Wednesday, October 31, 2012

శిలయే మృ దు పుష్ప మ ట్లు చెలు వొందె బళా .

అల నాడా రాముడు వన
 ము ల  మార్గము  బోవు చుండ  ముకుళి త  శిలను
న్నల తి  యహల్యను  దాకగ
శిలయే  మృ దు  పుష్ప  మ ట్లు చెలు  వొందె బళా . 

పద్య రచన -పిల్లి ,కోడి పిల్లలు


చూడు  మల్లదె   చిత్రంబు చోద్య   మదియ
కోడి  పిల్లలు ,పిల్లియు  కూడి  యుండె
జాతి  వైరంబు  లేక య  జతగ యుండి
మునుల  యాశ్రమ భావంబు  మొనయు  చుండె .
 

Monday, October 29, 2012

పద్య రచన -145

దండ మయా  శివ  శంకర 
 దండ మయా  సాంబ నీకు  దండము  భవుడా !
దండమయా  గిరిజా పతి !
  దండమయా  నీకు  నెపుడు  దండము  శివుడా !

చిత్రమ్మే మాట లాడె చిత్రము తోడన్ .

చిత్రములు    జ రుగు  చున్నవి
చిత్రమునే  స్క్రీను  మీద  చేతులు  కదిపీ
చిత్రముగ  తోలు బొమ్మల
చిత్రమ్మే  మాట లాడె  చిత్రము  తోడన్ .

పద్య రచన -144

లేగ దూ డలు  దల్లులు  వేగిరముగ
ద్రాగు  చుండెను  జూడుడు  ద ప్పి  కతన
బోరు  పళ్ళెము  నందలి  నీరము ను,  జ
వాను  దోడు  చుండెను  గద  వాటి కొఱకు .

Saturday, October 27, 2012

సిగరెట్టులు గాల్చ దగును , సే మము కొఱకున్

నగరము  వెలుపల  నరయగ
సిగరెట్టుల  గాల్చ దగును ,  సే మము  కొఱకున్ 
పగతుర  జోలికి  పోకుము 
పగ  గలిగిన  నిదుర  రాదు  పాడగు  మతియున్ .

హరు డుం గర మిచ్చి పంపె హనుమంతు నొగిన్

అ రిలోక  భయంకరు డే
హరు డుం గర మిచ్చి  పంపె  హనుమంతు నొగిన్
నర రూ పుడు ,భగ వంతుడు
ధరణిని  గాపాడు వాడు , ధర్మ జ్ఞుం డున్ .  

పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్

నగవుల  నిలయ పు  మా టిది
పొగ త్రాగని  వాడు దున్న పోతై  పుట్టు
న్నగ మ్య  గోచర  మీ యది
తగదయ్యా  యిట్టి  దీ య  తమకు న్నిపుడున్

Friday, October 26, 2012

దత్త పది -రారా -పోరా -తేరా -సారా

రారాజు  భీ మ సే నులు 
పోరాటము  సేయు చుండ  పుర హరుడ పుడున్ 
సా రా నిలమును జూ తును 
తే రా పుము  మాత ల య్య !తిరముగ నిచటన్ .

Thursday, October 25, 2012

నేనే వత్తున్ .

చాలీ  చాలని  రాబ డి
యేలాగున  బ్రతుక వలెను నీ శా ! చెపుమా
పాలేరు  తనము  జేయుదు
నీ లోగిలి  తెలుపు మయ్య ! నేనే  వత్తున్ .

శంక రార్య !

చాలి  చాలని  రాబడి శంక రార్య !
క్రుంగ దీ యును  మనిషిని  కూ డు  లేక
మధ్య  తరగతి  బ్రతుకులు  మిధ్య యేను
పూ ర్వ  జన్మల  ఫలితము బొందు  మనల.

Wednesday, October 24, 2012

రామునకు సీ త సోదరి రమ్య వనిత

జనకుని  జ్యేష్ఠ  కొమరిత  జాయ యగును
రామునకు  సీ త  సోదరి  రమ్య  వనిత
రమ్య  పేరున  నొప్పిన  రామ  యామె
సకల  సుగుణాల  రాశియు  సద్వ నిత యు .

దసరా

దసరా పండుగ  రోజున
కిసలయములు  బూ లు  దెచ్చి  కేశము  లందున్
హసితేక్షణ గిరి  ప్రభున క
రుసమున్నట  పెట్టు  నెడల రో సము  తగ్గున్ .

బొమ్మల కొలువు - గాయత్రి నగరము


బొమ్మల  గొలువు  జూడంగ  బోవ  నచట 
బొమ్మలా ? యవి దేవతా మూ ర్తులా య 
నంగ  నొకపరి  విభ్రాంతి  నైతి నయ్య !
యట్ల పేర్చిరి  బొమ్మల  నచటి  వారు.


పండుగ లివి వచ్చు దండు గలకు

పండుగ లివి వచ్చు దండు గలకు నన 
మంచి గాదు మనకు మమత లిచ్చు 
బంధు రికము దెలియు భవ బంధము పెరుగు 
పండు గనిన పరమ పావ నంబు

Sunday, October 21, 2012

కీ చకుడు పెండ్లి యాడె లంకిణిని మెచ్చి .

ఏసు  రాములు  మార్గాన  నేగు చుండి
పిచ్చి  మాటలు  బలుకుచు  బేల వోలె
ఏసు  రాముని  దరి జేరి  యిట్లు  బలికె
కీ చకుడు  పెండ్లి  యాడె  లంకిణిని  మెచ్చి .

కారు తిరిగె విచ్చల విడి గగనము నందున్

అవధాని  గారి  సమస్యా పూ రణ ము

ఔరా  సమస్య యే యిది
యా రాముని  ధర్మ పత్ని  నపహరణ ము కై
చేరిన  రావణు దురహం
కారు తిరిగె విచ్చల  విడి గగనము నందున్ 

కొమ్ములు జనియించె గనుడు కోమలి తలపై

ఇమ్ముగ  మా లే దూ డకు
 కొమ్ములు  జనియించె, గనుడు  కోమలి  తలపై
రెమ్మల  వలె   నేర్పడి యె ను
వమ్ముగ నట  యాముదమ్ము  వాడుట  చేతన్  

Saturday, October 20, 2012

దయ్యమె దైవమును జంపి ధర పై వెలసెన్ .

దయ్యములు లేవు నిజముగ
నయ్యదు నన జంపు శంక హా కలుగుట యా ?
దయ్యము దైవము నొకటే
దయ్యమె దైవమును జంపి ధర పై వెలసెన్ .
కారుకు  రెక్కల  నమరిచి 
నేరుగ పెట్రోలు  బోసి నింగికి  పంపన్ 
వా రందరు  కృషి  జేయగ
కా రు తిరిగె విచ్చల విడి  గగనము  నందున్ .

padya rachana

 వరుణ దేవుడ! మాకొక  వ రము నిమ్ము
నిండు  హృదయాన , పంటలు  పండు  కొఱకు
మంచి  వానలు  కురిపించు  మాకు  ధరను
వేయి  విధముల  మ్రొక్కుదు  మోయి సామి !

దే హము లేనట్టి వాడె తేజము బొందున్


ఆహా  భగవానుడు గద 
దే హము  లేనట్టి  వాడె  తేజము  బొందున్ 
మోహాదులు  లేకుండిన 
దేహము  మఱి  శుద్ది  యగును  దిన దిన వృ ద్దిన్ 

అ వధా నము జేయు వార లల్పులు గాదే !


అవధాన  మరయ  నొక  కళ 
రవ ళిం చును  జనుల  నెపుడు  రసముల  తోడ
న్నవ నవ లాడుచు నుండును 
అ వధా నము  జేయు  వార లల్పులు  గాదే !

Wednesday, October 17, 2012

అవధాని గారి ఆహ్వానము నవ యవధానివి నీ వయ ! వివరించుచు మాకు నీ వు విషయము లన్నీ నవ రస భరితము గలుగగ యవధానము సేయు మయ్య ! యనిలు కుమారా !


అ వధానము సేసిన వాని యాయువు పెరుగున్

అవధా నంబులు సేసిరి
యవిరళ మగు  ధార  కలిగి యాశువు  తోడ
న్నవధా నంబులు  సేసిన
య  వధానము  సేసిన వాని  యాయువు పెరుగున్ .

పద్య రచన -బతుకమ్మ సంబరము

సంబరము  జరుపు చుండి రి
యంబరమేయంటు నటు లహాహా యరుపు
ల్లంబరు పేట్ బతుకమ్మకు
నంబరములు  మేలు రకము నా చ్చా దించీ .




పతిని బాధపెట్టు వనిత సాధ్వి.

నరకలోక మేగు నర జన్మ తదుపరి
పతిని బాధ పెట్టు వనిత, సాధ్వి 
పతి దైవ మనియు భావించి నిరతము
పాద సేవ చేయు పాణి తోడ.

Sunday, October 14, 2012

దొరకని దొంగలును దొరికిన దొంగలు నొకటే .

దొరలుగ  నుండుచు  పైకిల
విరివిరిగా  దోచు కొనుచు వేలకు  వేలున్
దొరకగ  గుట్టుగ  నుందురు
దొరకని  దొంగలును  దొరికిన  దొంగలు  నొకటే .

పద్య రచన -141,కృష్ణ శా స్త్రి


చిత్ర  రంగము  నందున  చేయి  ద్రిప్పి
పాట  లెన్నియొ  వ్రాసిన  పటిమ  నీ దె
కృష్ణ  పక్షపు  చంద్రుడ ! కృష్ణ  శా స్త్రి !
మరల  రావయ్య  మమ్ముల  మరులు  గొల్ప .

Friday, October 12, 2012

శకుని కర్ణ దుశ్శా సనుల్ సత్పురు షులు

దుష్ట బుద్ధులు  మఱియును  దోర్బలురును
శకుని  కర్ణ  దుశ్శా సనుల్,  సత్పురు షులు
పాండ వేయులు  బహు నీ తి  పరులు గూ డ
అన్న దమ్ముల  సఖ్యత నెన్న లేము 

పద్య రచన -మర్క ట ద్వయము


రెండు  కోతుల  జూ డుము  పండను కొని
సెల్లు  ఫోనును  బరికించి  డొల్ల జేసె
కోతి  చేష్టలు  వింత ను  గొలుపు  చుండు
రూ ప  మరయగ మనుజుని  రూ ప మేను .

Thursday, October 11, 2012

చూ డు డదే పట్ట పగలె చుక్కలు వొ డి చెన్


ఓడల  రేవుల   యొడ్డున
చూ డు  డదే  పట్ట పగలె  చుక్కలు  వొ డి చెన్
వాడిగ విద్యుత్కాంతులు
పో డి గ నట  మె ఱ యు  చుండి  యోడల  లోనన్ .

పద్య రచన -139,అల్లసాని పెద్దన


అల్ల సాని  పెద్ద  నార్యుడ ! కవి  వర !
మను  చరిత్ర  రచన  మహితు  జేసె
అల్ల సాని  వారి  యల్లిక  జిగి బిగి
యండ్రు  నిజ ము  నతు ల  నం దు కొనుము .

Wednesday, October 10, 2012

పద్య రచన -138, బీ ట లు తీ సిన పొలము

బీ ట  తీ యగ ,పొల మది   బీ ద  రైతు
వాన  లేమికి  చింతించి  వాన  చినుకు
పడును  పండును  బంటలు  పాట్లు  తొలగు
ననుచు  భావించి  ప్రార్ధిం చె  నవ్వరు ణుని
 

అగ్ని పు నీ త వె యిడుముల కం త ము లేదా ?

అగ్నికి  యాహుతి  యౌట ను
అగ్ని పు నీ త వె  యిడుముల  కం త ము  లేదా ?
లగ్నపు  ఫలితము నౌ  యది
భ గ్న మె  మ రి  యాయె, వారి  భవ బంధ ములున్ 

Tuesday, October 9, 2012

పద్య రచన -తిక్కన

 భారతంబును  దెనుగున  వ్రాసి  నీ వు 
తెనుగు  భాషకు  వన్నెను  దెచ్చి నావు 
తిక్క  నార్యుడ ! కవి వర ! తెలుపు  చుంటి 
వంద  నంబులు  శత కోటి  యందు  కొనుము .

పనస పండు తినగ పరువ మబ్బె

పసిడి  రంగు  కలిగె  పద్మావతి కి యట
పనస  పండు  తినగ,  పరువ  మబ్బె
చిన్న  పిల్ల సీ త  వన్నెలు  జిందుచు
 నాడ  పిల్ల  లంద ఱ ట్లె  యుండు .

దామోదరు దిట్టు వాడు ధన వంతుడ గున్

 ఆ మూ గిగ పుట్టు నిలను 
దామోదరు  దిట్టు వాడు , ధన వంతు డగున్ 
రామా రామా  యనుచున్ 
దోమాల తొ  పూ జ సేయ తూ రుపు  ముఖమై .

పద్య రచన -137,ఎఱ్ఱన

భారతా రణ్య  భాగంబు  బదిల ముగను
దెనుగు  సేసితి వీ వయ ,తేట తెల్ల
ముగను  మఱియును  జనములు  మోద  మలర
శంభు  దాసుడ! యె ఱ్ఱ న !శ తపు  నతు లు .

Monday, October 8, 2012

కుంతికి నైదు గురు సుతలు గుణ సంపన్నుల్

వింతగ బలికెడి  మాటలు
కుంతికి  నైదు గురు  సుతలు,  గుణ  సంపన్నుల్
పంతులు  పెంచిన  పిల్లలు
నింతియ  మఱి  కా క  వారలీ శు ని  భక్తుల్ .

దత్త పది .. క్రికెట్టు -హాకీ -టెన్నిసు -చెస్సు ,భార తార్ధము

భార తంబున జూ దంబు  పాడి  య య్యె
హాకి  టెన్నిసు  చె స్సులు క్రికెటు  లేవి
యాడి  న ట్టులు  గానము  నార్య  !  యెచట
ధరణి  పాలించు  జక్కగ  ధర్మ రాజ !

 

Sunday, October 7, 2012

news


One mosquito coil equals 100 cigarettes, says expert 

New Delhi: Smoke emitted from one mosquito repellent coil is equivalent to those of 100 cigarettes, thus causing harm to a large number of people in India, an expert said. 

"Not many people know about it, but the damage done to your lungs by one mosquito coil is equivalent to the damage done by 100 cigarettes. This was according to a recent study conducted in Malyasia," said Chest Research Foundation director Sandeep Salvi. He was speaking at the conference 'Air Pollution and Our Health', organised by the Centre for Science and Environment (CSE) along with the Indian Council for Medical Research and the Indian Medical Association. Mr Salvi said there is a lack of awareness about the impact of air pollution on human health. Pointing out the "lack of research culture" among Indian doctors, Salvi said that indoor air pollution too is a health risk factor. Participants at the event, which included doctors and health researchers, also spoke about vehicular air pollution in the capital. 

According to estimates, about 55 per cent of Delhi's population lives within 500 metres from main roads - and is, therefore, prone to a variety of physical disorders. "The vehicular pollution is a major concern for the environment. The rising incidents of genetic disorder have a lot to do with air pollution. 

India loses one million children under five because of respiratory problems every year," said Sanjeev Bagai, the chief executive officer of Batra Hospitals. He said industries also contribute to the air pollution and these need to be shifted out of the capital. 

Saturday, October 6, 2012

హెడ్మా ష్ట రు నేర్వ సాగె నేబీ సీ డీ ల్

హెడ్మా  యను  వాడే  యిట
హెడ్మా ష్ట రు,  నేర్వ  సాగె  నేబీ  సీ డీ ల్
లె డ్మా  జేరిన  రోజునె
రెడ్మా  యే   దోస్తి  జేసె  లె డ్మా  తోడన్

 

పద్య రచన -135,నన్నయ

ఆది  కవిగను  బేరొం ది  యాంధ్ర  మందు
రచన  జేసితి వీ వ భా  రతము  న న్న
యార్య ! వందన  మొనరిం తు  నయ్య !గొనుము
శబ్ద  శాసన ! కవివర ! సత్క వీం ద్ర !
 

Friday, October 5, 2012

వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే .

వక్త్రంబు లెన్ని యున్నను
వక్త్రము  మఱి యొకటి నేని  బలుకని శివునిన్
వక్త్రము  లన్నియు  వమ్ము లు
వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే .

పద్య రచన -134,హరి కధ

డప్పు  సన్నాయి  మధ్యన  డాం భికముగ
యువతి  నిలబడి  హరికధ   యుత్సు కతన
జెప్ప  దొడ గెను  జనముల  చప్ప టు లు, గ
గనము వఱకును  వినబడు  వినుడు  మీ రు .

Thursday, October 4, 2012

రమణీ రమ్మనెను సీ త రాముని గనుచున్

రమణుని  జూ డను  ద్రిజటా
రమణీ రమ్మనెను సీ త,  రాముని  గనుచు
న్నమితమగు  సంత సమ్మును
విమలముగా  బొందె నపుడు విల్లును  విఱు వన్ .

పద్య రచన -133,కంస సంహరణ ము

మేనమామని  జూ డక  మృతుని  జేసి 
యవని  బ్రజలను  బ్రోచిన  యాద వేంద్ర !
దుష్ట  శిక్షణ  మఱియును  శిష్టు  బ్రోవ 
యవత  రించితి  వీ వయ  యవని యందు .

Wednesday, October 3, 2012

పద్య రచన -132.కా శీ క్షేత్రము

కాశి కాపురమున  గనిపించు నాలయ 
ములను  గనుల  గాంచ  మోక్ష  మరయ 
సంభ  వించు  నయ్య ! సత్య ము  సుమ్మిది 
శివుని  జూ డ వేరె  చెప్ప  నేల ?

పద్య రచన -131,అన్నము, విస్తరి

కూర  పప్పును  సాంబారు  కూడి  యున్న 
విందు  భోజన  మయ్యది   తిందు  మిపుడు 
రండు  వేవేగ  మీరలు  రాము  గుడికి 
అన్న దానము  జరిగె వెం  కన్న  చేత .

తిరుమ లేశు డైన దిరిప మెత్తె .

వేంక టేశు  డడుగ  పెండ్లి  చేసి  కొనుట
కు , మఱి  సొమ్ము  నిచ్చె  కూ డ దీసి
యా కు  బేరు  డాత  డానంద  బడగను
తిరుమ  లేశు  డైన  దిరిప  మెత్తె .

 

Monday, October 1, 2012

హింస కలుగ జేయు హితము భువికి

 ధీ రు డైన వాని భీ రుని  గానిల
హింస  కలుగ జేయు,  హితము  భువికి
ప్రాణ  హింస  మాను ప్రతిన సే  యంగను
హింస  కలుగు  నెడల  హేయ  మదియ .

పద్య రచన ---గాం ధీ జీ .

చూ డ జాలక  లోకంబు  జూ  డ్కు  లవియ
మూ త బడినవి  యౌ రౌ ర  ముఖము  దించె

నేమి  చేతుము ? తాతయ్య ! యెవరు  దిక్కు ?
రమ్ము  గాం ధి జీ ! వేగమె  మమ్ము  గావ .