Saturday, August 30, 2014

పద్య రచన -వేమన పద్యాలు

రచన గావించె వేమన రమ్యముగను
తనదు పేరన మకుటంబు దనరు నట్లు
పద్దెముల శత  మవియన్ని యర్ధ మగుచు
పిల్ల వానికి కూడను బ్రీతి గలుగు 

దత్తపది -కరి -గురి -దరి -విరి (భారతార్ధము )

కరిపు  రంబుదరికి నేగి కరము విరియ
మనసు వారిది, దె లియజే  తును గ  మంచి
గాను నలుగురి యెదుటన గలుగ శుభము
లాన  తీయుము మఱి నాకు  నార్య !బావ !

పదవీ విరమణ శుభా కాంక్షలు !!!


వాసి గాంచిన కొక్కు సద్వంశ మందు
పుట్టి తివి  తల్లి దండ్రుల పుణ్య వశము
విద్య లందించు గురువుగా వినుతి కెక్కి
పదవి విరమించు ప్రాజ్ఞుడా   ప్రణతు లివియె  !

యోగ్యు రాలు స్వరూప సౌభాగ్య వతిగ
రవికుమారుకు లభియించె రాగ మలర
రత్నముల వంటి పిల్లలు రవికి గలుగ
ధన్య మయ్యెను జన్మంబు దైవ కృపన !!!

ఎంద రెందరికో సుమ గంధ మద్ది
యోగ్యులుగ తీర్చి దిద్దిన యోధ మీరు
స్ఫుర్తి నిచ్చిన సౌజన్య మూర్తిమీరు
వినయ శీలురు విజ్ఞాన ధనులు మీరు !!!

నవ్వు చిందించు వాడని పువ్వురీతి
సత్య మార్గమే ప్రగతికి నిత్యమనుచు
నీతి నియమాలు దప్పక నిర్మలముగ
సేవ లందించితిరి మీరు చేవ జూపి !!!

తడబడని నడక నేర్పుచు
నడుగడుగున వెలుగులనిడు  నాదిత్యుడవై
గడిపితివి గతము నంతయు
బడిపిల్లల మద్య నీవు భాసుర లీలన్ !!!

పద్య రచన -సినిమా పాటలు ;; నాడు -నేడు

సినిమా పాటలు నాటివి
తనువును బులకించుచుండి తన్మయు జేయున్
వినగను బాటలు నేటివి
మనమును మఱి దొలిచి వేయు మాన్యుని నైనన్ 

ధన మొక్కటి మోక్ష మిచ్చు దారిగ దలతున్

ధనమును నొక మార్గమెగద
ధనమున జేసెదము మనము దానము లెన్నో
తనరుత దానము ధనమున
ధన మొక్కటి మోక్ష మిచ్చు దారిగ దలతున్ 

Wednesday, August 27, 2014

వాడి పోయిన పూవులు పరిమళించు

వాసు దేవుని బూజకు పనికి రావు
వాడి పోయిన పూవులు, పరిమళించు
పూవు పుట్టిన వెంటనే పొలుపు  నగుచు
చిదిమి పూలను ,బూజ చేయ వలదు

పురుషుల ప్రాణముల దీయ పుట్టిరి వనితల్

పురుషులు రాక్షసు లగునె డ
వెరవక మఱి యింతు లెపుడు వీర్యము తోడన్
సరగున సమరము జేయుత
పురుషుల ప్రాణముల దీయ పుట్టిరి వనితల్


పద్య రచన -శా పము

మునులకు గోపము వచ్చిన
వెనువెంటనె శాప మీయ వెనుకాడరుగా
మనసంతయు రాజగుటను
కనలేకను మునియు రాక కలిగెను శాపమ్

ముని =దూర్వాసుడు
మనసంతా రాజు =శకుంతలకు
రాజు =దుష్యంతుడు

Tuesday, August 26, 2014

నిషిద్ధాక్షరి (ప ఫ బభమ లు ) మద్య పానము మానుము

త్రాగుడు ద్రాగకు తండ్రీ !
త్రాగుడు నిక హాని జేయు దనువున కంత
 న్ద్రాగిన వారందరు నిల

 రోగులు గా నయ్యె గనవె ? రూకలు లేకన్

పద్య రచన -పెద్ద బాల శిక్ష

పెద్ద బాల శిక్ష పేరున గలయట్టి 
పుస్త కమ్ము నొప్పె  శా స్త్రమునకు 
గోచ రించు నందు గోప్యపు విషయాలు 
చదువు బాల !నీవు శ్రద్ధ  గాను 

Monday, August 25, 2014

పద్య రచన -నవరాత్రి చందాలు

చందాల రోజు లీ యివి 
చందాలకు వత్తు రిపుడు జను లందరునున్ 
చందాలు దేనికనగను 
నందముగా దుర్గ మాత యర్చన కొఱకున్ 

కామదాసు లైన గలుగు ముక్తి

  ఇహము పరము కూడ నిడుమలే యుండును
 కామదాసు లైన , గలుగు ముక్తి
భక్తి  శ్రద్ధ తోడ భగవంతు బూజించ
దయను జూపు నతడు  దైవ మేను 

Sunday, August 24, 2014

పద్యరచన -నానృషి;కురుతేకావ్యం
ఎంత చదువునుజదివిననెంతయైన
చేయరాదుగకావ్యముజేవగలుగ
ఋషిది యంశములేనిచోనెవరికైన
నానృషి;కురుతేకావ్యమౌ నిజము

దత్త పది -దెస -నస-పస-వెస

అన్ని దెసలను నరయగ నాంజనేయు
డమ్మజాడనువెసదెల్పనర్హులైన
బసలుగలుగు వానర ప్రముఖులనగ
వారు, నసలేని వారలపంపెనార్య!

Saturday, August 23, 2014

పద్యరచన-రెండుసింహములురెండుసింహములచ్చటపండుకొనుట
చూడ ముచ్చట గలిగించుజూపరులకు
వాని పొత్తులుజూడగవాహవహహ
భేషుగాగని పించెనుబ్రీతి జూడు

వల్లకాడులో పెళ్లి సంబంధ మమరె

వేలకొలదిగ  శవములు గాలునటగ
వల్లకాడులో, పెళ్లి సంబంధ మమరె
 మామ కూ  తురితోడన    మనుమనునకు
 బెండ్లి చేతురు వారికి వైభవముగ

అమ్మా యనిపిలువగానెయాగ్రహమందెన్


ఇమ్ముగనక్కునజేర్చును
నమ్మాయనిపిలువగానె,యాగ్రహమందెన్
కమ్మలుపోయెనునాయవి
యమ్మా! మరియేమిజేతుననగను నేనున్

పద్య రచన -పక్షి- కొమ్మ -


పచ్చ పచ్చగ గలయట్టివనములోన
రంగురంగులపూవులురంగరించ
పక్షి యొక్కటినిలబడెపసిడిరంగు
పూలు గలిగెడుకొమ్మలపొదలయందు

శేషశయను బూజ సేయ రాదు

  ధనము మిగుల గలుగు దా భక్తి శ్రద్దల 
శేషశయను బూజ సేయ , రాదు 
మోక్ష మెపుడు మరిని మూర్ఖునకు ధరను 
రక్తి కలుగు చోట భక్తి కలుగు

పద్య రచన -వినాయకుడు -కోమలాంగి

విఘ్న నాధుని నెదుటన విరులు గూర్చు
కన్యకా మణి జూడంగ గాని పించె
భక్తి భావంబు నామెలో ప్రబలె నట్లు
కరుణ జుచుత !యామెనా గణపతి మఱి .

Friday, August 22, 2014

టంగుటూరి వారి జయంతి

పుట్టితి వట యీ రోజున
పుట్టిన శ్రీ టంగుటూరి !పొ లుపుగ   నీ కున్
బిట్టున నిడుదును  నతులను
పట్టును సాధించి తీవు  పర పాలన లోన్

న్యస్తాక్షరి -సరస్వతీ దేవి స్తుతి

సకల సద్గుణ రాశివి శార దాంబ !
యమర గణములు సేవింత్రు నంబ !నిన్ను
సరగు గాపాడు మో స ర  స్వతి గరుణను
నిన్ను నిత్యము గొలుతును నిరతి నమ్మ !


ఒకటవ పాదములోమొదటి యక్షరము "స " రెండులో
మూడవది "ర " మూడులో పదవ ది "స్వ " నాలుగులో
పన్నెండవది "తి " యుండాలి .  

జడ శతకము-ఒక పద్యము

జడ లుండు  రెండు రకములు
పొడుగుగ మఱి కొన్ని యుండు బొట్టిగ నికయున్
బొడుగు జడలున్న యెడలన
గడు నందము గలిగి యుండ్రు కాంతలు నెపుడున్

Wednesday, August 20, 2014

దత్త పది -గద్యము -పద్యము -మద్యము -హృద్యము

పద్య గద్యము లాయవి హృద్యముగను
నుండి మనసును నాహ్లాద మొంద జేయు
మద్య పానము చేసిన మంద లించి
కలుగ సద్బుద్ధి , వ్రాతురు  కవన ములను

ముగ్గురమ్మలు

ముగ్గురమ్మలు కూర్చుండి మురిపెముగను
ముచ్చట ల నాడుచున్నట్లు మోములుండె
నెంత  తీరుబడిగ నుండి రింతు లచట
పనులు లేవేమొ వారికి బాల !యడుగు

Monday, August 18, 2014

పద్యరచన -భామలు బిందెలతో నీళ్ళు

నీరు బిందెల నిండుగ నింపుకొనుచు
నడుము లోతును గలయట్టి మడుగు లోన
పోవు చుండిరి భామలు మూవు రచట
చూడ చక్కని దృశ్యము చూడు బాల !

నారాయణ యనిన జాలు నరకమె గతియౌ

 పారము దాటగ వచ్చును
నారాయణ యనిన జాలు,  నరకమె గతియౌ 
నా రాయణు దూ షించిన
నారని సంపదల నిచ్చు నా ప్రభువేను

Sunday, August 17, 2014

శ్రీకృష్ణుని మేనమామ, శిశుపాలుండే


శ్రీ కృష్ణా ష్టమిఅష్టమి రోహిణి పొద్దున
న ష్టమ గర్భుడు గ పుట్టె నాకన్నడిలన్ 
న్ని ష్టముగ పూ జ చేసిన
కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్ .

నిషిద్దాక్షరము -ర -శివ ధనుర్భంగము

ఫెళ్ళు మనగ విల్లు ఝల్లు మనియె మఱి
యవని పతుల గుండె నా క్షణమున
పూలమాల వేసె   పూబోడి మెడలోన
నినకు ల మణి  మిగుల  నింపు గలుగ


పద్య రచన -కవలపిల్లలు

నలుపు తె లుపుల రంగున నచట నుండు
 పిల్ల లిద్దరు చక్కని బేర్మి తోడ
చూచు చుండిరి మనలను సూర్య !కనుము
ముద్దు లొలికించు మోముల ముద్దరాళ్ళు

Saturday, August 16, 2014

కలహమె సుఖ శాంతులకును గారణము గదా

లలనా !చెలిమికి బన్నము
కలహమె, సుఖ శాంతులకును గారణము గదా
యిల వెంకన్నను గొలుచుట
కలియుగపుం దైవ మతడె కంటివె  బాలా !

పద్యరచన -డబ్బుల కట్టలు

అట్టల లోపల డబ్బులు
కట్టలుగా నుండె నచట కళ్లుం జెదర
న్నిట్టటు జూసియు కొందరు 
బిట్టున గొనిపో దురే మొ ? పిల్లా ! గనుమా . 

Friday, August 15, 2014

పరిణయములు గుదురు నండ్రు పర లోకములోన్

అరవిందాక్షుని గరుణన
పరిణయములు గుదురు నండ్రు పర లోకములోన్
తరతమ భేదము జూపక
సరగుననే గారవింత్రు సమ మగు భావన్ 

త్రివర్ణ పతాకము -బాలుడు

మూడు రంగుల జెండాను ముచ్చటగను
జేత బూనుచు బాలుడు చిత్రమందు 
కాన బడియెను చూడుము కనుల కమల !
యుట్టి  పడుచుండె నతనిలో గట్టి భక్తి 

భరత భూమి స్వాతంత్ర్యము బడయ లేదు

భరత భూమి స్వాతంత్ర్యము బడయ లేదు
అనుట సరిగాదు బడ సెను నార్య !నేడు
అందువలనన జెండాకు వందనంబు
జేతు మీరోజు తప్పక చేతు లెత్తి 

Thursday, August 14, 2014

(ది .19-9-2014నుండి కరి సీతారామమ్మ గారి సంవత్సరీ క ములు సందర్భముగా శ్రద్ధాంజలి )

 

లేవు  లేవమ్మ !యిక మాకు  లేవు  నీవు
ఎచట  కేగితి వోయమ్మ! యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కోస  మిచ్ఛ తోడ .

కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో యమ్మ !చింత నుండి
రమ్ము వేవేగ మొక సారి రమ్ము మరిని


మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత  లేదు
సాటి  మనుజుని  మనిషి గా  సాకి నావు
సాటి  యెవరమ్మ  ! నీ కిల  సాటి యెవరు ?

పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువాయె  భామ !యికను
చివరి సారిగ జూచుటే చివరి చూపు
ఎం త దురదృష్ట వంతుడ నిలను నేను

ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతివి  ? రమ్ము వేగ
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమునే నమ్మునన్ను

అమర లోకంబు  జేరితి వమ్మ  ! నీ వు
అమరు లందఱు  నిను జూచి  యాద  రించ
మసలు  గొనుమమ్మ  ! యక్కడ  మాన్యు రీ తి
వంద నంబులు నీకివె  వంద లాది

నీ  తో  గడిపిన  రోజులు
చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
మాతో బలికిన  బలుకులు
నెంతో విలువైన  వమ్మ  ! యెంచగ  నిపుడున్ .

సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను


మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నమ్మ  ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమమ్మ  ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక  నయనాలతో .........    
కోటేశ్వరరావు మఱియు కుటుంబ సభ్యులు 

Wednesday, August 13, 2014

పద్య రచన -శ్రీ కృష్ణుడు -ఫేసు బుక్కు

జగము నాడించు కృష్ణుడు సంతసమున
ఫేసు బుక్కును నన్నకు  బ్రియ సతులకు
దనకు వచ్చిన "కామెంటు " తతిని చూపు
చుండె నచ్చట చక్కగ జూడు డార్య !

దత్తపది-కలి -పులి -వెలి -బలి (వెన్నెల రేయి వర్ణన )

కలికి ముఖమును వర్ణింతు రార్యులు గద
యెంత వర్ణించిన వెలితి యేయ గునుగ
నంద మందున బలియుడై  నట్టి చంద్రు
పులిన కిరణాలు బోల్చగ భువిని సామి !

Tuesday, August 12, 2014

శంకరాభరణము -సమస్యల సమస్య

విన్నపము జేయుచుంటిని
సన్నుత ! మఱి యాపవలదు  శక్తింగొలది
నన్నువ నిచ్చుచు నుండుము
బన్నము గాకుండు నటుల బ్రతిదివ సంబున్

చి.సౌ . లలితా గోపీల నూతన గృహా ప్రవేశము సందర్భముగా


Inbox


Aug 7 (5 days ago)


స్వంత యింటి కలను సాకార మొనరించు
నోయి గోపి !!నీకు నొసగు నీశు
డెపుడు సుఖము ,శాంతి ,యిష్టముల నిలను
జీవి తమును గడుపు సేమ మలర

వేద మంత్రాలు సదువంగ విబుధ వరులు
పూజ్య గోమాత వెనుకన పొమ్ముసామి !
నీవు కొన్నట్టి యింటికి నెమ్మనమున
శుభము లగుగాత !నిరతము భవుని దయను


కలకాలము మీరందఱు 
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను(రచన ==పోచిరాజు సుబ్బారావు )

రమ్మును త్యాగయ్య గొని స్వరముల గూర్చెన్

ఇమ్ముగ రామక ధాసా
రమ్మును త్యాగయ్య గొని స్వరముల గూర్చెన్
గమ్మని పదముల తోడను
రమ్మా మఱి నీవు కూడ   రాగము వినగన్

పద్యరచన -సూర్యాస్తమయము

లలన !దినమంత పుడమికి వెలుగు నిచ్చి
తనర మార్తాండు డొయ్యన వనధి యందు
నస్త మించగ సమకట్టె నచట చూడు
సూర్య బింబపు సొగసులు చూడ్కు లలర .

Sunday, August 10, 2014

పద్య రచన -శ్రీ కృష్ణుడు నదిని దాటుట

దాటు చుండగ గృష్ణుడు దారి యిచ్చె
దల్లి యమునయె  జూడుమా లల్లి !యచట
జగము నాడించు నాతడు చంటి బిడ్డ
వోలె కూర్చుండె భుజముపై  బుద్ధి తోడవానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

బోనము నోటికి రాదుగ
వానలు లేకుండ ,మెట్ట వరి ఫలియించెన్
వానలు బాగుగ బడుటన
వానలు మఱి లేనిచోట బ్రదుకుభ రమగున్ 

Friday, August 8, 2014

అన్న గారైన శ్రీ రవీంద్ర నాధ శర్మ గారికి శ్రద్ధాంజలి

లేవు లేవాయె యికమాకు లేవునీ వు
ఎచట కేగితి వన్నయ్య ! యిచట నుండి
యెదురు చూతుము మీరాక యెపుడ నుచును
మమ్ము  కరుణించి రావయ్య  మా ద రికిని .

ఎప్పుడు నెక్కడ కలిసిన
నప్పా !మఱి బాగె నీ వ ? యందరు కూడ
న్నెప్పుడు  వచ్చితి విచటకు
చొప్పున నను నడుగు చుండు సుఖముల నెపుడున్

పట్టు దలను దోడ పట్టభద్రుడ వయై
యొజ్జ లందు మేటి యొజ్జ గాను
పేరు గాంచి తీవ ప్రేమాదరమ్ముల
నిన్ను మించు నతడు మన్ను లేడు

ఏమి పాపము జేసితి మేము సామి !
దయను విడనాడి పోయిరి ధర్మ మౌనె ?
నెదురు చూసియు చూసియు నిపుడు నాదు
కళ్ళు జూడుము కాయలు కాచె సామి !

బంధు  ప్రీతిని గలిగిన బాం ధ వుండ !
స్నేహ సంపద నొందిన చెలియ కాడ !
పుడమిని నివర్త  వంశపు బుధుడ వీ వ !
కల్ల కాదిది నిజమునే బలుకు చుంటి

మాయ మర్మము  లెరుగని మనిషి వీవు  !
మత్సరంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషిగా సాకి నావు
సాటి యెవరయ్య  నీకిల సాటి యెవరు ?

మరణ కాలంబు దెలిసెనా ! మాత కృపను
నమ్మ పోషణ కూతుళ్ళ కప్ప గించి
వప్ప గింతలు సేసితి వొప్పు గాను
నందు కొనుమయ్య ,సాదర వందనాలు

 కాన రానట్టి దూ రంబు  గడచి నావు
కాను  పించుమ యొకసారి ,కాంచి నిన్ను
 సేద దేరుదుమో సామి !చింత నుండి
రమ్ము సోదర !ర  యముగ నిమ్ము గాను

మీరు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము భారమంతయు నిక నా మురహరి
చూచు కొను నార్య !నిజమిది ,లేచి యికను
నందు కొనుమయ్య శ్రద్ధాంజ లందుకొ నుము

నీ దు  పయనము దెలిసిన నీకు గలుగు
వేల కొలదిగ శిష్యులు వెంట బడుచు
సాగ  నంపిరి మిమ్ముల సాదరముగ
నాహ ! జోహార్లు మాయవి యందు కొనుము

సకల   శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
నీదు  జన్మకు శాంతిని నెగడు గాక !

(ది . 7-8=2014 తేదీన శ్రీ అన్నగారైన రవీంద్ర నాధ శర్మ గారు
పరమ పదించిన   సంద ర్భముగా అశ్రు  పూరిత నయనాల తో .......... )
రచన : పోచిరాజు సుబ్బారావుThursday, August 7, 2014

గు రుదేవులు నేమాని వారికి శ్రద్ధాంజలి


 లేవులేవాయెయికమాకు లేవునీవు
యెచటికేగితినీవార్య!యిచటనుండి
రమ్ము మాకొఱ కొకసారి రామజోగి!
శంకరాభరణ గురువ!శర్మ!మీరు

Wednesday, August 6, 2014

పద్య రచన - శంఖములు

చిత్ర మందలి శంఖముల్ చిత్రముగను 
మెరయు చుండెను జూడుము, మిత్రుని కర 
ములవి సోకంగ ధగధగముగను  మిగుల 
సూర్య కిరణాల మహిమయే యార్య !యదియ 

దారిద్ర్యము మనకు నిచ్చు ద రుగని ధనమున్

పూరాగా బా ధలనే
దారిద్ర్యము మనకు నిచ్చు, ద రుగని ధనము
న్నారావణు నిర్జించిన
మారాముని సేవజేయ నిచ్చును మనకున్

పెండ్ల మయ్యెను బార్వతి విష్ణు వునకు

శివుని కొఱకునై తపమును జేసి మరిని
పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణు వునకు
తనర  శ్రీ లక్ష్మి మఱియు సంతాన లక్ష్మి
యనగ నిరువురు భార్యలు  నండ్రు జనులు


చక్రములు లేని బండి చక చక సాగెన్

 వక్రముగను బోజాలదు
చక్రములు లేని బండి చక చక సాగెన్
చక్రముల తోడ గూడిన
చక్రుని యారధము మిగుల సావేగముగాన్ 

పద్య రచ న -గోంగూర చెట్టు

చెట్టు,గోంగూర యచ్చటచిల్వతోడ
చూడ ముచ్చటవేసెనుజూడగానె
మంచి యేపుగ పెరిగెనుమైత్రి!చూడు

భోజ్యవస్తువు ప్రతి యొక్కభోక్తకుమరి

Monday, August 4, 2014

తద్దినమ్మును బెట్టిన , ధరణి వీడు

ఏటి కేడాది బోనంబు నిష్టముగను
తిందు రియ్యేడ పెద్దలు దేన్చు వరకు
తద్దినమ్మును బెట్టిన , ధరణి వీడు
కాల మాసన్న మైనచో కాలు డైన

పద్య రచన -పున్నమి చంద్రుడు

పున్నమి చంద్రుని జూడుము
మిన్నున నట వెలుగు చుండె మిలమిల తోడన్
చెన్నుగ రూప్యము వోలెను
వెన్నుని సరి బొమ్మ యుండె బింబము లోనన్

తల్లియు దండ్రియును లేక దనయుడు పుట్టెన్

అల్లా! యేమీ చిత్రము ?
తల్లియు దండ్రియును లేక దనయుడు పుట్టెన్
కల్లయొ  నిజమో  , యీ యది
కొల్లలుగా జరుగు చుండు కుశునుని వో లెన్

Sunday, August 3, 2014

కరి నెత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్

కరమది పొడవుగ లదగుట
కరి ,నెత్తుకు పోయి యెలుక కలుగున దినియె
న్జరజర  బోవుచు నంగడి
నరయంగా నొక్క బల్లి నాహారముగన్

పద్యరచన -కొబ్బరి చిప్పలు

ఎండు కొబ్బరి చిప్పలు మెండు గాను
నేల మీదన పడియుండె నీల !చూడు
మెన్ని యున్నవో లెక్కించి యిపుడు చెప్పు
సంచి కెత్తుద మన్నింటి బంచు కొనుడు

Saturday, August 2, 2014

చి . సౌ . సౌమ్య ,రాం ప్రసాదుల వివాహము సందర్భ ముగా శుభా కాంక్షలు .....


పాలూరి వంశ కన్యక !
గా లము మఱి వేసి తీవు గడుసరి దానౌ
గేలములో చిక్కెను యీ
కాలపు సరి యైన నతడు  కాంతా !నీకున్

వధువు పుట్టెను పాలూరి వారి యింట
వరుడు యద్దనపూ డిని వారి యింట
జూడ చక్కని జంటయై చూపరులకు
సంత సంబును గలిగించు సంతతమును

సౌమ్య !వినుమిది యొక మాట సౌమ్య ముగను
భర్త యెడ లన నీవుగా వలపు గలిగి
చిలుక గోరింక వోలెను జలము బాలు
విధము కలసి మెలసి యుండు వేయి యేళ్ళు 


అమ్మ నాన్నల విడిచియు నరుగు దేర
బెంగ యుండును నిజముగ బేల !నీకు
అత్తలోనన జూడుమా యమ్మ నికను
కుదుట పడునమ్మ మనసు నీ ,కొంత వరకు కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను


రచన ; పోచిరాజు సుబ్బారావు 

పద్య రచన -పల్లె పడుచు

సొంపు లన్నియు గనబడ  నింపుగాను
నెత్తి మీదన నొకమోపు నొత్తి యుంచి
వంగి కుడిచేత మఱియొక చెంగలి గల
గడ్డి మోపును నెత్తుట గనుడు మీరు

Friday, August 1, 2014

అ రటి పండు , మూ ల్య మారు కోట్లు

  తీ య తీయ నుండు తేనేవో లెను మఱి
య రటి పండు , మూ ల్య మారు కోట్లు
నగర మందున గల  నరసింహు భవనమ్ము
పెద్ద వారి యిండ్లు  దద్ద రిల్లు     

...మాతాపితల సేవ.చిత్ర మందున జూడగ జెప్ప వచ్చు
బుత్రుడ నగను నొప్పును బుడమి యందు
తల్లి దండ్రుల నిరువురి ద్రాసు నందు
మోయు చుండెను బ్రేమను ముదిత మలర