Friday, January 27, 2012

వాణిని తిరస్క రించె డి వాడె బుధుడు

అధమ లోకంబు పాలగు నవని యందు
వాణిని తిరస్క రించె డి వాడె , బుధుడు
శిష్ట జన సేవితుండయి సేద దేరు
మంచి చెడ్డల ఫల మిదె మహిని యందు .

Thursday, January 26, 2012

దైవ మనెడి పదము తద్భ వమ్ము

దైవ మనెడి పదము తద్భవ మ్మే కాదు
నరయ జూడ సంది యంబు వలదు
ప్రకృతి వికృతి యనియు పర్యా య పదములు
తత్స మంబు మఱియు తద్భ వంబు

Wednesday, January 25, 2012

గణ తంత్రమ్మ నెడు మాట కల్లగ నిలిచెన్

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రమ్మ నెడు మాట కల్లగ నిలిచెన్ .

Tuesday, January 24, 2012

కడలి నీ రంతయు ను నిండె గడవ లోన

గాలి వానకు పొంగెను కట్ట దరికి
కడలి నీ రంతయును , నిండె గడవ లోన
చూరు వెంబడి జారెడు చుక్క లన్ని
వాన జోరుగ నింటిపై పడుట వలన .

విరుగ బండిన చేలను విడువ దగును

చూడ ముచ్చట గొలుపును చూపరులకు
విరుగ బండిన చేలను , విడువ దగును
చీడ పట్టిన వరి పైరు చేల తతిని
యెంత ప్రాప్త మొ యంతియ నిచ్చు ప్రకృతి.

Thursday, January 19, 2012

కవిని బెండ్లి యాడి కాంత వగచె

సరిత మదిని మిగుల సంతోష మొం దెను
కవిని బెండ్లి యాడి , కాంత వగచె
ముసలి వాడు వచ్చె మొగుడు గా దన కంచు
పూర్వ పుణ్య ఫలము పురుషు డనగ .

మకర శేఖరుండు మమ్ము బ్రోచు

సకల ప్రాణు లందు సమహి తత్వంబును
ఆర్తి జనుల రక్ష ణావ లంబు
డాయు పెంచ నర్హు డైనట్టి మహిత హి
మకర శేఖ రుండు మమ్ము బ్రోచు

Tuesday, January 17, 2012

పాపులను బ్రోచులే భగవంతు డెపుడు

పాపులను బ్రోచులే భగ వంతు డెపుడు
అనెడు మాటలు సరి యగు నయ్య ? స్వామి !
భక్తు లెవ రైన భజి యించ భక్తి మీ ర
రక్ష సేయును నిరతము రక్తి తోడ .

Monday, January 16, 2012

దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్

రారా యని నిను బిలువగ
నేరా నిక రాక యుంటి వేమిటి కతమున్
కోరికలు దీర్చు జనమం
దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్

Sunday, January 15, 2012

పస లేని పశువు కడివెడు పాల నొసంగెన్

అసలుకె మోసము నిచ్చెను
పస లేని పశువు ,కడివెడు పాల నొసంగెన్
పస గలిగెడి మా యావులు
రుస రుస లే దాని గుణము రోజంతయునున్ .

శుభా కాంక్షలు

సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !

Saturday, January 14, 2012

మకర సంక్రమణము మతిని జెర చు

భోగ భాగ్య మిలను భూరి నొసగు నట్టి
మకర సంక్ర మణము , మతిని జెరచు
పంట రాక మిగుల పాట్లు పడుట వల్ల
నేరి కైన తప్ప దీ యవస్థ

Friday, January 13, 2012

నాస్తికులకు దేవత లన్న నయము భయము

దైవ భక్తియు ,ప్రేమయు ,దయలు లేవు
నాస్తికులకు , దేవత లన్న నయము భయము
ఆస్తికుల నర నరముల నంటి యుండు
నుల్ల మలరగ జెప్పితి గల్ల గాదు .

బలము లేని వాడు భగ వంతు డగు నేమొ?

బలము లేనివాడు భగవంతు డగు నేమొ ?
కలి యుగంబు నిదియ కలుగ వచ్చు
సకల జీవ రాశి జాతి వైరంబును
మఱచి కలిసి మెలిసి మసల వచ్చు

ఆరాధన జేయు వాడు యాచకు డౌనున్

శ్రీ రాముని దయ నొందును
ఆరాధన జేయు వాడు , యాచకు డౌనున్
సారా నిత్యము ద్రాగిన
బోరానిక చోటు కెల్ల బోయిన యె డ లన్.

భోగములకు పంట భోగి మంట

సంకు రాత్రి యిచ్చు సకల భోగంబులు
భోగి మంట వెలుగు భూతి నిచ్చు
సకల లోకములకు సరి సంపదల నిచ్చు
భోగములకు పంట భోగి మంట .

Thursday, January 12, 2012

పందిరి మంచంబు నెక్కి ప్రసవము జేసెన్

చిందర వందర జేసిరి (పిల్లలు )
పందిరి మంచంబు నెక్కి , ప్రసవము జేసెన్
బిందుకు నెలలుం నిండగ
నందం బగు బుల్లి పిల్ల నైదవ కాన్పున్ .

తమ్ములను నుతింతు నెమ్మనమున

ఆద రింతు నఖిల బంధు జనంబుల
తమ్ములను ,నుతింతు నెమ్మనమున
ఆది దేవు శివుని నారాధ్య దేవుగ
అర్ధి జనుల భార మతని దౌను.

Wednesday, January 11, 2012

కాకర పూ వొత్తు వెలుగ కనకము కురియున్

వేకువ ,వెలుగులు జిమ్మెను
కాకర పూ వొత్తు వెలుగ ,కనకము కురియున్
కాకర పాదుల కుదురుల
నేకముగా పంట పండి యెక్కాలము లోన్ .

సంగీతము విన్న వారు చచ్చిరి త్రుటిలో

అంగాంగం బులు నూ పిరి
సంగీతము విన్న వారు , చచ్చిరి త్రుటిలో
రంగని మరణము వినగనె
భంగము నే జెంది రచటి భామలు నొయ్యన్.

యతి మోహావేశ మెసగ నతివను బిలిచెన్

అతివకు నాకర్షి తుడై
యతి మోహావేశ మెసగ నతివను బిలిచెన్
రతి కార్యము చేతకునై
యతియును బల హీను డగునె ? నతివల లోలన్ .

మకర సంక్రమణము మతిని జెరచు

సిరి యు సంపదలను శీ ఘ్రముగా నిచ్చు
మకర సంక్రమణము , మతిని జెరచు
త్రాగు బోతు వాని త్రాగుడు విష మించ
జరుగ వలయు పనులు జరుగు నిజము

ఇద్దరు మఱి ముగ్గు రైరి యీ శుని గెలువన్

పెద్దనకు బెండ్లి జేయగ
నిద్దరు మఱి ముగ్గు రైరి , యీ శుని గెలువన్
దద్దమలు నెందరున్నను
మొద్దు లె నిక నేమి జేయు ముక్కంటి నినిన్

Tuesday, January 10, 2012

ధర్మ విదులకు బూ జ్యుడు త్రాగు బోతు

ధర్మ రక్షణ గావించ ధరణి వెలసి
విష్ణు తేజంబు నొందిన కృష్ణు డవని
ధర్మ విదులకు బూ జ్యుడు ,త్రాగు బోతు
త్రాగి తందన లాడుచు దాను చెడును .

Sunday, January 8, 2012

విగ్రహము లతో నిండెను వీ ధు లెల్ల

ప్రజల దుర్మార్గ చేష్టలు ప్రబలి పోగ
వాటి నణగించ పుట్టెను వర గణేశు
చవితి పండుగ రోజున జరుప పూజ
విగ్రహము లతో నిండెను వీ ధు లెల్ల .

Wednesday, January 4, 2012

నామంబుల కెల్ల పంగ నామము మేలున్ .

భూమిం దారుణ మైనది
నామంబుల కెల్ల పంగ నామము , మేలున్
నేమము గల నొక వణిజుడు
పామోli

ఆప్తుడ వగు మీ .......

కష్టే ఫలె యను నానుడి
నిష్టము తో నమలు బరుచ నిచ్చును సుఖముల్
అష్టైశ్వర్యము లుండిన
కష్టము లో నున్న వారి కాప్తుడ వగు మీ .

శివుని పూ జిం తు రే కాద శీ దినమున

మాస శివ రాత్రి దినమున మఱువ కుండ
శివుని పూ జిం తు ,రే కాదశీ దినమున
పూలు గ్రుచ్చిన దండల బూజ సేయ
భవ్యు డొ సగును సంపద భక్తు లకును .
------
శివుని పూ జిం తు రేకాద శీ దినమున
ననగ నే ల నొ బూ జించ ననుదినమ్ము
నుబ్బు లింగడు గద కడు నుబ్బి పోయి
భూతి నొసగును మనకిక భూరి గాను .

Tuesday, January 3, 2012

దత్త పది "కల" (నాలుగు పాదాలలోనూ కల,త్రిజటా స్వప్నము )

కలవింక మంచి రోజులు
కలతల నే జెంద బోకు కలికీ ! సీతా!
కలయుటకు వచ్చు రాముడు
కలకాలము హాయి చెలగు కాంతుని తోడన్ .

Monday, January 2, 2012

పం ది మిగుల చొక్కె సుంద రాంగి.

చిన్న తనము నుండి స్నేహితు లైనట్టి
ప్రీతి, రమణు లైరి ప్రేమి కులుగ
పెండ్లి యాడు మనుచు ప్రీ తియె దావల
పంది, మిగుల చొక్కె సుంద రాంగి.

బ క సే వలు సేయ సకల భద్రము లొ దవున్ .

రక రకముల నామంబుల
సకలం బున కీ శు డైన చండీ నాధున్
నకళంక మనస్కుని త్ర్యం
బక సేవలు సేయ సకల భద్రము లొదవున్ .

పాత కాలపు టల వాట్లు పాడు జేయు .

బాగు పరచును మనుజుని బాగు గాను
పాత కాలపు టల వాట్లు , పాడు జేయు
కొత్త వేషంబు ధారణ కుర్ర కారు
ని నిది నిజమని , దెలియును నిలకడ గను.

ఆంగ్ల పాలన మనలను న ర్ధి జేసె.

ఆంగ్ల ప్రభువులు మనలకు నాశ జూపి
కూడు గుడ్డలు సహితము కొల్ల గొట్టి
దోచి కొనగను సంపద దుష్ట మతిని
ఆంగ్ల పాలన మనలను నర్థి జేసె.

చెప్పు దినెడు కుక్క సీమ నేలె

కాళ్ళ కింద నలిగి కదల కుండగ నుండె
చెప్పు దినెడు కుక్క , సీమ నేలె
గనుల లీజు నొంది గాలి సోదరులును
జైలు పాలు లయిరి జగము లోన.

పొదుపు జేయు డనిన బూ తు నయ్యె .

తండ్రి యిచ్చు డబ్బు దాచు కొండని బల్క
వీర నారి యయ్యి విసురు గొట్టె
పిన్న పెద్ద లందు పెద్ద జా డ్య మిదియ
పొదుపు జేయు డనిన బూతు నయ్యె .

పాడు లోకము మనుజుల బ్రతుక నీదు.

కాల వైప రీ త్యంబులు గలుగు చుండి
మాన వాళిని గడగండ్ల మయము జేసె
నేమి పాపము జేసితి నేమొ కాని
పాడు లోకము మనుజుల బ్రతుక నీదు.

Sunday, January 1, 2012

పండితులను దిట్టు వారు పావన చరితుల్ .

ముండనము జేయ నర్హులు
పండితులను దిట్టు వారు ,పావన చరితుల్
దండిగ పూజలు సేయగ
దండములుం దప్ప నింక దారియు గలదే !

ఆంగ్ల వత్సర మభ యమ్ము నొసగు

ఆంగ్ల వత్సర మభ యమ్ము నొసగు గాత !
క్రీ .శ .యిరువది పదికి మఱి రెండు
పాడి పంట సిరులు భాగ్యము గా నిచ్చు
వత్సరమ్మ ! నీకు వంద నంబు .