Tuesday, December 20, 2011

మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .

మాఘ మాసపు తానమ్ము మంచి దనుచు
తల్లి తోడన నేగిన తనయ నదికి
స్నాన మాడుచు జని పోయె సలిలమందు
మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .

3 comments:

  1. భక్తి శ్రధ్ధల గావించ భాగ్య మిచ్చు
    మాఘ మందున స్నాన మ్ము ,మరణ మొసగు
    రోగ పీడితు డైనట్టి రోగి కయ్య !
    పొల్లు గాదిది నిజమునె బల్కు చుంటి .

    ReplyDelete
  2. మాఘమందున స్నానమ్ము మరణ మొసగు
    ------------
    భక్తి శ్రధ్ధల గావించ భాగ్య మిచ్చు
    మాఘ మందున స్నాన మ్ము ,మరణ మొసగు
    రోగ పీడితు డైనట్టి రోగి కయ్య !
    పొల్లు గాదిది నిజమునె బల్కు చుంటి .

    ReplyDelete
  3. పై పద్యము నాలుగవ పాదము సవరణ
    ------------
    పొల్లు గాదిది నిజము చెప్పుదును నేను.

    ReplyDelete