Friday, August 23, 2013

ఆశీ స్సులు



భువిని నడకుదిటి  గృహపు  భూ ష  ణుండు
తల్లి దండ్రుల గారాబు తనయు డైన
వేంకట  సువర్ణ మునకునౌ  విధి తలచె ను
పెండ్లి చేయవలెననుచు బ్రీ తి తోడ


ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
కనులు కనులను గలుపగ  దనివి తీ ర
కాంచి పెద్దలు ,పెట్టిరి మంచి  మూ రు
తమ్ము నీ రోజు రాతిరి యిమ్ము గాను


వరుడు పుట్టె  నడకుదిటి వారి యింట
రావి  నూ తల యింటను  రామ పద్మ
ఒకరికి నొకరు తోడుగా నుండి మఱి ని
పరమ సంతోషముగ నిల బ్రతుకు గాక !


వధువు నుద్దేశించి ;;


మగువ ! అత్తమామలు  గడు మంచి వారు
వారి కనుసన్న మెలగుము  , మారు పలుక
వలదు , సంతోష బెట్టుము భర్త నెపుడు
అట్లు మెలగుచు నాశీ స్సు లందు కొనుము


పుట్టి నింటను మెలగిన నట్లు విధము
మెట్టి నింటను మెలగుచు  నెట్టి  లోటు
రాని  విధముగ  వర్తిలి  రామ పద్మ !
జీ వితంబును  సాగించు  నీవ యికను


అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
బెంగ యుండును నిజమిది బేల ! నీకు
అత్త లోనన జూడుమా  యమ్మ నికను
కొదవ లేకుండ మనసు నీ  కుదుట పడును


ఎదురు చెప్పక జేయుమ యె వరి కైన
మంచి గృహిణిగ  నెదుగుము  మంది లోన
మాన వత్త్వంబు తోడన మసలు  గొనుచు
మానినులయందగుము దల  మానికముగ


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని  రెప్ప  యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను


(28-8-2013 తేదీన  వెంకట సువర్ణ రత్న కుమార్ ,పద్మ లతల వివాహము
సందర్భ ముగా )

రచన ;  పోచిరాజు సుబ్బారావు


















 

No comments:

Post a Comment