు రామ భక్తు డె మఱి నే
    పలికిన పుణ్యము కలుగు చొ
    పలికెద వేవేగ నిపుడ పలుమరు సార్లున్
    ----------------
    హరిహర భవులకు నమములు
    హరి హర భవులార మీ ర లారాధ్యలరౌ
    హరియించుడు పాతకములు
    హరియింప గ వేడుకొందు హరి హర యనుచున్

    ReplyDelete
  3. పలికెదను రామ కధ నిల
    పలుకంగా శక్తి నీయ పలుమరు గోరన్
    పలుకక మిన్నక యుంటివ ?
    పలుకే బంగారు మగునె? పావన రామా !
    ---------------------

    ReplyDelete
  4. సర్వార్తి హరా !
    శరణా గత రక్షకుడవు
    కరుణ కరుడవు త్రిలోక కళ్యాణుడ వీ
    శ్వరుడవు గావున నిన్నే
    శరణము సోచ్చితి ముకుంద ! సర్వార్తి హరా !

    ReplyDelete
  5. దండమయా !
    దండమయా కరు ణా నిధి !
    దండమయా సాయిబాబ ! దండము నీ కున్
    దండమయా ఋ జు వర్తన !
    దండమయా నీ కు నెపుడు దండము కృ ష్ణా !

    ReplyDelete
  6. గోకుల నాధా!
    కోరను నిల మఱు జన్మను
    కోరను సంసార సుఖము కోరను ధనమున్
    కోరను నిహ పర సుఖములు
    కోరుదు నీ పాద సేవ గోకుల నాదా !

    ReplyDelete
  7. శ్రీ సాయీ యో సాయీ !
    శ్రీ సాయీ! యో సాయీ !
    నీ సాయము గోరు చుంటి నిలకడ కొఱకై
    ఈ సారికి దయ జూడుము
    ఏ సాయము కోర నిన్ను నికపై సాయీ!

    ReplyDelete
  8. మరణ కాలంబు నాసన్న మైన యపుడు
    అన్య బంధము లేవియు నంట నీ క
    చింత లేమియు లేకుండ జేసి నీదు
    స్మరణ మాత్రమె నీయుము శంభు దేవ

    ReplyDelete
  9. అరుణా చల శివ
    -------------
    దొరల మని హరియు నజుడును
    అరమరిక గ వాదు లాడ యిరువురి మధ్యన్
    వర లింగము వలె వెలసిన
    అరుణా చల శివుని గొలుతు ననవర తంబున్

    ReplyDelete
  10. పశుపతి నాధా !
    ------------------
    మరణము వచ్చిన యప్పుడు
    మరువక నీ నామ మెపుడు మననము సేయన్
    వర మగు శక్తిని నీ యుము
    పరి వేష్టిత నాగచత్ర ! పశు పతి నాధా!

    ReplyDelete
  11. --------------------
    వింటిని గజేంద్ర మోక్షము
    వింటిని రామాయ ణంబు వీ నుల వింపై
    వింటిని పదియవ స్కంధము
    వింటిని నీ మహిమలన్ని వేంకట రమ ణా !

    కోదండ రాము డందురు
    కోదండము చేతబట్టి కూర్చుట వలనన్
    కోదండ రామ చంద్రుని
    కైదండల కేలుమోడ్చి కంటిని మదిలోన్ .

    వైకుంఠ పురము నుండియు
    వేకువ యీ భక్తు జూడ వేంచే సితివా ?
    వైకుంఠ పుర నివాసుడ
    మూకుమ్మడి నీ కు నమో వాకము లయ్యా!

    నాలోన నీవు కలిగియు
    నీలో నను జేర్చు కొనుము నేలా గైనన్
    నాలో విజ్ఞత కలుగగ
    ఆలోచన జేసి నన్ను ఆదుకొ రామా

    ReplyDelete
  12. కాపాడు మయ్య !మమ్ముల
    నేపాపము సేసి యెఱుగ మేవేళల లోన్
    మీ పాద సేవ చేతుము
    మా పాలిట దైవ మీవె మంజుల నాధా !

    ReplyDelete