Friday, December 30, 2011

ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్ .

మాడుగుల శేష మాంబకు
పేడియ యగు వాని తోడ పెండిలి కాగా
వీడగ బ్రా ణ ము నయ్యెడ
నేడడుగుల బంధ మౌర ! యేటికి banpen

1 comment:

  1. ఏడేడు జన్మలందున
    కూడిక తో నుందురంచు ,గొప్పగ పెండ్లిన్
    ఆడగ ,కలహమ్ములతో
    ఏడడుగుల బంధమౌర !యేటికి బంపెన్.

    --------
    (సమస్యాపూరణం--576)

    అందరికి శుభాకాంక్షలు.

    ఈ నూత్నంబగు వత్సరమ్మున ,నహీనైక మత్యమ్ము ,సన్
    ధానప్రక్రియలన్,సకల విద్యా సంస్కృతీ వైభవా
    నూనోత్కర్ష ,విలాస సంపదల తో నుల్లాస లీలన్ ,జనుల్
    ఆనదింతురు ,ఆంధ్రులందరని నా యాకాంక్షలన్ దెల్పెదన్.
    -----------------

    ReplyDelete