Thursday, March 21, 2013

ఈ రోజు అనగా 21-3-2013 తే దీ న అలకాపురి పార్కులో జరిగిన సీతా రామ కళ్యాణము .

1. ఈ రోజు నవమి  కావున
  శ్రీ రాముల  పెండ్లి జరిగె  సీతమ  తోడన్
 ఆ రాముడు  సంతసమున
  భూ రిని  మఱి  యిచ్చు గాత ! భూతిని  మనకున్ .

2. సీ తా రాములకును నిట
  చేతో మోదంబు  గలుగ  జేసిరి  పెండ్లిన్
  ఏతావున  ననగ ననునది
  మాతావునె  నలక పురపు  పార్కున  యందున్ .

3. రామ  నామపు  భజనలు  రహిని  జెలగ
  వేద  పండితుల్  సాక్షిగ  , విపులముగ ను
  మంత్ర రాజము  సభ లోన  మారు  మ్రోగ
  పెండ్లి  చేసిరి  ఘనముగ  విబుధ  వరులు .

4. భరత  శత్రుఘ్ను  లిరు వైపు  పదిలము గను
  కాచు  చుండగ  మఱియును  కపి  వరుండు
  పాద సేవను  జేయగ  పరమ పురుషు
  డాది  దేవుడు  రాముడు  నాసన మున .

5. అలరు  చుండగ  లక్ష్మణు  డ య్యదు నన
  అమ్మ  సీ తయు , రాముని  యండ  జేరి
 పాద సేవను జేసెను  పత్ని తోడ
  రామ  లక్ష్మణ  బంధము  రమ్య  మదియ .

6. మృదు ల  మధుర  వాద్య  మింపు గొలుప  మది
  పులక రించె , గగురు  బొడిచె  మేను
  తేలి పోయె  మనసు  తెమ్మెర  వోలెను
  వాద్య  మహిమ  బొగడ  వరుణి  దరమె ?

7. రామాయణ  ప్రవచనమును
  ప్రేమగ  మఱి  చెప్పు  చుండె  ప్రియ  మొందంగాన్
  యీ మా సంతోషు గురువు
  రామా ! మఱి  కావు  మతని  రసికత  దృష్టిన్ . 

No comments:

Post a Comment