Thursday, November 8, 2012

పంచ రత్నములు (శ్రీ రాం ,శ్రీ దేవి -వివాహము సందర్భముగా )

1.   ఒకరి  కోసము  మఱి యొక రుద్భ వించి  
      యగ్ని  సాక్షిగ  పరిణయ  మాడ దలచి 
      తీసికొని రయ్య ! విందును  దీయగాను 
      బంధు  మిత్రుల  సాక్షిగ బట్ట పగలు .

2.   వరుడు  బుట్టెను  బ్రగ డల  వారి  యింట 
      వధువు  బుట్టెను  వడ్డాది  వారి  యింట 
      వధువు  శ్రీదేవి ,శ్రీరాము  వరుడు నరయ 
      చూడ  జక్కని  జంటయె  చూ డ్కులకును .
    
     వియ్యపు రాళ్లు ........

3.  ఇందును  గల దొక చిత్రము 
     నెందును  మఱి గానరాదు  నెవరికి నైన 
     న్నందమ  యిరువురి  పేరులు 
     మందికి  ముద మయ్యె  రత్న మాలలె  యగుట న్ .

     వధువు ......అమ్మా  శ్రీ  దేవీ !

4.  అత్త మామలు  మఱియును  నాడు బిడ్డ 
     మిగుల  సౌ మ్యులు , వారిని  మీర  కుండ 
     యధిక  భక్తిని  మెలగితి వై న    నిన్ను 
     రక్ష సేయును  నిరతము  రాము డబల !

5.  తనర  శ్రీ రాము  నీ కును  దగిన  భర్త 
     యతని  కనుసన్న  మెలగుచు నలరు  మ మ్మ !
    సకల  శుభములు  గలిగించు  శంక రుండు 
     కంటికిని  రె ప్ప యట్లయి  కాచు  మిమ్ము .
     
      



   

No comments:

Post a Comment