Monday, September 3, 2012

సత్య సాయి వీ లు నామా పత్రాలు


సత్యసాయి వీలునామా పత్రాలు

సత్యసాయి నిర్యాణానంతరం ట్రస్టుకు చెందిన కోట్లాది రూపాయల స్థిర చరాస్తులు ఏమి కానున్నాయి? సత్యసాయి సేవలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు సత్యసాయి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో కోట్లాది ప్రజలు, భక్తుల మెదళ్లను తొలిచాయి. వీటన్నింటికీ స్పష్టమైన జవాబునిస్తూ సత్యసాయి 1967లో రాసిన వీలునామాతో కూడిన పత్రాలు బయటకు వచ్చాయి. సత్యసాయి ఆంతరంగికుడు సత్యజిత్ పేరుతో మీడియాకు అందిన ఈ-మెయిల్ సందేశంలో ఇవి ఉన్నాయి. ఈ వీలునామా పత్రాలు ముంబైలో రిజిస్టర్ అయ్యాయి. సత్యసాయి స్వయంగా వీలునామా రాశారు.
click here to Download satyasai will pdf
‘‘ప్రశాంతి నిలయం నివాసి సత్యసాయి అను పేరు గల నేను.. నా వారసులుగా చెప్పుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తి హక్కులు ఎవరూ కోరకుండా ప్రజాప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాను. ట్రస్టుకు భక్తులు ఇచ్చిన ఆస్తులకు నేను ట్రస్టీని మాత్రమే. నా తదనంతరం ఈ ఆస్తులను భక్తులే చూసుకుంటారు. ట్రస్టు ఆస్తుల పర్యవేక్షణ, వాటి నియంత్రణ మాత్రమే సెంట్రల్ ట్రస్టు బాధ్యత’’ అని స్పష్టంగా తెలియజేశారు. తాను 12వ యేటనే కుటుంబాన్ని త్యజించి సంబంధ బాంధవ్యాలు వదులుకున్నానన్నారు. తన భక్తుల మూలంగా తనకు సంక్రమించిన స్థిర చరాస్తులన్నీ తాను స్థాపించిన ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతాయని తెలియజేశారు. ట్రస్టుపై హక్కులు కోరే అధికారం ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల ఆస్తులతో తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. ట్రస్టుతో, దానికి సంబంధించిన ఆస్తులతో కుటుంబానికిగాని, కుటుంబ సభ్యులకు గాని సంబంధం లేదని కూడా సత్యసాయి ఆ వీలునామాలో స్పష్టం చేశారు. చట్టపరంగా ధ్రువీకరించిన షా: సత్యసాయి నిర్యాణం పొందిన ఏడాదిన్నర తర్వాత వీలునామా పత్రాలు వెలుగులోకి రావడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. సత్యసాయి 1967 మార్చి 27న 44 ఏళ్ల వయసులో స్వయంగా రాయించి, రిజిస్టర్ చేయించారు. ఈ పత్రాలను ధ్రువీకరిస్తూ సాక్షిగా ముంబైకి చెందిన ఓవై శుక్లా సంతకం కూడా చేశారు. అనంతరం 1998లో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్వహణలో సాయి విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వివిధ రంగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పారు. ఇదే సందర్భంలో ఈ విలువైన పత్రాలను భద్రంగా దాచమని తన ఆంతరంగికుడైన సత్యజిత్‌కు సూచించారు. వీటిని సత్యజిత్ ఇప్పటివరకూ గోప్యంగా ఉంచారు. గత ఏడాది నవంబర్ 21న జరిగిన సత్యసాయి జయంతి సందర్భంలో సత్యజిత్ ఈ పత్రాల విషయాన్ని ఇందూలాల్ షా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తచెరువుకు చెందిన నోటరీ వెంకటరమణప్పను ప్రశాంతి నిలయానికి రప్పించి ఆ పత్రాలను చట్టపరంగా ధ్రువీకరించారు. ఈ ధ్రువీకరణలో సాక్షులుగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరేన్‌రామ్‌జీ, బృందావన్ క్యాంపస్ డెరైక్టర్ సంజయ్ సహానీ సంతకాలు చేశారు. వీటిని ధ్రువీకరిస్తున్న సమయంలో ఇందూలాల్ షా అన్ని విధాలా ఆరోగ్యవంతుడై ఉన్నారంటూ సత్యసాయి వైద్య సంస్థల ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వరదాచారి నిర్ధారించారు. ఈ ఏడాది జూలై 1న జరిగిన సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 17వ సర్వసభ్య సమావేశంలో సైతం వీటిపై చర్చ జరిగినట్లు ఈ-మెయిల్ సందేశంలో తెలిపారు. ఆదివారం వీటిపై మీడియాలో ప్రచారం జరగడంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు కూడా ఈ వీలునామాపై మరోసారి చర్చించినట్లు సమాచారం.



click hereclick hereclick here


No comments:

Post a Comment