Thursday, May 31, 2012

అమ్మ జ్ఞాపకాలు

అమ్మా ! యెక్కడ నుంటివి ?
ఇమ్మా యిక నీదు నా జ్ఞ నిను జేరుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నమ యింక నాకు వదు లుదు నన్నిన్
--------=
నిజమును జెప్పుచు నుంటిని
విజయము నీ పట్ల యుండు వేవిధములు గాన్
అజరామరములు నాత్మలు
నిజముగ యవి మారు చుండు నెప్పటి కపుడున్
-----------
అమ్మ పదమున కర్దము అమృత మయము
చిన్న తనమున నూ త గ చేతి నిచ్చి
పెంచి లాలించి పోషించి పెద్ద చేసి
యింటి వానిగ జేసితి వింత లోన
----------------
ఎందు బోయితి వుందువు నెచట నీవు?
నేను వత్తును జూపించు నీ దు దారి
నేడు చూడంగ యీ యిల్లు పాడు పడియె
మారె దెయ్యాల కొంప గ మారె నమ్మ!
-------------===
కోప గించను నోయమ్మ! కోప గించ
మాట మీ రను పల్లెత్తు మాట యనను
నీ దు నాజ్నను బాలింతు నిజము నమ్ము
కాను పించుము చూతును కన్ను లార.

అడవి కాచిన వెన్నెల హాయి నొసగె

సరిత ,పగలంత పడినట్టి శ్రమ యయ్యె
అడవి కాచిన వెన్నెల , హాయి నొసగె
నిండు జాబిల్లి వెన్నెల వెండి బోలి
సంత సంబును గూర్చుచు సహృద యులకు .

రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

రాలను రువ్వగ భక్తులు
రాలనె పూ మాలలగ దలంచి కరుణతో
బోలా శంకరు డ య్యెడ
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ .

Wednesday, May 30, 2012

నరులే కారణము లంక నాశనము నకున్

అరయగ వానర సేనలు
అరమరికలు లేనివారు నాప్తులు రమకున్
సురలకు పుట్టిన యీ వా
నరులే కారణము లంక నాశనము నకున్.

ద్రాక్ష పండ్లు తినిన దవడ వాచు

ద్రాక్ష పండ్లు తినిన దవడ వాచు ననుట
మంచి మాట కాదు నెంచి చూడ
బలము బుద్ది తెలివి బహు విధములు గాను
ద్రాక్ష యిచ్చు మనకు తనయు లార!

సంసారము చేయలేని చవట గ మారున్

హింసా మార్గము నెన్నుకు
మాంసా హారంబు నెడల మక్కువ కలిగే
హింసా కారుడు నెప్పుడు
సంసారము చేయలేని చవట గ మారున్

Tuesday, May 29, 2012

పాల బుగ్గలు కొరుకం గ పాలు కారె

వేడి నెత్తురు చిమ్మెను బేబి కూతు
పాల బుగ్గలు గొరుకం గ , పాలు కారె
చదును గలయట్టి యావుల చన్ను పిదుక
కొలది సేపున పాల తొ కుండ నిండె

పాల బుగ్గ కొరుక పాలు కారె

శోణితంబు వెడలె సునయన పసిబిడ్డ
పాల బుగ్గ కొరుక, పాలు కారె
పొట్టి యావు చిన్ని పొదుగును పిదుకం గ
మూడు సార్లు చేప ముంత నిండె

డం డ డ డ డ డం డ డం డ డం డ డ డం డం

దండమయా శివ శంకర
దండమయా సాంబ నీకు దండము శంభో
దండములు మీకు నెపుడును
డం డ డ డ డ డండ డం డ డం డ డ డం డం

వ్యాధి యుపశ మించె బాధ హెచ్చె

లక్ష్మణ ఫల రసము లాగించ కేన్సరు
వ్యాధి యుపశ మించె, బాధ హెచ్చె
సూది మందు కొఱకు సూది పో నొడలన
మందు లెపుడు వాడ బాధ కలుగు

గ్రహ శాంతులు జేయువాడు కాటికి నేగున్

అహరహము సుఖము నొందును
గ్రహ శాంతులు జేయువాడు , కాటికి నేగున్
గ్రహ గతులే వక్రించిన
గ్రహ నాయకు రవిని గొలువ నిహమున సుఖముల్

నే తి బీరకాయ నేతి నిచ్చు

నేతి బీరకాయ నేతి నిచ్చు ననుట
నిజము గాదు నరయ నేతి బీర
పాదు జాతి మొక్క పధ్యమిచ్చును నిల
పాదు లన్ని మేలు పడును మనకు

Sunday, May 27, 2012

అరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్

అరమరిక లేక జెప్పుడు
నరయంగా ద్రుపద సుతకు నార్గురు భర్తల్ ?
వరమగు నారవ భర్తను
కరుణుడు గా నొ ప్పు కుం ద్రె ? కవులందరునున్
----
కర్ణుడు బదులు కరుణుడు అని ప్రయోగించడ
మైనది . క్షంతవ్యుడను .

వావి వరుసలు జూడరు వదినె గారు

అన్న కొడుకగు సోముని యన్న కిచ్చె
తనదు కూతురు లక్ష్మిని , తనదు కొడుకు
పెండ్లి చేసెను సోముని పిన్ని తోడ
వావి వరుసలు జూడరు వదినె గారు

పెండ్లి కాని పిల్ల విధవ యయ్యె

పెండ్లి కాని పిల్ల విధవ యయ్యె ననుట
చోద్య మిదియ వినగ,చూడ గాను
ఎంత వారి కైన నిటువంటి దురవస్థ
రాక యుండు గాక! రమ్య చరిత !

Saturday, May 26, 2012

సాకుర్రు బావ గారు -పదవీ విరమణ

౧. అజ్జరపు వంశ మండన !
ఒజ్జవు సాకుర్రు కీ వ , యుత్తమ నేతా !
ఉజ్జ్వల చరితుడ వౌపూ
సెజ్జ యె యిక నీ దు బాట సిత వస్త్ర ధరా!

౨. నీదు మాటయె ప్రజలకు వేద వాక్కు
నిన్ను నమ్మిన వారికి నీ డ నిచ్చి
ఆదు కొందువు నిక్కము సాదరముగ
తండ్రి పేరును నిల బెట్టు తనయుడీవ.

౩. అక్క సె ల్లెండ్రు , కూతుళ్ళ నాదరించి
అన్న దమ్ములు ,కొడుకును నక్కు జేర్చి
ప్రేమ నిత్తువు, నిజమది ప్రియము తోడ
సాటి యె వ రయ్య నీ కిల సాటి యెవరు ?

౪. పదవి విరమణ దెలియును పదవి నాడె
చింత గూడదు దానికై సుంత యైన
బాధ తెలియును నాకును బావ గారు !
పదవి విరమణ వలనన వచ్చు ఫలము .

౫. సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

ఇట్లు
సుబ్బారావు


అప్పలమ్మ కొడుకు తప్పి పోయె

అప్పలమ్మ కొడుకు తప్పి పోయె నటర!
వింటె వార్త నీవు వెంకి బావ !
ప్రభల తీర్ధ మచట ప్రాభ వంభు గ సాగె
నచట తప్పి పోయి యెచట కేగె?

మూడు ముళ్ళ బంధ మూడి పోయె

రజని పెండ్లి జరిగె రాము తోడన నిల
స్కూలు నుండి వచ్చు చుండ రాము
వెనుక నుండి గుద్ద వెహికు లొ కటినౌర
మూడు ముళ్ళ బంధ మూడి పోయె .

Friday, May 25, 2012

కైక విభుడు రాఘ వుండు కాపాడు మిమున్

భీ కర హృదయుడు నయ్యెను
కైక విభుడు , రాఘవుండు కాపాడు మిమున్
శ్రీ కరుడు లోక హితుడును
వాగమృత సుధార యుతుడు బహుముఖ విదుడున్

Thursday, May 24, 2012

పదములు లేనట్టి వాడు పరుగులు వెట్టెన్

బెదరుచు పాకుచు వచ్చును
పదములు లేనట్టి వాడు , పరుగులు వెట్టెన్
పదనిసలు బాడు కొనుచును
నీ శ్వరు సంతోష మెసగ నీ శుని గుడికిన్ .

పుత్రు డనే గానటంచు పుత్రుడు పలికెన్

పిత్రా ! యేమని జెప్పుదు?
చిత్రమ , యీ రోగ మబ్బె చేయుదు వైద్యం
మాత్రలు తెత్తును, లేనిచొ
పుత్రుడనే గా నటంచు పుత్రుడు పలికెన్

Wednesday, May 23, 2012

మూ ర్ఖు డతడు రాజ పూ జితుండు

తప్పు పలికి ,చేసి యొప్పు ననెడి వాడు
మూ ర్ఖు డతడు, రాజ పూ జితుండు
సకల శాస్త్ర ములను జదివి న మనుజుండు
రచ్చ సభల లోన రాణి కెక్కు .

Tuesday, May 22, 2012

నాలుగున కైదు కలుపంగ నలుబ దగును

అరయ గణితాన తొమ్మిది యగును సామి !
నాలు గునకైదు కలుపంగ , నలుబ దగును
పదికి ముప్పది కలుపంగ పదిల ముగను
చేయ గలుగుదు మిటులన శీ ఘ్రము గను .

రంకు నేర్చిన చిన్నది బొంక లేదు

వావి వరుసలు విడనాడి బరితె గించు
రంకు నేర్చిన చిన్నది , బొంక లేదు
పాప కర్మల యందున పట్టు కలిగి
భీతి గలిగెడు మనసున్న బేల ,యనఘ !

Monday, May 21, 2012

తప్పు లెన్ను వాడె గొప్ప వాడు

పద్య రచన యందు పాటవంబును గల్గి
సరిగ జూచు నట్టి శంక రుండు
మమ్ము నుత్స హించి మంచి కవిని జేసె
తప్పు లెన్ను వాడె గొప్ప వాడు .

Sunday, May 20, 2012

పందిరి మంచమున ముండ్లు పరచు టె మేలౌ

అందమగు పూల జల్లుట
పందిరి మంచమున , ముండ్లు పరచు టె మేలౌ
పందుల బారిని రక్షకు
వందలుగా లింకు గూర్చి భవనము చుట్టున్ .

Saturday, May 12, 2012

లోక పాలు లేకున్నను లోటు లేదు

లంచ గొండుల పదవులు తుంచి వేసి
న్యాయ బద్ధుల నియ మించు నట్లు చేసి
గట్టి పాలన నందించ గలిగె నేని
లోక పాలు లేకున్నను లోటు లేదు .

పద్య రచన -౨౧,,కుచేలుడు

బాల్య మిత్రమ! దర్శన భాగ్య మౌర
యిన్ని నాళ్ళకు కలిగించి తీ వ సామి !
చరణ జలములు నాపైన జల్లు కొందు
పాద ములుగడి గి, సుదామ ! పదము లిమ్ము .

బంధాలే మనల జేయు బానిస వానిన్

బంధములు సరిగ నుండిన
బంధువులే సంత సింత్రు భయములు మరచిన్
బంధా లవి విక టించిన
బంధా లే మనల జేయు బానిస వానిన్

పద్య రచన -౨౦ , అహల్య

రామ పాదము దగిలిన రాయి మారె
సాధ్వి గౌతము భార్యగ ,సచ్చరిత్ర
యాయ హల్య రా ముపదము పైబ డియ నె
మోక్ష మీ యుము రామయ్య ! మోక రింతు .

Friday, May 11, 2012

సగము పెట్టిన పిమ్మట జంక నేల?

అన్న మడిగిన భర్తకు నాదర మున
సగము పెట్టిన పిమ్మట జంక నేల?
మరది యత్తను బావను మామ జూచి
భర్త కనుసన్న మెలగుట భార్య కద్దు .

నరక లోకము గల దండ్రు నాక మందు

పూర్వ జన్మల పాపాల పుట్టి నిల్లు
నరక లోకము , గల దండ్రు నాక మందు
రంభ మొదలగు నచ్చర రమణు బొత్తు
చూడ నాకాశ మంతయు శూన్య మౌర !

అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు

కఠిన చిత్తము , గోపము కలుగ జేయు
అధిక రక్తపు పోటు, సౌఖ్యమ్ము గూర్చు
శాంతి సహనముల్మ రియును సాను భూతు
లాయు రారోగ్య సంపద లన్ని యిచ్చు .

కోటి వైద్యులు గూడిన కుదురు లేదు

మొండి రోగము నొడ లంత ముదిరి పోయె
మందు లె న్నె న్నొ వాడిన మార్పు లేదు
దినము దినమును దేహము తేలి కయ్యె
కోటి వైద్యులు గూడిన కుదురు లేదు .

దత్త పది -,గొయ్యి -నుయ్యి -ఉయ్యి -తొయ్యి

గొయ్యి తవ్వగ తవ్వగ నుయ్యి యగును
ఊట నీ రును త్రాగక యుయ్యి యచట
తుక్కు దూ గర పక్కకు తొయ్యి బాల !
తేట నీటిని త్రాగిన తీ య గుండు .


Thursday, May 10, 2012

దత్త పది -ఇరుక రాదు , కొరుక రాదు ,నరుక రాదు ,పెరుకరాదు

ఇరుసు చక్రాల మధ్యన నిరుక రాదు
నల్ల రేగడి చెట్టును నరుక రాదు
కొడుకు నింటను పండ్లను కొరుక రాదు
పేను పట్టిన జుట్టును పెరుక రాదు .

Wednesday, May 9, 2012

పద్య రచన -౧౮ .మోహినీ అవతారము

దేవ దానవు లిరు వైపు తిష్ఠ వేసి
చూడ సాగిరి మోహిని చూడ్కి వైపు
అమృత పానంబు నందున నాతు రతన
నెరుగ నైతిరి దానవు ల్నెలతి మాయ .

ఏడు వంద లనిన నెక్కు వగున ?

ఏడు వంద లనిన నెక్కు వగున మాకు ?
ఎన్ని వంద లైన నీ య దగును
పద్య రచన వలన పదు నౌను బుఱ్ఱలు
వంద నంబు మీ కు కంది తిలక !

Tuesday, May 8, 2012

పద్య రచన -౧౭.

విజయ నగరపు వెలుగవు వీ ర పురుష !
దేశ భక్తిని చాటిన ధీ యుతుండ!
అప్ప రావు మ హా శ య ! యందు కొనుము
నాదు జోహార్ల శతమును నవ్య చరిత !

గేయ రచన

గురజాడ మహాశయా !
వందనములు
అన్నావు నీవు..........
దేశ మంటే మనుషులని
మాన వత్వాన్ని చాటి చెప్పావు
కన్యా శుల్కాన్ని , దురాచారాలను
రూపు మాపావు
దేశ భక్తిని ప్రజలలో
ప్రోత్సహించావు
నిను కన్న విజయ నగరము
ధన్యము
మీ కివియే మా జోహార్లు .

కోయ వాడు గొట్టె గుపితు డగుచు

రాము తోట లోని రామ ఫలములను
కోయ , వాడు గొట్టె గుపితు డగుచు
అడుగ కుండ కోయ నవసర మేమొ చ్చె?
రంగ ! యిటుల జేసి దొంగ కాకు .

చందురు లో నిఱ్ఱి నేల చంగలి మేసెన్

అందము గొల్పుచు నుండెను
చందురు లో నిఱ్ఱి , నేల చంగలి మేసెన్
డెందము నూయల నూ గగ
నందము గల లేడి పిల్ల నడయా డుచునున్.

Monday, May 7, 2012

అయ్యవారిని గని నవ్వె యాచకుండు

చిన్న పిల్లల తోడన చెడుగు డాడు
అయ్యవారిని గని నవ్వె, యాచకుండు
వీధి వీధులు దిరుగుచు వేడు కొనెను
పట్టె డ న్నము బెట్టియు పైస లిండు.

Sunday, May 6, 2012

పద్య రచన -౧౬.

సత్య వంతుని ప్రాణాలు సమసి పోయె
సాధ్వి సావిత్రి పలుమార్లు సముని కోర
తీ సి కొనుమంచు ప్రాణాలు తిరిగి యిచ్చె
సంత సించెను సావిత్రి సత్య జూచి

చెడు వారింగొలువ దీ రు చిర కామ్యంబుల్

అడవుల బాలగుదురు కద
చెడువారిం గొలువ , దీ రు చిర కామ్యంబుల్
వడి దుడుకులు లేకుండగ
నడకువ తో శంభు గొలువ నతులిత భక్తిన్ .

తొండ ఘీంక రించె దొండ మెత్తి

మూగ జీ వి నోరు మూగ బోవంగను
బావి పైన నుండి పలుక రించె
తొండ , ఘీంక రించె దొండ మెత్తి గజము
బావి లోన నుండు మనుజు జూచి .

శ్ర ద్దాంజలి

౧. లేవు లేవ మ్మ !యి కమాకు లేవు నీవు
ఎచటి  కేగితి వోయమ్మ ! యి పుడు నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

౨. చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు
తల్లి నీవయ, మరియును దండ్రి వీ వ
మరువ జాలము నెన్నడు మరువ లేము

౩. జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి
యు న్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ !! చూతుమ యొ కపరి  యైన రమ్ము
పున్నె యింతి గ నీ రాక ముదము మాకు .

౪. ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు
నాన్న  కూడను  నిందుకై  నగవు తోడ
సాయ బడుదురు కదయమ్మ  శ్రద్ధ కలిగి



5. అమ్మ ప్రేమను బంచిన యమ్మ  యీవు
మరువ జాలము నిన్ను మే  మరువ లేము
మాయ రోగము వచ్చి నిన్మడియ జేసె
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

6. ఆశ లేదమ్మ ! నీ కిల యాశ లేదు
ఉన్న దానితొ సంతృప్తి నొంది తీవు
సాటి రారమ్మ యె వరును సాటి రారు
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .


నీవు కూడను వారికి నేస్త మైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు సాయి .

8 అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
ఆదు కొందురు నమరులు హాయి గుండు .

9, చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయను సమ్మతించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీదు నాత్మకు శాంతిని నించు  గాక !

10. మగని సేవకు నంకిత మైతి వీవు
బ్రతికి నన్నాళ్ళు , సంసార బంధ మౌర
గుండె పీ డించి యెముకల గూడు చేసె
అందుకొను మమ్మ ! శ్రద్ధాంజ లందు కొనుము .

అశ్రు పూర్వక నయనాలతో ...........
రాజా
బిందు
సౌజి





Saturday, May 5, 2012

పద్య రచన -15

జంట కవులను బేరున శాస్త్రి యుగము
ఖ్యాతిని గడించి రవ ధాన కళ మెరయగ
వేంకట మఱియు తిరుపతి పేరు వారు
వంద నీ యులు కవులకు బందు గులకు

Friday, May 4, 2012

కాళి దాసాదు లెవ్వరు కవులు గాదు

పెక్కు కావ్యముల్ రచియించి పేరు గాంచె
కాళి దాసాదులె ,వ్వరు కవులు గాదు
అల్లి బిల్లిగ పద్యాల నల్ల గానె
కవి యనంగ నర్ధము నీ టి కాకి యౌను




మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్

సతతము కేకలు వేయును
మతి లేని నరుండు , మిగుల మన్నన నొందున్
నతులిత ప్రజ్ఞా వంతుడు
వితరణ శీ లుడును శాస్ర వేత్తయు నెపుడున్

భర్త యనుకొని దొంగను బాదె నతివ

ప్రేమ మీ రగ సిగ్గున బిలువ సాగె
భర్త యనుకొని దొంగను , బాదె నతివ
దొంగ గాజేయ నగలన్ని , దుడ్డు తోడ
తప్పు జేసిన దండమే తగిన శిక్ష .

Wednesday, May 2, 2012

భర్త యనగను నర్ధము బాదు వాడు

ఎల్ల వేళల మఱి భరియించు వాడు
భర్త యనగను నర్ధము , బాదు వాడు
క్రూ ర మృగమును బోలిన క్రూ రు డతడు
దుష్ట జనులను నుంచుడు దూ రముగను.

వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె

తులువ పని యని భావించి త్రోసి పుచ్చె
వార కాంతా విమోహమున్ , భార్య మెచ్చె
మగని ఇంద్రియ నిగ్రహం బ పటిమమును
వార కాంతల నెయ్యము వలదు వలదు

Tuesday, May 1, 2012

సిరుల వలన నేడు చేటు కలిగె

కష్ట పడిన సొమ్ము కావడ ము వలన
స్టేటు బేంకు నందు సేవు సేయ
బేంకు జీ త గాడు పెండ్లికి బోవంగ
సిరుల వలన నేడు చేటు కలిగె

బుద్ది హీ నులు మ్రొక్కిరి మురహ రునకు

వెన్న దొంగ గ ముద్రను వేయు చుండ్రు
బుద్ది హీ నులు , మ్రొక్కిరి మురహరునకు
భక్తి శ్రద్ధలు నెరపుచు పాండు రంగ !
యనుచు కైదండ లిడుచును నార్తి తోడ .