Friday, January 10, 2014

ఆశీర్వచనము

ఇరగ వరపు కుల భూష ణ !
యరమరికలు లేకమదిని నాదుకొ మమ్మున్
నిరతము మీ పాదములను
కరములతో బట్టు కొందు గరుణలు గలుగన్

 బంధు ప్రీతిని గలిగిన  బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని  నిరగవ రపు వంశ  బుధు డతండు
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి

మాయ మర్మము లెరుగని మనిషి యతడు
మత్సరమ్మును లేనట్టి  మాన్యు డతడు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
సాటి లేరిక యతనికి మేటి భువిని

స్వార్ధ మనునది లేనట్టి సహృద యుండు
వీ రు నావారు వారు పైవారనుటను
వినగ లే దె పుడును మఱి ,వీ ను తోడ
దైవ తుల్యుడే యిక పైన ధరణి ప్రజకు

రామ కృష్ణ రావనగ మా మామకు నిక
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల పుట్టుక లేకుండు వరము నిచ్చి
యతని యాత్మకు శాంతిని నిచ్చు గాక !


(లేటు  మామయ్య గారి సంవత్సరీకములు సందర్భముగా
 పోచిరాజు సుబ్బారావు సమర్పించు పుష్పాంజలి )
22-01-2014.
-----------------



 

No comments:

Post a Comment