Sunday, March 16, 2014

గణముల నిర్మాణ ఫలితములు

మగణ  నగణము తదుపరి భగణ యగ ణ
ముండు  చోటుల తప్పక నుండు జయము
మగణ నగణాలు వరుసగ  మలుచ కలుగ
ఫలిత మాయది సమృద్ధి ఫలము గలుగు

మగ ణ నగణము పిమ్మట జగ ణ తగణ
ముండు తావుల యుండు శూన్యపు  ఫల మది
ఫలము గురువర  తెలియుము భరణి యందు
జరుగు నిజముగ  నీ యది సరకు గొనుము

మగణ నగణము కంటెను రగణ సగ ణ
ములుగ  లుగునెడ  బంధుపీ  డలు గ లుగును
సర్వ కార్యము ల్సిద్ధించు సర్వు లకును
భగణ  యగాణాల కంటెను మగ ణ నగ ణ
ములు గ  లుగుచోట తెలియుము  ముఖ్య ముగను

భగణ  యగాణాల కంటెను భగ ణ యగ ణ
ములుగ లుగుదరి  యొనగూ డు  మోద మలర
లాభ మొనగూ డు ననశ ము లక్షణముగ
చింత బనిలేదు తెలియుము  చిత్స్వరూ ప !

ధనము నాశన మగు నార్య !ధరణి యందు
భగణ  యగణము పైనను జగణము తగ
ణములు  గనిపించు నచ్చట నమ్ము నిజము
ననుచు వాల్మీ కి నుడివెను నార్యు లార !

భగ ణ యగణము కంటెను రగ ణ  సగ ణ
ములు గనబడు చో ట శో కము ముందు నిలుచు
కార్య సిద్ధిని బొందును కనుగొనంగ
జగణ తగణాల కంటెను మగణ నగణ
ములు గలుగు నెడ నచ్చోట మోద మిచ్చు

వశము నగు నార్య !సర్వము వశము నగును
జగణ తగణము కంటెను భగణ యగణ
ములు గలుగు నెడ నిరతము ముదము తోడ
నూ టికిం నూరు పాళ్ళు నీ మాట నిజము

శుభ మశుభముల యందును జూడ తఱచి
రెంటి యందును గనబడు రిక్త ఫలము
జగణ తగణము కంటెను సదృశ గణము
కలుగు చోటన నిజమిది కనుము బాల !

స్వజన వైరము గలుగును సత్పురుషుల
కును నెంతగా గాదను కొనిన నిలను
జగణ తగణము కంటెను రగణ సగణ
ములు దగులుకొనినయెడ ల ముఖ్యముగను

గృ హిణీ  నాశన మగునట
అహరహముం రగణ  సగణ యక్షరములకున్
ఇహ యా భగణము యగణము
బహుళముగా బరమైన యెడల బాధలు గలుగున్

రగణము జగణము కంటెను
మగణము తగణం బు వేయ మానిని వినుమా
యగు మఱి కుల నాశనములు
తగునా నిక నట్ల యగుట తనకే కీడున్

రగణము సగణము కంటెను
రగణము సగణంబు నిలుప రంగుగ మీరున్
జగమున జరుగును నాయకు
డుగ బేరొం దు నతడు డూ డూ పలుకున్ .






 

No comments:

Post a Comment