Sunday, March 31, 2013

కరి సింహము నెక్కి దైత్యుల దునిమెన్

విరివిగ  చెరకును  దిను నట
కరి, సింహము నెక్కి  దైత్యుల దునిమెన్
అరి వీర  భయంకరి , యా
వరము లనే నీ యు  తల్లి   బాణము   తోడన్ . 

అంతర్జా ల అవధానము -పద్య రచన

అంతర్జా లంబందున
వింతగ మ ఱి  చేయు చుండ్రి  వేవిధము లుగా
వింతలలో  నవధానము
వింతలునే  గలుగ జేసె  వింతగ మనకున్ . 

జన్మ దిన శు భా కాంక్షలు --నా స్పందన

పుట్టిన  రోజులు  జరిగెను
పుట్టిన  మ ఱి నాటి  నుండి  పొలుపుగ నాకున్
ఇట్టులు  జరిగెను  వరుసగ
ఇట్టట్టుగ న ఱు వ దా రు  లి ప్పటి  వరకున్

వృ ద్ద  జనములు  నొక చోట  విడిది  చేసి
సత్క రించగ  నన్ను  ను   సాదరముగ
పిలువ బంచగ  నేగితి  ప్రియము  తోడ
చిఱు రు  మాలును  బండును  జేతి  కిచ్చి

నిండు  నూ రేం డ్లు  బ్రదుకుమా!  నెయ్య మలర
సకల  శుభములు  గలిగించు  శంకరుండు
ఆయు  రారోగ్య  సంపద  లన్ని యీ య
వేడు కొందు మనిరి మ ఱి  వినయ మొప్ప .


 

నిండా మునిగి పోవు

బండారు  రాము డ క్కట
నిండా మ ఱి మునిగి పోయె  నెయ్యము  వలనన్
చండాల పనుల గలిగెడు
కం డూ తిని  నప్పు  జేసి  కనుమ ఱు గయ్యెన్ . 

Saturday, March 30, 2013

మరుని ముద్దు లాడె గిరి కుమారి

సంహ రించె  శివుడు  సారుణ  నేత్రు డై
మరుని , ముద్దు లాడె  గిరి కుమారి
తనదు  చిన్ని  గణప  తయ్యను  మఱి యును
గజము  యొక్క  ముఖము  గలుగు  వాని . 

పద్య రచన -తులసి

తులసి  మాత ను  బూజించ  దొరలె  యగుదు
రార్య ! సందియ మిల ని సు మంత లేదు
చెట్టు గల యింట  నిరతము  సిరులు  బండు
పూజ జేయుడు మఱి పుణ్య  పురుషు లార !
 

తళుకు బెళుకుల దారలు దగ్ధ మయ్యె .

వస్త్ర సముదాయ  యంగడుల్  వరుస వరుస
తాము  బెట్టిన  బాంబున  దగుల  బడగ
అద్ద ముల  లోన  నుండెడి  యంద మైన
తళుకు బెళుకుల  దారలు  దగ్ధ మయ్యె . 

దత్త పది = తమన్నా -కాజల్ = సమంతా =త్రిష

శ్రీ కృష్ణుడు  అర్జునుని తో

తాసమం  తానే  నీ తాత  త్యాగ మందు
కా జలంబుల మునుగవే  కాక మూ క
త్రి ష డా యామ  కాలాల  తిరుగ  రెవరు
పీ త మన్నన  గంగయే  తాత  కిపుడు . 

Friday, March 29, 2013

పద్య రచన -నిఘంటువు

కవి వరే ణ్యు ల  కృషి యి యే  కార ణ ముగ
కఠి న  పదముల  కర్ధంబు  గాని పించు
సంది యంబున  కిచటను  సందు  లేదు
కల్ప వృక్షంబు  గద యీ ని   ఘంటు విలను . 

Thursday, March 28, 2013

ప్రాఙ్ముఖుడై పరుగు దీ సె భాను డు వేగన్ .

సఙ్మా  భానుని  నడిగెను
వా ఙ్మ యమగు  తెలుగు నందు  "పరుగుల పోటీ "
ది ఙ్మాత్రము  జేయుద మన
ప్రాఙ్ముఖుడై  పరుగు దీ సె భాను డు  వేగన్ .

శం కరా భరణ బ్లాగు

బ్లాగుల నన్నిటి గంటెను
బ్లాగే శంకరు గురువుల  వారిది నేనున్
భోగముల  గంటె కూ డ ను
రాగముతో  జూ తు నెపుడు  రాత్రిం బగలున్ . 

నిత్య కళ్యాణము -పచ్చ తోరణము

నిత్య  కళ్యాణ మగునని  ప్రత్యం గిరకు
పచ్చ  తోర ణం బులు  గట్టి  రచ్చ మైన
మామి డా కుల  దోడన  మగువ లచట
కామి తార్ధము లీ యుము  కనక దుర్గ !

ఆవకాయ పెట్టు విధానము

మెత్త నుప్పును  మరియును  మిర్చి  పొడిని
ఆవ  పిండిని  సమ పాళ్ళ  యట్లు  జేసి
కలప వలె నమ్మ ! సమముగ  గలి యు  వరకు
ఆవకాయకు  కారము  నిదియ  సుమ్ము .

మామిడి  కాయల ముక్కలు
గోముగ నా కార మందు  కొంచెము  కొంచెం
ప్రేమగ  వేయుచు   నూ నెను
దామాషగ వేసి  కలిపి   దాపున  జాడిన్ .

మూ డు  దినములు  నటులన   ముచ్చ టంగ
భద్ర  ప ఱచియు  తదుపరి  వాడు కొనిన
మంచి  రుచి గల్గి   నో రూ రి  మరల మరల
దినగ గోరిక  గలుగును  దేవి ! మనకు .

 
 

Wednesday, March 27, 2013

పద్య రచన -గగన కుసుమము

గగన  కుసుమాల  యునికియు  గగన మర య
గగన  మనగను  శూ న్యము  గద మ ఱి  యిల
గగన  మంద లి  చంద్రుడు  గాను పించు
సూ ర్య  కాంతులు దన మీ ద  సోక  వలన .
 

ఆహ్వానము - అమలాపురము కవితా సదస్సు

రామ  జోగయ్య  గురువులు రాణ  యొప్ప
ఆంద్ర  పద్యాల  సొబగును నాం ధ్రు లకును
విశ ద  ప ఱచగ  నాతని  వివరణ మున
తెలుగు  పద్యమ్ము  నిత్యమై  తేజరిల్లు . 

Tuesday, March 26, 2013

కుత్సితులె చేయుదురు వసంతో త్సవమ్ము

కుత్సితులె  చేయుదురు  వసంతో త్సవమ్ము
ల నగ  నేటికి ?చేయుదు రం ద రెపుడు
వారి  వారల  దైవము  బరము  గాను
భ క్తి  యుతముగ  బ్రతి యేట  పండు గ వలె . 

పద్య రచన -హోళి

హొళీ  పండుగ రోజున
పాళియ  గాం డ్రం ద రచట  భామల తోడన్
వేళా కోళ ము  లాడుచు
హేళ ముగా  రంగు పూ సి  హీ హీ  యనిరీ . 

గయ్యాళి గంప

గయ్యాళి  భార్య  తోడన
అయ్యా ! యిక  వేగ  లేను  నలసట  గలిగెన్
నుయ్యో గొయ్యో  దిక్కిక
బయ్యా ! యిక  పంపు  నామె  బ్రదుకుదు  నేనున్ . 

Monday, March 25, 2013

పద్య రచనము --కామ దహనము

కామము  వినాశ  హేతువు
కామము  మఱి  లొంగ దీ యు  కర్క శ ముం గాన్
కాముని  దహి యించెను  గద !
కామారియె  కోప గించి  కంతుని  నరుడా !

కలహములే సకల సౌఖ్య కారణ ములగున్

ఇల నిడుములకు న్  హేతువు
కలహములే , సకల  సౌఖ్య కారణ ములగున్
కలహములు  లేక యుండిన
పలువుర తో  బంధ ముంచి  బ్ర దుకగ  వలయున్ 

ఆకాశ వాణి

ఆకాశ వాణి  వార్తలు
ఆకాశము నుండి  వచ్చి  యలలు యలలు గాన్
తాకగను రిసీ వరునకు
వాక్కుగ  నది మారి  మనకు  వాచ్యము  జేయున్ . 

పండంటి కాపురము

పండంటి  కాపురంబును
దండుగు గా జేసికొనకు  దగవుల దోడ న్
ఒండొరులు గూ డ బలుకొని
పం డం టీ  బిడ్డ నిమ్ము  పార్వతి ! మాకున్ . 

Sunday, March 24, 2013

పద్య రచన -హస్తి మశ కాం తరము

హస్తి  మశ కాం తరము నర య దె లి  సె మ ఱి
బహుళ  కాయంబు  హస్తిది , మశక  మౌర !
సూ క్ష్మ  దేహంబు  రె క్కలు జూడ జాస్తి
హస్తి మశకంబున కిదియ   యంత రంబు 

అ ఆ లను మ ఱఛి పోయి రాం ధ్రు లె యౌ రా !

అ ఆ లనునవి  తెలుగున
అ ఆ లకు  బదులు నిపుడు నాంగ్లము  వచ్చెన్
అ ఆ ల యునికి  శూ న్యము
అ ఆ లను  మ ఱఛి  పోయి రాం  ధ్రు లె  యౌ రా !

Saturday, March 23, 2013

వ మ్మొన ర్చినచో సు ఫలమ్ము లొదవు .

మనసు  లోపల  మాత ను బదిల  పఱచి
ప్రార్ధ నాదు లు  సేయగ  బరిత  పించి
ఱేయి  బగ లులు  యాదేవి  లీ ల లను స్త 
వ మ్మొన ర్చినచో  సు ఫలమ్ము లొదవు .

చిలుక పలుకులు (పద్య రచన )

చిలుక పలుకులు బలుకుదు చెలువు  మీ ర
కవివ రులపద్య రచనము  గాంచి  నేను
కూర్పు జేయుదు  బద్యము  గురువు  లార !
తప్పు  సరిజేసి  దెలుపుడ , యొప్పు  నదియ .


 

Friday, March 22, 2013

పంచ వర్ష ప్రణాళిక

దేశ పాలన   జేయగ దీ టు గాను
పంచ వర్ష ప్రణాళిక  బదిల ముగను
చట్ట రూ పము  దేవగ  గట్టు దిట్ట
మైన  చర్యలు  శీ ఘ్రమ  గై కొనుండు . 

శ్రీ హరి వాసము

శ్రీ హరి  వాసము  జేరను
ఆ హరియే దారి  జూ పె  నాత్మీ యత తోన్
ఆహా ! యేమని  జెప్పుదు ?
తాహతునే  మ ఱ చి  నన్ను  దన్మయు  జేసెన్ . 

విద్యుచ్ఛక్తి

నీ టి   నుండి  పుట్టి  నేల మీ ద  వెలుగు
నిచ్చు  నట్టి  శక్తి  యిదియ సుమ్ము
మేలు జేయు  మఱి యు  మిగుల గీ డును గూ డ
జాగ రూ కత  యవ  సరము  మనకు . 

పద్య రచన -సమ్మెలు - జన జీ వనము

సమ్మెలు  సమ్మెలు  సమ్మెలు
సమ్మెలు మఱి లే ని రోజు సాలో కింపన్
ఇమ్మహిలో  గని పించదు
సమ్మే  జన జీ వనంబు  జరుగక  జేయున్ . 

తన్న న్ జూడగనె భక్తి తత్వము దెలియున్

అన్నువ  భాగ వతంబును
మిన్నగ  మఱి  చదువు చుండి  మేదిని  యందున్
ఉన్నతు డా  బమ్మెర పో
తన్న న్  జూడగనె    భక్తి  తత్వము దెలియున్ .
 

శ్రీ లలితాంబికా

లలిత రూపము  గలయట్టి  లలిత మాత !
నిన్ను  నమ్మితి  ననిశము  నిర్మ లాత్మ !
వందనమ్ములు  లలితమ్మ !  వంద లాది
కావు  మమ్ముల  నిక నైన  గరుణ  తోడ . 

Thursday, March 21, 2013

పి ఱి కి వాడు గెల్చె వీ ర తతి ని

పి ఱి కి  వాడు గెల్చె  వీ ర తతి ని నిల
పోరు జేయ జేయ  పౌ రు షం బు
కలిగి  బలము  గూడ  గట్టు కొని  గెలిచె
జయ మప జయ ము లవి   శం భు  లీ ల . 

పద్య రచన -రెంటికి జెడిన రేవడి

రేవ  డొ కనికి  బేరాశ  యావ  హించి
బట్ట  లుతుకుట  మానియు  పైరు  వేయ
వాన  లేమికి  జెడిపోగ పంట  పొలము
రెంటికి  జెడియు  కుమిలెనా  రేవడపుడు 

ఈ రోజు అనగా 21-3-2013 తే దీ న అలకాపురి పార్కులో జరిగిన సీతా రామ కళ్యాణము .

1. ఈ రోజు నవమి  కావున
  శ్రీ రాముల  పెండ్లి జరిగె  సీతమ  తోడన్
 ఆ రాముడు  సంతసమున
  భూ రిని  మఱి  యిచ్చు గాత ! భూతిని  మనకున్ .

2. సీ తా రాములకును నిట
  చేతో మోదంబు  గలుగ  జేసిరి  పెండ్లిన్
  ఏతావున  ననగ ననునది
  మాతావునె  నలక పురపు  పార్కున  యందున్ .

3. రామ  నామపు  భజనలు  రహిని  జెలగ
  వేద  పండితుల్  సాక్షిగ  , విపులముగ ను
  మంత్ర రాజము  సభ లోన  మారు  మ్రోగ
  పెండ్లి  చేసిరి  ఘనముగ  విబుధ  వరులు .

4. భరత  శత్రుఘ్ను  లిరు వైపు  పదిలము గను
  కాచు  చుండగ  మఱియును  కపి  వరుండు
  పాద సేవను  జేయగ  పరమ పురుషు
  డాది  దేవుడు  రాముడు  నాసన మున .

5. అలరు  చుండగ  లక్ష్మణు  డ య్యదు నన
  అమ్మ  సీ తయు , రాముని  యండ  జేరి
 పాద సేవను జేసెను  పత్ని తోడ
  రామ  లక్ష్మణ  బంధము  రమ్య  మదియ .

6. మృదు ల  మధుర  వాద్య  మింపు గొలుప  మది
  పులక రించె , గగురు  బొడిచె  మేను
  తేలి పోయె  మనసు  తెమ్మెర  వోలెను
  వాద్య  మహిమ  బొగడ  వరుణి  దరమె ?

7. రామాయణ  ప్రవచనమును
  ప్రేమగ  మఱి  చెప్పు  చుండె  ప్రియ  మొందంగాన్
  యీ మా సంతోషు గురువు
  రామా ! మఱి  కావు  మతని  రసికత  దృష్టిన్ . 

Wednesday, March 20, 2013

చొక్క నామాత్య పుత్రుడు తిక్కన గద !

చొక్క నామాత్య  పుత్రుడు  తిక్కన  గద !
కాదు , పెద్ద నామాత్యు డు  కద! మఱచితె ?
కన్ను దెఱి చెను  దోరాల  గ్రామ  మందు
అల్ల సానిది   జిగిబిగి  యల్లి  క  నిరి . 

ముద్దులు మూట గట్టు

ముద్దులు  ముద్దులు  ముద్దులు
ముద్దులు  మఱి  ముద్దు లన్ని  ముద్దులె  ముద్దుల్
ముద్దులు  బెట్టుట  నొక కళ
ముద్దులు  నిక  గట్టు కొనుము  మూటగ నరుడా !

పద్య రచన -కవిత్వ ప్రయోజనము

కవులున్జేతురు  రచనలు
నవ రసముల తోడ  మిగుల  నాణ్యత యొప్పన్
అవియే గూర్చును  శుభముల
న వనికి గళ్యాణ  మదియ  హర్షము  మఱియున్ . 

సూనుని దీ వనలు మనకు శుభ కరము లగున్ .

పూనికతో  గణ  నాధుని
మానక  మఱి  పూజ సేయ  మంత్రము తోడన్
మానస  రూపుడు  పశుపతి
సూనుని దీ వనలు  మనకు  శుభ కరము లగున్ .
 

Tuesday, March 19, 2013

వేయి సమస్యలు కవులకు వేడుక గూర్చెన్

హాయిగ బూ రణ  లాయెను
వేయి  సమస్యలు,  కవులకు  వేడుక  గూర్చెన్
శ్రేయులు  శంకరు  సేవలు
వ్రాయించిరి  కవుల జేత  పద్యము  లెన్నో . 

పద్య రచన - ఆంద్ర భారతి

ఆంద్ర భారతి ! నీ కివె  యందు కొనుము
వంద నంబులు  శతకోటి  వరుస  నిడుదు
నాదు  కలమున  నొప్పారి  నన్ను  జేయు
సాటి  కవులలో  నొకనిగ   శార దాంబ !

Monday, March 18, 2013

గుళ్ళు -గోపురాలు

  గు ళ్ళూ ను  గోపు రంబులు
 వెళ్ళంగా  బుణ్య మబ్బు  వేగిర ముం గాన్
ఒళ్ళం తయు  బుల కిం చును
కళ్ళారా  స్వామి జూడ  , కను విందగు నున్ . 

పద్య రచన -అడవి గాచిన వెన్నెల

తట్టు కోలేక  బాధలు  మెట్టి నింట
తోడ బుట్టిన  వారును  దోడు లేక
నీ దు జీ విత మునకట  నీ ల వేణి !
అడవి  గాచిన  వెన్నెల  యయ్యె  నేడు .
 

Sunday, March 17, 2013

మంద వారి ఆణి ముత్యాలు

మంద వారి  మాట మణుల  మూట , నిజము
మూట  యందు గలవు  మూడు  పదుల
తరము  ల కుప యోగ  తమములౌ  సంపద
సూక్తు లనగ  మంచి  సుద్దు లవియ . 

పద్య రచన -గత జల సేతు బంధనము

జరిగి పోయిన  బనులను  దిరుగ దోడ
ఫలిత ముండని  చందంబు  ,జలము పోయి
నపిద  ప యచట  జల బంధ నంబు  వమ్ము
గాదె ? పరికింప  దానినో  సుదతు లార!

వెఱ్ఱి వారలు సద సద్వివేక నిధులు

పరులు  బొగడంగ  నువ్వెత్తు  బరగు  వారు
వెఱ్ఱి వారలు,  సద సద్వివేక  నిధులు
మంచి  కార్యంబు  లొరులకు  మాన కుండ
చేయు  చుందురు  నిరతము  జిష్ణు  దలచి 

ఆక సంబున దారలు నంత రించె

మిలుకు మిలుకులు  కండ్లకు   మెరయ సాగె
ఆక సంబున  దారలు , నంత రించె
సూర్య భగవాను డు దయింప  సూటి గాను
గగన మందలి  దారలు  జిగులు  వదలి . 

Saturday, March 16, 2013

పద్య రచన -- విద్యా ధనము

దోచు కొనలేరు  విద్యను  దొంగ  లెవరు
పంచు కొనలేరు  దానిని  భ్రా త లెవరు
ఎవరి  విద్యయే  వారిని  నిలను  సాకు
విద్య  మేలైన  ధనము ర ,విశ్వ మందు 

మృ త్పిండ మె స్వర్ణ మగుచు మేలొన గూ ర్చున్

సత్పురుషు డైన  మనుజుడు
సత్పథమున్నెంచు కొనుచు  సవిమల  బుద్ధిన్
దత్పరత  విత్తు  నాటిన
మృ త్పిండ మె  స్వర్ణ  మగుచు  మేలొన  గూ ర్చున్ 

పాప పుణ్యము లా యవి పగటి కలలు

బాధ గలిగించు  పనులను  పాప  మండ్రు
పుణ్య  మందురు  సుఖములు బొసగు నేని
పాప పుణ్యము లా యవి పగటి కలలు
అనుట యుచితమా ? పలుకగ నార్యు  లార!

కుక్కిన పేను

కుక్కిన పేను లు  మాదిరి
కిక్కురు  మనకుండ దొంగ కిటి కీ  మూలన్
బిక్క మొగంబును దోడన
ప్రక్కలకుం  జూ చు చుండె పరుగున బోవన్ 

Friday, March 15, 2013

పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సు ధీ

పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సు ధీ
యరయ   నిజము  పరుల సేవ యవస రంబ యాద్య  ! యే
యరమరికలు లేని సేవ హత్తు కొనెను  గుండె లో
మరువ కుండ నాకు  పరమ పదము నిపుడ యీ యవా ?

పద్య రచన -సింహాద్రి అప్పన్న

సింహగిరి పైన వెలసిన  శ్రీ శ ! యీ శ !
చందనంబుల  శోభిత  శం భు లింగ !
నన్ను గావుము నిరతము  నార సింహ !
ఆశ లన్నియు  నీ పైన  హత్తు కొంటి . 

సుత వాహను డాజి గూల్చె సుర వైరి తతిన్

దితి సూనులు  విచ్చల విడి
పతి దేవుల  సంహ రించ  భామలు వేడన్
అతులిత మహితుడు , నంజలి
సుత వాహను డాజి  గూల్చె  సుర వైరి తతిన్ 

Thursday, March 14, 2013

శల్య సారధ్యము

శల్యు డనువాడు  కర్ణుని  సార ధి యయి,
గెలువ  లేనిచొ  వారలు  గేలి సేతు
రనుచు భయమును రేకెత్త  నతడు పొగిలె
శల్య  సారధ్య ఫలమిది  చట్టు  లార!

రామేశ్వరము

రాముని చే  స్థా పించిన
రామేశ్వర  లింగ మగుట  రామేశ్వర మ
న్నా మము గలిగెను  దానికి
రాముడు  మఱి  యీ శ్వ రుండు  రమ్యులు , నొకరే . 

సుందర కాండ సారాంశము

రామ కార్యము  కొఱకునై  లంక కేగి
సీ త గనుగొని  యా వార్త  శీ ఘ్రముగను
రాము నకుదెల్పి  రావణు  లయము నకును
గార ణం బైన హనుమకు  గరము  లో డ్తు . 

Wednesday, March 13, 2013

ఆహ్వానము --త్యాగ రాజయ్య గీ తాలు

త్యాగ రాజయ్య   గీ తాలు  రాగ వించ
జరుగు నుత్స వంబులకు నౌ   శంకరయ్య
గారు  పంపిరి  శుభ లేఖ  కవి వ రులకు
సంత  సంబున  నిడుదును  శతము  నతులు 

మృగమును సేవించు నెడల మేలగు బ్రజకున్

భగవంతుని  చేష్టలు నిల
సుగ మంబులు గావు  మనకు  శోధించంగాన్
మగ నర సింహపు  రూ పగు
మృగమును  సేవించు నెడల మేలగు  బ్రజకున్ 

పద్య రచన -అంతర్జాలము

అంతర్జాలము జూచితె ?
అంతర్జాలంబు  మనకు  నన్ని విషయముల్
వింతగ , దెలుపును  వెంటనె
అంతా  యా శివుని లీ ల  , యబ్బుర మదియే . 

Tuesday, March 12, 2013

గోధూళి

గోవులు  నడిచెడి  పథమున
గోవుల మూ త్రంబు లుండు , గో పే డ యు నున్
గోవులు  నడవగ  ధూ ళియు
బావన ముం జేయు మిగుల  పరిసర  గృహము న్ 

బుద్ధి కలుగు జనుల రోయ దగున్

వావి వరుస లేక  వలపు లొం  దునతడు
బ్రతికి యున్న  లేక  వమ్ము  సుమ్ము
పశువు  వలెను దుష్ట వర్తనము గల దు ర్
బుద్ధి   కలుగు  జనుల రోయ దగున్ 

మారుతినిం గొలుచు నెడల మతి చెడి పోవున్

ధీ రుడు గా  ముం దుం డు  ను
మారుతినిం  గొలుచు నెడల ,మతి  చెడి పోవున్
కోరునది  జరుగ కుండిన
కోరికలను నదుము బెట్టు కొనుటే మేలున్
 

Monday, March 11, 2013

దుగ్గిరా ల గోపాల కృష్ణ

దుగ్గి రాల  గ్రామ  దొర వైన  గోపాల
కృష్ణ ! వంద నంబు  గైకొనుముర
ఆంధ్ర రత్న  బిరుద మందిన  ఘనుడవు
నీ కు  సాటి రారు  నేత లెవరు . 

అనిరుద్ధుడు నెమలి నెక్కి యంబుధి దాటెన్

వినుమిది  చక్కని  పాదము
అనిరుద్ధుడు నెమలి నెక్కి  యంబుధి  దాటెన్
అనిరుద్ధు డంబికా సుతు
డనుపమ తేజో యుతుండు నా  స్కంధు డె గా . 

పద్య రచన -త్రిజటా స్వప్నము

త్రిజట యనునామె  రాక్షస  స్త్రీ ల తోడ
వినుడు  మీ రంద రొ క మాట   వీ ను లలర
రాముడిప్పుడ యేతెంచి రావణా సు
రుని  వధించి  సీ తను గొని వెనుదిరుగును
 

శబరిమల

శబరిమల మీ ద  యయ్యప్ప  యభయ హస్త
మిచ్చు నటులుగ  గూ ర్చుండి  యీ య సాగె
పదునెనిమిది మెట్ల ఫలము  భక్త తతికి
స్వామి !యయ్యప్ప ! శరణము  శరణు  స్వామి !
 

ఆది దంపతులు

ఆది దంపతు లగునట్టి యాయుమ ,పర
మేశ్వరు  కరుణా కటాక్ష యీ క్షణములు
శంకరా భరణ కవుల పై   సతత ముండు
గాక  ! మఱియు వే  యివిధముల్ గాచు గాత !


 

రమణ మహర్షి

రమణు ల సన్నిధి  నుండుట
అమరత్వము  బొంది నట్లు నాశింతు  మదిన్
రమణుల బేరును బలికిన
సమవర్తియు భీ తి జెంది  సరగున బోవున్ 

బెజవాడ కనక దుర్గ

బెజవాడ  కనక దుర్గకు
భజనలు  సేయంగ రండి  భామలు మీ రున్
సజలముల తోడ నమ్మను
విజయము నే నిమ్ము మనుచు  వేడుడు  మదినిన్ 

పంచాంగము

పంచాం గంబును జూచిన
అంచితముగ  దెలియు మనకు నవని  యునికియున్
"పంచాంగ కర్త " యందురు
పంచాంగము వ్రాయు వాని పండితు లు ధరన్ 

Sunday, March 10, 2013

ఓడి పోవుట వీ రున కొక వరంబు

తండ్రి  యానతి విష్ణుని  దర్శనంబు
కలుగ జేసిన ప్రహ్లాదు  డెలమి ఘనుడు
అతని  మూలాన యా తండ్రి  హత మయ్యి
ఓడి  పోవుట  వీ రున  కొక  వరంబు 

పద్య రచన -జాగరణము

జాగరణము  సేసి  రాగ మొప్పమిగుల
పెద్ద వారు కూడ  పిన్న  లయ్యి
శివుని  నామ శతము  శివ రాత్రి  దినమున
పఠన జేయుదు రట  పావ నముగ



 

Saturday, March 9, 2013

మాస శివ రాత్రి వచ్చును మార్చి యందు

మాస  శివ రాత్రి  వచ్చును  మార్చి యందు
వచ్చు నన్ని  నెలల యందు  వరుస గాను
బహుళ  పక్షం పు  జివరన  బర గు  చుండు
శివుని ప్రీ తైన  దినమది  భవుని  దలచు 

మాస శివ రాత్రి

మాస శివ రాత్రి  దినమున  బరమ  శివుడు
చేసి కొను నభి  షేకము  శిష్టు  గాను
పాలు బెరుగులు  వెన్నయు  బంచ దార
ఆది గా  గల  వస్తువు లైక్య బ ఱఛి . 

మంచి పద్యము =పిస్కా వారు

మంచి  పద్యము  నిపుడుజూ  పించి తీ వు
నీ దు ప్రతిభకు దార్కాణ  మిదియ  సుమ్ము
బింక మైన దీ  వివరణ శంక లేదు
సత్య  నారాయ  ణా !నతు   లిత్తు సామి !

శివ ! శంకర ! యనిన బాప చింతన లెసగున్

కవనము  బాగుగ  వచ్చును
శివ ! శంకర ! యనిన, బాప చింతన  లెసగున్
దుర్వ్యసనము బారి బడిన
అవగుణముల  వారి  కెపుడు నాశ్ర య మొద్దూ .

(మహాశివ రాత్రి  శుభాకాం క్షలతో ... )

పద్య రచన -మహా శివ రాత్రి

మహా శివ రాత్రి  శుభా కాం క్షలతో......

శివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని బలికి నంత  శివ సాయుజ్యం
భవ ! యని బలుకును  శివు డ ట
శివ శివ  యని బలుక రండి  శివునిం  గుడికిన్ . 

శివ దండకము -నేమాని వారు

శివ రాత్రి  శుభా కాం క్షలు
శివ శివ యని బలుక మీ రు  సేమము గలుగున్
శివునే మది  ధ్యానిం చుడు
శివ రూపుడ ! రామ జోగి ! సేతును నతులన్ . 

ఆలు మగలు

ఆలు మగలుల  బంధము  నలతి గాదు
జన్మ జన్మల నుండి యు  సాగు  చుండు
ఒకరి విడిచియు  మ ఱి యొక రుండ లేరు
చివరి వరకును , నిజమిది  చిత్స్వ రూ ప !
 

Friday, March 8, 2013

సోదరి బెండ్లాడెను మధు సూ దను డెలమిన్

వేద మయుండగు నాహరి
యాదరమున సాకు చుండి  యా పాండవులన్
జోదగు  పార్ధుని ,వరుసకు
సోదరి బెండ్లాడెను మధు సూ దను డెలమిన్ 

పద్య రచన - వైద్యో నారాయణో హరి:

వైద్యుడు నారాయణుడే
వైద్యుడు నిల  మందు నిచ్చి ప్రాణము నిల్పున్
వైద్యుని  యునికియు  ముఖ్యము 
వైద్యుని  గుర్తించి  బొగడె  బద్దెన  కవియున్ . 

గరిక పాటి వారి యవధానము

అవధానము  లన్నిట నీ
యవధానమె  గొప్ప దందు రార్యా రాధ్యా !
అవధానం బొన రింపుము
నవ పోకడ లుద్భ వించ  నర సిం హా జీ !

అచ్చులు -హల్లులు -ఉభయా క్షరములు

ఆంద్ర భాషకు  గల యట్టి  యక్షరముల
మూడు విధములు సేసిరి  ముచ్చటగను
అచ్చు లుభ యాక్షరము లును హల్లు లనగ
మొత్త  మేబది యా ఱు గ  ముచ్చ టించె . 

యతులు-ప్రాసలు

తెలుగు ఛం దస్సు  నందుండు   దెలియ  వినుము
యతులు  మఱి యును  బ్రాసలు  ననగ రెండు
మొదటి రెండవ  చోటుల  ముఖ్యముగను
ప్రాస యతులును  యతి మైత్రి బరగ నొప్పు . 

బ్రహ్మో త్స వములు

బ్రహ్మో త్స వంబు లనునవి
బ్రహ్మీ మూ ర్తంబు  నందు  వారాణ శి లోన్
రహ్మను ననబడు  ఋ క్కుని
బ్రహ్మను గా జేసి  జరిపె  బహు ముఖ  ప్రజ్ఞన్ . 

Thursday, March 7, 2013

పున్నామనరకము

పున్నామనరకమయ్యది
చెన్నువుగా  బుత్రు దాని  ఛే దిం చునుగా
పన్నుగ బుత్రుని  గనుటకు
మిన్నగ మది గోరు కొంద్రు  మేదిని దండ్రుల్ . 

బుధ్ధి నిడని గురుడె , పూజ్యు డగును

నిరత మరయ  న వని  నింద్యు డగును గద
బుధ్ధి నిడని  గురుడె , పూజ్యు డగును
శిష్యు జేర దీసి  శిష్ట  గు  ణంబులు 
బోధ సేయ  గురుడు  భువిని  మిగుల . 

తపాలా శాఖ

ఈ తపాల  శాఖ  యెంత గానొ  నుపక
రించు బంధు  జనము  మంచి  చెడులు
తెలియ నార్య ! నిజము  దేశ దేశాలుగ
జగతి  నుపకృ  తులకు  సహజ  గుణము . 

అయ్యప్ప

అయ్యప్ప యె  మా దైవము
అయ్యప్పను వేడు కొందు మా భవు  మూర్తిన్
అయ్యప్పకు  సరి  దైవము
ఇయ్యవనిని  గాన రాడు  నెవరికి  నైనన్ . 

మానవత్వపు విలువలు

మానవత్వపు  విలువలు  మంట  గలిపి
మనుజ జాతికి  జెందిన  మహితు  డొకడు
దొంగ  లెక్కలు  సృష్టించి   దొరగ  నుండి
జైలు బాలయ్యె  పాపము  జనము  విడిచి . 

ధూమ శకటము

పూర్వ  మందలి  రైళ్లన్ని  బొగ్గు  వలన
నడుచు చుండెడి  గతనన  నల్ల గాను
పొగలు  గిరగిర  గగనాన  పోక  వలన
ధూమ  శకటము  నాబడు  భూమి మీ ద . 

అద్దాల మేడ

అద్దాల మేడ జూడను
వద్దామని పయన  మైతి  పండుగ నాడున్
పెద్దయ్య  యింత  లోపల
ముద్దుగ  నను  బిలిచి  జెప్పె  ముద్దకు  రారా !

Wednesday, March 6, 2013

పద్య రచన -వయోజన విద్య

బాల్య మందున కుదరక , పా ఠశాల
కేగ  లేనట్టి  వృద్ధుల రాగ మొప్ప
చదువు  సంధ్యలు   నేర్పుట  చక్క గాను
అదివ  యోజన  విద్య నా  ననబడు  గద !

ధనములు గలవాడె నలగు దారిద్ర్య మునన్ .

అనయము  మద్యము  ద్రాగుచు
కన నొల్లక  శివుని  నెపుడు  కలలో నైనన్
పనిగొని  నిరతము  సురా బం
ధనములు  గలవాడె నలగు  దారిద్ర్య మునన్ . 

పద్య రచన =దశమ గ్రహము

దశమ గ్రహమని యందురు
విశదంబుగ, గూ తు పతిని , వివరణ యిత్తున్
అశనము బెట్టక  నిరతము
పిశి తంబులు  దినుచు  వచ్చి  పీ డించు  మమున్ . 

ఓటమి నంగీ కరించ నోపునె మూ ర్ఖుల్ .

ఓటులు వేసిన నొకరివి
ఓటమి బాలయ్యె నింక నూ ర్పులు మిగులన్
ఓటమి దిరస్క రించ గ
ఓటమి నంగీ కరించ నోపునె మూ ర్ఖుల్ .
 

పద్య రచన --స్వర్గము --నరకము

స్వర్గ మనునది  యున్నచో  స్వాగ తింతు
పాప పుణ్యము లాయవి  పఱగు  మనకు
మనము జేసిన కర్మల  ఫలిత ములుగ
స్వర్గ నరకము లనునవి  జై భ వాని . 

పద్య రచన ---కలిమి -లేములు

కలిమి  లేముల  నందురు  కవి వరేణ్య !
తనర  కావడి కుండల  దరహ యనుచు
కలిమి  గలవాడు  లేమిని  గనిక రించి
సాయ మొన రించి తప్పక  సాక వలయు . 

Tuesday, March 5, 2013

పద్య రచన --ఉడుత భక్తి

ఉడతా భక్తని  బిలుతురు
అడకువ తో  జేయు బనిని,  నల్పము  నైనన్
కడలికి  వారధి  యప్పుడు
ఉడుత యునుం  వేసె  యిసుక  నుత్సా హము తోన్ .
 

స్తనములు గల పూ రుషుండు స్తవ నీ యుడగున్

కనుముర ! యాతడ  పేడియ
స్తనములు గల పూ రుషుండు,  స్తవ నీ యుడగున్
అనయము  శంభుని  దలచుచు
మననము నే జేయు నతని  మంత్రము  నెపుడున్ 

Monday, March 4, 2013

కర్మ ఫలము

కర్మ లు  సేయును బ్రాణులు
కర్మలు నవి  మంచి  వైన  గలుగును  సుఖముల్
కర్మలు  మర్మము  గలిగిన
కర్మలు నిక  బంపు  మనల  గాటికి  నరుడా !

గోవులు -గోపికలు (పద్య రచన )

గోపిక లెవరను గొంటిరి
గోపికలే యా దేవ స్త్రీ లు , గోగణ మునుగా
రూపము లెత్తియు  దేవత
లా పురుషుని దరిని బొంది రా ముష్మికమున్ 

బృందావనము (పద్య రచన )

బృందావనమది  జూడుడు
అందాలకు  నంద మయ్యి  యల రించెంగా
నందుని  నందను డిక్క డె
బిందెలు గా  వెన్న దినుచు  విశ్వము  జూపెన్


 

తులసి వనమున గంజాయి తోపు మొలిచె

తులసి వనమున  గంజాయి  తోపు మొలిచె
బగిది  జన్మింతు రధములు  పావనులకు
పుట్టు మనుజుడు  దప్పక  గిట్టు గాన
చేత నైనంత  యుపకృతి  జేయ నొప్పు 

Sunday, March 3, 2013

పద్య రచన -సుడి గుండాలు

సుడులు సుడులగను  నుదకము
వడి వడిగా  దిరుగుచుండి  వార్ధిని  యందున్
నడుగున కుం  బోవు గతన
సుడి గుండము  లండ్రు వాని  సూరి జనంబుల్ 

పిఱి కి పందల మదినిండ భీ తి యుండు

ఎన్ని కల లోన  సోముడు  మిన్న గాను
నిలువ బడియును  నాఖరి నిమిష మందు
ఓట్లు బడవను  భయమున  నోటు  చింపె
పిఱి కి  పందల  మదినిండ  భీ తి  యుండు 

జగమున గల ఫ కీ రులు సాయి లేను

సాధు  భావము  తోడ న  సకల జనుల
నాద రంబున  జూ చుచు నమిత  గార
వమున   మెలగిన  నదనున  వమ్ము  కాదు
జగమున గల  ఫ కీ రులు  సాయి లేను 

వేమన పద్యాలు

విశ్వ దాభి రామ ! వినుర వేమ!యనుచు
దనకు  దాను  జెప్పు కొను విధముగ
నీతు లుడివె జాల    నీ తి  శతకముగ
మఱువ  దగని  వవియ  మనుగడకిల 

తన బాణము కలత వెట్టె త్య్రం బకు మదిలో

అనువున  మార్కండేయుడు
తన  బాణము బొడుచు కొనగ  దన  బాణము తోన్
కనినా  దృశ్యము , భవునకు
తన బాణము  కలత వెట్టె  త్య్రం బకు  మదిలో . 

Saturday, March 2, 2013

సౌందర్యము

సుందర భావము  పుడమిని
సౌందర్యము  బిలువ బడును  సురుచిర ముం గా
సుందర మె  ప్రకృతి  యంతయు
సుందరమా ! నీ కు జెపుదు  సు స్వాగత మున్ 

ఆట -పాటలు (పద్య రచన )

ఆట పాట  లందు నారి దేరినవాడు
అమర విభుని  కొమరు  డర్జు నుండు
పేడి  రూపు తోడ  విరటుని  గడకేగి
వర్ష  కాల  ముండె  హర్ష మునన

 

దండ యాత్రలు(పద్య రచన )

రాజ్య  మందలి  యభిలాష  రగులు  గొనగ
మొగలు  దేశపు  ప్రభువులు  మొరటు లయ్యి
భరత  దేశపు  సంపదల్  భగ్న పఱు చ
దండ  యాత్రలు  జేసిరి  దండి గాను

 

తలుపు దెఱచి యుండె దమ్ము గొట్టు

రార రంగ ! నీ వు  రాపాక వంశజ !
తలుపు దెఱచి  యుండె , దమ్ము గొట్టు
వేగ,. యమ్మ  వచ్చు వెంకట గిరి నుండి
పొగను  ద్రాగ  వలదు  ముందు  ముందు . 

Friday, March 1, 2013

ఆత్మ హత్య పుణ్య మగును భువిని

మీదు మిక్కిలి గను  మిగుల  పాప మగును
ఆత్మ  హత్య , పుణ్య మగును భువిని
పేద వాని  కెపుడు  పెను సాయముం  జేయ
మానవునకు  సేవ మఱువ  బోకు 

పద్య రచన -వ్యసనములు

వ్యసనముల జోలి బోకుము
వ్యసనంబులు  మార్చు  మనుజు బానిస లుం గాన్
వ్యసనము లనబడు  నన్నియు
యసమును మఱి  బాడు జేసి  యసువుల  దీ యున్ 

కోటి రతనాల వీ ణలు గూ య సాగె

మ్రోగ సాగెను  సభ యంత  మోద  మలర
 కోటి  రతనాల  వీ ణలు,  గూ య సాగె
కోకిలలు నిల  నుదయాన  కో కొ  యనుచు
వేటి  ధర్మము  లాయవి  విన్న పించు 

పద్య రచన -గొల్ల భామ

గొల్ల  భామ  ప్రాక  గోరునది  గలుగు
కల్ల గాదు  నిజము  బల్కు  చుంటి
బామ్మ  జెప్పు  నాకు  బ్రతి దినము  నొకటి
క్రొత్త విషయ ములను  గోప పడక 

పద్య రచన -కూడు -గుడ్డలు

కూడు  గుడ్డల  కెపుడును  గొదవ  లేదు
ఆయు వున్నంత  వరకును  నాశ కొలది
బ్రదుక దలచితి  భువి పైన  బాగు గాను
శివుని  దలచుచు  మదిలోన  శివ శివ యని