Monday, June 30, 2014

పద్యరచన - శంకరయ్యగారి మనుమడు

తాత !యెక్కడ నుంటివి ?త్వరగ రమ్ము
బోసి నవ్వుల తోడన  భుజము నెక్కి
యాడు కొందును నీ యొద్ద యాట లెన్నొ
యెదురు చూతును మఱి రమ్ము ముదము తోడ

కనుగొందును నీ జాడను
వినయముగా నాన్న నడిగి వేకువ జామున్
దనరగ బాకుచు వచ్చుచు
వనస్థ లిపురంబు తాత ! పంతుల నడి గీ

పద్య రచన -రాత్రికి బియ్యము

కవిత రూపాన నూహల కలలు గనుచు
మురియు చుండెను జూడుడు ముసలి వాడు
పూర్తి యాయెను బియ్యమీ  పూట తోడ
రాత్రి వంటకవసర ము  నాధ!యనగ
 చూచె భార్యను నొకపరి సూటిగాను

తల్లికి జనించు వాడు సోదరుడు కాడు

సోదరుండగు నిజమిది సూర్య !వినుము
తల్లికి జనించు వాడు, సోదరుడు కాడు
మేనయత్తకు బుట్టిన నాని  మనకు
బావ యగుజుమీ తెలియుము బంధ మిటుల

గౌరవనీయులు ,శ్రీ మధుసూ దన రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు


పుట్టితి వట  యీ రోజున
పుట్టిన మధు సూదనుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను  దిరుగు చుండి నలుగురి లోనన్

పుట్టి నేటికి యాయెను పొలుపుగాను
వత్సరమ్ములు నేబది వాస్తవముగ
నందువలనన స్వర్ణ జయంతి యనెడు
 నుత్సవమ్మును జరుపగ నుత్సహించె

రాయల సీమన బుట్టిన
రాయుడు మధు సూ దనుండు రామ తులసినిన్
జాయగ జేయుట కతనన
పాయని సంపదలు గలిగె బహు ముఖములుగన్

నియమ ని ష్ట ల యుతుడు సు నీతు డనగ
బుట్టె వారికి నేకైక పుత్రు డొకడు
బుద్ధి మంతుడు చదువరి బుధ జ నులను
జేరి వినయాన నతులను జేయు నతడు
 తండ్రి పేరును నిలబెట్టు తనయు డేను

వితరణ బుద్ధిని గలిగిన
నతులితమగు సుగుణ శీ లు నతనికి మేమున్
సతతము నర్పణ సేతుము
శతములుగా వందనమ్ము సాదర ముంగాన్

బంధు ప్రీ తిని గలిగిన  బాంధ వుండ !
స్నేహ సంపద నొందిన స్నేహ శీ ల !
సాయ మొనరించు గుణమున  సద్గుణుం డ !
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?

పుట్టు తోడనే నబ్బెను నిట్టు లైన
సాయ మొనరించ యీ బుద్ధి సామి !నీ కు
లేని యెడ లన నిట్లుగా లేశ మైన
చేయ లేవయ్య  సాయము చిత్స్వ రూ ప !

ఉండు మాత్రాన జేయడు నొండు మనిషి
సాయ మెపుడును ,నీ పట్ల సరియ కాదు
చేసితివి మఱి యింకను జేతు వీ వు
పుట్టి నుండియు వచ్చిన బిట్టు గుణము

సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను
--------------------------------------

రచన :::: పోచిరాజు సుబ్బారావు


Sunday, June 29, 2014

పద్యరచన =కాళే శ్వరుని పూజ

చేయుచుండెను బూజను శ్రీ జ  నిరతి
వరల  కా ళే శ్వరున కట వాణి !చూడు
పూజ జేయుట మనవంతు భూరి వరము
లిచ్చుట మఱి యా  భగవంతు డిష్ట ముగద

సతతము బాధించు నట్టి స్వామికి జేజే

అతివా !దగ్గర కాకుము
సతతము బాధించు నట్టి స్వామికి, జేజే
వితరణ బుద్ధిని గలిగిన
నతులిత మగుసుగుణ శీ లు నతనికి నెపుడున్

Friday, June 27, 2014

పద్య రచన -పిల్లి ,పిల్ల

పిల్లి దరిజేరి కూర్చుండి పిల్ల యొకతె
పలుకు చుండెను దానితో  పలుకు లేవొ
చిత్ర మయ్యది జూడగ చిలిపి దనము
గాన బడెను స్ఫుటం బుగ  గనుడు మీరు

పద్య రచన -కప్పల పెండ్లి

వాన రాకడ కొఱకునై వరుణ దేవు
నకిల యాగము గావిం త్రు  నఖిల జనము
మఱియు పెండ్లిండ్లు సేతురు మంచి గాను
కప్ప జంటల కిచ్చట కమల !వినుము

మూగవాడు పాడె మోహనముగ

సంజ్ఞ జేయ నెఱు గు  సంగతు లన్నియు
మూగవాడు,  పాడె మోహనముగ
నిండు సదన మందు నీరజ రమతోడ
గాయకు లిరువురకు వేయి నతులు

Thursday, June 26, 2014

పద్య రచన -రావణుడు

ఆత్మలింగము దిగబడ యవని లోని
కంత రావణుం డెలమిని చింత నొంది
పైకి తీయను యత్నించ బలము చాల
కమఱి  కూల బడగ నయ్యె కనుము సామి !

విస్కీ ద్రాగి యవధాని వెస సభ కేగెన్

విస్కీ ద్రాగుట నేరము
తస్కరి వలె ద్రాగు చుండి తలుపుల చాటున్
మస్కా కొట్టుచు భార్యకు
విస్కీ ద్రాగి యవధాని వెస సభ కేగెన్

Wednesday, June 25, 2014

పద్య రచన -బకము

మాటు వేసెను నాకొంగ నీటి యందు
పిల్ల చేపను లేదేని పెద్ద చేప
పట్టు కొఱకునై నోటను బిట్టు గాను
నార్య !జూ డ నా  చిత్రము నటుల దోచె 

రవిక విప్పి డాసె రమణి యతిని

స్నానమాడ నేగె సావిత్రి యుదయము
రవిక విప్పి, డాసె  రమణి యతిని
పాద పూజ జేయ పాలు పుష్ప మ్ములు
ఫలము లగరు బత్తి వత్తి తోడ

Monday, June 23, 2014

పద్య రచన -కర్ణుడు

పార్ధ ! చంపకు మఱి నన్ను బ్రణతు లిడుదు
రధపు చక్రాలు దిగిపోయె రయము ననిట
శాప ఫలితము లీ యవి  చక్ర ధారి !
నీకు దెలి య ని  దిగలదా ?నీరజాక్ష !

రామ యనిన నోరు ఱా తి రోలు

రామ యనిన నోరు ఱా తి రోలు
నాను డువుదురు గదమఱి  నాస్తికులట
వారు చూతురు  దేవుని  వైరిగాను
దూర ముంచగ వలయును  దురితులనిక

Sunday, June 22, 2014

పద్యరచన =ముసలమ్మ

పార్శ్వ మందున్న మనుమని  పాల కొఱకు
వెన్ను బొమ్మను ముసలమ్మ విక్ర యించ
తీసికొని వెళ్ళు  చుండెను తేజ !చూడు
చిత్ర భావము లొలికించు చిత్తరువును 

Saturday, June 21, 2014

మారణ హోమమ్ము గూర్చు మహిలో శాంతిన్

పేరాశ యదియ జగతిని
మారణ హోమమ్ము గూర్చు, మహిలో శాంతి
న్నారాముని సే వనములు
వీరా !చేయంగ గలుగు వినుమీ నిజమున్

పద్యరచన = భర్త రాకకై ఎదురు చూపులు

భర్త రాకకై నిలబడి భామ యచట
యెదురు చూచుచు నుండె దా నింతలోన
భర్త రాకను గమనించి ప్రమద మలర
సిగ్గు తోడన ముఖమది యగ్గ లించె

Friday, June 20, 2014

పద్య రచన -శంతనుడు =మత్స్య గంధి

ఓర కంటిని జూచుచు నా ల  లామ
మత్స్య గంధియా  శంతను మరల మరల
భయము తోడన నిలువెల్ల వణకు చుండె
పెద్ద వారల యొద్దన వినయ మదియ

Thursday, June 19, 2014

పద్య రచన -వామన గుంటలు

భామల జూడుడు  ,చక్కని
మోములతో గూడి మనకు  ముదమును గూర్చన్
వామన గుంటల నాడుచు
బాములనే మఱచు నట్లు వర్తిలి రచట న్ 

కాకి కాకి కాక కేకి యగునె ?

ఆవసంత కాల మాగమ నంబున
కాకి కాకి కాక కేకి యగునె ?
కాకి కాకి యౌను కేకి కేకి యగును
కాకి, కేకి రంగు కాఱు  నలుపు

నేమాని వారు

భువిని నేమాని వంశపు భూష ణుం డ !
మాతృభూమికి విచ్చేయు మాన నీ య !
రండు కుశలంబు దోడన రామ జోగి !
స్వాగ తంబులు మీకివె  శతము శతము

సులభ తరముగ పయనమ్ము గలుగు నట్లు
చేయ,  గోరుదు నిరతము శివుని మదిని
గీ ము చేరిన వెంటనే ప్రేమ మీ ర
తెలియ జేయుడు శుభ వార్త దేవ !మీరు .

సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య ములనిచ్చి యాదు కొనుచు
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
దయను నేమాని వారిని దప్ప కుండ .


పద్యరచన =సీతారాములు

సీతారాముల జూడుము
చేతో మోదంబు తోడ జేరగ పురమున్
వాతాయానము జేసిరి
భ్రాతలు హనుమంతు రాగ  బ్రమదము లొలుకన్

చేతకానివాడు శ్రీ హరి యట

ముందు సిద్ధ మగును మొగమాట మేలేక
చేతకానివాడు శ్రీ హరి యట
భక్త రామ దాసు బాధలు దరిజేర్చి
నతడు వింటి వీవ యగ్రజుండ !

Wednesday, June 18, 2014

రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్

తామస గుణుడే కదమఱి
రాముడు, రావణుని మెచ్చి రాజ్యమ్మొసగె
న్నీ మాట సత్య దూరము
శ్రీ రాముని సేవ జేయ సిరులను నిచ్చున్

Tuesday, June 17, 2014

పద్య రచన -మాస్కో పూజారిణి

గుడి పూజారిణి జూడుము
వడివడిగా నిచ్చు చుండె భక్తున కచట న్
కుడి చేతిని బైకెత్తియు
జడగా గల శిరసు పైన శఠ గోపమునున్

విప్రుల పూజించిన నపవిత్రులు గారే !

కప్రా వాసపు విప్రుడు
సప్రేమను విష్ణు పూజ జరుపుట కతనన్
విప్రుడు  పూజా ర్హు డగున్
విప్రుల పూజించిన నపవిత్రులు గారే !

Monday, June 16, 2014

కర్ణు డె ద్దు నెక్కి కంసు జంపె

కర్ణు డె ద్దు నెక్కి కంసు జంపెననుచు
జెప్పి రార్యు లుమఱి  చిత్ర ముగను
కంసు జంపి నతడు కర్ణుడు కాదండి
వీరిరువురి యుగము వేరువేరు

పద్య రచన -సాముహిక వ్రతము

స్త్రీ లు  గుంపుగ నచ్చట  సిరుల కొరకు
సత్య నారాయ ణుని వ్రత మత్యనురతి 
గలిగి జేయుట సంతోష ములుగ  దార్య !
నేను వత్తును జేయంగ వ్రతము నచట

Saturday, June 14, 2014

పద్య రచన -మతి మరుపు భార్య

మతిమ రుపుగల భార్యను  మంద లించి
తనదు భుజముపై ననమోసి  కొనుచు పోవు
చుండె నింటికి చూడుము  సుజన ! నీవు
జాలి గుండెల భర్తలు మేలు గాదె !

భూత ప్రేతముల పూజ మోక్షము నొసగున్

కాతరము గలుగ జేయును
భూత ప్రేతముల పూజ ,మోక్షము నొసగున్
భూ తే శుని  పూజించిన
భూతేశు డె యింక నిచ్చు  భూరిగ శ్రీ లన్

రావిపాటి వారు

రచన గావించె మెప్పుగ రావి పాటి
పద్యమొక్కటే యర్ధముల్ హృద్య ముగను
భార తంబును రామాయ ణా ర్ధము లవి
యెంత నేర్పది ? పొగడగ సుంత యైన
జాల  నేనార్య !నతులను జాల సేతు

పద్య మొకటిగా గనబడు దధ్య మదియ
చదివి జూడగ రెండుగో  చరమగు మఱి
తేట గీతియు గాదేని యాటవెలది
రెంటి లోనన నొకటిగా గంట బడును

దినము నకునొక పద్యము దెలుపు చుండు
నయ్య వారగు  మాశంక  రయ్య !గురువు
గారికి మఱి సేతు నతులను  గార వంబు
తోడ సుబ్బరా వనునేను  తుషితు నగుచు

అన్ని పదముల కర్ధము నరయు కొఱకు
ఆంధ్ర భారతి జూడంగ నవసరంబు
కలుగు దప్పక మనకిట కవులు లార !
కలిగి యుండుడు బొత్తము గరము నందు

పద్య మంతయు గాకుండ మధ్య లోన
విడిగ నున్నట్టి పద్యము వెలికి తీసి
మనకు జూపిన ధీశాలి మనగు రువులె
వంద నంబులు వారికి వంద లాది

పద్య మంతయు దెలుపును  హృద్యముగను
రామ కధ యను  బేరన  రామ బలము
భాగ మందున నీకధ  భారతంబు
భళిర యనిపించె రెండింటి  భావములును .

నారి కేళ పా  కంబున నానుకతన
కష్ట మనిపించె నర్ధము  కాని యందు
పద్య మొక్కటి చదివిన విందు గూర్చు
సార మట్లుగ నుండుట జవుల తోడ

కఠి న  పదముల కర్ధమ్ము గనుగొ నంగ
రెండు పద్యాల యడుగున నిండు గాను
సులభ ముగనర్ధ మగునట్లు సొంపు మీర
నీయ బడె నార్య !వివరణ యితని చేత
 

Friday, June 13, 2014

పద్య రచన -పేకాట

కష్టమర్లట నిలబడి కాచు కొనుచు
చూచు చుండగ నామెను ,చోద్యముగను
నాడు చున్నది పేకాట యాయ మమఱి
యేమి చేయదా ?యేమియు యిపుడు పనిని!

నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ

వీరా !యేమని యంటివి ?
నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ  
నారిని బెండ్లాడక మఱి
జారిణి  బెండ్లాడ దలతొ యిప్పుడు చెపుమా !

Thursday, June 12, 2014

శకుంతల

కణ్వుని వదల  లేకన కాంత యాశ
కుంతల వెనుది  రుగుచుండె  వంత కతన
ముల్లు సాకున కాలెత్త డొల్ల యాయె
నాశ్ర మంబున ముల్లులా ?హాహ యేమి ?

సారా గ్రోలంగ జన్మ చరితార్ధమగున్

శ్రీరాముని తత్త్వము మన
సారా గ్రోలంగ జన్మ చరితార్ధమగున్
రారా పోదము మనమును
నారాముని భజన జేయ నాలయ మునకున్

Wednesday, June 11, 2014

పద్య రచన -బడి పిల్లలు బడికి పోవుట

చేయి చేయిని బట్టుకు జెలిమి దోడ
బడికి పోవుచు నుండిరి వడివడి గను
అక్క మఱి యును దమ్ముడు జక్క గాను
సంతసంబును గలిగించె నెంతొ నాకు

Tuesday, June 10, 2014

నయ వంచకులే గద మన నాయకు లకటా !

జయములు బొందుట కొరకై
నయ వాక్యము లన్ని జెప్పి నాయకు లవగాన్
  రయమున మఱతురు నయములు
నయ వంచకులే గద మన నాయకు లకటా !

గంగ పుట్టెను గోలారు గనులలోన

మంచు కొండల నడుమన మహితముగను
గంగ పుట్టెను , గోలారు గనులలోన
బొగ్గు గల దార్య !విలువైన  పుత్త  డియది
నల్ల బంగారు మందురు  కల్ల  గాదు

గాన సుధా రసము గురిసె గాడిద లొకటై

గానపు పోటీ బెట్టగ
కాననమునగల మృగముల కాంతల కెల్ల
న్నానన మందున నగవున
గాన సుధా రసము గురిసె గాడిద లొకటై

పద్య రచన -బడుగు జీవి

బ్రదుకు దెరువు కొరకు బండిలా గుబడుగు
వాని జూడ జాలి ,బాధ కలుగు
చుండె నేమి తోచ కుండె ను  నతడుగా
నెపుడు బయట పడునొ ? నెట్లు  బ్రదుకు ?

Monday, June 9, 2014

పద్య రచన -చీర కట్టిన పిల్ల

ముద్దు లొలికించు చుండునా  ముద్దు గుమ్మ
చీర కట్టిన విధమును  సీత !చూడు
వందనంబులు సేయుచు  నందరికిని
నెటుల నిలబడి యున్నదో  యిప్పుడిచట

Sunday, June 8, 2014

పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున

పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
నవును వార్ధక్య మనునది యసలు లేదు
కోరి కలకున వియెపుడు గోరు చుండు
బడుచు దనమును నిజమిది బాల !వినుము

సీమాంధ్ర

ప్రజల కోరిక లేమియు పాక్షికముగ
నొక్క రాష్ట్రము రెండుగ  ముక్కలయ్యె
పూర్ణ కుంభము తోడన పొలుపు గాను
స్వాగతంబును బలుకుము  సబిత !నీవు 

Saturday, June 7, 2014

పులులావులు గూడి యొక్క పొలమున మెలగెన్

అల కణ్వుని యాశ్రమమున
పులులావులు గూడి యొక్క పొలమున మెలగె
న్నెలుకలు బిల్లులు గూడను
గలగాదిది పచ్చి నిజము కాంతా !వినుమీ

పద్య రచన -గురుకులము

శిష్య వర్గము దోడన  చెన్ను గాను
చెట్టు క్రిందన గురువునా  శీ ను డయ్యి
చేయు చుండెను బోధన సీ త ! గనుము
గురుకు లములేను బూర్వము  గురుతరములు

Friday, June 6, 2014

పద్య రచన -కన్నప్రేమ

కన్నప్రేమకు దార్కాణ మన్న ! జూడు
చిత్ర మాయది యాతల్లి  పుత్రుని నట
ప్రేమ మీరగ నురమున బెట్టు కొనుచు
ముద్దు లీయుచు నుండెను ముద్దరాలు

మత్స్య యంత్రము గొట్టెను మాద్రి కొడుకు

అమిత బలము తోడన నర్జు నుండు
మత్స్య యంత్రము గొట్టెను ,మాద్రి కొడుకు
లునకుల సహదే వులు బల ము నన తీసి
పోరు పార్ధు మొదలుగాగ వీరులకును

Thursday, June 5, 2014

పద్యరచన -చిరుత పులి

వనము నుండి పల్లె వాసుల యొద్దకు
దారి తప్పి చిరుత తడబ డంగ
పల్లె జనులు జూచి వధియించ సమకట్టి
దండ వరుస  జేత  దాడిజే సె

మోసగించు వాడె పుత్రు డగును

మోస పోవు నిజము ముదితలార !భువిని
మోసగించు వాడె, పుత్రు డగును
"పు " అను  నరక  బారి బ్రోచు వాడే మఱి
పుత్రు డుం డ వలయు ముద్దు లీయ

Wednesday, June 4, 2014

పద్య రచన -పొగబండి

ఏమి చిత్రము ?పొగబండి యెటుల  గలదొ !
యిసుక వేసిన రాలదే యిలను పైన
నెంత ఘోరమో! పయనమ  ,యింతు లార !
చేయ వలదమ్మ  యీ పూట  చేయ వలదు

అర్ధ రాత్రి భు జించిన నదిక ఫలము

అన్నమరుగక రోగము లధిక మగును
అర్ధ రాత్రి భు  జించిన ,నదిక ఫలము
నొంద గలడు ది  నముదిన మోర్పు తోడ
చేయ వలసిన  గార్యమ్ము  జేయు నెడల

Tuesday, June 3, 2014

పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్

పందిని  విష్ణువు జూచుచు
పందే నాకిష్ట మనుచు బాపడు పలికె
న్నందము కంటెను నిలనర
విందపు పాదాలు గొప్ప వేయి వి  ధంబుల్

పద్య రచన -శునకము ,బాలుడు

శునకము ప్రేమను నిచ్చును
శునకము విశ్వాస మదియ జూపును మనకు
న్ననుటకు జిత్రము జూడుము
అనునయముంజూప బిడ్డ  హాయిగ నుండెన్

శ్రద్ధాంజలి

(ది . 31-5-2014 వ తేదీన పెద్ద బావ  పరమ పదించిన  సందర్భముగా )


లేవు  లేవాయె  యిక మాకు  లేవు  నీ వు
ఎచట  కేగితి నీ వయ్య !  యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కోస  మిచ్ఛ తోడ .

కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో సామి ! చింత  నుండి
రమ్ము  పెదబావ !  రయముగ  నిమ్ము  గాను .

బంధు ప్రీ తిని  గలిగిన  బాంధ  వుండు
స్నేహ సంపద నొందిన  చెలియ  కాడు
భువిని  నిమిషకవి కులపు  భూ ష ణుం డు 
కల్ల  కాదిది  నిజము నే  బల్కు చుంటి .

మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత  లేదు
సాటి  మనుజుని  మనిషి గా  సాకి నావు
సాటి  యెవరయ్య ! నీ కిల  సాటి యెవరు ?

పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువౌను బావ !యికను
చివరి సారిగ నినుజూడ జేర నైతి
నెంత దురదృష్ట వంతుడ నిలను నేను

ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతిరి ? రమ్ము వేగ 
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమును  బావ !నమ్ము

అమర లోకంబు  జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు  నిను జూచి  యాద  రించ
మసలు  గొనుమయ్య ! యక్కడ  మాన్యు రీ తి
వంద నంబులు నీకివె  వంద లాది

మీ తో  గడిపిన  రోజులు
చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
మాతో బలికిన  బలుకులు
నెంతో విలువైన  వయ్య ! యెంచగ  నిపుడున్ .

సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను


మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక  నయనాలతో .........      
పోచిరాజు సుబ్బారావు

పద్యరచన గణన యంత్రము

 వేల కొలదిగ జనములు వేరువేరు
గణన యంత్రము  ముందర, గంట నుండి
చేయుచుండిరి తమతమ చేయు పనులు
శ్రద్ధ తోడన  చూడుడు  శర్మ గారు !

రావణా సురుండు రాము బంటు

పరమ భక్తి తోడ భవునిబూ జించెను 
రావణా సురుండు, రాము బంటు
అంజనీసు తుండు యాంజ నే  యుడుగద
 వేరు చెప్ప నేల  విపుల ముగను

Sunday, June 1, 2014

తెలంగాణా రాష్ట్రము

నూతన రాష్ట్రము నిచ్చెను
మాతయ మన సోనియమ్మ మనకు న్నిపుడున్
జేతోమోదము తోడన
నేతలు మరి యెన్నుకొనిరి నేతగ జంద్రున్


సాహితీ సంపదకు విభజనము గలదె ?

సాహితీ సంపదకు విభజనము గలదె ?
లేదు సరిగదా యుండదు ,నాదుమాట
నిజము . మాట్లాడు భాషల పసను బట్టి
వేరు వేరని యనిపించు వినుత శీల !

పద్య రచన -బజ్జీలు

వేడివేడిగ బజ్జీలు వేగు చుండ
నూని వంటకై  యెగబడి  నోరు చాపి
కాచు కొనియుండి రచ్చట కాంతలు మఱి
యెంత ఘోరమో యూహించు డింతు లార !

తల్లి దండ్రుల దిట్టుటే ధర్మ మగును

కరము ఘోరాతి ఘోరమౌ కార్య మదియ
తల్లి దండ్రుల దిట్టుటే  ధర్మ మగును
దల్లి దండ్రుల బూజించ  ధరణి యందు
తల్లి దండ్రులు సాక్షాత్తు  దైవ సములు