Sunday, August 11, 2013

పచ్చని చెట్టు

పచ్చని చెట్టును  గొట్టిన
పచ్చగ వాడుండ బోడు భరణిని  నిజమున్
నచ్చక యీ నా మాటలు
విచ్చలవిడి గొట్టె నేని  వివశత నొందున్


కారణం బును   లేకయ ఖడ్గ మూని
ఎవడు కొట్టునో  చెట్టును  నీ పుడమిని
సరము  పడుగాక యనుచును  శాప మిచ్చు
చూడు ! పోవద్దు తరువుల జోలి కెపుడు


తరువు లేడ్చును నిజమిది తరుణు లార !
ఆకు రాల్చును దఱచుగ  నదియ గుర్తు
వాటి కాకులే కన్నీళ్ళు  వసుధ లోన
మనువు సాగించు నవి కూడ  మనకు వలెనె 

No comments:

Post a Comment