Saturday, September 7, 2013

ది . 22-10-2013 తేదీన శుభాష్ ,జ్యోతిల వివాహము సందర్భముగా సమర్పించు పద్యాంజలి పూర్వక ఆశీ స్సులు

హాయ్ ! సుభాష్ !


తల్లి దండ్రుల కేకైక  తనయు డీవు
అక్క లిద్దరి  గారాబు "అనుజు " డీవు
బావ లిద్దరి  ముద్దుల  బావ వీవు
అందు కొను ముర!  యా శీ స్సు  లందు కొనుము


పెండ్లి యీ డు రాగ  పెండ్లి సేయుట గూర్చి
తల్లి దండ్రులు మఱి  యెల్ల వారు
వెదుక  మొదలిడ  నిక  వధువు కొ ఱకు వారు
కాను పించె  యీ మె  కన్ను గవకు


ఊరి  పెద్దలు మోదాన  నోల లాడ
తల్లి దండ్రులు  ననుమతి  దనకు నీయ
చూడ చక్కని  మూ ర్తము  సొంపు  లలర
అయ్య వారలు  బెట్టిరి  యంచితముగ


ఒకరికొఱకునై  మఱి యొక రుద్భ వించి
అగ్ని సాక్షిగ  నొకటిగ  నగుట కొఱకు
వేచి యుండిరి  యిరువురు  వినయముగను
వరలు  కళ్యాణ  ఘడియలు  వచ్చు వరకు



జ్యోతి నీ పట్ల నిజముగ  జోతి యగును
సంది యంబిసు మంతయు నిందు లేదు
కాన నొకరికి నొకరుగా  గలిసి  యుండి
జీ వ యాత్రను సాగించు  సేమ మలర


అమ్మా !  జ్యోతీ !


అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
లరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
అట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల


తనర యీ సుభాషును నీకు  తగిన భర్త
ఎదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .


రచన :  పోచిరాజు  సుబ్బారావు
(పెద్ద మామయ్య)



















 

No comments:

Post a Comment