Sunday, November 25, 2012

పద్య రచన -జయ విజయులు

జయుడు  విజయులు  నిలబడి  జయము  జయము
పలికిరా యదు  నందను  ప్రభుత కపుడు
తమకు  మోక్ష మీ యంగ  యా  త్రాడు  లాగి
మోక్ష  మీ యంగ  సత్తువ  మురహరి దె గ .

పద్య రచన -ధర్మజుడు ,పాలికలు

జూదము  నాడకు  నెప్పుడు
జూ దమునే  యాడి ధర్మజుడు నడవులకున్
సోదర  యుతముగ  నరుగుచు
పాదపముల  నాశ్ర యించె  బ్రతుకుట  కొఱకున్

Saturday, November 24, 2012

పద్య రచన -జిలేబీలు

నోరూరు చుండె ని య్యె డ
యారాముగ దిందు నిపుడ యన్ని జిలేబు
ల్నార య బంగ రు రంగును
మీ రె ను గద వాటి జూడ మిలమిల మెఱ సీ

 

కాకి నృత్య మాడె కేకి వొగ డె

కాకి  నృత్య మాడె  కేకి  వొగ డె నట
బాగు బాగు  వినుము  భ రత ! నీ వు
పూ వు పెట్టు  కొనుము  పొసగంగ చెవిలోన
వినగ రాని  మాట  వినుట  వలన .
( క్షమించాలి )
 

Friday, November 23, 2012

కమ్మని వర మొసగ , మిగుల కళ వళ మొందెన్

అమ్ముని  దీ వన  మేరకు
నిమ్ముము  నొక  పుత్రు  నాకు యినుడా ! దయ తోన్
నమ్ము మని  కుంతి  బలుకను
కమ్మని  వర మొసగ , మిగుల కళ వళ  మొందెన్ 

Thursday, November 22, 2012

పద్య రచన -- బాపు

చదువుడు   అ ఆ ఇ ఈ యని
పదునుగ మఱి   ముగ్గు  గీ చె  బాపూ  నచట న్
మది  విందు  గూర్చు నేరుపు
కద సొంతము  వానికి చిత్ర కళ లోన బళా

Wednesday, November 21, 2012

యము గన పెన్నిధులు బెక్కు లలరుచు నుండున్ .

సమతా  భావము  గ లుగుచు
మమతలు  తనరారు చుండు మనుగడ  తోడన్
విమలము నగునా  సతి హృద
యము గన  పెన్నిధులు బెక్కు లలరుచు  నుండున్ .

పద్య రచన -168. పాండవులు

అరుగు  చుండిరి  పాండవు  లైదు గురును 
వెనుక  వారికి  యొక కుక్క  వెంట రాగ 
ముక్తి  కొఱకునై  జేరగ మోక్ష  గృహము 
అంతి  మంబున  సర్వుల కదియె  సుమ్ము .

కైలాస పర్వతము

నీ వా  కైలాసమ్మును
నావాసము  జేసి కొనుచు  నహ రహ  మందున్
కావగ మమ్ముల  నుంటివి
యావంతయు  లేదు  శంక  హర హర  శంభో !

Tuesday, November 20, 2012

పద్య రచన -167,శిబి -గద్ద

పావు రంబును  రక్షిం చు  పనికి  పూని
చక్ర  వర్తియా  శిబి, డేగ  సంత  సించ
తనదు  తొడ నుండి  మాంసము  దనర కోసి
యాహ రింపగ  నిచ్చెను  నాద రమున .
 

19-11-2012 తే దీ న శ్రీ వారి పుష్ప యాగము

వేంక టే శున  కీ పూట  వైభవముగ
మంత్ర  పూర్వక  నామాలు  మంది  జదువ
పుష్ప యాగము  జరిగెను పూల  తోడ
చూడ  ముచ్చట  గొలిపెను  చూప రులకు .
-
కనకాం బరములు  మల్లెలు
నెనరం జేమంతి  పూలు  నింపగు  దళ ముల్
వినయము  దోపుచు  నింపిరి
పూనికతో  వేద విదులు  పూర్ణా నందున్ .
-
మొగలి  రేకుల  వాసన  మోద మలర
వేద  ఘోషణ  మనసును  విందు  గొలుప
భక్త  జనములు  చుట్టును  భక్తీ తోడ
పలుకు  చుండిరి  జేజేలు  ప్రభువు  న కును .

కాశీ యాత్ర

కన్న కొడుకగు  కిరణును  గలుపు  కొనుచు
విజయ ,జామాత  లిరువురు  వెంట  రాగ
కాశి  కేగితి  విశ్వేశు  గనుట  కొఱకు
హాయి  గొలిపెను  పయనము   నందఱకును
-
కాశి కాపురమున  గ ను విందు  గావించె
కనక  మ యపు  దేహ  కాంతి  తోడ
యన్న పూర్ణ  తల్లి , య భయ మీ యంగను
భక్త  కోటి  కెల్ల రక్తి  నుండె .
-
చూసితి  దుర్గా  మాతను
జూసితి  మఱి  యాంజనేయు  జూసితి  గపులన్
జూసితి  వీణా ధారిని 
జూసితి నే  గవల  మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ  నాధుని   జూడంగ  వేల కొలది
భక్త  జనములు  వత్తురు  ప్రతి  దినమ్ము
వారి  నందర  బ్రోవను  వాస  ముండె
కాశి యందున  తిరముగ గాలు డచట
-
ఘాటు  లరువది నాలుగు  గలవు  సుమ్ము
నందు లోనన  మణి కర్ణి కాయు పట్టు
తాన  మాడిన దొలగును  దప్పు  లన్ని
కల్ల  కాదిది నిజమునే  బల్కు చుంటి
-
కాళ  భైరవ  దర్శన  కాంక్ష తోడ
పరుగు  పరుగున  బోవంగ  ప్రభువు  దరికి
సరిగ జూడంగ జాలము  జనము  మధ్య
ప్రణతు  లిడుదును నా కాళ  భైరవునకు .
-
చింతించ దగిన  విషయము
నంతా నిక  చెత్త యుండె  నా పుర మందున్
గుంతల  మాదిరె  వీధులు
నంతా  యా శివుని  లీల  లాహా  యరయన్
-
చీరల  విషయము జూసిన
బారమ యే  లేక యుండి  బహు  తేలికగా
నీరము తడిసిన  చెడక బె
నారసు  పటు  చీర  బోలు  నవ  వస్త్రము నున్ .
-
శివుని  యాజ్ఞ యు  లేనిచొ  చీమ యైన
కుట్ట డందురు  పండి తు లట్టు  లయ్యె
యాజ్ఞ గలుగగ  భర్గుని  యాత్మ  నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని  దరికి .

పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి  గంగ లోన 

Monday, November 19, 2012

దిన ఫలముల వలన మనకు దృప్తి గలుగునే ?

అనయము రోగము  గలిగిన
మనుజున కుం  మందు  కాక  మనుగడ  కొఱకున్
మొనయగ క లు వ గ  జోస్యుని
దిన ఫలముల  వలన మనకు  దృప్తి  గలుగునే ?

పద్య రచన -పెసరట్టు

పెసరట్టు  సైను  బోర్డును
చూసితి  మఱి  యమెరికా లొ  చూసితి  యింకా
యాసలు  నట  చిగి రించెను
బాసను  మన  తెనుగు  చూసి  బళిరా  యంటిన్ .

Saturday, November 10, 2012

పద్య రచన -157

ఏడు కొండల మీదున్న వేంకటేశ!
మమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ 
ముసలి పండుల మైతిమి ముదిమి వలన 
మేము రాలేక గోరితి మిమ్ము సామి !


కారాగార మ్ము లొసగు గై వల్య మ్మున్

నేరాలు  సేయ  ఫలితము
కారాగార మ్ము లొసగు  గై వల్య మ్ము
న్నా  రాముని  సేవించగ
శ్రీ రాముడె  మనకు  రక్ష  సిరి సిరి  మువ్వా !

Friday, November 9, 2012

పద్య రచన -156,బుర్ర కధ

బు ఱ్ఱ కధను వి  నుటకు నో  బుడత  లార!
రండు  వేగమె  మీరలు  రచ్చ  దరికి
చెప్పు  చుండెను  కధకుడు  చెవుల  కింపు
గాను శ్రీ కృష్ణ  లీలల  కధను  నచట .


తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్

వినుమీ  వాక్యము  శంకర !
తనయునకును  దండ్రి కొకతె  దారగ నయ్యెన్
విన గూడని  వన్నియు నిట
వినుటకు నే,  నోయి  భవుడ ! వెగటుగ నుండెన్ .

Thursday, November 8, 2012

పంచ రత్నములు (శ్రీ రాం ,శ్రీ దేవి -వివాహము సందర్భముగా )

1.   ఒకరి  కోసము  మఱి యొక రుద్భ వించి  
      యగ్ని  సాక్షిగ  పరిణయ  మాడ దలచి 
      తీసికొని రయ్య ! విందును  దీయగాను 
      బంధు  మిత్రుల  సాక్షిగ బట్ట పగలు .

2.   వరుడు  బుట్టెను  బ్రగ డల  వారి  యింట 
      వధువు  బుట్టెను  వడ్డాది  వారి  యింట 
      వధువు  శ్రీదేవి ,శ్రీరాము  వరుడు నరయ 
      చూడ  జక్కని  జంటయె  చూ డ్కులకును .
    
     వియ్యపు రాళ్లు ........

3.  ఇందును  గల దొక చిత్రము 
     నెందును  మఱి గానరాదు  నెవరికి నైన 
     న్నందమ  యిరువురి  పేరులు 
     మందికి  ముద మయ్యె  రత్న మాలలె  యగుట న్ .

     వధువు ......అమ్మా  శ్రీ  దేవీ !

4.  అత్త మామలు  మఱియును  నాడు బిడ్డ 
     మిగుల  సౌ మ్యులు , వారిని  మీర  కుండ 
     యధిక  భక్తిని  మెలగితి వై న    నిన్ను 
     రక్ష సేయును  నిరతము  రాము డబల !

5.  తనర  శ్రీ రాము  నీ కును  దగిన  భర్త 
     యతని  కనుసన్న  మెలగుచు నలరు  మ మ్మ !
    సకల  శుభములు  గలిగించు  శంక రుండు 
     కంటికిని  రె ప్ప యట్లయి  కాచు  మిమ్ము .
     
         

పద్య రచన - ఓరు గల్లు -భద్ర కాళి

ఓరుగల్లున  వెలసిన  భద్ర  కాళి !
పూజ సేయంగ నేర్తు మా పురికి రమ్ము 
నేను రాలేక  దరికినీ  నిన్ను  గోరు 
చుంటి  నిక నీవు  గరుణను  జూపు  తల్లి !

కరములు దిద్దం గ లేని కరము కరమ్మే ?

హరి  పూజ  సేయు  కరములు
కరములు  దిద్దం గ  లేని  కరము  కరమ్మే ?
హరునకు  తిలకము  జక్కగ
హరిహరులే  నొక్క రూపు  నాలోచించన్ .

పద్య రచన -154,కొండ గుహ -శివ లింగము

కొండ  కాదది  యొక మన  గుండె కాని
గుహయు  కాదది మన బ్రహ్మ  కుహర  మదియె 
మంచు  లింగము  గాదది  మాన  వతయె 
భావ నాజగ ము న లస ద్భా వ  మదియె .

-
కొండ  గుహలోన  వింతను  గొలుపు  చుండె
మంచు  లింగము  దెలుపును  మించి  యుండె
లింగ  రూపము  దాల్చిన  రంగ  సాయి !
శిరసు  వంతును  నో సామి ! సిగ్గు  పడ ను .

Tuesday, November 6, 2012

ఓడ నెక్కి పోద ము రావె యోరుగల్లు .

వేయి   కంబము ల్గ ల యట్టి  వీ డు  బ ళి ర
చూడ  నద్భుతము  గొలుపు  చూడ్కుల కును
మానసంబున  నుల్లాస మనెడు  గాలి
 యోడ  నెక్కి  పోద ము  రావె  యోరుగల్లు .

పద్య రచన -153,

హంస  వాహనా రూ డు డై  యరుగు  చుం డె 
 నీ టి మీ దన  జూడుడు  నీ ర జా క్షు 
డైన  ప్రమధ  గ ణా ధి పు  డాలి  తోడ 
సంద్య్హ  కాలపు   వాహ్యాళి  జరుప  కొఱకు .

Monday, November 5, 2012

పద్య రచన -152,నంది దోయి

 నందికి  దీటుగ  వేరొక 
నందియి యే  యుండె  నచట నల్లటి  రంగు
న్నందము  చిందించుచు  మఱి 
కందోయికి  విందు  గూర్చె  కంటి రె  మీరున్ ?

దత్త పది -శరణము -చరణము -తరణము -కరణము


శరణము  దశ రధ  నందన !
చరణము లే మీవి  మాకు  తరణము   లయ్యా !
కర ణ ములు  సేయ  మంచివి 
వరమగు  సద్బుద్ధి  నిమ్ము  వరదుడ ! రామా !

తల్లికి దనయకును ధవు డొ కండె

ధరణి  సుతకు  ధవుడు దాశరధియ  యౌను
వసుమ తీ శు డనగ  వాసు దేవె
 దాశరధియు  ననగ  వాసు దే వు  డ గుట
తల్లికి  దనయకును  ధవు డొ కండె .

Sunday, November 4, 2012

పద్య రచన -151

 బస్సు  మీదన  నిలబడి  పయన  మగుట 
యరయ  యా ప ద  తెలియదె  యట్లు  జేయ ?
నెప్పు  డైనను  నా  ప ద ల్  జెప్పి  రావు 
సా వ ధా న మె  యె ల్లె డ   స రి య  యగును .

కొందరికి మేత పలు వాత లందరకును

అన్ని  శాఖల  యందున  నధిక  మయ్యె
లంచ  గొండు తనము  నిల  ,నించు  కేని
పాప  భీతి యె   లేకుండ పరుల  సొమ్ము
కొందరికి  మేత పలు వాత  లందరకును  

Saturday, November 3, 2012

పద్య రచన - అపు రూప నాణేలు

పాత  కాలపు  నాణేల  పైన  జూడ
రామ  లక్ష్మణ  ప్రతిమలు  రమ్య  ముగను 
గాన  వచ్చును  జూడుడు  కన్ను లార
దైవ  భక్తికి   ఋ జువ ది   తనయు  లార!పద్య రచన -

వరదలు  వచ్చిన  యె డ లన
కరువే  మఱి  సంభవించి  కాటికి  పంపున్
వర దు డ !  శ్రీకర !  శుభకర !
వరద లు   లేకుండు న టు లు  వరమును  నిమ్మూ !కలలే వాస్తవము లగుచు గడు సుఖము లిడున్ .

వలయముల  వంటి  యూహలు
నలలలలుగ  వ చ్చు చుండి  య దృ శ్య  మగుచున్
కలలుగ   మారుచు  నుండిన
కలలే  వాస్తవము  లగుచు  గడు  సుఖము  లిడున్ .

Friday, November 2, 2012

సీ తా పతి యనగ జంద్ర శేఖరుడు గదా !

భ్రాతా ! విను మొక  విషయము
 పీ తాంబర  ధారి  మఱియు  ప్రేతల  ప్రభువు
న్నేతావత   చింతించగ
సీ తా పతి  యనగ  జంద్ర  శేఖరుడు   గదా !

పద్య రచన -148,శబరి

గోరు  ముద్దలు  దినిపించు  నారి వోలె
దాను  రుచి  జూసి  తీయని  దైన  ఫలము 
రాము  జేతికి  నిచ్చిన  రామ , యరయ 
 శబరి  నాబడు  గురువర !   సద్వ నిత యు .

Thursday, November 1, 2012

పద్య రచన -బాలుడు ,సింహము

బాలు  డ క్క డ   సింగము  ప్రక్క  నుండి 
యాట లాడుట  మొదలిడు  నట్ల  యుండె 
బోసి  గుడ్డలు  గలిగిన  బుడత డ  తడు   
భరతు డా  యను  సందేహ  పడితి  నిపుడు .