Friday, February 28, 2014

మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొ

పూలు విరివిగ బూచెను  బొలుపు గాను
మల్లె తీగకు, పూచె  చేమంతు లెన్నొ
పసుపు వర్ణము తోడన  పసిడి  వోలె
మాపె రటిలోన  గలయట్టి మడిని బెంచ 

పద్య రచన -యశోద -బాల కృష్ణుడు

బాల కృష్ణుడు  బంధింప బడెను జూడు
ఏమి పాపము జేసెనో యి లను నతడు
పిల్ల వాడని జూడక  పెద్ద శిక్ష
వేసె  నాయశో ద మ్మ ట  బాసి కరుణ 

కందివారి యింట నంది వెలసె

కందివారి యింట  నంది వెలసె నట
చోద్యమే గదయది  చూడ రండి
శంకరయ్య గావ  సాక్షాత్తు  నందియే
వెలసె నార్య !గనుము వింత యిదియ 

పూజ నీయులు గద పోకిరీ జనములు

శంకరాభరణము  సంధాన కర్తలు
కందిశంకరయ్య గారు మనకు
పూజ నీయులు గద, పోకిరీ జనములు
దుష్ట బుధ్ధు లు మఱి  దూర ముంచు 

కందిశంకరయ్య

కందిశంకరయ్య గారికి వందన
శతము లిడుదు నిత్య మతని పాద
పద్మములకును మఱి పండితు లగుటచే
పూజ నీయులు గద  పుణ్య జనులు 

Thursday, February 27, 2014

ఏటా శివరాత్రి వచ్చు నేప్రిలు నెలలోన్

మాటల సందర్భములో
నేటా  శివరాత్రి వచ్చు నేప్రిలు నెలలోన్
నాన్ టాగూరు పలికె నట
యేటా మఱి లేదు వచ్చు నేమో యిపుడున్ 

నమశ్శివాయ

ఇలయలకా పుర  మందున
నలరిన యా శంభు గొలువ యైదువ తనమున్
లలనా మణులకు  నిచ్చును
వలపున మఱి నీకు నిత్తు వందనము శివా !

తల దొలగించిన శుభమ్ము తప్పక గలుగున్

కలకాలము సుఖ ముండను
కలవరములు లేకయుండు  కాపురమందు
న్నిల మనల నలుముకొనిన వె
తల దొలగించిన శుభమ్ము తప్పక గలుగున్ 

పద్య రచన ,చెమ్మ చెక్క లాట

చిత్ర మందున జూడుడు చెమ్మ చెక్క
లాట లాడుచు నుండిరి యచట చెలులి
రువురు సంతసము గలుగ  ,రూప మందు
నొకవి  ధముగానె  నలరిరి  యుత్సు కతను


 

Wednesday, February 26, 2014

హరికి భార్య పర్వతాత్మజ యుమ

కడలి రాజ పుత్రి క యగు నా  లక్ష్మియే
హరికి భార్య,  పర్వతాత్మజ యుమ
శివుని ధర్మ పత్ని భవబంధ  నాశిని
లోక మాత మఱియు  మాకు భగిని 

పద్య రచన -శివాభిషేకము

భక్తు లెల్లరు గుమిగూడి భక్తి తోడ
చేయుచున్నారు చూడుడు  చిత్ర మందు
పాలు ,పంచామృతములు ను వరలు నేతి
తోడ యభిషేక మాయుమ జోడున కట 

శివస్తోత్రము

 శివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని బలుక గలుగు శివ సాయుజ్యం
భవుడే  యిట్లని జెప్పెను
శివ నామము పలుకుడెపుడు  సేమము కొఱకున్ 

శుభా కాంక్షలు

శివరాత్రి పర్వ దినమున
సవినయముగ వేడు కొనుదు  సహ చరు  లగమిన్ 
శివ నామము  జపియించుడు
భవుడే  మిము గాచు నెపుడు  భవ్యత గలుగన్ 

ఆడు కోతియై యింటింట నాడె వాణి

గంతు లేసెను  శ్రీ వాణి  గట్టు మీద
యా డు కోతియై, యింటింట నాడె వాణి
నాట్య మందున నేర్పరి నాబ డు టన
నాట్య కత్తెలకీర్తులు  నటన లోనె 

చిన్న తిరుపతి

ద్వారకా తిరు  మలగల  దైవ మరయ
స్వయము వెల సిన  ప్రత్యక్ష స్వామి యనుచు
జెప్పె నచ్చటి పూజారి  శిష్యు డొకడు
కనుల  విందొన  గూడెను  గాంచ గానె .

వెండియు నచట  మఱి యొక వేంక టేశు
విగ్ర హంబు బ్ర తిష్ఠ గా వించె, మౌని
యైన దూర్వాసు  ఘనముగ నాహ యనగ
వంద నంబులు మౌనికి వంద లాది

చిన్న తిరు పతి యందుండు చిన్మ యుండు
వేంక టేశు ని జూడంగ వెళ్లి యచట
భక్త జనముల సందడి బరగ లేమి
 మూడు మారులు  దర్శన మునకు నేగ
కలిగె  దర్శన భాగ్యము  కన్ను గవకు

చిన్న  తిరుపతి యందున చెలువు గాను
వేంక టేశుని  సోదరి విడిది జేసె
గ్రామ దేవత రూపాన గనుల పండు
గ వలె  కుంకుళ మ్మను బేర కాంతి తోడ

అమ్మ పాదము ల్దల పైన నాను నట్లు
వంగి ,భక్తి యు  తము గ నే  బ్రణతు లిచ్చి
ఆర్యు లిచ్చిన ప్రాసాద మార గించి
పయన మైతిమి యింటికి  భద్ర ముగను

చక్ర పొంగలి పులిహోర ,చాలీ నన్ని
లడ్డు పొట్లము ల్గొని నట సడ్డ తోడ
ఆర గించితి మచ్చట , యాహ రించి
బయలు దేరగ  న ట నుండి  బాగుగాను
చేరితిమి మఱి  యింటికి  క్షేమ ముగను

 

పద్య రచన -శ్రీ మహా విష్ణువు -బాలుడు

తనకు ప్రత్యక్ష మైనట్టి  దైవ విభుని
రెండు చేతులు జోడించి మెండు గైన
భక్తి యినుమ డించగ నట  బాలు డొకడు
వేడు చుండెను జూడుడు  వినయ ముగను 

Friday, February 21, 2014

పద్య రచన -సీ తాకోక చిలుక

చిత్ర మందుసీ  తాకోక  చిలుక జూడ
రంగు రంగులు వెదజల్లి  రమ్య మగుచు
చూడ ముచ్చట గానుండు  చూప రులకు
చూసి మీరును  ననుభూతి  జూర గొనుడు 

శ్రీ మాతృ స్తుతి

మాతయనగను  శారద మాత యెగద
వంద నంబులు నామెకు  వంద లాది
కరుణ జూపును  నిత్యము కఠిను నైన
సందియంబును నిసుమంత యిందు లేదు 

Thursday, February 20, 2014

హారతి గైకొనుచు లక్ష్మి యమపురి కేగెన్

కోరాడ దేవళం బున
హారతి గైకొనుచు లక్ష్మి యమపురి కేగె
న్నే రోగము వచ్చెనొ మఱి
యారా దీ యంగ మనకు నవసర మిపుడున్

 

విశ్వనాధుని కరమున విశ్వముండె

అభయ చిహ్నము గలదార్య యద్భుతముగ
విశ్వనాధుని కరమున విశ్వముండె
విశ్వనాధుని గడుపున నశ్వర మగు
పంచ భూతాల కధిపతి పరమ శివుడె 

పద్య రచన -ఏనుగు

గోతి యందుండు వత్సను గోము తోడ
లాగు చుండెను గరాన లలితముగను
తల్లి యేనుగు,  జూడుడు  పిల్లను నట
తల్లి   ప్రేమ కు  సాటిది ధరను లేదు 

Wednesday, February 19, 2014

పద్య రచన -తిన్నని శివ భక్తి

తిన్న డ య్యెడ దనకన్ను  దీ సి  శివుని
కంటికి నమర్చ  భక్తిని  గాలు డంత
మోక్ష మిచ్చెను  నతనికి ముదము తోడ
దైవ కృపలన  నిటులనే  దనరు చుండు
 

రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్

తామసు డే యై న పరశు
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
రామల పుస్తులు ని లువగ
రాముడె కాపాడె సామి ! రాజస మొప్పన్ 

లలితా స్తుతి -నేమాని వారు

స్తోత్ర మయ్యది వ్రాసిన సుగుణు డతడు
వరల నేమాని వంశపు  వారసుండు
రామ జోగయ్య నామము  రమ్య మలరి
ధరను  వెలుగొందు నెప్పుడు ధార్మికుడుగ
 

ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా

ఇట్లుగ బలుకుట  నాయమె ?
ముట్లుడిగిన రాధ కిపుడు  మూడవ నెలరా
ముట్లుడిగిన వారల కస
లెట్లుగ సంభవముగలుగు లిట్లుగ బుడమిన్ 

Tuesday, February 18, 2014

కైలాస గౌరినోము

కైలాస గౌరి నోమును
కైలాసపు మాత గురిచి కైవల్యంబున్
మేలుగ బొందుట కొఱకై
చాలిన బెను భక్తి తోడ జరుపగ  దలతున్

అందు కొరకునై  వలసిన నన్ని సరకు
లనగ కుంకుమ పసుపు లు నరటి పండ్లు
తమల పాకులు  వక్కలు దనరు నట్లు
కోర, కొని తెత్తు  నిప్పుడ  కోటి నుండి


సరుకు లన్నియు నొకచోట సర్ది యింట
పసుపు కుంకుమ ల్మండ్లలో భద్ర పరచి
యింటి యాడ పడుచు రాక  కంట జూచి
మొదలు బెట్టిరి  నోమును  మో దమలర


ఆలయంబున పూజకై నరిగి ,యచట
భక్తి శ్రధ్ధ ల గావించి  భవుని పూజ
వచ్చి యింటికి నేరుగ  వరుస వరుస
పసుపు కుంకుమ ల్దోసిళ్ళ  బట్టి యీయ

ప్రక్క యింటిలో నున్నట్టి పడతు లపుడు
నొక్కరొకరుగ  వచ్చుచు చక్కగాను
తీసికొను చుండి రయ్యెడ వాసి యైన
పసుపు కుంకుమ ల్దోసిళ్ళ  బ్రమద మలర


పెద్ద ముత్తైదువల తోడ పిన్నలు నట
కట్టు కొనుచును బొట్లము ల్బిట్టు వెడలె
సరిగ  పన్నెండు గంటల సమయమునకు
పూర్తి యయ్యెను మానోము మాత దయను

నోములు సంపద నిచ్చును
నోములునిక నిచ్చు మనకు నూతన బలమున్
నోములు నిచ్చును నాయువు
నోములె  మఱి కాచు మనల నొవ్వల బారిన్ 

పద్యరచన -సుందరి

 అందమొలికించె  ముఖమార  యటను జూడు
చిత్ర మందలి  సుందరి  చెలువు తోడ
నేమి  ? కన్నీ  ళ్ళు కార్చెను  నెడమ కన్ను
అడుగ దలచితి గారణ మామెను మఱి
 

అమృ తమ్మో ప్రాణ ఘాతమగు గరళ మ్మో

అమరెను రెండవ రాష్ట్ర
మ్మమృ తమ్మో  ప్రాణ ఘాతమగు గరళ మ్మో
సమయము గడచిన  దెలియును
మమతలతో మెలగ నొప్పు మహిలో నిరువుర్ 

ద్రౌపది భర్తలను వారించుట

బాపడీతడు మార్చగ రూపమితని
శిరము నందలి రత్నము ఛే ద నంబు
జేయుడని పతుల ను  గూర్చి చేతులెత్తి
వేడు కొనియెను ద్రోవది వివశత నన

 

Monday, February 17, 2014

నేమాని వారి జన్మదిన శుభాకాంక్షలు

సకల శుభములు గలిగించు  శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
వరలు గురువులు  నేమాని వారి నెపుడు 

చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె

కానబడుచుండు  జిరు మచ్చ కంటి కెపుడు
చంద్ర బింబమ్ము లోన, భాస్కరుడు వెలిగె
చంద్ర కిరణాలు సోకగ సాగరమును
దినకరుండును జంద్రుండు దిరుగు చుండి
యొకరి తదుపరి మఱి యొక రుందు రిలను 

Sunday, February 16, 2014

వారమన రెండు దినములు వారి జాక్ష !

వారమన రెండు దినములు వారి జాక్ష !
మనము పోవుట యాత్రకు  మంది గూడి
చూడవలసిన వన్నియు సొంపు మీర
వ్రాసి యుంచుము నొకచోట  వాసిగాను 

పద్యరచన -తల్లి ఒడి-తొలిబడి

తల్లి యొడిలోన గూర్చుండి  తనయు డచట
నేర్చు చుండెను గ "అ ఆ లు " నియతి తోడ
చూడ ముచ్చట  గానుండె  సొంపు కలిగి
తల్లి యొడి యే ను  దొలిబడి  పిల్ల లకగు . 

షష్టి పూర్తి శుభాకాంక్షలు

గోటేటి వంశ మండన !
మాటలలో జెప్పలేను మఱి నీ శక్తిన్
మూటలు నిండును గొలిచిన
నేటేటా  వయసు బెరిగి యిపుడౌ నరవై

గోటేటి వారి యింటను
నాటలు మఱి పాట తోడ హాయిని గొలుపన్
పాటలే నిక సరిగమలై
మీటెను బెను  వీణ నపుడు మేదుర భంగిన్

ఏమి సంబర మంచును నిరుగు పొరుగు
వారి నడుగంగ బలికిరి వహహ  యదియ
యయ్యగారికి నుత్సవ మద్భుతముగ
జరుప దలచిరి  ఘనమగు జయము గోరి .

అరవై దాటె నె  యప్పుడె ?
యరయంగా నటుల గాన మార్యా ! మేమున్
సరసుడవై జీ వించుము
సురలే దీవింతు రెపుడు  సుబ్రహ్మణ్యా !

షష్టి పూర్తి దినము చక్కగ జరుగంగ
వలయు శక్తి సహన మల వడంగ
దైవ ముండును  నిక దానుగ మీ వెంట
సందియంబు వలదు చందురుండ !

తల్లి దండ్రుల గారాబు  తనయుడీ వు
భామ గీతా కుమారికి భర్త వీవు
తనయ లలితరాణి కి గద తండ్రి నీవు
పెండ్లి కొడుకవు మఱి మాకు ప్రేమ మయుడ !

సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను

(ది 18-2-2014 తేదీన శ్రీ గోటేటి వెంకట సుబ్రహ్మణ్యము గారి షష్టి పూర్తి మహోత్సవము
సందర్భముగా ప్రేమ పూర్వక శుభాకాంక్షలు )
 

Saturday, February 15, 2014

పద్యరచన -పాండురంగడు -బాలుడు

 పాండురంగని బ్రతిమకు  బాలు డొకడు
పట్టె  గొడుగును జూడుడు  భక్తి తోడ
వాని భక్తికి మెచ్చియా భవుడు మఱి ని
ఇచ్చు గావుత !వరముల నెన్నొ దయను . 

Friday, February 14, 2014

పద్యరచన =మందర -కైక

  కైక శయ నించు చోటకు  వేగముగను
మందరేతెంచి  యామెతో మగువ ! వినుము
రాము నడవికి బంపను  రాజు జేరి
యీ యవలసిన  వరమును  నిప్పు డడుగు 

దుష్టా చారములె ముక్తి దొరకొన జేయున్

కష్టముల బాలు జేయును
దుష్టా చారములె , ముక్తి దొరకొన జేయు
న్న ష్ట మ గర్భుని గృష్ణుని
నిష్ఠ త  తోపూ  జసేయ  నీ భువి లోనన్ 

Thursday, February 13, 2014

పద్య రచన ;NTR,ANR,GHANTASAALA

నందమూరి మఱియు  నాగేశ్వ రుండును
ఘంటసాల వారు గాని పించ
రార్య ! యందనంత  దూర మే  గిరిగద
వంద నంబు లిడుదు  వంద లాది . 

దత్తపది ;సభ -బిల్లు -ప్రతినిధి -తగవు


పాండు సూనుల బంపున  బ్రతినిధిగ ను
సంధి జేయగ  వచ్చితి సభకు నేడు
తగవు లాటలు లేకుండ ధర్మ ముగను
సంత సంబి ల్లు  నట్లుగ  సగము నిమ్ము . 

భగవద్గీ తయె విషమ్ము భారత భూమిన్

తగునే యిటు మాటాడుట
భగవద్గీ తయె  విషమ్ము  భారత భూమిన్
భగవద్గీతను బలువురు
నిగమముగా దలతు రెపుడు నిజమిది  వినుడీ !

 

కోటి లింగేశ్వర స్వామి

ఇలను సీ తా న గరమందు వెలసి నట్టి
యాంజ  నేయుని దర్శించి యరటి గెలను
మంత్ర యుతముగ  నర్పించి మరలి , శివుని
జూడ తాళ్లాయి పాలెము చొచ్చితిమఱి

తాళ్లాయి పాలె శంభుని
కళ్ళా రగ జూడ దలచి కాంచగ నేగన్
రాళ్ళును రప్పలు గలుగుత
నొళ్ళం తయు బులిసి పోయి నోపిక చచ్చెన్

మార్గ మంతయు గతుకుల మయమ యౌట
తూ గు టు య్యెల మాదిరి తూలు చుండి
చేరి యుంటిమి  యెటులనో  శివుని గుడికి
ఏమి భాగ్యము నా యది  యీ శు జూతు

చూచితి మచ్చట గోవుల
జూచితి నక్షత్ర వనము జూచితి బవనున్
జూచితిమి  వేంకటేశ్వరు
జూచితి మఱి కోటిలింగ శూలిని  నచట న్ .

అచట గ్రహముల తొమ్మిది కాలయాలు
వేరు వేరుగ  గలవియై విందు గొలుప
తనివి తీ రగ  నర్చించి తన్మయతను
మూగ వోతిని నప్పుడు మూగి వోలె .
 

Wednesday, February 12, 2014

మేడారం జాతర

మేడారం  జాతరయన
వేడుకగా బోవుచుండ్రు  వేలుగ జనముల్
ఆడమగ యనుచు  జూడక
యీ డేర్చును వారివారి  యీ ప్సిత  శతముల్ 

Friday, February 7, 2014

ఆశీ స్సులు

శ్రీపతి వంశోద్ధారక !
యాపద్భాం ధవుడ వయ్య !యందరకు నిల
న్నాపశుప తి  నర్చించ
న్నీ పట్టున జరుగుచుండె నీ యుపనయమున్ .

బ్రహ్మచారిగ  బట్టాను బడయు కొఱకు
చేయుచుండిరి యుపనయ మార్య !నీకు
నీవు దప్పక గాయత్రి సేవజేసి
సార్ధ కంబును జేయుము శశివ టుండ !

నేటి నుండియు నీవుగా మేటి యైన
బ్రాహ్మణుండవు కనుకన భక్తి కొలది
సంధ్య వార్చుము ముప్పూట శ్రద్ధగాను
మేలుసేయును గాయత్రి మీకు నెపుడు

తల్లి దండ్రులు నరయగ దైవ సములు
అడుగు జాడల నడచుచు హాయి గొలుప
సంత సిల్లుచు నిత్తురు సకలములగు
నండ దండలు తప్పక యయ్య !నీకు

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య  సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల ప్రియమున జల్ల గాను

(ది , 9-2-2014,ఆదివారము  చిరంజీవి  శ్రీపతి శశి కాంత్  ఉపనయము సందర్భముగా )
రచన ; పోచిరాజు సుబ్బారావు .

 

Tuesday, February 4, 2014

కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్

మూ లన గల శునకమునకు
కాలొక్కటె కలదు, మూడు కన్నుల దొరకున్
కాలొక్కటె కనబడు మఱి
లీలగ దాం డవము  సేయ ప్రియముం గలుగన్ 

Sunday, February 2, 2014

రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు

రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు మఱి
రాత్రి పగలు  పగలు రాత్రి యగును
కనుక  సరియె  యమెరి  కాయందు శంకర !
వలదు  సంది యంబు  నలతి  యైన .