Thursday, May 30, 2013

కలుగు సత్త్వ నిరతి చేత కార్య సిద్ధి

కలుగు  సత్త్వ నిరతి చేత  కార్య  సిద్ధి
కాక , ప్రజల కవసరముల్  గలుగు నట్టి
జయము ,సుఖమును మఱియును  సంత సంబు
లన్ని   యొన గూర్చు సత్త్వమ  యార్య ! నిజము . 

పద్య రచన -పొగ త్రాగె డు వాడు

చూడ చిత్ర మందు నొకడు  చుట్ట ద్రాగు
చుండె  నక్కట ! పొ గలను  జూడు నింగి
కెటుల  రయ్యన నల్లగ  నేగు చుండె ?
చుట్ట ద్రాగిన  కేన్సరు  చుట్టు  కొనును . 

Wednesday, May 29, 2013

పద్య రచన -మిత్రుడు

మిత్రుడను పదమున కర్ధ మే రవియు  మ
ఱి యును  జెలికాడు నిరువురు  చేయు దురు ప్ర
జలకు మేలును ,హితమును  జక్క గాను
మంచి మిత్రుని బొందుడు  నంచితముగ .
 

Tuesday, May 28, 2013

పద్య రచన -వీ ధి యరుగు

వీధి యరుగున గూర్చుండి  వివరముగను
తీర్పు లిత్తురు  పెద్దలు తీర్పు లెన్నొ
కొన్ని తీర్పులు  మంచిగ  కొన్ని వెగటు
కలిగి యుండును  నేరపు   సరళి బట్టి 

తమ్ములు (ప్రతి పాదము మొదటన ) భారతార్ధము

తమ్ములు  నలుగురు  కడును
త్త మ్ములు  గాదె మ ఱి ని  యల ధర్ముజు నకునున్
తమ్ములు  గడు  బలవంతులు
తమ్ములు నా వారె  ధరణి  దగుదురు  మిగులన్ . 

కామి తార్ధమ్ము లొసగదు కనక దుర్గ

కామి తార్ధమ్ము  లొసగదు  కనక దుర్గ
నిజము  కాదది , యా తల్లి  నిజము గాను
ఎవరు కోరిన  వారికి నిడును సుఖము
ఎల్ల వేళల  బూజించ  నుల్ల మలర 

పద్య రచన -చంద్రమతి మాంగళ్య ము

తనదు పతి జూడ సూత్రము తల్ల డిల్లె
కాటి కాపరి యయ్యెను  ఖర్మ కొలది
అనుచు  చంద్రమ తిమిగుల తనదు బాధ
విశద బఱచెను  భర్తకు వివర ముగను . 

Sunday, May 26, 2013

పద్య రచన -నస్యము

ముక్కు  పొ డుమును బీ ల్చగ  ముక్కు నుండి
కారు చుండును  నల్లటి  మురుగు  ద్రవము
చీ ద రింతురు  జనములు చీ కొటుదురు
పీ ల్చ బోకుడు  నస్యము మీ ర లెపుడు . 

రోహిణి కార్తె

కార్తె లన్నిటి గంటెను కష్ట మైన
కార్తె కాదె యీ రోహిణి కార్తె యరయ
రోళ్ళు రోకళ్ళు  మఱి యును  రాళ్ళు కూడ
బ్రద్ద లగుచుండు  నెం డకు  బ్రస్ఫు టముగ .

Saturday, May 25, 2013

పద్య రచన -ఛాందసుడు

ఛంద మనగను  నర్ధము నందు రార్య !
వేద మనుచును , చదివియా  వేదసార
మితరుల కెవడు  చెప్పునో  నతని  నండ్రు
ఛాం ద సుండని  పుడమిని శాస్త్రి గారు .

వానర సైన్యమ్మె రక్ష పంక్తి ముఖునకున్

మానవ రూపుడు కతనన
వానర  సైన్యమ్మె  రక్ష, పంక్తి ముఖునకున్
దానవ గణములె  సేనలు
మానవులకు దా నవులకు మఱి యౌ  పోరున్

Friday, May 24, 2013

పద్య రచన -గోంగూర

రుబ్బి  గోంగూర యాకులు  రోటి యందు
ఎండు  మిర్చిని తాళింపు  మెండు గాను
పెట్టి కలుపగ పచ్చడి  యట్టు లయ్యి
తినుట మొదలిడ  నోరూరి  తిందు మెపుడు .
 

Thursday, May 23, 2013

ముని హంతకునకు శరణన బుణ్యము గలుగున్

అనయము  దుర్గతి  గలుగును
ముని హంతకునకు,  శరణన బుణ్యము గలుగున్
అనిశము సాయిని  నార్తిని
వినతులు నుం జేసికొనిన వీ డును పీ డ ల్ .

ఆంజనేయ దీ క్ష (పద్య రచన )

దీక్ష లన్నిటి గంటె ను దీక్ష యరయ
ఆంజనేయుని  దీ క్షయే  యభయ మిచ్చు
వాయువేగమునన మన  పనులు  జరుగు
సంశ యంబులు  జెందక  శరణు  వేడు .

చెట్టు మీది కాకి చుట్ట మెకద .

చెట్టు మీది  కాకి బిట్టున గావు కా
వనగ  చుట్ట మగుదు  ననుచు వచ్చు
బంధు వొకడు  మఱి ని  బరికించ  దీనిని
చెట్టు  మీది  కాకి  చుట్ట మెకద .

పద్య రచన -నాది -మనది

నాది నాది యనుచు  నగుబాటు  నొందకు
నాది యనగ బుడమి  నేది లేదు
నాది మనది యనగ నేదియు లేదుగా
ఉన్న దంతయు మఱి  యురగ  ప్రభుదె .

గురువులు శంకరయ్య గారికి

భర్త   యైతిరి  యోసామి ! భార్య కునకు
తండ్రి యైతిరి  మీరలు దనయులకును
తాత యైతిరి మనుమల  దరము నకిల
గురువు లైతిరి  మఱి మాకు  గొనుడు  నతు లు .

Sunday, May 19, 2013

మమతాను రాగములు

మమతయు  ననురాగంబును
సుమతులకే యుండు  భువిని  సూ నృ త మిదియే
విమలములగు నా రెండును
కుమతుల యెడ మృగ్యమయ్యి   కోపము హెచ్చున్ . 

రాయలు రచియించె నంట రామాయణ మున్

ఆ యీ  గోదా గాధను
రాయలు  రచియించె నంట , రామాయణ మున్
పాయక  వా ల్మీ కి యె గా
ఆయా  కవులను  బుడమిని  నారాధింతున్ 

పద్య రచన -బైరాగి

బైరాగి యనగ బిలుతురు
వైరాగ్యము బూనుచుండు వారును బుడమిన్
బైరాగులలో  మోసపు
బైరాగులు గూడ గలరు భద్రము మీ రల్ . 

Saturday, May 18, 2013

వేసవిలో శీ త వాయువే వీ చు గదా !

కాసార మెండి పోయెను
వేసవిలో, శీ త వాయువే వీ చు గదా !
ఆసా యంత్రము మాకిట
మూ సీ నది యుండు కతన  ముచ్చట గొలుపన్ . 

పద్య రచన -కొండ పల్లి బొమ్మ

కొండపల్లి బొమ్మ కోటి కాంతులు గల్గి
ప్రాణ ముండు దాని వలె ను  నుండె
చూడ చిత్ర మదియ  చూడ్కుల కిం పయి
అంద గించి మదిని  హర్ష మొదవె .
 

Thursday, May 16, 2013

పద్య రచన - వర విక్రయము

పూ ర్వ  కాలంబు నందున   పురుషు లరయ
కొలది   మందిగ  నుండుట  కువల  యమున
ఆడ పిల్లలు   కట్నము నంద  జేయ
నండ్రు  వరవిక్ర యంబని   నార్యు  ల య్య !

తొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్

వియ్యాల  వారి   రాకను 
 చయ్యన  మఱి  వినిన గీ త  చకచక  వంటన్
చెయ్యగ దొందర  బడుచును
తొయ్యలి తాలిం  పున  నిడె  దుల సీ  దళముల్ . 

వక్త్రంబుల్ బది గలిగిన వానికి జేజే .

వక్త్రము  నొకటియ  వానికి
వక్త్రము  మఱి  మూడు గలుగు వానికి  మఱియున్
వక్త్రము  నాలుగు వానికి
వక్త్రంబుల్ బది గలిగిన వానికి  జేజే . 

Wednesday, May 15, 2013

పద్య రచన -రాదు --పోదు

ప్రాప్తి లేనిది  యిసుమంత  రాదు మనకు
పోదు  మన నుండి , చేసిన పుణ్య మెపుడు
పాప పుణ్యము లాయవి  పరిగ ణిం చ
పాప శాతము  బెరుగును  పాపులకును . 

Tuesday, May 14, 2013

పద్య రచన -గృ హ లక్ష్మి

ఇంటికి   వెలుగు  నిల్లా లె  యెప్పు  డైన
 అట్టి  వెలుగునె  గృహ లక్ష్మి  యండ్రు   బుధులు
ఏక దారిని  నడిపించి  యింటి  నామె
స్వర్గ  సుఖముల  నొన  గూ ర్చు  సభ్యులకును . 

కుందేలుకు జూడ జూడ గొమ్ములు రెండే .

కుందేలును  జూడ   సరిగ  ను
 ముందర భాగంబు నుండు  బొ డి పులు  తోడన్
అందురు  వానిని  కొందఱు
కుందేలుకు  జూడ జూడ   గొమ్ములు  రెండే . 

శుభాకాంక్షలు

గురుతుల్యులు    శ్రీ నేమాని వారి   పెళ్లి రోజు    సందర్భముగా ...


సకల శుభములు  గలిగించు  శంకరుండు
ఆయు రారోగ్య   సంపద    లన్ని  యిచ్చి
కంటికిని  రెప్ప  యట్లయి  కాచు గాత !
తనర  గురువులు  నేమాని  దంపతులను .
 

ఆలింగన సుఖము దక్కునా ? మిస్సన్నా !

ఆలియె  యిచ్చును  గదమఱి
ఆలింగన   సుఖము,  దక్కునా ? మిస్సన్నా !
పాలకుల కిచ్చు  ధనములు
 జాల రులకు , సరిగ లేని   జనులకు ధర లోన్ . 

పద్య రచన -పాద లేపనము

సిద్ధుడు  లేపన మీ యగ
బుధ్ధిగ  నా లేపనంబు  పులిమెను  బ్రవరున్
ముద్దగ  దన పాదములకు
తద్దయు  మఱి  చేరె నతడు  తపసుల  వనమున్ . 

Monday, May 13, 2013

పద్య రచన -ఉక్క పోత

సూర్య కిరణాలు  నేరుగ  సోక కతన
ఉక్కపోతలు  మొదలాయె  మిక్కుటముగ
అంతకంతకు  వడగాల్పు లధిక  మయ్యి
శోష వచ్చెను  నొ డలంత  శుష్క  మయ్యె . 

Sunday, May 12, 2013

పూతరేకులు

పూతరేకులు  సేసి మా పొరుగు వారు
అమ్ము చుందురు  వారపు  టం గడులకు
శుచిగ నుండునాస్వాదిం ప  రుచిగ నుండు
తీ య తీ యగ వానిని నిని  దినగ  రం డు 

పాద పద్మములు

పద్మముల బోలు జక్కని  పాద యుగము
నళిన నేత్రుని మురిపించు నవ్వు మోము
అభయ హస్తము జూపించు నద్రి  సుతకు
ప్రణతు లిడుదును  శ్రీ పాద పద్మములకు . 

Saturday, May 11, 2013

సింహమునకు గరికి జెలిమి కుదిరె

ఆశ్రమంబున  గల  యడవి  జంతువులగు
సింహమునకు గరికి  జెలిమి  కుదిరె
కర్కశత్వమునకు మారు  పేరైనవి
కూడ శాంత గుణము కూడి  యుండు . 

Friday, May 10, 2013

రామ హృదయమ్ము పొంగెను రావణు గన

అవని సుత వార్త దెలియగ హనుమ వలన
రామ హృదయమ్ము పొంగెను,  రావణు గన
వాని  మరణము నూహించి  పడతి యనగ
పొంగి పొరలెను  దుఃఖము పుర జనులకు . 

Thursday, May 9, 2013

ఆబాల గోపాలము

శ్రీ ని వాసుని  బెండ్లి కి  సిరుల తోడ
తరలి వచ్చిరి తండోప తం డములుగ
బాలు రాదిగా గలయట్టి ప్రజలు నటకు
లోకనాధుని  పెండ్లియె  లోక రక్ష 

సద్ఘో ష్టి

సద్ఘో ష్టి  తెలివి నిచ్చును
సద్ఘోష్టియె  మనల జేయు సత్పు రు షుం గాన్
సద్గోష్టి  విలువ యైనది
 సద్ఘోష్టిని  మాన కెపుడు జరుపుము  నెపుడున్ 

ఆకాశ రామన్న

అన్నలకును మిన్న  నాకాశ రామన్న
అతని పేర వచ్చు  నప్పు డపుడు
ఉత్తరములు గ్రామ పెద్దలకు  మఱి
వలయు  సరకు లిండు  వంట కొఱకు . 

నైవేద్యము

   శ్రీ వేంకటేశ   ప్రభునకు
 నైవేద్యము జేతు రిపుడు నవనవ లడ్డుల్
ఆ విధమునె  పులిహోరను
ఆ విభునకు నిడుదు రార్య ! యాయా  వేళన్ 

రణము గాంచి వగచె రామ మూర్తి

భూమి శిస్తు కొఱకు  భూపతి పంపు ,క
రణము గాంచి వగచె రామ మూర్తి
శిస్తు  కట్ట సొమ్ము మస్తుగ దన యొద్ద
లేక పోవు  కతన  మూకి  యయ్యె 

పద్య రచన -మేక వన్నె పులులు

మేక వన్నె పులులు మేడపాడు చివర
దట్టమైన నడవి దరిన  నుండె
మిగుల శాంతములయి  మేక పాల వలెను
చిక్క నైన  పాలు  చేపి  యిచ్చు . 

Wednesday, May 8, 2013

ఉంగరంబున జిరు నవ్వు లొలికె బళి ర

రాము  ముఖమును   గనులార  రామ గాంచి
ఉంగరంబున ,  జిరు నవ్వు  లొలికె ,  బళి ర
వారి దాంపత్య  మాదర్శ    మేరికైన
వందనమ్ములు   సీ తమ్మ !  నతు లు  రామ !

పద్య రచన - రచ్చబండ

రచ్చ బండల  బేరున  రహి జెలంగి
 తీ ర్పు  నిచ్చును   నచ్చట  తీ యగాను
శత్రు భావంబు  లన్నియు   శమయ  జేసి
 శాంతి   సౌఖ్యము  లొన గూ  ర్చు  సర్వులకును . 

సా యి లీ లలు

సాయి లీలల నెన్నగ శక్య మేన ?
వింత లెన్నియొ  చేసెను     వింత గాను
 ప్లేగు  మొద లుగా  గలయట్టి    రోగములను
నయము  చేసెను    హస్తాన  రయము తోడ . 

Tuesday, May 7, 2013

వదినను బెండ్లాడెను బుధ వర్యులు మెచ్చన్

మదినిండ నాద రించుము
వదినను  బెండ్లాడెను బుధ వర్యులు  మెచ్చన్
ముదమున  లక్ష్మిని  గోరుచు
చదువులలో  మేటి యైన  చావలి  శివుడున్ . 

అణో రణీయాన్ మహతో మహీ యాన్

అణువున కణువై  చిన్నగ నలరు  చుండి
అండ బ్రహ్మాండ మందున  నధిక  మయ్యి
భక్త  కోటిని  గావగ  భద్ర ముగను
కొండ పైనున్న  వెంకన్న ! కోటి  నతులు . 

పడుగు -పేక

పడుగు -పేక లు  మిళిత మౌ  పగిది  ధరను
మనుజు  లందఱు  నొకటిగ  మారి మ ఱి ని
అన్నదమ్ముల  బోలిక  ననుసరించి
మెలగ వలయును  మనసార  మెప్పు తోడ . 

ఆట పాటలు

ఆట పాటల యందున  నాఱి దే ఱి
చదువు  సంధ్యల  యందును శ్ర ద్ద జూపు
బాల  బాలికలే  దేశ  భవిత  నార్య !
రక్ష సేయగ  నేర్తురు  ముఖ్య ముగను . 

Monday, May 6, 2013

దత్త పది = కంది -పెసర -సెనగ -మినుము (పా ర్వతీ కళ్యాణము గురించి )

గిరిజ  పెండ్లి   నాడు   ధరణీశు యింటన
కంది   పెసర  మొదలు  గాగ    మఱియు
సెనగ  మినుము తోడ  చేసి న  వేడివి
 పలు  రకముల  పిండి  వంట లమరె .
 

పద్య రచన -హిత మితోక్తులు

మితముగ  బలుకగ  నెపుడును
ఇతవును   మఱి  గలుగ జేయు  నెవరికి నైనన్
సతతము  రక్షణ  పొందును
హితముగ  మాట్లాడు  చుండి  హితమును  జేయన్ . 

Sunday, May 5, 2013

సంగీ త సాహిత్యములు

సంగీ త ము  సాహిత్యము
లంగములే  భాష కవియ  యాలోచించన్
గంగా తరగల  బోలుచు
అంగము బులకిం ప జేయు   నహర హము  భువిన్ . 

Saturday, May 4, 2013

ఆది మధ్యాంతములు

ఆది మధ్యాంత   రహితు డా  యాది దేవు
డాయు   రారోగ్య సంపద లన్ని  యిచ్చి
  కంటికిని  రెప్ప   యట్లయి  కాచు  గా  త
బ్లాగు  సోదరు  లందరి  భవితములను

కంటికి రెప్ప

కంటికి  రెప్పయు  వడువున
  పంటికి  మరి   పెదవి యుండి    పరి  రక్షించున్
  మింటికి  శూ న్యము  నరయగ
చంటికి  నిక  చెప్పగలరు  సరియగు   దానిన్ .


 

శూన్యము

శూన్యము గగనము నరయగ
 శూన్య మ  యీ జగము  కూడ  శూన్యము  బ్రదుకుల్
శూన్యము  బంధువు  లంద ఱు
శూ న్యము  యీ  మైత్రి  యికను  శూ న్యము  ప్రేమల్ . 

నెల తప్పిన రాజు గాంచి నెల రాజ నియెన్

నెలతలు  సెప్పిరి   యామెకు
నెల తప్పిన రాజు   గాంచి ,  నెల రాజ నియెన్
ఇల  గనుదువీవు  పాపను
తెలతెల్లగ  బుట్టు  నామె   దీటుగ జంద్రున్
--
గమనిక ; రాజు అనగా  రాజ్య లక్ష్మి 
            ముద్దుగా  రాజు
           నెలరాజు  అనగా    చంద్ర  మోహన్
గా  అన్వయించు కొనవలసినది గా  మనవి .
------

ఇలలో  బుట్టును  రాణికి
నెల తప్పిన   రాజు  గాంచి నెల రాజనియెన్
కుల  దీ పకు డు ద యింపగ
కులము  వెలయు మీ దు  కీ ర్తి  కువలయ  మెల్లన్ . 

Friday, May 3, 2013

కోడి గుడ్డు

కోడి గుడ్డు  జూడ  కోలగ  నుండును
పగుల గొట్ట గా ఱు  పచ్చ, తెల్ల
సొనలు  వాటి త్రాగ  మేను  సొగసు దేరు
బలము కూడ  కలుగు  బాలుర కును . 

మాతా పితలు

వందనము  మాతృ  మూర్తికి
వందనమో పితృ దేవ! వందన మయ్యా !
వందనము  గురువు గారికి
వందన మిక  సర్వ లోక పాలకులారా !

పద్య రచన - ఉపవాసము

ఉపవాస మనగ నర్ధము
ఉపవాసము చేయ గా  దె ,  యోపిక  కొలదిన్
ఉపవాసము  దైవమునకు
ఉపకార మె  యదియ ప్ర  జకు   నూ రికి కూ డన్ . 

ఇద్దరు సతు లున్న వాడె హితము గడించున్

వద్దుర    బాబని  నేడ్చును
 ఇద్దరు  సతు  లున్న వాడె,   హితము   గడించున్
తద్దయు  మేలొన రించిన
 తద్దినమే  మంచి    రోజు    తలపగ  మనకున్. 

చలన చిత్రము లు

చలన చిత్రము లనునవి సర్వులకును
సంతసంబును  గలిగించు  నెంత యోను
చూడ గోరిన మంచివి  చూసి బాల !
అనుసరించిన  సుఖమును  హాయి  గలుగు .