Saturday, August 31, 2013

పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్

మీదకు రానేరడు గద
పాదమ్ములు  లేని నరుడు , పరుగిడ జొచ్చె
న్నీ దరి కాదరి కా తడు
వేదన మఱి  దాళ లేక వీ రడు  మిగులన్ 

దానిమ్మ

చూడు దానిమ్మ ఫలమును  చూడ్కు లలర
గింజ లుండెను  ము త్యపు  గింజ వోలె
తినుట మొదలిడ నోరంత  తీపి  గలిగి
మంచి రుచి నిచ్చు నయ్యది  ,మంచి  ఫలము 

Friday, August 30, 2013

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

నాదు  సోదరి గిరిజకు  నల్ల గాను
కొడుకు పుట్టె , సన్యాసికి గురువు కృపను
ముక్తి గలుగగ  జేరెను  మోక్ష పధము
గురువు దయలుండ  సాధించు  కొనగ  గలము 

తెలుగు పద్యము

తెలుగు పద్యపు  భావమ్ము  తీ యనగుచు
సంతసమ్మును  గలిగించు  జదు వరులకు
అందువలనతా  ననియెను  నాంధ్ర భోజు
డైన  రాయలు  మఱి లెస్స  యైన  దనియు
 

Thursday, August 29, 2013

సతి సతి గవయంగ సంతు గలిగె

కలుసుకొనిరి  విందు గలుగు చోటన  మఱి
సతి సతి  గవయంగ  సంతు గలిగె
భార్య మరియు  భర్త బహు దినంబులు నట
సహజ మీయది  యిక  జగము నందు
 

లోభి

తాను  దినడు  మఱి ని  దాచు సంపద మొత్త
మంత , పెట్ట డితర  మనుజు లకును
లోభి గుణ మదియ   లాభ మేమియు లేదు
వ్యర్ధ మతని  బ్రదుకు  వసుధ లోన 

Wednesday, August 28, 2013

భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు

ఇందు  సందేహ  మేలనో  నిదియ నిజము
భాగ్య నగరమ్ము  హైదరాబాదు, కాదు
అనిన నొప్పదు ముమ్మాటి కదియ సుమ్ము
కంది  శంకర ! నమ్ముడు  కల్ల కాదు .
 

ఆకాశవాణి

పలికె ఆకాశవాణి  యా ప్రభుని గూర్చి
యీ శకుంతల  భార్యయే  యీశ ! నీకు
అనగ  దుష్యంతు డ య్యెడ  యనుమ తించ
పూల  వర్షము గురిసెను  మురిపెముగను


ఆకాశవాణి పలికెను
సంకోచము లేక నీవు  సాదరముంగాన్
శాకుంతల యను నీమెను
స్వీ కారము చేయుమార్య !  చెఱు గని బుద్ధిన్ 

Tuesday, August 27, 2013

ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్

విడ్డూర  మిదియ  చూడుడు
ఒడ్డాణ మలంకరించె  నువిద  శిరమ్మున్
వడ్డాది వా రి యింటను
విడ్డూ రము కాద  యిదియ ?  వీ క్షిం పం గన్ 

పచ్చి మిరప కాయ

పచ్చి మిరప కాయ  పచ్చగ   నలరెను
గూబ  గుయ్య మనును  గొప్ప కొఱకు
కఱ కఱ మని తినిన  కార మ  గుచును
కాన  శ్రద్ధ  మేలు దాని పట్ల 

Monday, August 26, 2013

పకోడి

కళ్ళు దె ఱవ గ నె ప కో డి  కాని పించె
ఏమి భా గ్య ము ? మనకిక యీ దిన మ్ము
వేడి వే డి గ  ది  ను దము  వే గ ము  గను
ఆలసించిన విషమగు  నమృత  ము గ ద !
 

ఉల్లి గ డ్డల దిను వార లె ల్ల ఖలులు

ఉల్లి నందురు  కద సామి !  తల్లి వంటి
దనుచు  మఱి యేల  మీ రె య  ట్లంటి  రిపుడు ?
ఉల్లి  గ డ్డల  దిను వార లె  ల్ల  ఖలులు
గాదని సెల వీ యుడు మఱి  కంది  సామి !

Sunday, August 25, 2013

ప్రాతః కాలము

ప్రాతః కాలమె లేచుచు
చేతో మోదంబు గలుగ  చిన్మయ మూర్తి
న్నాత్రత  నారాధించిన
ఆతడె  మనకిచ్చు  నెపుడు  నమితపు సిరులన్
 

వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి

సాని కొంపకు రయమున  సత్తి బాబు
వేశ్య కౌగిలింతను గోరి  వెడలె,  యోగి
వేమన శతకము వ్రాసె   వినుర వేమ
అనెడు మకుటాన  పద్యము లద్భుతముగ 

శీ త కన్ను

నాదు  రచనలకు జిలేబి సోదరి మఱి
చూచు  తోడనే  స్పందించి చొరవ చూపి
వ్రాయు చుండెడి వారలు  వ్యాఖ్యలు నిక
శీ త కన్నును వేసిరి  వ్రాత లేక 

వాణి -- రాణి

వాణి  మఱియును  సోదరి  రాణి యరయ
ఒక్కరే మఱి  యెటు లను  చక్క గాను
నటన చేయుచు నుండిరి  పటువు  తోడ
దర్శకుని మహిమము కద  దనరె  నటుల ?

మరో చరిత్ర

 సీ ర్య  లందు మరో చరిత్ర రయముగను
 సాగు చున్నది  యందలి సర్వ జనులు
పార వశ్యులై  తమతమ పాత్ర లందు
నటన గావించు చుండిరి  జట్టు గూడి
 

Saturday, August 24, 2013

బకమున్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా

నకనక లాడుచు  మఱి యా
శకటంబున దిరుగుచుండ  శలభము  గానన్
వికశించిన  ముఖమున శా
బకమున్వడి  మ్రింగుచున్న బల్లిం  గనుమా
 

కృష్ణా నది స్తోత్రము

పోవు నఘములు నీ నీట  మునుగ తల్లి !
కలుగు శుభములు  నీపేరు  పలుకు కతన
నిన్ను నమ్మిన వారికి నీడ నిత్తు
వుకద   కృష్ణమ్మ ! నిజమైన  పూజ సేసి 

అనుబంధాలు

తాత  తండ్రి  భార్య తనయులు మఱియును
బావ యికను  మేటి బంధు తతుల
బంధము లొకదాని  వరుసన నొకటిగ
దనరు బంధ ములె య  గు నను బం ధాలు గ . 

గడియారము

గడియారము  చూడగ  మఱి
గడియారపు  ముళ్ళు సూపు  గంటలు నిమిషాల్
నడయాడుచు  గుండ్రముగను
సుడులుంగా  మనము కూడ  సూర్యుని చుట్టున్
 

Friday, August 23, 2013

బాం ధవ్యములు

పాలకుల నిర్ణయంబులు  ప్రజల కు మఱి
నష్ట మనిపించి  యాందోళ న లు స  లిపిరి
ప్రభుత  ప్రజల బాం   ధవ్యపు  పట్టు లేక
జరుగు చున్నవి  బందులు  జగము నందు 

మురళీ గానమ్ము మరణమును గలిగించున్

పరమ పదంబును జేర్చును
మురళీ గానమ్ము,  మరణమును గలిగించున్
విరివిగ దీపి పదార్ధము
లరుదుగ  మధు మేహ రోగి  యాహా రించన్ 

గొడ్రాలు

సంతు లేమిని నందురు  జనులు భువిని
మఱియు  రా నీ యరు గ  శుభ కార్యములకు
ముద్ర వేతురు గొడ్రాలు  ముదిత యనుచు
నాతి పట్ల యి  ట్లనుటను  నాయ మగునె ?

ఆశీ స్సులు



భువిని నడకుదిటి  గృహపు  భూ ష  ణుండు
తల్లి దండ్రుల గారాబు తనయు డైన
వేంకట  సువర్ణ మునకునౌ  విధి తలచె ను
పెండ్లి చేయవలెననుచు బ్రీ తి తోడ


ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
కనులు కనులను గలుపగ  దనివి తీ ర
కాంచి పెద్దలు ,పెట్టిరి మంచి  మూ రు
తమ్ము నీ రోజు రాతిరి యిమ్ము గాను


వరుడు పుట్టె  నడకుదిటి వారి యింట
రావి  నూ తల యింటను  రామ పద్మ
ఒకరికి నొకరు తోడుగా నుండి మఱి ని
పరమ సంతోషముగ నిల బ్రతుకు గాక !


వధువు నుద్దేశించి ;;


మగువ ! అత్తమామలు  గడు మంచి వారు
వారి కనుసన్న మెలగుము  , మారు పలుక
వలదు , సంతోష బెట్టుము భర్త నెపుడు
అట్లు మెలగుచు నాశీ స్సు లందు కొనుము


పుట్టి నింటను మెలగిన నట్లు విధము
మెట్టి నింటను మెలగుచు  నెట్టి  లోటు
రాని  విధముగ  వర్తిలి  రామ పద్మ !
జీ వితంబును  సాగించు  నీవ యికను


అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
బెంగ యుండును నిజమిది బేల ! నీకు
అత్త లోనన జూడుమా  యమ్మ నికను
కొదవ లేకుండ మనసు నీ  కుదుట పడును


ఎదురు చెప్పక జేయుమ యె వరి కైన
మంచి గృహిణిగ  నెదుగుము  మంది లోన
మాన వత్త్వంబు తోడన మసలు  గొనుచు
మానినులయందగుము దల  మానికముగ


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని  రెప్ప  యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను


(28-8-2013 తేదీన  వెంకట సువర్ణ రత్న కుమార్ ,పద్మ లతల వివాహము
సందర్భ ముగా )

రచన ;  పోచిరాజు సుబ్బారావు


















 

తిరుగలి

తిరుగలిని జూడు డా ర్యులు
అరమరలో నుండె  నచట యందము దోపన్
తిరుగలివలె యీ బ్రతుకులు
తిరుగుచునే నుండు భువిని  దినముం  దినమున్  

తీ ర్ధ యాత్రలవలన వర్ధిల్లు నఘము

పుణ్య పురుషార్ధములు మఱి  గణ్య ముగను
తీ ర్ధ యాత్రలవలన  వర్ధిల్లు, నఘము
కలుగు  ప్రాణ హింస జరుగు  నెలవు చోట
ప్రాణ హింసను  జేయక పదిల పడుము 

Wednesday, August 21, 2013

జనా ర ణ్య ము

రా ష్ట్ర  సమైక్య  కొఱకునై  రాష్ట్ర  మం త
చేయు చుండిన  సీ మాంధ్ర  నాయకు  ల ట
బందు లాం దో ళ నంబుల   చంద  మరయ
కాను పించెజ  నారణ్య  మౌ  నను న టు








 

రామ భక్తులలో మేటి రా వ ణుం డు

వాయువేగము  గల య ట్టి    వాయు సు తుడు
రామ  భక్తులలో  మేటి,  రా వ ణుం డు
శివుని  భ క్తుడు , నూ టొ క్క  శివుని  లింగ
ములకు బ్రతిదిన  మభి షేక  ము నొన  గూర్చు 

Tuesday, August 20, 2013

సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

పోనీలే యని  యుండగ
మేనంతయు  నిండునట్లు  మెక  చర్మంబా !
కానీ నీయీ పని , దొర
సానీ నీ సాటి గలరె  సాధ్వుల లోనన్ 

రక్షా బంధనము

బంధ మయ్యది బలముగ  బట్టు కొఱకు
కట్టు చుండెను  రాకీని  బిట్టు గాను
అరయ శ్రావణ  పూర్ణిమ  యగుట వలన
నేడు ,చిత్ర పు  చిత్రము  చూడు డార్య !

Monday, August 19, 2013

యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము

చేతు  లాడక  వినలేని  చెవులు  మఱియు
నోరు పలుకక  నడువక  కాళ్ళు   లేచి
నిలబ  డు టకును  బలములే  నినత  నికిల
యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము 

తెలుగు జాతి మనది

తెగువ గలిగిన జాతిరా తెలుగు జాతి
మనది  నిస్స్వార్ధ మయమునై  దనరు చుండు
వేడు కొందును శంభుని  వినయముగను
తెలుగు వాడిగ  బుట్టుక గలుగు కతన 

Sunday, August 18, 2013

పెన్నిధి

పేదల పెన్నిధి యనబడు 
వేదుల రామయ్య  మేటి వితరణ యందున్ 
బీదలు గోరక మునుపే 
లేదనకన నిచ్చు నెపుడు నాదర మొప్పన్
 

వలదు వలదనుకొన్నసం ప్రాప్త మగును

పూర్వ జన్మల  పుణ్యంబు  పొందు కతన
భోగ భాగ్యముల్జనులకు  భూరిగాను
వలదు వలదనుకొన్నసం  ప్రాప్త మగును
సందియం బిసుమంతయు  నిం దు  లేదు 

కైంకర్యము

ప్రతి దినంబును  జేతురు  భక్తులు మఱి
భక్తి శ్రద్ధలు గలుగుచు  రక్తి తోడ 
భవుని  కైంకర్య మత్యంత  వైభవంబు 
కలుగు నట్లుగ  శుభములు గలుగు కొఱకు 

రూపాల సంగమేశ్వర స్వామి --కర్నూలు

ధరణి వె లయుజ  గన్నాధు దలము మీద
సంగ మేశ్వరు  స్వామిని శక్తి కొలది
పూజ జేయగ  నేగగ  మోజు పడుచు
స్వామి  దర్శన మాయెను  సంతసముగ


మంత్ర యుతముగ  నర్చన తంతు పూర్తి
గాగ పూజారి యిచ్చెను నగవు తోడ
తీర్ధ ప్రాసాదములు మాకు  తియ్య వైన
అందు కొంటిమి మఱి యును  నార గించి


పిదప  యాంజ నేయు  స్తాట్యు  పేర్మి తోడ
మార్గ మంతయు గతుకుల మయము నైన
చూడ నేగితి  మచట కు  చొరవ తోడ
చూడ నద్భుతముగ నుండె  చూచు కొలది


ఉర్వి జనములు సుఖముగ  నుండు కొఱకు
దైవ ప్రార్ధన జేసితి నీ వ ,స్వామి !
ఎల్ల వేళల గాపాడు  చల్ల గాను
నీవె దిక్కిక గోరుదు  నిన్నె శరణు


వాన రాకడ గమనించి  పై నభమున
పయన మైతిమి యింటికి రయము గాను
ఒక్క య ఱగంట పయనమై సుఖము గాను
చేరు కొంటిమి యింటికి సేమము గను





Saturday, August 17, 2013

తెలుగు లెస్స

దేశ భాష లందు తెలుగు లెస్స నియెను
సార్వ భౌము డపుడు సరిగ బలికె
తేనె లొలుకు భాష తెలుగు భాషయె మఱి
అర్ధమగును నార్య యందఱకును




భీ మసేనుండు దేవకీ ప్రియ సుతుండు

పాండవుల యందు  నరయగ  బాహుబలుడు
భీ మసేనుండు,  దేవకీ ప్రియ సుతుండు
మనకు నారాధ్య దేవుడు కృష్ణుడె  కద
వందనంబు బృం  దావన  వాసి కార్య !





Friday, August 16, 2013

గురు బోధనము


కణ్వు  డాదిగ ఋషుల యా   కథలు వినగ 
దెలియ వచ్చెను  పూర్వము తిరము గాను 
ఆశ్ర మంబున  శిష్యుల కాశ్ర యంబు 
నిచ్చి గావించె బోధన  లింపుగాను 

మద్యమును గ్రోలు డనునదే మంచిమాట

మద్యమును గ్రోలు డనునదే మంచిమాట
యనుట నొప్పైన  బ్రతివారు హాయి యనుచు
కైపు నెక్కగ ద్రాగు చు  గంతు  లేతు
రార్య ! నిజమిది  నమ్ముడు  మీ రు  కూడ 

Thursday, August 15, 2013

పుస్త కమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము

అనువు గాని చోట యనవరతము పుస్త
కమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము
పుస్తకమ్ము జదువ పొలుపుగ మఱి   వాని
సుజను డండ్రు  లల్లి ! సుజన   గణము 

పిడికిట సూర్యుడు

పిడికిట సూర్యుని జూడుము
పిడికిలి లో వెలుగు చుండె పేరిమి రశ్మిన్
పిడికిలి య వంశిగారిది
అడకువతో ,నీ కునతులు  నారని జో తీ !                                                        

Wednesday, August 14, 2013

స్వాతంత్ర్య ఫలము దక్కు స్వార్ధ పరులకే

 నేతల మోసపు మాటలు
ప్రీ తిగనేయుం డుగాని   ప్రేమలు  గరువౌ
స్వాతంత్ర్యము మనకు  గలుగ
స్వాతంత్ర్య ఫలము దక్కు  స్వార్ధ పరులకే 

స్వాతంత్ర దినో త్స వము

ఈ రోజు మనకు పండుగ
సై , రా యీ  దేశమునకు  స్వా తంత్ర్యం బున్
 మా  రణ హోమము  పిమ్మట
వైరుడు  దా   బోవు గతన  వచ్చెను నరుడా !

Tuesday, August 13, 2013

అ పరిఛితులు

నమ్మకుము దుష్ట జనులను
నమ్మకుమా యపరిచితుల నర్మపు  మాటల్
నమ్మకుము నీ మనస్సును
నమ్ముము మఱి దేవ దేవు  నామము  నరుడా !



హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్

బేరము  లాడితి  గట్టిగ
హారము కొఱకై  యొక సతి హారము నమ్మెన్
కారణ మరయగ  దెలిసెను
వారసుడగు గొడుకు బంప వాషింగ్టనుకున్




అయిష్ట మగునుగ కవిత్వ మధముల కు గదా !

రయముగ రండిటు  చదువుదు
జయమెవరిదొ  దెలియునిపుడు  సంపూ ర్ణముగన్
భయ మనుచు విడుతు రది యిం
పయినను ఖలునకు కవిత్వ మధములకు గదా 

Monday, August 12, 2013

శిల -శిల్పము

శిలను జెక్కువాని  శిల్పి యండ్రు భువిని
శిల్పి చెక్కు శిలను  శిల్ప ముగను
ప్రాణ ముండు దాని వలె  రమ్యమై యుండి
మనసు దోచు కొనును  మాన్యు లార !

Sunday, August 11, 2013

లచ్చి మగని కైదువు త్రి శూ లమ్ము గాదె

దైత్య గణమును సు వి  దారక మైనది
లచ్చి మగని కైదువు , త్రి శూ లమ్ము గాదె
భవుని నాయుధంబు  భవ్య మగునదియా
ఆయుధంబు లార ! హాయి నిండు 

అద్దె యిల్లు

స్వంత యిల్లు  లేని వారల కద్దె కొం
ప మఱి  తప్ప దార్య ! పాడు వడిన
దైన  మంచి  దైన నిక మనువచట నే
గడుప వలెను  నెంత కష్ట మైన





 

పచ్చని చెట్టు

పచ్చని చెట్టును  గొట్టిన
పచ్చగ వాడుండ బోడు భరణిని  నిజమున్
నచ్చక యీ నా మాటలు
విచ్చలవిడి గొట్టె నేని  వివశత నొందున్


కారణం బును   లేకయ ఖడ్గ మూని
ఎవడు కొట్టునో  చెట్టును  నీ పుడమిని
సరము  పడుగాక యనుచును  శాప మిచ్చు
చూడు ! పోవద్దు తరువుల జోలి కెపుడు


తరువు లేడ్చును నిజమిది తరుణు లార !
ఆకు రాల్చును దఱచుగ  నదియ గుర్తు
వాటి కాకులే కన్నీళ్ళు  వసుధ లోన
మనువు సాగించు నవి కూడ  మనకు వలెనె 

Saturday, August 10, 2013

ప్రత్యర్ధిని జూచి వడకె బార్థుం డని లోన్

ప్రత్యర్ధులు  సోదరులే
సత్యము , మఱి  వారి జంప  సముచితమేనా ?
హత్యలు దాజేయ ననుచు
ప్రత్యర్ధిని జూచి  వడకె   బార్థుం డని లోన్ 

గానుగ

తిలల నుండి ద్రిప్పి దీ యంగ  తైలము
జోడు  వృషభ ములను  గాడి కట్టి
త్రిప్పు చుండె జూడు   తెలుకల రామయ్య
చూడ ముచ్చట య్యె  జూచు కొలది 

ప్రాణ భీ తి

పిల్లి వాసన గనిబెట్టి  యెలుక  పాఱు
కుక్క కనిపించ  పిల్లులు  నక్కి యుండు
సింహ మగుపడ  జింకలు  చేవ జూపు
ప్రాణ భీ తినె గద  మఱి  ప్రాణు లన్ని 

పాపాత్మురాలు

పచ్చని చెట్టని  జూడక
పచ్చక దానుండ బోక పచ్చని పనసన్
కచ్చాగా గొట్టించెను
పిచ్చిది మఱి యేమొ  కాని పేరుకు వాణీ


కత్తి  దెబ్బలు  దినుచును  గదల కుండె
ఎంత బాధను నొందెనో  నెవరి కెఱు క
ప్రాణ హింసను జేయను  బాణి  యెటు ల
వచ్చె ?  మిక్కిలి క్రూరుడా  వాచు మేను


కత్తి దెబ్బలు బడుటన  కంది  మ్రాను
రాత్రి యంతయు నేడ్చెను  రాల్చి యాకు
ఏమి పాపము జేసెనో  నేమొ కాని
 నరుని నొకనిచే  గొమ్మలు నఱు క  బడెను . 

ఆప్త మిత్రుడు

కష్ట కాలమందు  కాపాడు నాతడే
 ఆప్త మిత్రుడనగ ననగ  వచ్చు
డబ్బు చూసి వచ్చు  డాం భికులను  మఱి
దూర ముంచ మేలు  దురిత దూర !

 

చతురోపాయములు

సామ దాన భేద నామమున దనరి
ప్రాణ హాని లేక బరగు నిలను
మఱి ని  దండ మనగ  మారణ హోమము
జరుగు నార్య   వలదు చావు
 

జ్వరము -లక్షణములు

ముక్కు దిబ్బడ మఱియును  ముఖము వాపు
కాళ్ళు నొప్పులు కళ్ళెఱ్ఱ  కరములు నిక
పట్టు లుండవు  దేహము బయలు కమ్ము
మైమ ఱు పు గల్గు నాకలి మంద గించు  

Friday, August 9, 2013

కోయ దొర

వేరు మందులు ముందర వేసి కొనుచు
సెల్లు ఫోనును జూచుచు శీ ఘ్రముగను
కూరు చుండెను హాయిగ కోయ దొరయ
చూడు డార్యులు  మఱి మీ రు  చోద్య మిదియ 

నెల కేడు దినమ్ములని గణిం తురు విజ్ఞుల్

అల శాస్రజ్ఞులు  సెప్పిరి
నెల కేడు దినమ్ములని ,గ ణిం తురు  విజ్ఞుల్
మెలమెల్ల గ దివిని గదలు
పలు తారల ఫలిత మార్య ! ప్రమదము తోడన్ 

Thursday, August 8, 2013

గురువులు , శంకరయ్య గారు !

ఆది దంపతు లనబడు  నయ్యు మా మ
హేశు లీ శంక  రార్యుల కా శి సులను
నిచ్చు గావుత ! రుగ్మము చచ్చు వడగ,
వడి గ   కోలుకొన రోగపు బారి నుండి 

రామజోగి మందు ప్రాణ హరము

రామజోగి మందు ప్రాణ హరము కాదు
ప్రాణము నిల బెట్టు  ప్రతియొ  కరికి
మందు వాడ  కంబు  మనుగడ  కొఱకు నౌ
కోరి   ప్రాణ హరము కొఱకు  కాదు 

పెంకుటిల్లు

ఇల దొడ్డ వరము నందున
అలయా చిత్రమును బోలి  యైదు గదుల తోన్
వెలసిన  యిల్లే  మాయది
చలువకునై బెంకు  పైన  చ ఱచితి మార్యా !

Wednesday, August 7, 2013

ఆది దంపతు లు

ఆది దంపతు లనబడు  నయ్యుమామ
హేశు లిచ్చు  గావుత ! మఱి  హేమమయము
లైన నాభరణం బులు  వాని భక్తు
ల కెపుడు  నిరతి  శయ మగు    ముక్తి గూడ 

త్రాగి పాడె నంట త్యా గ రాజు

నిండు జనము గలుగ  బండి రా ధా కృష్ణ
త్రాగి పాడె నంట ,  త్యా గ రాజు
రామ చంద్రు పైన  రమ్యమై  న గృతులు
రచన జేసి  మిగుల  రాణ  యొప్పె 

అత్తమీ ది కోపము దుత్త మీ ద జూపు

అత్తమీ దన నున్నట్టి యాగ్రహంబు
దుత్త మీదన జూపెను దుహిత యొకతె
ఏమి  సేతలు సేయను  జే త గాక
శాప నార్ధము లన్నియు  సైచి మిగుల
 

కూచిపూడి నృత్యము

నృత్యము లన్నిటి గంటెను
సత్యముగా జెప్పదగును చక్కని దనియున్
నృత్యమ కుచిపూడి  యనగ
సత్వరమే రండు మీరు  సకలము  నేర్వన్ 

మూడు ముళ్ళ బంధము

అండదండ లుండె  మెండుగ నాకిల
భర్త కూడ  మఱి ని  బాగయుంట
మూడు ముళ్ళ బంధము దెగువ నేర్పెను
బాగు ననగ జేతు  భావి నికను 

ఆటవిడుపు

ఆటవిడుపు గ  విడుచును  నయ్య వారు
పా    ఠ  ములువిని  విసిగిన  బాల బాలి
కలను  నా డుకొనుటకు నై   కలసిమెలసి
వారి మనసులు  హాయిగ మారు కొఱకు
 

Tuesday, August 6, 2013

శివ లాస్యము

శివ లాస్యమ యది , జూడగ
భవబంధము లన్ని దొలగి పరముం  గలుగున్
శివలాస్యపు  మహిమమ యది
శివ శివ యని పలుక మ నకు  సేమము  గలుగున్




 

పాండవులు దుష్ట చిత్తులై భంగ పడిరి

సాధు వర్తనులు మఱియు  సాత్త్వికులు ను
పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
ధార్త రాష్ట్రులు  ఘోష యాత్ర కరి గి కద !
కలిసి    యుండిన  నెంతైన  కలుగు  సుఖము 

Monday, August 5, 2013

అప్పిచ్చెడు వాడు వైద్యు డగు ననిరి బుధుల్

ఎప్పుడు సుఖముగ  నుండుత !
అప్పిచ్చెడు వాడు,  వైద్యు డగు ననిరి బుధుల్
ఒప్పుగను  వైద్య శాస్త్రము
తప్పగ మఱి  జదువు వాడు ధరణిని వింటే ?

పానకాల స్వామి

బిందుల కొలది పానకం బ్రియము తోడ
ఇత్తు నెప్పుడు కాపాడు మిప్పుడీ శ !
దుష్ట సంహార !నరసింహ ! దురిత దూర !
నిన్ను నమ్మితి న నమ్ముము నిజము గాను 

ఉట్టికి నెగుర లేనమ్మ స్వర్గానికెగి రిం ద ట

ఉట్టి కెగురలే  దు మఱి యు నెట్టు లెగురు
దివికి నాయమ్మ తెగువన దెలియ జేయు
డార్య ! సాధ్యమ ? భువిలోన  నట్ల  గుటను
వింటి మామఱి  గంటి మా వీ స మైన



 

పుట్టుకతో వచ్చు బుద్ధి పుడకల వశ మౌ

పుట్టుకను వచ్చు బుద్ధులు
బిట్టున బోబోవు నరయ  పేడికి  నైనన్
అట్టులు సెప్పిన విధముగ
పుట్టుకతో వచ్చు బుద్ధి  పుడకల వశ మౌ 

Sunday, August 4, 2013

పద్య రచన -అడవి దున్నలు ,సింహము

అడవి దున్నల దాడికి నాగ లేక
పారి పోవుట జూచితె ? మీ రలార్య !
అడవి  యం తటి  కిని రాజు  నయ్యు  సింహ
మక్కట  !,  సమష్టి యనగను  నదియ సుమ్ము 

వావి వరుసలు జూడని వారనఘులు

వావి వరుసలు జూచి యు ద్వాహ మాడ
మంచి సంతాన వంతులై  మహిని వెలుగు
మఱి యు వంశ ము  నభివృద్ధి బ ఱగు సుమ్ము
వావి వరుసలు జూడని వారనఘులు

 

Saturday, August 3, 2013

పద్య రచన -ఏనుగు

అల్లనల్లన మెల్లగ నడుగు వేచి
నడుచు చున్నది  చూడుడు నగము నచట
కట్టె మోపులు వీపుపై గట్టి వైచి
నడుపు చుండెను గజమును  నాయకుండు 

శ్రీ శ్రీ కవి యనగ దగడు సిరి సిరి మువ్వా !

శ్రీ శ్రీ కవితలు నవతకు
నాశ్రయమై యుండి    మనకు  హాయిని గూర్చున్
శ్రీ శ్రీ యన నా కిష్టము
శ్రీ శ్రీ కవి యనగ  దగడు? సిరి సిరి మువ్వా !

Friday, August 2, 2013

సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

ఇంపుగ  సంసారంబును
పెంపొనరగ జేసికొనుచు  ప్రేమమ్మలరన్
రొంపున  మునిగెడు  నక్రమ
సంపాదన లేని మగని  సాధ్వి నుతించెన్ 

ప ద్యరచన -ఆత్మవంచన

తనను కొఱ గాని వానిగ దలచి మదిని
ఎవడు వర్తించు ననిశము  నిహము నందు
ఆత్మవంచన  యగునది  యార్యు లార !
సంయ మనమున  ముందుకు  సాగ వలయు 

మోకాలికి బోడి గుండు ముడి వెట్ట దగున్

పోకిరి వలె  దిరుగకు మఱి
యో కామేశా ! యనంగ  నూరికి  బోదున్
నాకో తొంబది యిమ్మనె
మోకాలికి బోడి గుండు ముడి వెట్ట దగున్ ?

Thursday, August 1, 2013

పద్య రచన -ప్రకృ తి

మనకు కనబడు నంతయు  మఱి  ప్రకృతియ
ప్రకృతి  కోపించ మారును వికృతి గాను
ఈ శ్వరా ధీ నమై  చరిం చీ యది నిట
కాన వేడు కొందము నిక కాలు మనము 

వాన రాకడ ప్రాణము పోకడ

వాన రాకడ ప్రాణం బు  బాయు ట నగ 
ఎఱు గ  రెవరును  జగతిని  నెచట నైన
వచ్చు చుండును మఱియును  బాయు చుండు
వాటి సమయాన నవియ  నా  మాట నిజము 

ముసలి దనము

ముసలి దనము వలన  మొద్దు బారు మెదడు
చట్ట నొప్పి  భుజము జాచ లేరు
పులిసి   పోవు  నొడలు  పోడిమి దగ్గును
బొందు  విడువ మేలు ముందు గానె . 

చందమామ లో మచ్చ

చందమామ లో న  నందమై యామచ్చ
సోయగంబు గూర్చె  జూప రులకు
అందమెచట నుండు  మంది జేరునటకు
సంది యంబు వలదు సన్ను తాంగి !

కౌగిలి మరణమ్ము నొసగు గద సరసులకున్

భోగములదేలియాడుచు
రోగములను దెచ్చుకొనుచు  రోగిగ  మారీ
ఆగని యె డలన  మఱి చెలి
కౌగిలి మరణమ్ము  నొసగు  గద సరసులకున్