Tuesday, January 29, 2013

వేద గాయత్రి అగ్ర హారము

1.వేద గాయత్రి  పేరున వెలసి నట్టి
   యగ్ర హారంబు  జూడంగ హర్ష మయ్యె
  చేయు చున్నట్టి  యాగంబు  సరళి జూడ
  సంతసం బొందె  మిగుల  నా యంత రాత్మ .

2. అక్కడి  ప్లాటులు  జూడగ
   మిక్కుటముగ నిడువ  గలిగి  మిలమిల లాడెన్
   మక్కువ  గలిగెను  నాకవి
  చక్కగ  నే  ప్లాను వేసి  స్వంతము  సేతున్

3. అడిగెదను  శర్మ గారిని
    గడు వీ యుడు  మూడు నెలలు  గైవశ మునకున్
   విడివిడిగ బ్రోగు చేయుచు
  నిడుమలు బడి యైన నిత్తు నీ శ్వరు  కృ పనన్ .

4. ప్లాటు నిత్తురు మనిషికి  ప్లాటు యొకటి
    యదియు  బాపడు  లయినవా రైన యెడల
    కల్ల గాదిది  నిజమునే  బల్కు చుంటి
   శర్మ  యిట్లని  వాక్రుచ్చె  సభను గూర్చి .

5.  పప్పు  బూరులు  పులిహోర  పాయ సంబు
    పెరుగు  సాంబారు వడ్డించ  బ్రేమ తోడ
   భోజ నంబును  జేసితి బుష్టి గాను
   అన్నదాతకు  కలుగుత ! యాయు వృ ద్ధి .
 

తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్

బాలుని  సమస్య  యీ యది
తేలును  ముద్దాడి మగువ  తియ్యగ నవ్వెన్
 పే లవముగ నుండెను గద
చాలను బూరించ  దీ ని  చదువుల తల్లీ !

Monday, January 28, 2013

పద్య రచన -చిత్ర గుప్తుడు

చిత్ర గుప్తుని  జూడుడు  చిత్ర మందు
పాప  పుణ్యాల  చిట్టాను  బలుకు  చుండ
దాని  నాధార ముగ జేసి  ధర్మ  జుండు
ఆజ్ఞ యిచ్చును  శిక్షింప  యర్హు లకును 

మేను శాశ్వతంబు , మిత్తి రాదు

మనము  జేయు మంచి పనుల పుణ్య పు ఫల
మేను శాశ్వతంబు , మిత్తి రాదు
శ్రద్ధ తోడ  మనము  శంకరు  బూజింప 
ముక్తి  కలుగు  నిజము  మునులకు వలె 

పద్య రచన =శ్రీ రాముడు ,హనుమల ఆలింగనములు

చిన్మయ  రూపుడు  రాముడు
తన్మయమున  నాంజనేయు   దనువును  దాకెన్
ఉన్మత్తుల వలె వారలు
తన్మయులై  యొకరి నొకరు  దనువులు  గలిపెన్ .

చిన వానిని పెండ్లి యాడి చేడియ మురిసెన్

వినుమీ  సంగతి  మొదటన
కనులకు  పెను  విందు సేయు కామేశ్వరియే
య నురాగముతో  దా వల
చిన వానిని  పెండ్లి యాడి  చేడియ మురిసెన్ .

Sunday, January 27, 2013

పద్య రచన -సీ త అగ్ని ప్ర వేశము

తనకు  వచ్చిన  యప నింద  దరుము  కొట్ట
రామ  చంద్రుడు  సీతను  రయము దూక
మనియె  నగ్ని యందున కట , యప్పు డామె
మారు  మాటాడ కేగెను  మంట దరికి .

భరద్వాజుని ఆశ్రమము -పద్య రచన

చిత్ర  కూ టం పు  శిఖరము జేర గోరి
మార్గ  మధ్యము నందున  మహితు  డైన
ఋ షి  వరే ణ్యుని యాశ్రమ  దర్శ నంబు
జేయ కొఱకును  మౌనిని  జేరి నిలిచె .

ఉత్తరమ్మున జరిగె సూ ర్యో దయమ్ము

పేరి వారింట  జరిగిన  పెండ్లి  కొఱకు
నేను  వెళ్ళితి  నచటకు  మాన కుండ
వప్ప గింతలు పూర్తి యై  యొప్పు సరికి
ఉత్తర మ్మున  జరిగె  సూ ర్యో ద య మ్ము 

పద్య రచన -శ్రీ మహా విష్ణువు

ఆంజ నేయుడు కైదండ  లంద  జేయ
గరుడు డాది  పురుషునకు కరము లెత్తి
వంద నంబులు  జేయగ వాసు దేవు
డభయ మిచ్చెను  నిరువుర  కపుడు  చూడు .

Saturday, January 26, 2013

రాహు కేతువు లిరువురు రవి తనయులు

రాహు కేతువు లిరువురు  రవి తనయుల
టంచు పలుకులు సరి యౌనె యార్య !మీ కు
మృత్యు దేవత  కొమరుండు కేతు వయ్య !
రాహు వగు నట  వరుసకు  రవికి  బావ .

Friday, January 25, 2013

శ్రద్ధాంజలి

1. లేవు లేవయ్య యిక మాకు  లేవు నీ వు
   ఎచట కేగితి వన్నయ్య !యిచట నుండి
  వత్తు వెప్పుడు  మము జూడ  ,వత్తు  విపుడ !
  ఎదురు  చూతుము  నీ కోస మిచ్ఛ  తోడ .

2 .రాపాక వంశ  మండన !
   ఏ పాపము  సేసినామొ ? యింతటి  శిక్షన్
  ఏ పారగ  విధియించితి
 వీ పాపుల గనిక రించి  యీ సారికి  రా .

3. రామ  శేషమ్మ  కడుపున రహి జెలంగ
   కడుపు  పంటగ  మురమళ్ళ  గ్రామ మందు
   పుట్టి , పెరిగితి వీ వయ్య ! పోత వరము
   నందు  ,ప్రజల జేజేల  నందు కొనుచు

4.  మీతో  గడిపిన  రోజులు
     చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
     మాతో  బలికిన  బలుకులు
    ఎంతో  విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .

5.  బంధు ప్రీ తిని  గలిగిన  బాం ధ వుండు 
    స్నేహ  సంపద  నొందిన  చెలియ కాడు
    భువిని  రాపాక  వంశపు  బుధు డతండు
    కల్ల  కాదిది  నిజమునే  బల్కు  చుంటి .

6.  మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ
     మత్స రంబును  నీ కిసు మంత  లేదు
     సాటి మనుజుని  మనిషిగా  సాకి నావు
     సాటి  యెవరయ్య , నీ కిల  సాటి యెవరు ?

7.   మరణ  కాలంబు  దెలిసెనా ? మాత  కృపను
     అమ్మ పోషణ  కూతుళ్ల  కప్ప గించి
    ఒప్ప గింతలు  సేసిరి  యొప్పు గాను
    అందు కొనుమయ్య ,సాదర  వంద నాలు .

8.   కాన రానట్టి  దూ రంబు  గడచి నావు
      కాను పించుమ యొక సారి ,కాంచి  నిన్ను
     సేద దేరుదు మోసామి ! చింత  నుండి
     రమ్ము సోదర ! రయముగ  నిమ్ము గాను .

9.   సకల శుభములు   గలి గించు  శంక రుండు
      మరల  జన్మంబు  లేకుండు  వరము  నిచ్చి
      పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
     నీ దు  నాత్మకు  శాంతిని  నిచ్చు  గాక !

10.  మీరు  లేనట్టి  లోటును  మేము తీ ర్చ
     లేము ,  భార మంతయు  నిక నా మురహరి
     చూచు కొను నార్య !  నిజ మిది , లేచి యికను
     అందు కొనుమయ్య ! శ్ర ద్ధాంజ  లందు  కొనుము .
     

                                      అశ్రు నయనాలతో ................
                                                  కుటుంబ సభ్యుల తరఫున ,
                                                    పోచిరాజు సుబ్బారావు
(క్రీ .శే .రాపాక  ప్రభాకర రావు గారి  వర్ధంతి  సందర్భముగా )
                                             22-1-2013
                                                           
                                                              



   
 

పద్య రచన -భారత రాజ్యాంగ నిర్మాతలు

చిత్ర  మల్లదె  జూడుడు  చిత్ర మందు
దేశ నాయకు  లందఱు  నాశిను లయి
మంచి    సూత్రముల్  రచియించి  మనకు  నిచ్చె
అదియె  భారత  రాజ్యాంగ మయ్యె మనకు .

Thursday, January 24, 2013

పద్య రచన -దశరధుని విలాపము

రామ భద్రుని వనవాసమా ? మ హర్షి !
యెటు ల  జీ వింతు  పదునాలు  గేండ్లు  భువిని
అనుచు  విలవిల  యేడుచు న్నా  దశ ర ధు
నూ ర డిం చెను  రామయ్య యొప్పి దముగ .

తెలివి లేని వారలు గదా తెలుగు వారు

తెలివి లేని వారలు గదా  తెలుగు వారు
అనుట  సత్య దూ రమ్మును  ననుచితమును
కాన  బలుకంగ వలదు మా  యాన సుమ్ము
తెలివి గల వారు వారలు దెలియు మార్య !

Monday, January 21, 2013

పద్య రచన -దను నామక రాక్షసుడు

రామ లక్ష్మణు  లిరు వైపు రహిని  నొప్పి
దనున  ననగనా  రక్కసు  దండ  దోయి
నొక్క  వేటున  దెగ ద్రుంచి  యొప్పు గాను
పాతి  పెట్టిరి  భువి లోన  పతితు  వాని .

హిత మతిని గూ ల్చితే ? దేవ ! శ్రిత హితైషి !

హిత మతిని  గూ ల్చితే ? దేవ ! శ్రిత  హితైషి !
యెంత  పని చేసి తీ వయ ! యింత లోనె !
శ్రితుల  గాపాడ  ధర్మము  హితుల  కౌర !
ఇదియ  బాధ్యత  ప్రతి యొక్క  హిందువునకు 

Sunday, January 20, 2013

పద్య రచన - కబడి యాట

కబడి  యాట  జూడ  కను విందు  గావించు
ఆడు కొలది  మనకు  నాయు  వుయును
బెరుగు , కల్ల  కాదు  , పెద్దల  వాక్కిది
ఆడు  కొంద  మిపుడు  రండి  మీ రు .

తనయు జంపి చేసె జన హితమ్ము

నరకు   విభుని  పాల న నరకమ్ము  కతన
వేడ  ప్రజలు ,సురలు  విష్ణు నపుడు
లోక  హితము కొఱకు  లోకేశు  నర్ధాంగి
తనయు జంపి  చేసె  జన హితమ్ము .
 

Saturday, January 19, 2013

పద్య రచన -రాయప్రోలు

అభినవ  నన్నయ  బిరుదును
శుభముగ నిల పొంది తీ వు  సుబ్బారావా !
అభి వాదము నే జేతును
శుభ కా మనలిమ్ము  నాకు   సుకవి  వరేణ్యా !

కన్నె పాటలు మొదలైన  కవిత లెన్నొ
సుపరిచితములు మాకవి  సుబ్బ రావ !
కవన మందున  నీ సాటి  కాన రారు
ఎందు  వెదకిన  నో సామి !యెవరు  నీ కు .

Friday, January 18, 2013

బంధములను దొలచు విభుడు బంధింప బడెన్

బంధమె  సంసారమ్మిల
బంధితులము మనమిచట ను  భవ బంధము చేన్
బంధముల నూ డ్చ గోరగ
బంధములను  దొలచు  విభుడు బంధింప బడెన్ 

పద్య రచన -గిరులు


దుర్గమ గిరులను జూడుము
దుర్గమమే బైకి బోవ ధూర్జటి కైనన్
దుర్గమ తల్లి గరుణనన
నర్గళముగ నెక్క వచ్చు నగముల పైకిన్.

Thursday, January 17, 2013

పద్య రచన -NT రామారావు

తెలుగు  దేశము  పార్టీని  దెచ్చి  భువికి
ముఖ్య  మంత్రిగ  రాష్ట్రాన్ని  ముందు  నడిపి
తెలుగు  భాషకు  వన్నెను  దెచ్చి  నట్టి
నంద  మూరి  రాముడ ! నీ కు   వందనములు .

Wednesday, January 16, 2013

పద్య రచన -జెండా

మూడు రంగుల  జెండాను  ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది సైనికు లట
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును  బంచిరి  చమువు  గణము 

విజయవాడ పయనము

విజయవాడ కేగ  విధు లన్ని  సరి చేసి
పయన  మైతి  నేను  భార్య  తోడ
కొద్ది  దూర మేగి  కునుకు పాటులు  రాగ
కారు  నడప  లేక క్రమ్మ రిలితి .

తేజ !

నేల మీ ద  యేల ?  డీ లగ  నుంటివి ?
నిద్ర  వచ్చు నెడల  నేరు గాను
మంచ మెక్కి హాయి  యంచును  వేగమె
పండు కొనుము  తేజ ! పరుపు మీద .

Tuesday, January 15, 2013

కనుమ నాటి పూజ కాటి జేర్చె

కనుమ నాటి పూజ కాటి జేర్చె ననుట
సరియ కాదు  వినుము సామి ! నిజము
పూజ దినము దినము  పూల తోడన జేయ
పుణ్య మబ్బు సుమ్ము!  పుణ్య పురుష !

గో వర్ధన గిరి


గోవర్ధన గిరి  నెత్తియు
గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
గోవనితలు గోపాలురు
గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్

Monday, January 14, 2013

కనుమ యనుచు బావ గారి కనులను మూసెన్

కనులకు  గంతలు  గట్టియు
కనులకు  గనబడని  చోట  కమలను  దాచీ
అనుపమ  బావను  కలిసియు
కనుమ  యనుచు బావ గారి  కనులను మూసెన్ 

పద్య రచన -జోడెడ్లు

కనుమన  రైతుల  పండుగ
కనుముర  జోడెడ్ల  నచట  కనులకు  నింపౌన్
వినయము  తోడుత నుండెను
మన రైతులు  సేయు  పూజ మానుట  వరకున్ .

Sunday, January 13, 2013

పద్య రచన -సూర్య భగవానుడు

సోదర  సోదరీ  మణులకు  మకర  సంక్రాంతి  శుభాకాంక్షలు

ఏడు గుఱ్ఱాల  యాసామి ! వేడు కొందు
అంధ కారము  జగమున  నలము కొనియె
వంద నంబులు  వేవేలు  గందు కొనుచు
నీ వు  కనిపించు  మాకయ్య !రవివ  రేణ్య !

పద్య రచన -భోగి మంట

పనికి మాలిన  కట్టెలు  పదిల పఱచి
బోగి మంటను వేతును  భోగి నాడు
అటుల  జేయగ , బోవును  నఘము  లన్ని
సంది యంబును  నిసుమంత పొంద వలదు
 

సంక టం బుల సంక్రాంతి ! స్వాగ తంబు

పాడి  పంటల  దులదూగు పావ  నాంగి !
అలుపు  సొలుపులు లేకుండు నట్లు  జేయు
జీవితంబును నీయగ  జీ వులకును
సంక టం బుల  సంక్రాంతి  ! స్వాగ తంబు 

Saturday, January 12, 2013

పద్య రచన --వివేకానందుడు

దేశ దేశాలు  దిరిగిన  ధీ యుతుండు
హిందు  ధర్మము  జాటిన  హైంద వుండు
నాతడే  వివేకా నంద  యతి  వరుండు
వంద నంబులు  నతనికి  వరుస నిడుదు .

Thursday, January 10, 2013

భారతమున రావణుండు ప్రౌ డిని జూపెన్

ఆరయ  లంకా ధీ శుడు
నేరుగ మఱి  రాము జేర  మోక్షము  కొఱకున్
వై రవ  భావము  గ లుగుచు
భారతమున  రావణుండు  ప్రౌ డిని  జూపెన్ 

పద్య రచన - వేంకటేశ్వరుడు


ఏడు కొండల శ్రీ వేంక టేశ ! శ్రీ శ !
మమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ
ముసలి పండుల మైతిమి ముదిమి వలన
మేము రాలేక గోరితి మిమ్ము సామి !

ఆకసంబున  మేఘంబు  లావ రించె
నెటుల  వత్తును  మెట్లెక్కి  యీ శ ! రమణ !
ఇప్పు  డిక్కడె  యీ యవ ? యొప్పు గాను
నీ దు  దర్శన భాగ్యంబు  నెమ్మ నమున .
 

Wednesday, January 9, 2013

రమణి విల్లు విఱి చె ప్రమద మెసగ

వీ ర  నారి  ఝాన్సి  విమతుల  వధియింప
అశ్వ మెక్కి యేగె  యాత్ర తనన
యుద్ధ రంగ  మందు  యోధురాలుగ మారి
రమణి  విల్లు  విఱి చె  ప్రమద  మెసగ
 

పద్య రచన -గంగిరెద్దు

గంగి రెద్దులు  గనబడు  సంకు రాత్రి
దినము  లప్పుడు  మాత్రమె  దినము దినము
ఆట  లాడించి  వానిచే  నద్భుత ముగ
గంగి రెద్దుల  యజమాని  గడుపు  పొట్ట .

పద్య రచన -బాల శంకరుడు

యోగ నిద్రను  బొందిన  యోగి  వర్య !
ముద్దు  వచ్చెను  నీ యొక్క  మోము  జూడ
పెట్టు  కొందును  ముద్దును  పేర్మి  తోడ
బాల శంకర ! రమ్ము నా  భవన మునకు 

Monday, January 7, 2013

పద్య రచన -నాగయ్య

చిత్తూరు  వంశ  మండన !
సత్తా జూపించి  తీవు  సరసపు  నటనన్
చిత్రాల  నటన  తత్పర !
బత్తిని  నాగయ్య ! నీకు  బ్రణతు లొనర్తున్
 

పద్య రచన -వీ ధి బాలుడు

భావి  భారత  పౌరుడు   బక్క చిక్కి
చదువ  వలసిన  బాల్యంబు  చంక  నాకి 
చేయి  చాపుచు  యాచన  చేయు చుండె
బ్రహ్మ  లిఖితము  గాదన  వశమె  మనకు ?
 

Sunday, January 6, 2013

రంగుల బూజింతు రెల్ల ప్రాంతము లందున్

అంగ న్యాసాదులు మఱి
యంగములం గూడ దీ సి యర్చన జేయా
భంగిమ  పోకడ పెక్కుతె
రంగుల బూజింతు  రెల్ల ప్రాంతము  లందున్
 

సమస్య -930

ఏమి  యీ రోజు  కరువాయె  యేమి  వింత ?
ఒక్క  టిసమస్య  కాన రాదొక్కొ  నాకు
కంది  గురువుల  జాబితా  యందు  వెతుక
నేను  బంపిన  వింకను  గాన నగును 

Saturday, January 5, 2013

ఉంగరమ్మె యొ డ్డాణ మై యొప్పెను గద

చిన్ని  బొమ్మను  గొని దెచ్చి చెలువు  మీర
భూ ష ణం బులు  బెట్టుచు  బుడుత యొకతె
తనది యగు  నుంగ రంబును  దనర బెట్ట
ఉంగరమ్మె   యొ డ్డాణ మై  యొప్పెను గద !

పద్య రచన -గోదా దేవి ,దండ

గోదాదేవిని  జూడుడు
పాదాలకు  జేరు  దండ  పాణిని తోడన్
వేదాల  మూల పురుషున
కాదరముగ  వేయ దలచి  నట నిల బడియెన్ .

Friday, January 4, 2013

బాలుడు భండనము నందు వైరుల గూల్చెన్ .

ఆలపు  విద్యలు  నేర్వగ
బాలుడు  శ్రీ రామ చంద్రు డాతత  రక్తిన్
హేళన జేయగ కుమతులు
బాలుడు  భండనము నందు  వైరుల గూల్చెన్ .

పద్య రచన -త్రిశంకు స్వర్గము

గాధి  తనయుడు  సృష్టించె  గగన మందు
సకల  భోగముల్  గలిగించు  స్వర్గ  మొకటి
రాజగు  త్రిశంకు  కొఱ కునై  రమ్య ముగను
కుపితు  డ గుటను  నృ పతి పై   కౌశి  కుండు 

Thursday, January 3, 2013

ఉన్నది కన్పట్టు నొక్కొ యోగి వరేణ్యా !

ఉన్నది  యొకటే  జగమున
మన్నున  మఱి  మిన్ను  నందు  మఱు గున  నుండున్
పన్నుగ  సాధన  జేసిన
ఉన్నది  కన్పట్టు నొక్కొ  యోగి  వరేణ్యా !

పద్య రచన -సీమంతము

అమ్మ ! కల్పన! శ్రీ మంత  మమ్మ  నీ కు
జరుపు చుండిరి  యింతులు  స హృ దయముగ
అందు కొనుమమ్మ  వారల  యాశిసు లను
బంధు మిత్రులు    దోడురా  భవ్య ముగను .

అమ్మా ! కల్పన! వేగమె
యిమ్మా  నొక  మనుమరాలి  నీ శా  రూపున్
ఇమ్ముగ  శంకరు  సామికి
నెమ్మది  నా శీ ర్వదింతు  నిరతము  నిన్నున్

 

Wednesday, January 2, 2013

పద్య రచన -పూవిలుకాడు

చెఱకు  గెడను నా   యుధముగ  జేసి కొనిన
మార ! వంద నంబులు పది వేలు సేతు
మమ్ము  పీడించ వలదు సు  మా! యెచటను
మదిని జెడ గొట్టు  విలుకాడ ! మన్మధుండ!

కంటి కింపు గొలుపు గాన సుధలు

మంచి  చిత్ర  మదియ  మదిని ము రియ జేసి
కంటి కింపు గొలుపు ,గాన  సుధలు
కర్ణ భేరి దాకి  కర్ణంబు  లుప్పొంగి
చేర్చు  మనల  నపుడు  శివుని  దరికి .

సరస్వతీ ప్రార్ధన

శరదిందు సమాకారే పర బ్రహ్మ స్వరూపిణి !
వాసరా  పీ ట  నిలయే సరస్వతి  నమో స్తుతే !

కోడిం దినె కోమటయ్య కోరిక తీ రన్

ఆడిన  యలసట  వలనన
వేడిగ  నేదైన  దినగ  వేడుక  గలుగన్
వేడిగ మఱి మెత్త ని ది ప
కోడిం దినె  కోమటయ్య  కోరిక  తీ రన్
 

Tuesday, January 1, 2013

పద్య రచన -చెక్క భజన

అమ్మ వారల  యుత్సవ మందు  భక్త
జనము  లూరూర  చెక్క భ జనలు  సేసి
దండు  కొందురు  మిగులచం  దాలు  వడిని
సంత  సంబున  పాడుచు  శంభు  మహిమ .

తణుకు

చూసితి  తణుకు  పురంబున
చూసితినే  సూర్య దేవు  సుందర  రూపున్
చూసితిని  నాగ రాజును
చూసితి  నట రాజ  ప్రభుని  జూసిమురి సితిన్ 

హ్యా పీ న్యూ యియ ర టన్న నాగ్రహ మొం దెన్

నూతన  ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు

పాపారావు  కలువగనె
హ్యా పీ న్యూ యియ ర టన్న  నాగ్రహ మొం దెన్
ఆపాద  మస్త కంబుగ
నే పాపము  సేసి నానొ ? యెప్పుడొ ?యెట నో ?

పద్య రచన -2013

నూతన  ఆంగ్ల  సంవత్సర  శుభా కాంక్షలు

ఇరువది, యొకటి యు,  మూడును
నరయంగా  మంచి  సంఖ్య యన్నిటి  కంటెన్
తిరముగ  వత్సర మంతయు
సిరి రాసుల  నిచ్చి  మనకు శ్రీ పతి  జేయున్