Tuesday, September 30, 2014

పద్య రచన=పిల్లి -ఆహారమునకై నెదురు చూపు

పిల్లి యొక్కటి కూర్చుండె  మెల్ల గాను
నెదురు జూచుచు నాహార మేదియైన
వచ్చు  నేమోయ  నుకొనుచు  గచ్చు మీద
నెంత  తెలివై న  దో!పిల్లి  చింత జేయ .

Monday, September 29, 2014

దత్త పది =కాకి ,కోయిల ,కొంగ ,నెమలి భారతార్ధము


నాదు కొంగది లాగెను  నాధ ! వినుము
ఎందు కోయిల  బ్రదుకంగ నిపుడు నేను
నేనె మలిన మైతినిమఱి  , నెమ్మదిగను
నూర కుండుట కా కిరీ  టీ ! ర  భసము ?

పద్య రచన -కనక దుర్గమ్మ

కనకపు  పళ్ళె ము తోడను
కను విందుగ బిలుచు చుండె కంటిరె  దుర్గ
న్ననువగు నొక యుద యంబది
తనరగ నా యింటివారు ధన్యా త్ములుగా

డి డియరు ఫామ్సు (Buffolo grove,USA)

 
ఆది వార మగుట నాహ్లాద ముకొఱకు
మనుమ రాళ్ళ తోడ ,మఱియు కొడుకు
కోడ లియును రాగ ,కూడ వ చ్చిన నెయ్య
ములగ  లుపుకొ  నుచును ముదము తోడ

కార్ల మీదను బోతిమి కాంత ! మేము
ఒక్క యరగంట లోపల చక్క గాను
పోయి తిరిగితి మంతయు హాయి గలుగ
పండు వెన్నెల వంటియా యెండ లోన

డి డియరు  ఫామ్సుని  జూడగ
గడుగొని బోవంగ నచట గాంచితి రైడుల్
వడినడకల పొగ బండియు
గడు నొప్పగ నొంటె యుండె గనుగవ కింపౌ

చూచితి నట మఱి యింకను
చూచితి నే మొక్క జొన్న సొగసుల తోటన్
చూచి మఱి  బండి మీదను
దా చుట్టూ తిరిగి రాగ దాహము వేసెన్

తిరిగి తిరిగి యలసి చిరునగ వులతోడ
చేరు కొంటి మియిక చేరు వైన
యింటి మొగము వట్టి గంట లోపున జేరి
నిద్ర పోతి మమ్మ ! నీర జాక్షి !

Sunday, September 28, 2014

బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట రాదు

పట్టనర్హత గలుగునా ? పట్టమనకు
బ్రహ్మ కడిగిన పాదమున్, బట్ట రాదు
అడ్డ మైనవా  రలకాళ్ళు హాస్య మునకు
నైన నెపుడును నిజమిది యౌన ?కాద ?

పద్యరచన -వరికుప్పలు

వరికుప్ప లవియ చూడుము
వరి ధాన్యము తోడ మరిని వరుసగ నుండెన్
వరిధాన్యము సరి యగుటకు
చెరుగుచు నట యుండె నొకడు చేటల తోడన్

దసరా శుభాకాంక్షలు

బ్లాగు మిత్రుల కిడుదును వంద నములు
దసర పండుగ కతనన దండి గాను
అందు కొను డార్య !మీరంద  రందుకొనుడు
నా శు  భాకాంక్ష లీ యవి ,వేశ తములు

Saturday, September 27, 2014

పద్య రచన -ఖడ్గ మృగము

ఖడ్గ మృగ మది  చూడుము కత్తు లెన్నొ
కాయ మంతయు సూదిగా కలిగి యుండు
నెదురు వచ్చిన వారిని నేక ముగను
బొడిచి చంపును కత్తులు  వాడి కతన

న్యస్తాక్షరి -దుర్గా దేవి స్తుతి (మొదటి పాదము 2వ గణము మొదలు "దు " 2వ పాదము 3వ గణము మొదలు "ర్గ " 3 వ పాదము 4వ గణముమొదలు "దే " 4వ పాదము 5వ గణము మొదలు "వి " ఉండాలి

అమ్మ !దుర్గమ్మ !కాపాడు మమ్మ , నన్ను
న లము పాప వర్గమ్మును దొలగ జేయ
దీ ను నై నట్టి  యీ నేను దేవి ! నిన్ను
మఱువ కుండగ బూజింతు మాత ! వినుముపద్య రచన -అడవి పంది

పందులన్నిటి కంటెను భయము గొలుపు
పందియనియండ్రు   గనడవి  పంది నిలను
నెదురు వచ్చిన వారిని నేక ముగను
బంపు  పైలోక  ములకట  బగను గలిగి

పదవి విరమణ ( సేకరణ )ఎంద రెందరికో సుమ గంధ మద్ది
యోగ్యులుగ తీర్చి దిద్దిన యోధ మీరు
  స్ఫూ ర్తి నిచ్చిన సౌజన్య మూర్తిమీరు
వినయ శీలురు విజ్ఞాన ధనులు మీరు !!!

నవ్వు చిందించు వాడని పువ్వురీతి
సత్య మార్గమే ప్రగతికి నిత్యమనుచు
నీతి నియమాలు దప్పక నిర్మలముగ
సేవ లందించితిరి మీరు చేవ జూపి !!!

తడబడని నడక నేర్పుచు
నడుగడుగున వెలుగులనిడు  నాదిత్యుడవై
గడిపితివి గతము నంతయు
బడిపిల్లల మద్య నీవు భాసుర లీలన్ !!!Friday, September 26, 2014

వెంట బడి చంపు వాడె పో ప్రియస ఖుండు

పరమ రాక్షసు డౌ గద భరణి యందు
వెంట బడి చంపు వాడె పో, ప్రియస ఖుండు
కష్ట కాలము లందున కనిక రించి
యాదు కొనునుని  జముగ దా నాప్తు డగుచు

పద్య రచన -చెవి దుద్దు

వామ భాగపు చెవి దుద్దు వదులు కతన
పెట్టు కొనసాగె జూ డుడు బిగువు గాను
ముద్దు లొలికించు నందాల మోముతోడ
కుందనపు బొమ్మ వలె యుండి యంద  గించె

దుద్దులు బెట్టుచు చెవులకు
నద్దములో జూచుకొనుచు నాహ్లాదముగా!
దిద్దిన తొడవు ల తళుకులు
ముద్దుల మోమున మెరియగ ముదితయె మురిసెన్!

వైభవ లక్ష్మి పూజ

అద్భుతముగ బూ జించితి వమ్మ !పద్మ !
మాత వైభవ లక్ష్మిని మనసు నిండ
యామె యిచ్చుత ! యారోగ్య మాయు సిరుల
నెల్ల వేళల మీ కుగా  నుల్ల మలర . 

Thursday, September 25, 2014

నిషిద్ధాక్షరి -పెండ్లి విందు ,అనుస్వార రహితము

వైవాహిక భోజనమున
నావడులను బెరుగు తోడ నాహార ముగన్
వేవడిగ  వేయు కతనన
పావని తిన నోపదయ్యె బవన కుమారా !

పద్య రచన -ఉడుత

ఉడుతలు చిన్నవి యైనను
కడువేగము కలిగి యుండు గమనము లోనన్
వడిదిరుగుచు గొమ్మలపై
కడుసుందర మొప్పు బ్రజల కళ్ళకు నెపుడున్

Wednesday, September 24, 2014

ఈ తాకుల గుడిసె లోన నినుడుద యించెన్

మాతాతలు నిదురించిరి
యీ తాకుల గుడిసె లోన, నినుడుద యించె
న్నీతూరుపు కను  మలలో
మాతా ! యిక లెమ్ము, నిదుర  మాప టి కెకదా 

పద్య రచన -చిన్న పిల్ల- పావురములకు బియ్యము

చిఱు త  ప్రాయము నందున చిట్టి పాప
చల్లు చుండెను బియ్యము మెల్ల గాను
భూత దయతోడ మఱి యాక  పోత ములకు
చూడ చక్కని పి ల్లయే  చూడు నీవు

బంధములు

బంధములన్నిటి గంటెను
బంధము సంసార మదియ బహుక ష్టంబున్
బంధములు ద్రెంపు కొననిమి
యంధత్వమె యగును బ్రదుకు నార్యా ! వినుమీ .

Tuesday, September 23, 2014

అడుగులకు మడుగు లొత్తు

అడుగులకు మడుగు లొత్తు ట
కడుహీ నము సంఘ మందు కారణ మేదౌ
నడవడిక మనది సరిగను
నడరినచో భయము లేదు నాత్ముల వలనన్

దత్తపది -తల(నాలుగు పాదాలలో )పూలతోట వర్ణన

తలపగ నీతోట నుమఱి
తలపునకున్ వచ్చెనాకు తలిరుల బోడుల్
తలచుకొని  బూ లతోటను
తలపులవల జిక్కు కుంద్రు దారలవోలెన్

Monday, September 22, 2014

అన్నము సున్నం బయె వదినమ్మలు వండ న్

అన్నా ! యేమిది చిత్రము !
అన్నము సున్నం బయె వదినమ్మలు వండ న్ ?
అన్నము సున్నమ యగునా !
మున్నెన్నడు వినగలేదు మూర్తీ ! నిజమా !

పద్య రచన -శిల్పము

శిల్ప మందున జెక్కిన చిత్ర మదియ
చూడ బ్రాణము గలదియై చూపరులను
మోహితుల జేయు దనదైన ముఖము తోడ
నేమి యందమ ? యాయది యేమి సొగసు ?

చక్కని శిల్పము భళిరా!
మక్కువతో తీర్చిదిద్దె మగువను శిలలో
చెక్కిన శిల్పికి జోతలు
నిక్కంబుగ ప్రాణమున్న నెలతగ దోచెన్!

రవితేజ

రవితేజా జూ పించెను
సవివరముగ దనదు పవరు సమయము బట్టిన్
పవరను బేరున వచ్చిన
నవచిత్రము నందు మిగుల నవ్యత దోపన్

Sunday, September 21, 2014

ఫారెస్టు ప్రజర్వు (Buffalo grove, USA)

ఫారెస్టు ప్రజర్వు జూడగ
నారాముగ నేగ నేను నాత్మజు వెంటన్
కారు దిగి నడక దారిని
దూరముగా నేగంగ నచట  దొర కని పించన్

ఎంత దూరము మరియును   నెంత వరకు
బోవు నీ దారి చెప్పుమ పుణ్య పురుష !
ననగ ముప్పది మైళ్ళుగా గనబడు నిది
పోవు  నుచికాగొ డవును ట వునువ రకును

నావి  నినిరాశ  తోడన నడక సాగ
లేదు మాకింక ముందున  కో దు   హితట
యింత లోపల చినుకులు వింత గాను
పడగ మరలితి మింటికి భయము తోడన్యస్తాక్షరి ,కా -కీ -కే -కై లు కంద పద్యము

అలగా  జన మీ యెడ కా
కులగో లం జేయు కతన కుపితను నాకీ
యలగా  జనముల కొరకే
తల నొప్పిని గుములుచుంటి తాలిమి కొరకై 

పద్య రచన -వంకాయలు

వంకాయ కూర వండుము
వంకాయలు దెచ్చియచట వరుసగ బెడితిన్
వంకాయ సంఖ్య గణనకు
బింకముగా నేడు గలవు విమలా !కంటే ?

Saturday, September 20, 2014

పద్య రచన -పసిబాలుని నిద్ర -నాగు పాము

పసి బాలుడు నిద్రించగ
మిస మిస వర్ణంబు తోడ మెరయుచు పామున్
పసివాని దరికి జేరగ
శశి ధరుగా నూహ కలిగి సన్నుతి జేతున్ 

పద్య రచన -నదీ తీరము

నదులకు తీరము లుండును
పదిలముగా దాట వాని వంతెన యునున్
చదునుగ నుండను జేతురు
అదియంగా సుకర మౌను నటు నిటు పోవన్

నిషిద్ధాక్షరి -శ ష సహ లు ఉప యోగించ కుండ సతీ సావిత్రి పాతివ్రత్యము

యముని వేమార్లు నడుగుచు నాపె మిగుల
భర్త ప్రాణాలు గొనియెను బ్రమద మలర
పాతి వ్రత్యపు మహిమచే బడయు కతన
యింతులందున మేటియౌ యింతి యయ్యె

Thursday, September 18, 2014

గుడి కేగుట మేలు కల్లు కొని భక్తులకున్

కడుగొని ప్రతి దిన మందున
గుడి కేగుట మేలు, కల్లు కొని భక్తులకున్
గుడి కేగుట నేరము గద
మడికట్టుకు నేగ శుభము మనుజుల కెపుడున్

పద్య రచన -ఓటమి

పాటల పోటీలో రవి
సాటియ  యగు వార లెదుట చక్కగ బాడన్
బాటను దడబడి నందున
నోటమి పాలయ్యె నార్య ! యోదార్తు నిదే 

Wednesday, September 17, 2014

పద్య రచన -నలుపు

నల్లని మేఘము జూడగ
నల్లన నామనసు పొంగె హర్షముగలుగన్
వెల్లువ వలెవ ర్షము మరి
చల్లగ బడుననుచు నిపుడు చారల తోడన్

నలుపు రంగును నందురు నాణ్య మనియు
నలుపు వర్ణము గలవాడు నల్ల నయ్య
వర్ష మిచ్చె డు  మేఘాలు వరుస నలుపు
నలుపు రంగును సాటిది యిలను లేదు

దత్తపది -అల -కల -వల -తల (రావణు చెరలో సీ త మనోగతము )

తలపు లన్నియు వలపులౌ కలను గంటి
రామ !వేవేగ మఱి  యల ,రావణాఖ్యు
సంహ రించియు గొనిపొమ్ము సామి !నన్ను
నిటుల న నుకొనె దనలోన నింతి సీ త

పద్య రచన -గోహత్య ,బ్రహ్మ హత్య

పాతకము లైదు లోపల
పాతక మది గోవు మరియు  బ్రాహ్మణ హత్య
ల్యేతావున గలుగు నెడల
నాతావులె భస్మ మగును నార్యా !వినుమీ

ఆత్మహత్య

తనను దాను జంపు కొనుటను నందురు
ఆత్మహత్య యనుచు నార్యు లిలను
కారణంబు వెదుక  మరియెన్నొ గనిపించు
శరణు కాదు మనకు చావు మరిని

Tuesday, September 16, 2014

పద్య రచన -ఆకాశ మంత

ఆకాశ మంత హృదయము
భూ కాంతుల  కుండు నెడల భువియగు దివియు
న్నాకాశ మనిన శూన్యము
నా,  గాదా పెద్ద లండ్రు నారీ !చెపుమా !

పద్య రచన -పిట్టల దొర

పిట్టల దొరగా  నటనము
పుట్టుకతో వచ్చె నాకు  పూర్వము నందున్
బిట్టుగ రంగ స్థలమున
చట్టులతో గలిసి జేయ సంతస మయ్యెన్

పద్య రచన -విమాన ప్రయాణము

దక్షిణ మెరికా యందున్న తనయు జూడ
పయన మైతి వి  మానము పైన మేము
పక్షి మాదిరి గగనాన పరుగు లిడుచు
మహిని దిగియెను  మరియా వి  మాన మపుడు

వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె

వాణి నారాణి యనుచును బలికె నొకరు
వాణికి తెలివి లేదని బ్రహ్మ పలికె
తల్లి యామాత చదువుల తల్లి యనుచు
నేను బలుకుదు నిప్పుడు నిజము గాదె ?

న్యస్తాక్షరి -నగర జీవనము ,కందములో మొదటి పాదము మొదటి యక్షరము=న రెండవ పాదము రెండవ ది =గ మూడవ పాదము మూడవది =ర నాలుగవ పాదము నాలుగవ ది =ము ఉండాలి

నగరపు జీవన మరయగ
గగనమె మరి బడుగు జనుల కందరి కచట
 న్న గరము నందున నుండుట
సుగమము కాదార్య !మనకు శోచింపంగాన్
పద్య రచన -అగ్గి పెట్టె

అగ్గి పెట్టెను జూడగ నంద మొలుకు
పుల్ల లుండును మందుతో  పొదుపు గాను
రాచి గీ చిన  భగ్గున రగులు గొనుచు
పచన మేదేని జేయును పవన యుతగ

Monday, September 15, 2014

, చి . సంతోష మహిత ,శైల సంహితల పుట్టిన రోజు శుభాకాంక్షలు

పుట్టితివట యీ రోజున
పుట్టిన యో శైల సంహి !పున్నమి చంద్రున్          
బిట్టున బోలియు  వెలుగుచు
బట్టున నూరేండ్లు దాటి బ్రదుకుమ  నీవున్

చదువులు సదువుచు  బాగుగ
చదివిన మరి సారమంత శ్రధ్ధగ మదినిన్
బదిలముగ భద్ర పరచుచు
బదిమందికి  పంచుమమ్మ !ప్రమదము తోడన్

అల్లరి జేయకు మెప్పుడు
కల్లలు మాటాడ కమ్మ !కలలో నైనన్
చిల్లర తిండ్లను దినకుము
ఉల్లము సంతోష బడగ నుండుము నెపుడున్

గురువులు సెప్పెడు పాఠ ము !
లిరవుగ వినుచుండి నీ వు  నెప్పటి కపుడున్
కరమవి మననము జేసిన
తిరముగ నీ మనసు నందు దీ టుగ నుండున్ 

సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
నెల్ల వేళల నీ సంహి జల్ల గాను

సంతోషము గూర్చు బాల్య సఖు మరణ మ్మే

సంతోషమా  యిదియ మరి
సంతోషము గూర్చు బాల్య సఖు మరణ మ్మే
సంతో ష ముకా నిదిలను 
సుంతైనా గలదె సామి ! చోద్యము సుమ్మీ

వినోద్ కుమార్ గారికి శ్రద్ధాంజలి

నీదుమిత్రుని మరణంబు మదిని దొలిచె
శంక రార్యుడ !కోరుదు  శంభు నిపుడు
వారి యాత్మకు శాంతిని వడిగ నిమ్ము
అనుచు , నంద జేయుడు వారి  యాత్ము లకును
సాను భూతిని నాదిగా సామి !మీరు

పద్యరచన శ్మశాన వైరాగ్యము

పుట్టు మనుజుడు తప్పక గిట్టు కత న
చింత గూడదు దానికై  సుంతయేని
జన్మ లుండును వ్యామోహ జాడ్య మున్న 
జన్మ లేదాయె యుత్తమ జన్ము నకిల .

Sunday, September 14, 2014

పద్య రచన =మాయూరు

మాయూరు  దొడ్డవర మయ
మాయూరిని  మించి యూరు మరి యెట లేదే
మాయూ రిలొ నెటు జూసిన
పాయనివౌ పంట చేలు వరుసగ నుండున్

 ఏయూ రు వాడవైనను
మాయూరికి రమ్ము సామి !మమ్మలరింపన్
మాయూరి యంద  మరయగ
నే యూరికి నుండ బోదు నిదియ నిజంబున్

నిషిద్ధాక్షరి -ద్విత్వ సంయుక్తాక్షరములు లేకుండా సత్య హరిశంద్రుని గూర్చి

మాట నిలకడ గలిగిన మనుజు డతడు
మాట కొరకుగా దానాయె గాటి కాప
రిమరి ,నిజమునే బలుకు ని  యమము గలుగు
నతడు ,పలుకనే  రడుసామి !యనృత మెపుడు

Saturday, September 13, 2014

కెనడా వాతావరణము -ఇతర రాష్ట్రము లపై ప్రభావము

కెనడా రాష్ట్రము నందున
ననుదినమును మంచు కురియ యా శీ తలమున్
మన రాష్ట్రమునకు జొరబడి
మనుగడయే కష్ట మాయె మాబోటు లకున్

కాని యుష్ణపు యంత్రాలు గలుగు కతన
వేడి గాలులు గదినిండ విసర బడుట
నుండ గలమట  లేదేని యుండ లేము
సహజ సిద్ధము చలి మరి సరళ !దెలియు

పద్య రచన -ఆడపడుచు

ఆడ పడుచు ననగ నర్ధమగడు  గాన
భర్త కీయు గార వంబు నీయ
వలయు నామెకు మరి  వగలు గ  లుగజేయ
కెపుడు ,సిరులు గలుగు  నపుడు బాల !

స్త్రీలకు స్వాతంత్ర మొసగ జెల్లదు ధరపై

పాలన బాగుగ నుండును
స్త్రీలకు స్వాతంత్ర మొసగ , జెల్లదు ధరపై
స్త్రీలను హింసించుట నిక
నాలన మరి పా  లనయన నంతయు వారే

Friday, September 12, 2014

విన్నపము -గురువులు, శంకరయ్య గారికి

విన్న వించు కొందు విన్నప మొక్కటి
యార్య !యిప్పు డుంటి  నమెరికాన
నందు వలన "పోస్టు "లాలస్య మగుటను
గరుణ తోడ నన్ను గనుము సామి !దత్తపది -చింత -నిమ్మ -మామిడి -వెలగ

అమ్మ సుధేష్ణ యడిగెను  నిమ్మ రసము
నీ య  బోవుదు  వెలగ నీ రాయసంబు
చింత రానీ కుమా మిడి  సిదనమునన
కేలు విఱు తురు లేదేని  కీచ కుండ !

పద్య రచన -వానరులు వారధి గట్టుట

లంక కేగుట కొఱకునై రాము డార్య !
వార ధిం గట్ట నుదధికి వానరు లట
మోయు చుండిరి రాళ్ళను ముదము తోడ
రామ శ్రీరామ యనునట్టి  రవము తోడ  

Thursday, September 11, 2014

పద్య రచన -ఎండమావులు

వినగను నేతల మాటలు
వినసొంపుగ నుండు మరిని వీనుల కెపుడు
న్కనగను  జేతల రూపము
మనకుంగా నవియ యెండ మావులె సుమ్మీ

పార్వతి తనయుండు పుష్ప బాణుని జంపెన్

ఆరయ గజ ముఖుడే మఱి
పార్వతి తనయుండు, పుష్ప బాణుని జంపెన్
శార్వరి నాధుడు  శంభుడు
మీరుట దనహద్దు కతన మిడిసిడి పాటన్

Wednesday, September 10, 2014

న్యస్తాక్షరి -ప్ర- వ -రు -డు నాలుగు పాదాల మొదటి యక్ష ర ము లు గా

ప్రవర నామంబు నొప్పునే పరమ పురుష !
వరముగా నిమ్ము మఱి నాకు పాదపు పస
రు మ ఱి   వేగంగ బోవను హిమగి  రికిక
డు రమ ణీ యము  లైనశి  ఖర ము లుగద !

పద్యరచన -ప్రగల్భములు

చేయ లేక యుండి   చేతునను చు మఱి
గొప్ప లెన్నొ జెప్పు నొప్పు గాను
బలుకు విధము నండ్రు ప్రాగ  ల్భ   ములనుచు
దేట తెల్ల మిదియ తెలియు బాల !

Wednesday, September 3, 2014

తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్

కల్లాకపటము తెలియని
యల్లన  మా శంకరయ్య కందము గూర్చెన్
దెల్లని మీసము లాయవి
తెల్లని మీసములె సొబగు తెలుగుల కెల్లన్ 

పద్య రచన -విషజ్వరములు

వర్షము లెక్కువ పడుటన
హర్షము మది గలిగె మాకు ననుదిన మునున్
వర్షము వలనన మురుగై
విష పూరిత జ్వరము లవియ బిట్టున వచ్చున్ 

Monday, September 1, 2014

పద్య రచన -కోతి కొమ్మచ్చి

కోతికొమ్మచ్చి యాటను గుఱ్ఱ కారు
ఆడు చుందురు  గ్రామాల నాఱు బయట
పెరుగు వృక్షాల  కొమ్మలు పిడికి లించి
కొనుచు నూగుచు చిరుపిల్ల కోతివోలె 

నిషిద్ధాక్షరి -గణపతి స్తోత్రము (సర్వ లఘువ్హులతో , ఆటవెలది )

కరి ముఖుని గొలువ కలిమిని నొసగును
రమణి !కొలువు మిపుడు రహిచె లగగ
కొలువ మనకు నొసగు కుడుములు మఱియును
దరగ  నినిధు  లచయ  మరయు  బాల !

పద్య రచన -బాపు

లేవు లేవాయె యిక మాకు లేవు బాపు !
పాడి గాదయ్య  మము వీడ పరమ పురుష !
బాపు బొమ్మలు  గనగానె పరవ శింతు
రఖిల జనములు పుడమిని నదియ మేటి .

అందరి వాడవ యైతివి
యెందరొ  మఱి నిన్ను గూర్చి యేడ్చిరి యిచట
న్నిందరి మనసులు నొవ్వగ
నెం దుకయా  యేగి తీవ యిపుడే  బాపూ !

ఎం దులకో యీ  కోపము
అందరమూ నిన్ను గురిచి  యార్తిని నుండన్
మందిమి మేముం టి మిగా
నందముగా  మమ్ము జూచి యాశి సు లిమ్మా !
 

చెడు కాలమె జనుల కెపుడు సేమము గూర్చున్

ఒడుదుడుకులు లేకుండగ
కడు గారవ మొప్ప భువిని గడు జాగృ తితో
న్నిడుమలు గలుగక ,పాలిం
చెడు కాలమె జనుల కెపుడు సేమము గూర్చున్