Thursday, May 31, 2012

అమ్మ జ్ఞాపకాలు

అమ్మా ! యెక్కడ నుంటివి ?
ఇమ్మా యిక నీదు నా జ్ఞ నిను జేరుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నమ యింక నాకు వదు లుదు నన్నిన్
--------=
నిజమును జెప్పుచు నుంటిని
విజయము నీ పట్ల యుండు వేవిధములు గాన్
అజరామరములు నాత్మలు
నిజముగ యవి మారు చుండు నెప్పటి కపుడున్
-----------
అమ్మ పదమున కర్దము అమృత మయము
చిన్న తనమున నూ త గ చేతి నిచ్చి
పెంచి లాలించి పోషించి పెద్ద చేసి
యింటి వానిగ జేసితి వింత లోన
----------------
ఎందు బోయితి వుందువు నెచట నీవు?
నేను వత్తును జూపించు నీ దు దారి
నేడు చూడంగ యీ యిల్లు పాడు పడియె
మారె దెయ్యాల కొంప గ మారె నమ్మ!
-------------===
కోప గించను నోయమ్మ! కోప గించ
మాట మీ రను పల్లెత్తు మాట యనను
నీ దు నాజ్నను బాలింతు నిజము నమ్ము
కాను పించుము చూతును కన్ను లార.

No comments:

Post a Comment