Tuesday, November 20, 2012

కాశీ యాత్ర

కన్న కొడుకగు  కిరణును  గలుపు  కొనుచు
విజయ ,జామాత  లిరువురు  వెంట  రాగ
కాశి  కేగితి  విశ్వేశు  గనుట  కొఱకు
హాయి  గొలిపెను  పయనము   నందఱకును
-
కాశి కాపురమున  గ ను విందు  గావించె
కనక  మ యపు  దేహ  కాంతి  తోడ
యన్న పూర్ణ  తల్లి , య భయ మీ యంగను
భక్త  కోటి  కెల్ల రక్తి  నుండె .
-
చూసితి  దుర్గా  మాతను
జూసితి  మఱి  యాంజనేయు  జూసితి  గపులన్
జూసితి  వీణా ధారిని 
జూసితి నే  గవల  మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ  నాధుని   జూడంగ  వేల కొలది
భక్త  జనములు  వత్తురు  ప్రతి  దినమ్ము
వారి  నందర  బ్రోవను  వాస  ముండె
కాశి యందున  తిరముగ గాలు డచట
-
ఘాటు  లరువది నాలుగు  గలవు  సుమ్ము
నందు లోనన  మణి కర్ణి కాయు పట్టు
తాన  మాడిన దొలగును  దప్పు  లన్ని
కల్ల  కాదిది నిజమునే  బల్కు చుంటి
-
కాళ  భైరవ  దర్శన  కాంక్ష తోడ
పరుగు  పరుగున  బోవంగ  ప్రభువు  దరికి
సరిగ జూడంగ జాలము  జనము  మధ్య
ప్రణతు  లిడుదును నా కాళ  భైరవునకు .
-
చింతించ దగిన  విషయము
నంతా నిక  చెత్త యుండె  నా పుర మందున్
గుంతల  మాదిరె  వీధులు
నంతా  యా శివుని  లీల  లాహా  యరయన్
-
చీరల  విషయము జూసిన
బారమ యే  లేక యుండి  బహు  తేలికగా
నీరము తడిసిన  చెడక బె
నారసు  పటు  చీర  బోలు  నవ  వస్త్రము నున్ .
-
శివుని  యాజ్ఞ యు  లేనిచొ  చీమ యైన
కుట్ట డందురు  పండి తు లట్టు  లయ్యె
యాజ్ఞ గలుగగ  భర్గుని  యాత్మ  నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని  దరికి .

పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి  గంగ లోన 

No comments:

Post a Comment