Saturday, June 29, 2013

పద్య రచన -అదృష్టము

దృ ష్టము  గానిది  పుడమిని
ఇష్టము గా జూడ లేము  సాకార ముగన్
శిష్టులు  వక్కాణిం తురు
దృష్టము మఱి  కాని దంత  దృ ష్ట మ యగునౌ 

Friday, June 28, 2013

కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రిం గెన్

పందెం బు  గెలిచె  కూర్మము
కుందేలును , కోడిపిల్ల  గుటుకున  మ్రిం గెన్
అందందున  నడయాడుచు
విందుగ నొక వానపాము వీపున బొడిచీ . 

Thursday, June 27, 2013

పనస పండు

పనస పండు  వంటి  బాలుని గనెనట
యా యశోద  చూత మమ్మ  రండి
కృష్ణు బేర బఱగి  క్రూ రుల  వరుసగా
సంహ రించు వలదు  సంది యంబు .
 

మాయ లేడి

రాక్షసుండగు మారీచు డా క్షణ మున
మాయ లేడిగ రూపంబు  మహిని దాల్చి
అడవి యందున  దిరుగాడు  నయ్యద నున
సీత రాముని  దెమ్మనె  శీ ఘ్ర ముగను

 

Wednesday, June 26, 2013

కుండలోన బెట్టె గువలయమును

సాయి  పూజ కొఱకు  చామంతి పూలను
దెచ్చి , వాడకుండ  పచ్చ   కొఱకు
కుండలోన బెట్టె  గువలయమును మఱి
వాడ  కుండ నుండు  వార మైన .

పచ్చ  కొఱకు అనగా పసుపు పచ్చ దనము   కొఱకు
గా అన్వయించుకొన ప్రార్ధన .

పద్య రచన -దిన పత్రికలు

ప్రతి దినంబును   వచ్చు నీ  పత్రికలనె
య రయ దిన పత్రిక లనుచు  నండ్రు జనులు
ప్రతి దినంబును  నుదయాన  పఠ న మిడిన
పూర్తి  వార్తలు  దెలియును  భువిని  జరుగు 

Tuesday, June 25, 2013

కల గాంచితి మోద మలర గను మూ యకయే

అలవోకగ  నిద్రించగ
పలురకముల గలలు  వచ్చి  భయమును  గొల్పన్
మెలకువ రాగా  మరలను
కల గాంచితి  మోద  మలర గను  మూ యకయే 

పద్య రచన -లలిత కళలు

లలిత కళలు  మిగుల లలితము గానుండి
మనసు దోచు కొనుచు  మరులు  గొలుపు
మమత కలుగ జేసి  మఱి మఱి  గన జేయు
కళలు లోన మిన్న కళలు  నమ్ము 

Monday, June 24, 2013

కమ్మలు మోకాళ్ళు దాకి ఘులు ఘలు మనియెన్

అమ్మలు  గ్రొత్తవి  కొనగా
కమ్మలు , నవి వదులు నయ్యి కదులుచు మిగులన్
నిమ్ముగ  పైకిని  క్రిందకు
కమ్మలు  మోకాళ్ళు  దాకి ఘులు ఘలు  మనియెన్ 

పద్య రచన -గంగో ధ్ధృతి

మంద గమనము  గలదిగ  మహిత కెక్కి
ఉధ్ధృ తం బయి  మనుజుల  యుసురు దీ సె
ఏమి పాపము జేసిరో  యిలను  వారు
గంగ పాలైరి  యకట  ముక్కంటి యెదుట

పుట్టు  మనుజుడు  తప్పక గిట్టు  నిలను
ప్రభుని  కేదారు  సన్నిధి  ప్రాప్తి  కొఱకు
ఏమి  పుణ్యము  జేసిరో  యేమొ  గాని
మోక్ష మందిరి సులువుగ ముదము  గలుగ .

ముక్కంటి  యెదుట  మడియుట
జ క్కంగా  బొందె వారు  సాయుజ్యం బున్
 అక్కొం డల  నడుమన యా
ముక్కంటియె  చేర్చుకొనెను  ముదమున  వారిన్ .
 

Monday, June 17, 2013

తిప్పలు బెట్టెడు సతియె పతి వ్రత గాదే !

అప్పడ తి  వీర నారిగ
చప్పున సమరంబు  దూకి  శరములు  వడిగా
ద్రిప్పుచు  దుష్టుని నరకుని
తిప్పలు బెట్టెడు సతియె పతి వ్రత  గాదే !

పద్య రచన -శాపము

శాపము లిత్తురు  పడతులు
శాపము లవి గ్రుచ్చు కొనును  చాపముల వలెన్
పాపములు  సేయ కునికిని
శాపములను బాయ వచ్చు  శ్రవణ  కుమారా !

పానకములోని పుడుకలు పాండు సుతులు

పానకములోని పుడుకలు పాండు సుతులు
అంత తేలిక యాయెరా ? యార్య ! మీ కు
పాండు సుతులను  దీ టు వా రొండు లేరు
వారు వారికే సాటిల  పచ్చి  నిజము . 

Sunday, June 16, 2013

పద్యరచన -తేలు

తేలు  జూడగ  భయమును గొలుపు చుండె
తోక యొద్దన  నున్నట్టి  తొడిమ వంటి
సూది తోడన గ్రుచ్చిన  చుర చుర మని
విషము నిండుచు  నొడ లంత  విగతు  డగును 

Saturday, June 15, 2013

ముని గని దనుజాం గన వలపుల వల విసిరెన్ .

చనుచు న్న డవుల వెంబడి
తనులత యా చుప్పనాతి దరహాసమునన్
వినయము గలిగిన యారా
ముని గని దనుజాం గన  వలపుల వల విసిరెన్ . 

పద్య రచన -తాత -మనుమలు

తాత యందలి ప్రేమచే   తనరి మిగుల
ముద్దు లాడుచు నుండెను  మోము నిండ
చూడ  ముద్దును  గొల్పును  జూ పరులకు
తాత  మనుమల  యనురాగ   మెంత టి ది యొ . 

Friday, June 14, 2013

పద్య రచన -దాగిలి మూతలు

ఆడకు దాగిలి మూతలు
ఆడకు మా  దొంగ యాట హాస్యము కొఱకున్
ఆడినచో లో కువగుదు
వాడాలని యుండు నపుడు  నమ్మను  నడుగూ . 

పాపముల ద్రోయు గంగ పాపముల జేసె

పాపముల ద్రోయు గంగ  పాపముల జేసె
గంగ యిచ్చును బుణ్యము  గాదు పాప
మార్య ! యిత్తరి  మీ రట్లనగ రాదు
మిమ్ము  గోరుదు నా మాట  మిధ్య గాదు 

Thursday, June 13, 2013

పద్య రచన -తీ ర్ధ యాత్రలు

తీర్ధయాత్రలు  సేయుచు ద ఱచు గాను
స్నాన మాడిన  నందలి  సరసు లందు
పుణ్య మబ్బును  మఱియును  పాప చయము
తొలగు వెనువెంట  నిజమిది  తోయజాక్షి !

Wednesday, June 12, 2013

తుని లోపల లోక మెల్ల తూగుచు నుండున్

అనయము వీ డక  భగవం
తుని లోపల లోక మెల్ల తూగుచు నుండున్
ఇనుడిచ్చు  మనకు నిరతము
పనుపున యా దేవదేవు పగటిని  వెలుగున్ 

పద్య రచన -వీ ణ -డప్పు

వీ ణ  డప్పులు  ధరియించి  వీధి వీధి
తిరిగి  వాయించు గొనుచును దిరిపె మడిగి
బ్రదుకు చున్నట్టి  వారిని నాడు కొనగ
దాత లెవరైన రండిటు  దయను దలచి 

దిన దిన గండము

దిన దిన గండపు  బ్రదుకుల
మనలేమయ  యింక మేము  మార్గము  జెపుమా !
తనువిది  కృ శించి  బోయెను
వినయముగా గోరుచుంటి వేంకట రమణా !

కోరికలు

కోరికలనునవి దప్పవు
కోరిక లవి మించ రాదు  కువలయ నేత్రా !
కోరికలు  శృతిని  మించిన
వారుగ నిల బోదు రెపుడు  పతనము  వైపున్ 

Tuesday, June 11, 2013

పద్య రచన -బడిపిల్లలు

బాల బాలిక లందఱు  పాఠశాల
కేగు దృశ్యము  జూడగ  నిష్ట  మయ్యె
యూని ఫారము ధరియించి  మేను నిండ
ఒక్క రీ తిని  నుండిరి యొక్క రొకరు 

Monday, June 10, 2013

ధర్మ సుతునకు బాంచాలి తనయ గాదె

ఆలి యగునార్య ! నిజముగ  యమసుతుడగు
ధర్మ సుతునకు  బాంచాలి , తనయ గాదె
కుంతి భోజున కీ యమ  కుంతి  దేవి
ధర్మజాదులు మిగులను  ధర్మ విదులు 

పద్య రచన - వరినాట్లు

చిత్ర మయ్యది జూడుడు  చిత్ర మందు
నాటు చుండిరి  వరిపైరు  నడుము వంచి
అన్నదాతలు  వీ రలె  యంద రకును
చూడ చక్కటి  దృశ్యము  చూపరులకు 

Sunday, June 9, 2013

నరసింహుని ప్రి య సుతుండు నారాయణుడే

అరవిందు డనెడు వాడే
నరసింహుని ప్రి య సుతుండు,  నారాయణుడే
నరులను బోషించు భువిని
నరనారాయణు లిరువురు  నందుని  కాప్తుల్
 

పద్య రచన -పావ నాంగి

పడుచు  పిల్లదె  జూడుడు  పావనాంగి
కోడి పెట్టలు నొక వైపు  నడచు చుండ
పాత్ర  నొకదాని  బట్టుకు  పర వశించి
చేయు చుండెను జింతన  సీత  గూ ర్చి . 

చదువులు

చదువులు చదువులు చదువులు
చదువులు మఱి గష్ట మయ్యె  సామాన్యు లకున్
చదువుల ఖర్చులు  పెరిగెను
చదువుల  తల్లీ ! కరుణను  సాకుము  మమ్మున్ 

పడక కుర్చీ

భోజ నంబును  దృ ప్తిగ  బూ ర్తి జేసి
పడక కుర్చిలో  కూర్చుని  పట్టి నమలి
వార పత్రిక జదువుచు వరుస  నూగి
నిద్ర పొమ్మిక మఱి కమ్మ  ని కల గనుచు 

రాముడు శూ ర్పణ ఖ నపుడు రహి బెండ్లాడెన్

పొమ్మని గట్టిగ జెప్పెను
రాముడు శూ ర్పణ ఖ నపుడు, రహి బెండ్లాడెన్
అమ్మగు నాయిల జాతను
ఇమ్ముగ సంతోష మొప్ప నీశుడు  రామున్ 

శ్రావణ మేఘాలు

శ్రావణ మేఘము  లయ్యవి
రావముతో  బోవుచుండె రక్కసి  వలెనున్
అవ్వా ! చూడుము వాటిని
ఎవ్వారిని  బీద జేయ నేగుచు నుండెన్ ?

Saturday, June 8, 2013

పద్య రచన -వర్షము

వర్షపు  ధారను జూడగ
హర్షముతో నిండి మనసు హాయిని  గొలిపెన్
 కర్షకులు  ముదము నొందురు
వర్షము  మఱి  యడవి గాక  వరిపై   గుర్వన్

పద్య రచన -హిందూ ధర్మ సమ్మేళనము

ఆది శంకరా చార్యులు  మధ్య నుండి
ధర్మ గురువులు వరుసగ దరిని వెలుగు
చిత్ర మయ్యది  జూడుడు  శిశి వు  లార !
పుణ్య దినమిది  నిజముగా  బుణ్య దినము 

Friday, June 7, 2013

పిడి కొస లె రుపెక్క బతిని బి లచెను సతియే

వడగండ్ల వాన పడుటన
కడవలు నవి చిల్లు పడుచు  కారెను  జలముల్
కడవల  యంచులు  గీ చుకు
పిడి కొస లె రుపెక్క  బతిని  బి లచెను సతియే 

Thursday, June 6, 2013

వడగండ్ల వాన

వడగండ్ల వాన కురిసెను
దడదడ  యను రవము తోడ దరువుల పైనన్
వడగండ్లు ననగ దె లియుము
వడ గండ్లే మేఘ శకము వర్షపు బదులున్ 

వర్షా కాలము

వర్షా కాలపు  రాకను
హర్షముతో  స్వాగ తింతు  ననిశము  నేనున్
కర్షకులు  సంత సింతురు
వర్షము  మఱి  మేలుజేయు  వరి పంటకు నున్ 

పద్య రచన -మానవుడు --దానవుడు

మానవత్వము  గలిగిన  మాన వుండు
మెప్పు  నొందును  బరులకు  మేలు జేసి
దనుజ సంతతి యైనట్టి  దాన వుండు
మాం స భక్షణ మందున మమత జూపు 

పాతాళ గంగ

పాతాళ గంగ దెచ్చెను
పాతాళము నుండి  నరుడు  బాణము విడి చిన్
తాత యగు భీ ష్ము  కొఱకుగ
ఆత్రముగా ద్రాగి  భీష్ము డాయువు  వదిలెన్సరగు  భీష్ముని  దప్పిక  దీ ర్చు  కొఱకు
పార్ధు డ త్తఱి  సంధించి బాణ మవల
తెచ్చే  పాతాళ  గంగను  ముచ్చట గను
త్రాగి  భీ ష్ముడు  సులువుగ దనువు  విడిచె
 

Wednesday, June 5, 2013

వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

కొంకా పల్లిన  నుండిన
వేంకట శాస్త్రికి మనుమలు  విల్సన్ ఖాదర్
పంకాలు  బాగు జేయుచు 
లెంకలు గా  బ్రదుకు చుండ్రి  లేమిని  కతనన్ 

పద్య రచన -పిడుగు పాటు

పిడుగు పాటు  వార్త పెద్దన్న  వినగను
గుండె కొట్టు  కొనెను  గుప్పు గుప్పు
అనుచు  వేగ ముగను  నతని జూడ  భయము
కలిగి  మాకు  మేను  గగురు పొడిచె 

Tuesday, June 4, 2013

పద్య రచన -సన్మాన సభలు

సన్మా నింతురు  కవులను
సన్మానపు  సభలు  జరిపి  సముచిత రీ తిన్
సన్మా నించుట మన విధి
సన్మానము నీ యు తృప్తి  సత్క వుల కునున్ 

నీ తి జెప్ప బోడు నిజ గు రుండు

తప్పు జేయ మిగుల దండించి శిష్యుని
విద్య గ ఱ పి  మంచి వేత్త జేయు
నీ   తి  గార వములు  నేర్పును దా  నవి
నీ తి  జెప్ప బోడు నిజ గు రుండు 

వాయు గుండములు

వాయు గుండము లయ్యవి వచ్చు చుండు
కనుము ,తఱచుగ  బంగా ళ  ఖాత మందు
వాన ,గాలికి  చెట్లన్ని  వాలి పోయి
నేల దాకును కొమ్మలు  నిక్క ముగను

 

రారమ్మని బిల్చె సాధ్వి రంజిల విటులన్

ఆరమణుని  సతి తోడన
రారమ్మని బిల్చె  సాధ్వి,  రంజిల విటులన్
నారీ మణు లుండు కతన
భారముగా సాగు చుండె  భార్యల  బ్రదు కుల్ 

పద్య రచన -గోరంత దీపము

గోరంత దీ ప మయ్యది
ఆరని యా జ్యోతి  వెలుగు లాశలు  దీర్చున్
ఊరూరి దేవళం బున
గోరంత లె  వెలుగు చుండు  గొండంత లుగన్ 

Sunday, June 2, 2013

పద్య రచన -కొల్లేటి కాపురము

కొల్లేటి  కాపురంబును
గల్లీలో  చెడుగుడాట  గర్హింప దగున్
పిల్లా పాపల తోడను
చల్లంగా నుండవలయు  శంభుని  గృ పనన్ 

Saturday, June 1, 2013

వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ .

వేదములు నాలు గైనను
వేదమె  యా భారతంబు  వివ రింపంగన్
వేదము రామాయణమును
వేదము లాఱని  గణించె  విజ్ఞులు  మెచ్చన్ .