Tuesday, April 30, 2013

బ్రూ కా ఫీ

త్రాగ వలయును  బ్రూ కాఫి  త్రాగ  వలయు
మంచి  రుచియును  బలమును  మంచి తెలివి
ఇచ్చు నిరతము  సంది యం  బిందు లేదు
లెస్స  యైనది  మఱి దాని  మిస్సు  కాకు .


 

గోపూజ

భక్తి  శ్రధ్ధల  తోడన మైమ  ఱం చి
ఎవడు గోపూజ  సేయునో నిహము నందు
అతడు  జేరును బరమాత్మ  యాలయమ్ము
సంది యంబును  వదులుము  సత్య మిదియ .
 

భవ బంధాలు

త్రెంచుము  భవ  బంధమ్ముల
నుంచుము  మఱి  నీ మనమ్ము నోం కారములో
నం చెలు గా  బై కెదిగిన
సంచితముం  జేయు నీ కు  స్వర్గము  శివుడున్ . 

పద్య రచన - న్యాయ వాదులు

న్యాయ వాదులు   సత్యము  నకును    మారు
 పేరు గద మఱి , నిజమగు  పేర్మి  తోడ
న్యాయ  బధ్ధముగను దీ ర్పు  నీ య  గలుగ
కనులు  మూసిన   దేవత  కనులు  దె ఱచు .  

కాఱడవులు

చెట్లు  చేమలు  గుబురుగ నల్లి యుండి
దోమ సహితము  స్వేచ్ఛగ దూ ఱ లేక
కారు  చీ కట్లు  పూ ర్తిగ  గ్రమ్ము  కొనుచు
కంటి  కానమి , యందురు  కా ఱ డ వులు . 

విహార యాత్రలు

వినుముర  విహార  యాత్రలు
అనయము  మఱి  చేయు నెడల  నబ్బును  దెలివిన్
కన వచ్చును  రహదారులు
వినవచ్చును  దెలియ రాని  విషయము  లెన్నో . 

Monday, April 29, 2013

పద్య రచన -చీ పురు కట్ట

చీ పురు  కట్టలు  సేతురు
సాపుగ  మఱి  యీ నె తీ సి  సమమగు  సైజున్
చీ పురు  లూ డ్చును  గదులను
బాపురె  యిది      లేని యిల్లు  వమ్ముయె  సుమ్మీ !

చీపురు  కట్టలు  గొనుటకు
రేపున  నే బోదు నికను   రేపల్లెకునున్
ఏపుగ  నుండును  నచ్చట
మాపటి వేళగును  నాకు  మరలుట  నచట న్ . 

Sunday, April 28, 2013

గొడ్రాలికి కొడుకొకండు గొబ్బున పుట్టెన్

గె డ్రా జె ప్పిన దొక కధ
గొడ్రాలికి  కొడుకొకండు గొబ్బున  పుట్టెన్
మెడ్రాసు వైద్య మైనను
గొడ్రాల్ మ ఱి  కనగ లేదు కొడుకును  బుడమిన్ .

 

పద్య రచన - గోం గూ ర పచ్చడి

పచ్చడి  లన్నిటి గంటెను
యిచ్చం బగు  పచ్చ డిదియ  యెవరికి  నైనన్
పచ్చటి గోం గూ రాకులు
అచ్చముగా మెత్త రుబ్బి  హత్తుము  పోపున్ . 
 

మండు టెం డలు

మండు టెం డ జూడ  మంటలు రేగును
ఒడలు  నిండ  నుండె  నుక్క పోత
కళ్ళు జూడ నె ఱు పు  క ఱకు టెం డ  కతన
కంద గడ్డ యాయె  కనుము  ముఖము .
 

రామేశ్వరము

రామేశ్వరమున లింగము
రామునిచే నుంచ బడెను రమ్యము  గాగన్
ఆమని  వచ్చిన  శివునకు
భామిని యగు  గిరిజ తోడ పరిణయ మగునున్ . 

Saturday, April 27, 2013

పద్య రచన -పాద యాత్ర

పాద యాత్రలు  సేయుట  ప్రబల  మయ్యి
శుష్క  వాగ్దానముల జేయు చుందు  రపుడు
గద్దె నెక్కిన  పిమ్మట  గాన రారు
కార్య కర్తలు  సహితము  నాయకులకు . 

వివర మెఱు గ లేని వాడె విజ్ఞుడు జగతిన్

అవిరళ  మనస్కు డే నట
వివర మెఱు గ   లేని వాడె , విజ్ఞుడు  జగతిన్
సవివరముగ  దెలిసి కొనుచు
నవ విధముల  సాయబడును  నమ్రత తోడన్ . 

Thursday, April 25, 2013

పద్య రచన -భుక్తి -ముక్తి

హనుమజ్జయంతి రోజున
హనుమను బూ జించు  నెడల  హనుమయె  యిచ్చున్
అనిశము  భుక్తియు  ముక్తిని
మననము నే జేయు మయ్య ! మంత్రము  నెపుడున్ .


 

పద్య రచన -రామప్ప దేవాలయము

చిత్ర మయ్యది  జూడుము చిత్ర మందు
అద్భుతంబుగ నుండెను నందమునన
కాక తీ యుల కాలపు  కట్ట డమది
అరయ  రామప్ప  నిర్మిత  యాల యమ్ము . 

కలువలు వికసించెను దినకరు డుద యించన్

నెలవంకను  జూ డం గనె
కలువలు  వికసించెను , దినకరు డుద యించన్
వెలుతురు  నిండెను జగమున
మెలమెల్లగ మేలుకొనిరి  మేదిని  జనముల్ . 

Wednesday, April 24, 2013

శిశుపాలుడు ప్రాణ దాత శ్రీ కృ ష్ణు నకున్

శిశిరమున బుట్టె నట గద
శిశుపాలుడు,  ప్రాణ దాత  శ్రీ కృ ష్ణు నకున్
నిశ యంత  పూజ సేసిన
అ శనమునకు  లోటు లేని  హస్తము  నిచ్చున్ . 

చంద్ర గ్రహణము

రాహు వనువాడు  తమ వైపు  రాక వలన
చూచి చెప్పెను  చంద్రుడు  చూడ్కు లనన
అంత  విష్ణువు  ఖండిం చ నతని  శిరసు
రాహు  కేతువు  లయ్యిరి  రమ్యముగను .

కోపము  జెందిన  రాహువు
పాపిగ నిక  చంద్రు దలచి  పట్టుచు నుండెన్
కోపన  ప్రతి వత్సరమును
ప్రాపుగ మఱి  యయ్యె  చంద్ర  గ్రహణము   గాగన్ .
----------------------------------

భూమి తనచుట్టు  దిరుగుచు  భువన మందు
ఉండు చంద్రున కిల  యడ్డ ముండు  గతన
చంద్ర  గమనపు  మార్గము  సరిగ  లేక
గ్రహణ మేర్పడి చీ కటి  కాని పించు .
 

టక్కరి నక్క

టక్కరి నక్కయు  నొకపరి
మిక్కుటముగ నాక లుండి  మేదిని  యందున్
ఇక్కడ కక్కడ దిరుగుచు
కొక్కొరోకో యనుచు  దిరుగు కోడిని  జూచెన్ .

చూచి దరి జేరి ప్రియమగు చూడ్కు  లలర
కుశల బ్రశ్నల  నడిగియు  కూర్మి తోడ
ఒలక  బోయగ   బ్రేమలు  నుట్టి బడగ
ఉబ్బి పోయెను  నా కోడి  యు త్సుకతన .

మాయ  మాటల  నమ్మించి  మడియ జేసి
మాం స మంతయు  దినెను నా  మాయ నక్క
మోస పోవద్దు  నిక నైన  మోస గాండ్ర 
మాయ మాటల కెపుడును  మనుజు లార!

Tuesday, April 23, 2013

పద్య రచన -పిసిని గొట్టు

పిసిని  గొట్టులు  దినరు దా  బెట్ట రితరు
లకును  గూడ బెట్టుచు దొరల కిల  యప్ప
గిం తు రం తి యె  మఱి యిసుమంత  లాభ
ముండ దార్య ! వా   నిధనము  దిండు నకును . 

Monday, April 22, 2013

బకము వచ్చి వాలి ప్రాణము గొనె

బకము వచ్చి   వాలి  ప్రాణము గొనె
 ననుట  సత్య  దూర   మా ర్య ! విన గ
బ క  మనంగ   కొంగ  వాలి యరయ  కోతి
 రెంటి  కెట్టుల కుదు రీ కలయిక .


మడుగు లోని చేప   నడుము  బట్టి    దినె ను
బకము వచ్చి,  వాలి ప్రాణము గొనె
రామ బాణ మపుడ  రహిని  చెలగి న దై
అన్న దమ్ముల  కల  హ మటు  లాయె . 

Sunday, April 21, 2013

పద్య రచన -అహంకారము

అహము  కలవాని  కరయగ  నిహము నందు
మెప్పు గలుగదు  మఱియును  మిత్రు లెవరు
చేర నీ యరు  సరిగదా చీ కొడుదురు
అహము కారపు  లక్షణ మదియ సుమ్ము . 

నలకూబరు డాం జనేయునకు మామ గదా !

ఇల నరయ కాడు  నేమియు
నలకూబరు డాం జనేయునకు , మామ గదా !
బలరామునకును  గంసుడు
పలు విధముల  బాధ వెట్టె బ్రజలను  నతడున్ . 

పద్య రచన -వేసవి కాలము

వేసవి  కాలము  వచ్చెను
బాసటముగ నెండ  ముదిరె  పలురకములుగాన్
ఈ సులు  మోదలా యెను  మది
కాసులు నిక  యెక్కువగును  కవివరు లారా !

సూర్య చంద్రుల నొక చోట జూడ గలము

సూర్య  చంద్రుల  నొక చోట  జూడ గలము
పౌర్ణ  తిధి యందు  రామేశ్వ రార్ణవమున 
చంద్రు  రాకయు  మఱియును  సూర్యు పోక
ఏక సారిగ  జరుగును  నిచట జూడ. 

Saturday, April 20, 2013

పార్వ తీ శ్వర శర్మ !

పార్వ తీ శ్వర !యవధాన  పటిమ గరిమ !
తెలుగు  తేజమ ! నీ కిదె  దెలుపు  చుంటి
సకల  శుభములు  గలిగించు  శంక రుండు
ఆయు రారోగ్య  సంపద  లన్ని యిడును . 

వనము సుఖము నొసగు జనుల కెపుడు

చెట్టు  చేమ  పురుగు  పుట్టల  కలయికే
వనము ,  సుఖము  నొసగు  జనుల కెపుడు
శివుని  పూజ సేయ  శివునిం దలచినను
భుక్తి నిచ్చు  మఱియు  ముక్తి  నిచ్చు . 

పద్య రచన -కవిత్వ ప్రయోజనము

కవి విరచిత  మగు దానిని
సవినయముగ  విబుధు  లనిరి  సత్కవితం బనిన్
అవిరళ మగు  నానందము
కవనంబున గలుగు  నిజము  కవివరు లారా !
 

Thursday, April 18, 2013

రాముని పెండ్లి జరిగెను ధరాధర సుత తోన్

ఈ మన  యాలయ  మందున
రాముని  పెండ్లి జరిగెను , ధరా ధర  సుత తోన్
కాముని  జంపిన శివునకు
ప్రేమగ  మఱి   యిచ్చి జేసె  పెండిలి పెద్దల్ 

పద్య రచన - మంగళ సూత్రము

మంగళ  సూ త్రం  బదిగో
మంగళమును  గలుగ జేయు  మానవుల  కిలన్
మంగళముగ నా  రాముడు
అం గన యౌ  సీ  త మెడన  హారము  సేయున్ .

 

Wednesday, April 17, 2013

సింహమును బా ఱ ద్రోలె ను చిన్న వాడు

భరతు డ నువాడు  నాడుచు  ప్రక్క  నగల
సింహమును  బా ఱ ద్రోలె ను  చిన్న వాడు
జరిగె  నీ యది   కణ్వుని  సమ్ముఖమున
మదిని  నెంచగ  నాశ్రమ  మహిమ  గాదె !

తెలుగు వారి వారసత్వము --పద్యరచన

తెలుగు  భాషకు  మఱియును దెలుగు  ప్రజల
వారసత్వపు  మనిషి గా  వాసి  కెక్కి
జ్ఞాన  పీ ఠ ము  నొందిన  జ్ఞాన  మూ ర్తి !
అందు కొనుమయ్య ! రావూరి ! వంద నములు . 

Tuesday, April 16, 2013

లోకాపవాదము

లోకాపవాదము నకును
ఆకరమును  బూని  సీత  నడవుల కంపెన్
రాకొమరు డె  యా రాముడు
ఏకాకిగ  నామె నకట !   యీ శుడె  చూచున్ 

దూ ఱ లేదని యర్ధాంగి దూఱె పతిని

తప్ప  తాగిన  యొక్కడు  తలుపు  తట్టి
ఇంటి లోనికి  జొఱబడి  ఇంతి  గూర్చి
పలువి  ధములుగ  బూతులు  బలుక ,నతని
దూ ఱ లేదని  యర్ధాంగి  దూఱె  పతిని 

పద్య రచన -వార్ధక్యము

పరగ  ముసలి  తనము  వార్ధక్య మనబడు
కళ్ళు కనబడవుగ  కాళ్ళు  నడువ
లేవు  చెవులు విన బడవు  ముక్కు  కారును
బ్రదుకు కంటె  మేలు  మరణ  మార్య !
 

Monday, April 15, 2013

పద్య రచన - పిల్లల ప రీ క్షలు

పిల్లల  ప రీ క్ష  రోజులు
ఉల్లములం బదిల పఱచి  యురు  విషయములన్
చల్లగ  గూర్చుని  హాలున
మెల్లగ  నిక  వ్రాయు చుండ్రు  మెదలక  యుండన్ . 

సంసారము దుర్భరమ్ము సత్పురు షులకున్ .

సంసార  సాగ రంబును
కంసారికి  గష్ట మయ్యె  గడపగ  నపుడున్
హింసలు  జరుగుట  గతన న
సంసారము  దుర్భరమ్ము  సత్పురు షులకున్ . 

శ్రీ మా తృ స్తోత్రము -నేమాని వారు

మాతృ మూర్తిని గూరిచి మాలి కంబు
రచన జేసిన గురువర ! రామ జోగి !
సాటి యెవరయ్య ! నీ కిల ? సాటి లేరు
అందు కొనుమయ్య ! వందనా లందు కొనుము .

 

దత్త పది -అలక -పలక - మొలక -నలక (సంసార పరంగా )

ఆలు మగల మధ్య  యలక లుండిన మఱి
పలక రింత లుండ వసలు  నమ్ము
అలక దీ రి  నగవు మొలక లెత్తి న, లక
లక లు  తోడ నేక  మగుదు రు గద !.

దత్త పది -కంచి ,మధుర ,కాశి వానపల్లి

కంచి  కామాక్షి మిమ్ముల  గాచు గాత !
మధుర  మీ నాక్షి  కావుత ! మమ్ము  నెపుడు
కాశిని విశాల సతతము  కరుణ  జూ పు
వాన పల్లికి  పళ్ళాలు  వర ము లిచ్చు . 

Sunday, April 14, 2013

పద్య రచన -ఎండమావులు

వచ్చు ననుకొను  భాగము వ్రయ్య లయ్యి
ఎండమావిగ  మారెను నింత  లోన
ప్రాప్తి  లేదని  భావించి  పరమ  శివుని
వేడు కొనగను  బోవుదు   విభుని  దరికి . 

మరుని బూజించ మేలు మాతా మహికిన్ .

అరువది వత్సర మగుటన
భరమగు బంధముల  విడిచి  భవ హర  యనుచున్
శరణము గోరుచు  హరునికొ
మరుని  బూజించ  మేలు  మాతా  మహికిన్ . 

పరశు రామ ప్రీతి

భవన  సముదాయములు మఱి   ప్రక్క నుండు
పాక శాలలు  నంగడి  ప్రాంతములును
దగ్ధ మగుటను  నగ్నికి  ,దాని  నండ్రు
పరశు రాముని ప్రీ తియై  బరగె  ననుచు . 

కరెంటు బల్బు

వేయి కేండిలు గలిగిన  వెలుతు రుండు
బల్బు జూడగ  చేతికి బట్టు వడదు
కాంతి పుంజము  చెప్పలేనంత  యుండి
హాలు  మొత్తము  ధగధగ  లాడి పోవు .

Saturday, April 13, 2013

పద్య రచన - వా గ్భూష ణ ము

భూషణ మన్నిటి కంటెను
భూషణ మే వా క్కు నిలను భూరిగ నిచ్చున్
భూషణ మనబడు పరువము
వేషముల కు  తావు లేదు వివరించంగన్ .  

మారుతిని గొల్చు వారల మతులు చెడును

బుద్ధి  వికసించి  పదునగు  పూజ సేయ
మారుతిని ,  గొల్చు వారల మతులు  చెడును
దుష్ట  బుధ్ధుల  నెయ్యము  నిష్ట  పడుచు
దూ ర ముంచ వలయు గద  దుష్టు నెపుడు .
 

Friday, April 12, 2013

పద్య రచన -పుట్టి నిల్లు

పుట్టి నింటను మఱియును  మెట్టి నింట
మంచి  యనిపించు కొనునట్టి  మహిళ  జూడ
సంత  సంబున  జేతును  శతపు  నతులు
అట్టి  వారలన్ గనునుమా  యాంధ్ర  మాత . 

కరి చెర విడిపించుమ ని మకరి వేడె హరిన్

తరుణు డు  గోరెను  విష్ణుని
కరి  చెర  విడిపించుమ ని, మకరి  వేడె  హరిన్
నిరతము  సేవలు  జేయుదు
హరియించుచు  పాప చయము  హర! యీ ముక్తిన్ . 

తేజ నృత్యము (11-4-2013)

వేలకొలదిగ సభికులు  వేచి చూడ
మైకు  సెట్టులు  పని చేయ  నిక తము న న
ఎట్టకేలకు  మొదలిడి రె ట్లొ  యపుడు
డేన్సు  సారులు  బ్రార్ధించె  గణపతి నిల .

చిన్న పిల్లలు  నృత్యము సన్నయ మున
చేయు చుండుట  చూడగ  చేత  మలరె
కట్టు ,బొట్టులు  మఱి యును కదలికలును
చూడ ముచ్చట గొలిపెను జూపరులకు .

రామా లయమున  జరిగెను
ప్రేమగ మఱి  తేజ  డేన్సు  ప్రియ తము లెదుట న్
గోముగ  జేసెను  నృత్యము
భామలు  మఱి  మెచ్చు కొనుచు  భళిరా  యనగన్ .

మెలికలు  దిరుగుచు  నృత్యము
లలితముగా జేసె  నపుడు  లహరుల  వోలెన్
ఇలలో  నెవ్వరు  జేయని
తలపులుగా  ద్యోత మయ్యె దలిరుల  కపుడున్ .

ము ద్దు  ముద్దుగ బ్రాకుచు బోర్ల బడుచు
ఆడు కొను   నట్టి  బాలిక  యింత లోన
స్టేజి మీ దన  నృత్యము  చేయ గలుగు
స్థాయి దెచ్చు కొన గలుగు  స్థాయి  కెదిగె .

అమ్మా! తేజమ్మా ! మఱి
కొమ్మా ! దీ వన  శతములు కోటిగ  నిపుడున్
అమ్మాధవు నింగొలు చుచు
ఇమ్మనుమా ,చదువు  బాగ  నిమ్ముగ నీ కున్ .

చదువులు  జదువుము  బాగుగ
చదివినచో  నీ కు  వచ్చు చక్కటి  జాబున్
చదివించు నమ్మ నాన్నలు
ముదమును నే బొందు రపుడు  ముద్దుల  తేజా !

(రచన : పోచిరాజు  సుబ్బారావు )
 

పద్య రచన -సి నీ వాలి

చంద్ర  కళను  గూడి  చల్లగ  నుండియు
అమవస దరి  దాటి  యామని యయి
నియ మ నిష్ఠ  గల ,సి నీ వాలిగ  భువిని
మాత  యయ్యి  మాకు  మమత  బంచె . 

Thursday, April 11, 2013

పంచాంగ శ్రవణము

పంచాంగ   శ్రవణము నన
అంచితముగ దెలియు  మనకు నన్ని విషయముల్
లంచము లీ బని  లేదుగ
వంచనకును జోటు లేదు  వాస్తవ  మరయన్ . 

Wednesday, April 10, 2013

శ్రీ రామ నవమి (19-4-2013)

ఈ రోజు  నవమి  కావున
శ్రీ రాముల బెండ్లి జరిగె  సీతమ తోడన్
ఆ రాముడు  సంతసమున
భూ రిని నిక  నిచ్చు గాక ! భూ తిని  మనకున్ .

సీ తా రాములకు ను నిట
చేతో మోదంబు గలుగ  జేసిరి  పెండ్లిన్
ఏతావున ననగయనగ
ఈ తావునె , శాస్త్రి యింట   యిప్పుడె  జరిగెన్ .

రామ నామపు  భజనలు  రహిని జెలగ
వేద పండితుల్  సాక్షిగ  విపుల ముగను
మంత్ర రాజాలు   సభ లోన  మారు మ్రోగ
పెండ్లి జేసిరి  ఘనముగ విబుధ  వరులు .

మృదుల  మధుర  వాద్య మింపు గొలుప మది
పులక రించె , గగురు  బొడిచె  మేను
తేలిపోయె  మనసు  తెమ్మెర వోలెను
వాద్య  మహిమ బొగడ  వరుణి  దరమె ?

బంధు  జనములు  ముత్యాలు  బట్టి  యీ య
సీ త  మ ఱి యును  రాముడు  సిగ్గు  వడుచు
పోసి కొని రయ్య ! శిరము పై  ముచ్చట గను .
వేద మంత్రాల  మధ్యన  వేద  విదులు .

ఈ కళ్యాణము  జేసిన
మీ కును మఱి ముక్తి  గలుగ  ,మీ తో బాటున్
ఈ కళ్యాణము  జూసిన 
మాకును నిక  ముక్తి  నీ య మాత న డు గు దున్ .

రామునినే  ధ్యానించిన
రామునికే  పూజ సేయ  రామునె  దలచన్
రాముని  యారా ధించిన
రాముడె మ ఱి  యిచ్చు  మనకు  రాదగు  ముక్తిన్ .

రామా ! నీ కళ్యాణము
దామోదర  శాస్త్రి యింట  దడవు దడవునన్
ప్రేమాదరములు గలుగగ
మేమే కద ! చేయు చుంట  మీ కృ ప వలనన్

(మేమే అ నగా  ఉత్సవ  కమిటీ )

సీ తా రాముల  జూపులు
శీ త ల ముగ నుండి  మనకు  సేదను  దీర్చన్
ఏతావున  బ్రసరించిన
ఆ తావులు శుభము లగును నందము మీ ఱన్ .

అయ్యె  రాముని  కళ్యాణ మద్భుతముగ
పాన కంబును  వడపప్పు  పాయసంబు
బూరె  పులిహోర  బజ్జీలు  భూరి గాను
చేసి వెట్టిరి  నైవేద్య మీ శునకును

చూసితి  కల్యాణం బును
చేసితినే గడుపు  నిండ  సీ తమ  గరుణన్
వాసి గల భోజ నంబును
ఆసాయము  నచట నుండ  హాయిగ  నుండెన్ .
(రచన:  పోచిరాజు  సుబ్బారావు )కాదు సంతోష దాయక మీ దినమ్ము .

విజయ  వత్సర మీ యది  విజయ ముగను
ఏగు దెంచెను  నీ నాడ యింతు లార!
మదిని  కలత లొం  దకుడు నా  మాట  వమ్ము
కాదు,  సంతోష దాయక మీ దినమ్ము . 

విజయ నామ సంవత్సర శుభా కాంక్షలు

శంకరాభరణ  మిత్రులకు విజయ నామ  సంవత్సర శుభా కాంక్షలతో ...

విజయము  నిచ్చును  గావుత !
విజయపు  నా వత్సరమ్ము   వేవిధములుగాన్
అజరామరమగు  శుభములు
నిజముగ నిక  గలుగు గాక ! నిరతము మీ కున్ 

Tuesday, April 9, 2013

పూల రంగడు

పూల రంగని  వేషము బొలుపు  గాను
వేసి  మెప్పించ జనముల  వెఱగు  దోప
అక్కి నేని   కి  మాత్రమే  యర్హ తౌను
నిజము  బల్కితి  నమ్ముడు  ప్రజలు  లార!
 

పెండ్లి కాని పిల్ల

పెండ్లి కాని  పిల్ల  పెద్దమ్మ  దరి జేరి
కావు మమ్మ!  నన్ను  గరుణ తోడ
బంధు  జనము లయప  వాదులు   భరియించ
జాల నమ్మ!  యికను  శరణు నీ వె . 

పద్య రచన -అభయ హస్తము

విశ్వ గురుడగు  సాయిని  వేడు కొనిన
కనిక రించుచు  దప్పక  గరుణ తోడ
అభయ  హస్తము  జూపును  నాక్ష ణ మున
బాధ తొలగును నిజమను భవ ము  నాది . 

అనుజు డగ్రజు డాయె దానాదరమున

కవ ల  పిల్లలు  వారలు ,లవ కుశలు ల లోన
అనుజు డగ్రజు డాయె,  దానాదరమున
నేర్పె  వాల్మీకి  వారికి  నియతి తోడ
రామ  కధ  యను  బేరున  రామ  గాధ 

వావి వరుసలు

వావి వరుసలు జూడక  వలచు వాని
పశువు వోలెను  జమ గట్ట వలయు  సుమ్ము
వావి వరుసలు  ముఖ్యము  వధువు, వరుని
మేనరికముల పెండ్లిండ్లు  మాను టొప్పు 

పూజా ఫలము

పూజా ఫలము ను  దెలుపగ
పూజారియు  నేర్వ రాదు  పూజల వరకే
భాజను డా త డు  గద మఱి .
పూజల ఫల మిచ్చు వాడు పురు షో త్తముడే 

ఉగాది పచ్చడి

మామిడి  ముక్కలు  జె ఱ కును
గోముగ  మరి  చింత పండు  గుడ మును  నరటిన్
జామయు ను  వేప పూవును
భామా !కలుపవ ? యుగాది  పచ్చడి  కొరకున్ . 

ఉగాది

వచ్చును  నుగాది  పండుగ
అచ్చముగా  దెలుగు వారు  నానందిం పన్
పచ్చగ  నరువది  మారులు
నిచ్చలు  బొంగరము  వోలె  నియమము  తోడన్ . 

పాలు - నీ రు

పాలు  నీ రు కలియు  వడువున  గ్రామస్థు
లంద రొ కటి  గాను  నాట పాట
లందు  దేలి యాడ హాయిగ  మనుగడ
సాగు నయ్య ! నిజము , సామి ! వినుము . 

పద్య రచన -మయ సభ

మయుని  సభ జూడ  కనులార , మతిని జె ఱచు
మాయ  లోకము , వింతలు   మహిమ  లుండె
ఉన్న దంతయు  గనబడు  లేని వోలె
లేని దున్నట్లు  గనబడి  హీ న  బఱచు. 

Monday, April 8, 2013

కన్నను శూరుం డు ముజ్జగంబుల గలడే ?

మిన్నుడ నని  గర్వించుచు
పన్నుగ  మ ఱి  గంసు డపుడు  బాధలు  వెట్టెన్
ఎన్నగ  పన్నగ శయనుని
కన్నను  శూరుం డు  ముజ్జగంబుల  గలడే ?

టి బి యస్సు శర్మ

తోపెల్ల  వంశ  తిలకుడ!
చీ పుగ గొట్టేసి  యీ వు  సింహా సనమున్
మా పాలిట  గురు వైతివి
ఏపుణ్య ము జేసినామొ  యీ శున  కె ఱు కన్ .

చదివితిని  దెలుగు కోర్సును
చదివెను  మీ  నాన్న కూడ  చదువులు  నచట  న్
ముదమున  మోడే కు ఱ్ఱు న
అదియే  మా స్నే హ మునకు  నాధా ర మయ్యెన్ .

పద్మ నాభుని  పుత్రుడ ! బాల .... శర్మ !
మీ దు  మిక్కిలి  మిత్రుడు  నీ దు  తండ్రి
తండ్రి మించిన  కొడుకువు  తలచి  జూడ
అందు కొనుమయ్య ! ఆ శీ స్సు  లందు కొనుము .
 

Sunday, April 7, 2013

ఒంగోలున నుండు జనుల యోగ్యులు స్తుతికిన్

బంగారు  విలువ  గిత్తలు
ఒంగోలున  నుండు,  జనుల యోగ్యులు  స్తుతికిన్
  చెంగావి  రంగు  ధోవతి
నంగాంగము గప్పు గొనుచు  నార్భా టించన్ . 

పద్య రచన -జనన మరణములు

జననము  మరణము   లయ్యవి
అనయము  మఱి  వచ్చు చుండు  నాశా  జీ వీ !
మనమున  శంభుని  దలచిన
జననములే  యుండ  కపుడు  సాకల్య మె యౌన్ . 

Saturday, April 6, 2013

దేవ తా ర్చ న

దేవ తా ర్చ న  వేళాయె  దేవ ! రండి
కాళ్ళు సేతులు  ముఖమును గడుగు  కొనగ
నీ ళ్ళు  బెట్టితి బయటను  వెళ్ళి  యటకు
కడుగు కొని  రండి  వేగమె  కవి వరేణ్య !

దేవతా ర్చన జేతురు దేవత లట

దేవతా ర్చన  జేతురు  దేవత లట
అటలు  బలుకుట  భావ్యమ , యయ్య ! మీ కు ?
ఆక లుండదు మ ఱి యు దా  హమును గూడ
చిద్వి లాసులు వారలు  చిత్స్వ రూ ప !

కావ్య కన్యక

కావ్య కన్యక జూడగ నవ్య మల రి
భావ  లాలిత్య  సొగసులు  భద్ర ప ఱచి
కుందనపు బొమ్మ  బో లె డి  యంద మునన
కవి  వరుల లే  హృ దయాల గలత  బ ఱచె . 

కుంతి మగడు శూ లి కొడుకు వాలి

పాండు  రాజు ,షణ్ము ఖుండును, సుగ్రీ వు
గుం తి మగడు , శూ లి కొడుకు ,వాలి
వరుస జూడ  తెలియు వారల బంధము
లెఱు గు డ య్య లార ! యెవరొ  వారు ? 

పద్య రచన -ఆరోగ్యమే మహా భాగ్యము

ఆరోగ్యమె  మహ భాగ్యము
ఆరోగ్యము  గలుగు వాడు  హాయిగ  నుండున్
ఆరోగ్య వంతు యొద్దకు
ఏరోగము  రాదు సామి ! యీ శుని  కృ ప చేన్ . 

Thursday, April 4, 2013

తగినది గాదయ్య వేద ధర్మము మనకున్

పగతో గూడిన  బలుకుల ?
తగినది  గాదయ్య  వేద ధర్మము  మనకున్
తగినది  జెప్పగ  నార్యుల
వగతో మ ఱి  వేడుకొనుదు  వారిని  నిపుడే . 

భువన విజయము

భువన వి జయ మను  సభ యది
కవివరు లెనమండ్రు  తోడ  గనిపించెనుగా
అవనీ శుడు  రాయలు మ ఱి
నవులను  జిందించు   చుండె  నవ వరుని  వలెన్ . 

ధన్య వాదము లు

ధన్య వాదము ల ను మహత్తర  పదమ్ము
కంది  శంకరు గురువుల  కలము  నుం డి
శంకరాభర ణ మునన  జదువ దగును
నిండు  మనమున  పలుకున  నిశము వారు .
 

విద్యుల్ల త

విద్యుల్ల తలను  జూడుము
ఖద్యోతము  నందు  మిగుల కాంతుల  తోడన్
ఆద్యంతము లొక  విధముగ
విద్యున్మా లయు  నుబోలె  వీ క్షిం చం గాన్ . 

తారా బలము

తారా బలములు  సూచుట
మారమ్మయు  నేర్చు కొనెను  మనుగడ కొఱకున్
తారలు  తొమ్మిది ,యందున
తారయ మఱి నైధనంబు  త్యాజ్యము  సుమ్మీ . 

Wednesday, April 3, 2013

విజయ నామ సంవత్సరము

విజయ  వత్సరమా ! నీ కు  వేయి నతులు
స్వాగ తంబును  బలుకుదు  సాదరముగ
రమ్ము  మా యమ్మ ! విజయమ్మ ! రయము  వచ్చి
మమ్ము  గరుణించి సంపద లిమ్ము  మాకు .

విజయ యను పేరు  గలుగుచు
విజయంబుగ రమ్ము  భువికి  విజయము  జేయన్
విజయంబులె  నీ ధ్యేయము
విజయా సంవత్సరంబ ! వేతును  నీ కై .
 

పద్య రచన -తేనె పూసిన కత్తి

తేనె పూసిన  కత్తి యే  తెచ్చు ముప్పు
ఏల  యంటివ ? విను మఱి  యీ శ ! నీవు
దేశ నాయకు లందఱు  దీ పి  బలికి
మోస గింతురు  బ్రజలను  మొండి  గాను . 

Tuesday, April 2, 2013

పద్య రచన --కాకి కబురు

నీ దు తీ రిక  జూసుకు  నెమ్మదిగను
కాకి చేతను  బంపుము  కబురు  నాకు
వేగ  వత్తును  నిచటకు  విందు  జేయ
సంది  యంబులు  విడువుమ , యిందు  వదన !

పాడు పనుల జేయు వాడు ఘనుడు

దుష్ట  బుద్ధి  గలుగు  ధూర్తుడు  జగతిని
పాడు  పనుల జేయు ,  వాడు  ఘనుడు
సాటి  వాని బాధ సరి జేయు పురుషుడు
మానవులకు సేవ  మాధ వుసరి . 

Monday, April 1, 2013

పద్య రచన - తారక మంత్రము

తారక  మంత్రపు  పఠనము
పారము గూర్చును భవా ర్ణ వ నిమగ్నుల కా
పారా యణ మహి  మంబది
పారాయణ జేయు మార్య ! ప్రతి దిన మందున్ .