Friday, October 31, 2014

నిషిద్ధాక్షరి -కవర్గము లేకుండా కాకాసుర వృత్తాంతము

వాయస రూపపుట సురుడు
పాయని రోషంబు తోడ బాలుని జిష్ణి
న్నాయువు తీయను వచ్చుట
ఛాయను హరి జూచి యపుడు చంపెను వానిన్

వాయస రూపపు ట సురుడు
పాయని మోహంబు తోడ భామను సీత
న్నా యా తావుల నొచ్చుట
వాయసపున్నే త్ర మొండు బా సె న్ద ర్భన్పద్య రచన -అన్యమత దూ ష ణ ము

అన్య మతమును దూ షించ  నవస రమ్ము
నేమి వచ్చెను ? నీకిపు  డేమి ఫలము ?
పాప మయ్యది ,యెఱు గుము బాల !నీవు
నన్ని మతముల సారము నౌను నొకటె

కోటీశ్వరుడు

అక్కినేని సుతుడు నాగా ర్జును డనగ
నతడు  నిర్వ హించు యజ్ఞ మందు
కోటి నెవరు మీలొ కూ డ బె  ట్టుదుః రొకొ ?
యోగ ముండ వలెను యోగ్య తకిల

ప్రతిభ గలిగిన వారిలో ప్రధము లైన
వారి జాబితా నొకచోట భద్ర పఱచి
యీ య  నాగార్జు న కతడు నీ వ  రుసను
దినము నొక్కని జొప్పున ననుది  నమ్ము

ప్రశ్న వేయగ సరియగు బ్రతియొ  కటికి
సొమ్ము రూపాన  బహుమతి నిమ్ము గాను
నిచ్చు చుండును వానికి  నింపు గలుగ
వారు  దెలి పెడు నాన్స రు  బట్టి యపుడు

కోటి కాకున్న మఱి యఱ కోటి యైన
నొక్క రొకరికి రావచ్చు జక్క గాను
మీర లందఱు పాల్గొని మీ య దృష్ట
మును ప  రీ క్షించు గొనుడార్య !ముదము తోడ

 

Thursday, October 30, 2014

రాముండి టు రమ్మ టంచు రాధను బిలిచెన్

భామను  సీతను బిలిచెను
రాముండి టు రమ్మ టంచు, రాధను బిలిచెన్
భామామణి ! నీవొక పరి
యీ మూలకు రమ్ము చూత మిమ్ముగ  శివునిన్

పద్య రచన -తేలు కుట్టిన దొంగ

దొంగ తనము జేసి గంగమ్మ దొరకంగ
నూరి జనులు నామె యుసురు దీయ
కుయ్యు మనక తేలు  కుట్టిన దొంగమా
దిరి సహనము గలిగి దిగులు జెందె

Wednesday, October 29, 2014

దత్త పది -భారతార్ధము లో =తీ పి -కారము -పులుపు -చేదు

చెడ్డ తలపులు పుక్కిటి జేదు కొనుచు
మేటి యధికార మును మఱి మేళవించి
దుర్మతీ !పిన తం  డ్రిని దుయ్య బట్ట
కాచు కొనుముసు  యోధన !కదన మందు 

తాడి గడప శ్యామల రావు

పద్య ములమార్పు  జక్కగ  బలికి తీవు
నీదు  ధీవి శే షమునకు నాదు మనము
సంత సించెను నెంతయో సంభ్ర మమున
వంద నంబులు శ్యామల రావ ! నీకు

పద్య రచన -పాపల ఆటలు, దీపాలతో

దీపాలను జేబూనుచు
నా పాపలు నోరు దెఱచి యఱు పు ల తోడ
న్నాప్రాంతము ఘో  షించగ
నేపుగ నట నాడుచుండె నిరువురి రువురున్

బ్లాగు మిత్రుల కలయిక

ఏమి భాగ్యమో వారిది యేమి ఘనత !
యెక్క డె క్కడో వారలు నక్కజముగ
కలుసు కొంటిరి యుద్దండ కవితిలకులు
వంద నంబులు వారికి  వంద లాది .

నటన

నిజ జీవితమున నెన్నడు
నిజముగ  నటియించ వలదు ,నేర్పున తోడ
న్నజరా మరమగు  సౌఖ్యము
బ్రజ కీయుము దప్పకుండ భార్యతొ  బాటున్

ఆలి చెప్పెను దనదైన శైలి తోడ
నెవడు నిజ జీవి  తంబున నిలను మీద
నటన జేయునో నాతడు  నర్మ సఖుడు
నదియ కాకుండ మూర్ఖుడు నగునుసుమ్ము

మఱియు  జెప్పెను దానట మంచి గాను
దనదు భార్యను బిల్లల దనుపు కొఱకు
చేయు చుండెను నటనగా జిత్రములను
నెంత మంచిగ జెప్పెనో  నెంచి చూడ !

ఆలి టా కీ సు జూచిన నవగ తమ్ము
న తని యెడదను  నున్నట్టి యా ణి ముత్య
ములవి ,మఱి కొం ద  రుందు రు ఖలులు భువిని
నెచ్చ టైనను నటనయే యిచ్చ గింత్రు 

Tuesday, October 28, 2014

పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

ఊరు మఱి యును ధనమును జూ రగొనక
యార్త రక్షణ ధ్యేయమై యా ర్తుల కిట
యేమ ని బిలిచి  నబదులు  నిచ్చు నుమఱి
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

క్షౌరకర్మ

క్షవరము  జేయుట దానిని
నవహేళ న జేయ గూడ దవసర మదియే
క్షవరము జేయుట నొక కళ
వివరముగా దెలుపు ది పుడు వీనుల విందౌ

శిరసు  పైన జుట్టు  చిందర వందర
గా గనబడుచు నెడల  కామరాజ !
క్షవర శాల కేగి   చయ్యన చేయించు
కొనగ వలయు సుమ్ము కురులు సరిగ

క్షవర మయ్యది లేనిచో కలుగు బాధ
లెన్నియో మఱి  ,  తల నొప్పి  మిన్న గా ను
వచ్చు చుండును  మఱి యును  బెచ్చు పెరిగి
  పేను   లనబడు పురుగులు ,పీకు  తలను

దాని వలనన దురదలు  దాని వలన
గోక శిరమును , పుండ్లు గాన్ సోకి క్రిములు
మెదడు లోనికి జొచ్చియు మెదడు మఱియు
సకల రోగాలు రాకకు సహకరించు

అందువలనన ప్రతి యొక్క  డవస రమును
బట్టి కా  రము చేయించ వలయు సుమ్ము
అప్పు  డో సహ చరులార! యందమైన
 నాయు రారోగ్య ములరెండు బాయ వచ్చు

అనుభవంబున జెప్పితి నార్యులార !
యిచ్చ గింతురొ ,లేదొ మీ  యిష్ట మదియ
నాదు వంతుగా నుడివితి నమ్మ కముగ
నెవరె  వరికి ష్టమో జేయు డు వర  లునటు . 


Monday, October 27, 2014

న్యస్తాక్షరి ;; అంశము =శాంతము లేక సౌఖ్యము లేదు నాలుగు పాదాలలో మొదట వరుసగా " త్యా -గ -రా -జు " ఉండాలి ఛందస్సు ----ఆ టవెలది

త్యాగరాజు కృతులు  ధరణిని మఱి విన
గదగు  నెల్ల వారు  ,కాని యెడల
రాదు సౌఖ్య మునిక  రా దుశాంత ముమను
జునకు నెపుడు నిదియ సుమ్ము నిజము

జదశతకము -ఆ విష్కరణము

జడల పద్యాలు చదువంగ నెడద దలతు
ననువు గలిగిన బ్లాగులో నునుపు డా ర్య !
దూర మందుండు  కతనన జేర లేను
శంక రార్యుడ ! క్షమియించు మింక నన్ను

Sunday, October 26, 2014

పద్య రచన -బాలుడు ఉడుతకు ఆహారము

ఇచ్చు చుండెను నాహార మింపుగాను
బాలు డ చ్చట యుడుతకు  బాగు బాగు
జంతు  వులపట్ల  గలయట్టి  జాలి కాహ
యిడుదు జోహార్ల శతమును నీశ ! నేను

దీ పమ్మా ర్పగ గృహమున దేజమ్మొ సగెన్

లోపల యంతయు చీకటె
దీ పమ్మా ర్పగ గృహమున, దేజమ్మొ సగెన్
పాపా త్ము న్నరకుని పెను 
గో పముతో సత్యభామ కూ ల్చెను  బుడమిన్ 

Saturday, October 25, 2014

నిషి ధ్ధా క్షరి -మొదటి పాదము మొదటి యక్షరము "రా" ఉండాలి రెండవ అక్షరము "మ "నిషేధము 2వ పాదము మొదటి అక్షరము "భ " ఉండాలి . 2వ అక్షరము "ర " నిషేధము 3వ పాదము మొదటి అక్షరము "ల "ఉండాలి . 2వ అక్షరము క్ష్మ నిషేధము 4వ పాదము మొదటి అక్షరము "శ " ఉండాలి . 2వ అక్షరము త్రు నిషేధము అంశము --రామ పట్టాభి షేకము . తేటగీతి లో

రాజ పుంగవు డగునట్టి రామ విభుడు
 భయము లేకుండ  బ్రజలకు బాస నిచ్చి
లలిని పట్టాభి షేకంబు లక్ష ణ ముగ
శక్రు డాదిగ సాక్షిగ జరుపు కొనియె

వృక్షో రక్షతి రక్షితః

రాజ మార్గము జూడుము రమ్య మలరి
త్రాచు పామును బోలుచు తళుకు లీనె
చెట్లు  లేనట్టి  మార్గము  చిత్రమాయె
చెట్లు నా టంగ  వలయును నీడ కొఱకుFriday, October 24, 2014

పద్య రచన -ఇరువురు భామలు

భామ లిద్దరు చక్కని మోము తోడ
నొకరు మించిన నందము నొకరు కలిగి
యెదురు బదురుగ  నిలబడి యేమి యౌను ?
మాట లాడుచు నుండిరి ? మహతి ! యడుగు .

హరి హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

హరి పేరు గలుగు నిద్దరు
నరిగిరి వేటాడ సింహ మనదగు  మృగమున్
దరినే  య టవిని  గనబడ
హరి హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

మను వాడెను మన్మధుండు మానిని సీతన్

వినయమగు రతీ దేవిని
మను వాడెను మన్మధుండు, మానిని సీత
న్నినకుల నాధుడు రాముడు
ననువుగ నావిల్లు విఱి ఛి పత్నిగ జేసెన్

Thursday, October 23, 2014

దత్త పది -కటి -కిటి -తటి -నటి (సూర్యోదయము )

కారు చీకటి  దొలగించ గర్ణు తండ్రి
కొండ తటి నుండి  బయటకు  కోరి రాగ
వెలుగు లొం దగ   వాకిటి తలము లన్ని
సంతసంబున నటియించె  జనము నపుడు

పద్య రచన -ఊరి జనములు -బావినీరు

ఊరి జనములు నందరు నూరి బయటి
బావి యొద్దన గుమిగూడి బాల్చి తోడ
నొక్క రొకరుగ నీటిని నొడిసి పట్టి
లాగు చుండిరి బయటకు వేగముగను

మాపెండ్లి రోజు (24th october)

భార్య యాయెను మఱి నాకు భామ విజయ
పరగ నలుబది నాలుగు వత్స రముల
మునుపు , నాటి నుం  డియునేటి  దనుక నీదు
చుంటి మాశివుని దయను సుఖమ యముగ
జాడ్య మేమియు లేనిసం  సార మునిల .

Wednesday, October 22, 2014

పద్య రచన -శుభాకాంక్షలతో దీపావళి

నరకుని మరణము నాసుం
దరివిని మోదంబు నొంది తలపులు మీరన్
వరువరుసగ దీపాలను
కరమున వెలిగించె నపుడు కాంతులు గలుగన్

కాంతు లన్నియు నయ్యప్ప జోతి యగుచు
నాయు రారోగ్య సంపద లంచితముగ
బ్లాగు కవులకు నిచ్చుత ! ప్రమద మలర
శుభము లొసగుదీ పావళి శుభ దినాన

తెలుగుల సంవత్సరాది దీ పావళి యే

ఇలచై  త్రమాస పాడ్యమి
తెలుగుల సంవత్సరాది, దీ పావళి యే
యలమిన చీకట్లను మ ఱి
తొలగంగా జేయు నట్టి తొలి పండుగ యౌన్

అంశం- దీపావళి. ఛందస్సు- ఉత్పలమాల. మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’, మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’. (పదవ అక్షరం గురువు కావాలి. అంటే ‘వ’ తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)

దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా
పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్
పాపిని భూసుతున్ దునుమి చ్చిన కృష్ణుని సత్యభామనే
కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే.

Tuesday, October 21, 2014

పద్య రచన -నరక సంహారము

మరణించె నరకు డనుచును
కరమతనిని జూడ గోరి కమలా క్షుండే
దారను వెంటను నిడుకొని
మరు భూమికి వచ్చె నార్య ! మనసున బాధన్

నరకుడు నేలను వ్రాలగ
వరదుడు దా వచ్చి  సత్య భామయు తోడన్
మరణము నొందిన నతనికి
సరములు లేకుండ దెలిపె సంతా పంబున్
 

వయసును దెలిసి కొనుట
Monday, October 20, 2014

పద్య రచన -చీరలో పిల్ల

చీర గట్టిన నచ్చటి చిన్న పిల్ల
వాలు చూపులు గలదియై వాట ముగను 
నగవు మొగమున విలసిల్లి నారిబోలి
చూడ ముచ్చట గొలిపెను జూడు డార్య !

సద్గ్రంధ పఠ న ము జనుల జవటలజేయున్

సద్గ్రంధ మనగ దెలియుము
సద్గ్రంధ మె  మనకు దెలుపు సదసద్గుణ ముల్
సద్గ్రంధ మిటుల   జేయదు
సద్గ్రంధ పఠ న ము జనుల జవటలజేయున్

సద్గ్రంధ మేదొ దెలియుము
సద్గ్రంధమె హితము దెలుపు. సద్గుణము లిడున్
సద్గ్రంధమె, చెప్పదగునె
సద్గ్రంధ పఠనము జనుల జవటలజేయున్.

వేలంపాట

వేలంపాటను వేసిరి
యాలయపుంజీ రలన్ని యాయధి కారు
ల్వేలంపాటన నాలుగు
వేలకునే బాడె నపుడు బీదల కీయన్

Sunday, October 19, 2014

నిషిద్ధాక్షరి -ల ళ లు లేకుండా ఊర్మిళా దేవి నిద్ర

రాము వెంటను సౌమిత్రి ప్రేమ తోడ
నడవి కేగగ నాతని విడువ బడుట
కామె దుఃఖ ప  డుచు, వచ్చు  నంత వరకు
 నిద్ర  వోయెను మనసును నిమురు కొనుచు

ఊర్మిళ నిద్ర

రాము వెంటను నడవికి లక్ష్మ ణుండు
వెడల నాతని  నెడబాటు విడువ లేక
 భర్త సౌమిత్రి దలచుచు ,వచ్చు వరకు
నిద్ర నొందె ను పదునాల్గు  వత్స రములు

పద్య రచన -ఆర్త రక్షణము

ఆర్త రక్షణ మయ్యది యవస రంబు
మహిని బుట్టిన బ్రతి యొక్క  మాన వునకు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
పుణ్య పురుషుల యందున గణ్యు  డగును

Saturday, October 18, 2014

న్యూయార్కు ప్రయాణము

న్యూయార్కు మహానగరము
న్యూ యార్కును జూ డగోర నోముల ఫలమే
న్యూయార్కు నగర వాసులు
ఆ యేసుని భక్తు లగుట నపర కుబేరుల్

పయన మైతిమి కారులో బఫులొ నుండి
వంద మైళ్ళు మే బోవగ వర్ష మదియ
ఉరుము మఱియును మెరుపులు మెరయు చుండ
కుండ బోతగ విడువక కురియ సాగె

పురము పురములు దాటుచు పోవు చుండ
దారి కిరువైపు లున్నట్టి తరువు లతలు
స్వా గతంబును  బలుకునా సా దరముగ
రంగు రంగుల పూలతో రమ్య మలరె

పూల భ్రాంతిని నొందితి బూలు కా వు
ఆకు రాలె డు  కాలంబు నపుడు కా న
చెట్ల యాకులు వింతగ నట్లు మారె
రంగ రించిన నెరుపుల  రంగు తోడ

బ్రిడ్జి వారన   గలయట్టి పెద్ద చెట్లు
చిన్న చెట్లుగ  గనిపించి చెలువు నొంది
పూల పాన్పును బరచెనా ! పూల తోడ
ననగ దోచెను మారిన యాకు లన్ని


పోవు చుంటిమి నేరుగ బోవునపుడు
వాన వచ్చిన ,వెలసిన మాన కుండ
రయము న్యూ జెర్సి నగరము రాత్రి వేళ
చేరు కొంటిమి హొ టలును క్షేమ ముగను

మఱు చటి దినము నుదయా న మరల మేము
భువిని  పే రొం దు న్యూయార్కు డవును టవును
చూడ కోరిక కలుగగ వేడు కగను
పయన మైతిమి టూ రుగా ప్రమద మలర

చూసితి డకోట హౌసును
చూసితి యా నగర ఠీ వి ,సొగసులు మిగులన్
చూసితిని రైలు మార్గము
చూసితి మే తార లిల్లు చూడ్కులు లలరన్

చూసితి మేరీ స్టా ట్యూ
చేసియుమఱి బోటు మీద చేరితి నటకున్
చూసితిని మ్యూ జియమ్మును
చూసిన నాకళ్ళు చెదిరె చోద్య ములకున్

చేరితి సెంట్ర లు  పార్కును
చేరితి యా కొలము బస్సు సెంటరు మఱి యున్
ఆ రయ మఱి యా సెంటరు
ధర నెప్పుడు నిదుర పోదు తనరెడు కాంతిన్

చూడ  సెంట్ర లు  పార్కును చోద్య మయ్యె
విడత యుండెను నె ని మిది వేల యెకర
ములట షూ టిం గు లచ్చట జరుగు ననిరి
హీ రొ  యినులును మఱి యును హీ రొ  లటనె
నుందు రని జెప్పె మా గైడు నంద ముగను

అన్ని దేశాల జెండాలు మిన్ను నంటి
చుట్టు రెపరెప లాడుచు బిట్టు గాను
చిన్న పిల్లల స్కేటింగు చెన్ను మీర
రాకు ఫిల్లరు సెంటరు రమ్య మలరె

క్రిష్ట మస్సు దినము నట క్రిస్మ సుట్రి
వివిధ రంగుల దీపాల వెలుగు తోడ
అంద గించును పరిసర మంత యటను
ననుచు చెప్పెను మాగైడు నపుడు మాకు

టెర్ర రిస్టుల చేతను బ్రేల్చ బడిన
భవనముల కూల్చి మార్చిరి భద్ర ముగను
ఫౌం టె నుం  జేసి రచ్చట వ్రా సిరి యట
మరణ మొందిన వారల పేరు లన్ని

డౌను టవునన దృశ్యముల్ దనర జూచి
విద్మహే నవీ నులు రాగ విడిచితి మిక
డౌను టవునును ,వారితో చనుచు మేము
చేరితి మివారి యింటికి క్షేమ ముగను

స్వా గ తించియు మమ్ముల సాదరముగ
వండి పెట్టిరి ప్రియముతో  వంటకములు
సకల శుభములు కలిగించు శంక రుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిడుత !

బ్రిడ్జి వాటరు పురమున  వెలసి నట్టి
వేంకటే శుని బూజించి వినయ ము గను
శివుని దర్శించి సేవించి శిరము వంచి
వేడు కొంటిమి మనసార విభుని మేము

వాషింగు ట న్నునంగల
భాసురమగు  పార్లమెంటు భవనము మఱి యు
న్నీ ష న్మాత్రము దూరపు
భేషగు నా వైటు హౌసు బ్రియమున గంటిన్

నాదు శిష్యుడు శేఖరు నామ కుండు
నుండు నూరికి బోవగ, మెండు గాను
సంత సించియు నాతిధ్య మెంతొ నిచ్చె
నతని భార్యయౌ  శాంతయు నాద రించె

సకల శుభములు గలిగించు శంక రుండు
నాయు రారోగ్య సంపద లన్ని నిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
శాంత శేఖరు  కార్తీ కు  లందరినిల

పిట్సు బర్గున వెలసిన వేంక టేశు
పూజ జేయించి ప్రాసాద పొట్ల ములను
భక్తి తోడన గ్రహియించి బయలు దేరి
తిమి, యొ  కహొ టలు నందు రా  తిరి గ  డుపగ

క్రొత్త చోటుల నెన్నియో కొడుకు చూప
నా కళిం ప జే  సికొనుచు  నంతి మమున
వైల్డు యానిమ లు ల పార్కు వరుస జూచి
చేరితిమి యిక  యింటికి క్షేమ ముగను


Monday, October 13, 2014

నిషిద్దా క్షరి = "ర " ఉపయోగించకుండ కందము లో రామ రావణ యుద్ధము

దశ కంఠుని దును  మాడగ
నిశితంబగు బా ణ మూని  నెవ్వగ నతడున్
దశదిశలు బిక్క టిల్లగ
కశిపుల్లేకుండ జే సెకా కుత్సు డిలన్


పద్య రచన -తల్లి యొడిలోన బాలుడు

తనదు యొడిలోన నున్నట్టి తనయు జూచి
మురియు చుండెను నాతల్లి ముదము తోడ
కనిన ప్రేగది గాబట్టి కనుల నిండ
సంత సంబును నింపెను సంతు జూచి

Sunday, October 12, 2014

అంబను బెండ్లాడె భీష్ము డతి మో హమున

సాంబయ కొమరుడు భీష్ముడు
అంబటి రాంబాబు దుహిత యంబను వలచెన్
కంబాళ చెరువు గుడిలో
నం బను  బెండ్లాడె భీష్ము డతి మో హమునన్

అంబరము మారు మ్రోగగ
సంబరములు మిన్ను ముట్ట, సా దర ముగ స 
ర్వాం బుధులు  వెల్లి విరియగ
నంబను బెండ్లాడె భీష్ము డతి మో హమునన్

వరదలు

వరదలు వచ్చెను జూడుము
పరవళ్ళను ద్రొక్కు కొనుచు, బాబా గుడినిన్
వరదల నీరది చుట్టెను
వరదుని యున్వ దలలేదు వరదలు  సుమ్మీ

వరద వచ్చెను గుడిచుట్టు  బాగు గాను
గుడికి బోవంగ గలదట పడవ మనకు
రండు పోదము   పడవపై  రమ్య ముగను
ముక్తి తోబాటు గలుగును రక్తి కూడ

ఆకు మారు కాలము (అమెరికాలో )

ఆకు రంగు మారె నాకస్మికముగను
చెట్ల జూడ నిచట చిత్ర ముగను
నాకు లన్ని యొక్క యాకు కూ డమిగుల
కుండ యెరుపు రంగు మెండు గయ్యె

ఆకు లన్ని దోర గా కని  పించుచు
నంద గించి కనుల విందు జేసె
నిటులె నుండు ననిరి యీ నెల యంతయు
పిదప యొకటొ కటిగ విడుచు నాకు

వరుస వరుసగ నాకులు  వటము నుండి
రాలి పూర్తిగ ,మోడుగా మారి యుండు
నేప్రిలు నెల వ  రకుగాను నిట్ల నెయట
పిదప చిగురించి యాకులు పిందె ,ఫలము


అక్టోబరు నెల వచ్చిన
నా కులు తమ రంగు మార్చి యందము నిచ్చు
న్ని క్కడ గల చెట్లన్నియు
నేకముగా మోడు లగును నేప్రిలు వరకున్ .

Saturday, October 11, 2014

దత్త పది -ఆది ,సోమ ,మంగళ ,బుధ (ఈ పదాలతో భారతము)

అరుణ కిరణా ల  యాదిత్యు నాద రించి
సోమ మీయగ దనకుగా సూర్యు డపుడు
మంగ ళం బును నక్షయ  మ యని దలచి
బుధజ  నుల గార  వించెడు బుధుడు నైన
ధర్మ జున కిచ్చె  నాపాత్ర  ధర్మ మరసి 

హుధుడు తుఫాను

హుధుడు నామక  పెనుతుఫా ను ధర గలుగ
తీర వెంబడి గాలులు తి రము గాను
వీచుచుండగ చెట్లన్ని వీగి పోయి
నేల బారెను బూ ర్తిగ బాల ! చూడు

వచ్చెను హుధుడుతు  ఫా నిట
హెచ్చగు  వేగంబు తోడ నీ దురు గాలుల్
పచ్చని చెట్లనుమీదుగ
వీచుత  నవి కూలిపోయె వేవేగముగాన్

కూలి పోయెను చెట్లన్ని గూలి పోయె
మార్గ మంతయు నుండెను దుర్గమముగ
చెట్ల కొమ్మలు  రెమ్మలు  చిన్న చిన్న
పిందె లయ్యెను జిందర వందరగను

మార్గ మంతయు గజిబిజి మయమయాయె
రాకపోకల కాటంక  మెక్కువగుట
ప్రజల జీ వనంబంతయు వశము దప్పె
నేమి వారల దుస్థితి యేరి కెరుక

ఒక్క టొక టిగను దుఫాను లొక్క సారి
వచ్చు నెడలను జీ వించ  నిచ్చ గింతు
రొకొ జ  నంబులు మరణంబు నొందు టకును
నిశ్చ యింతురు మఱి వారు  నిక్కువముగ

అట్టి వారిని నాదుకు  న్నట్టి వారె
ధరను పుణ్యాత్ము లనగను వరలు దురట
నేను జేతును నిజముగ నిరతి తోడ
వంద నంబులు వారికీ వంద లాది

వారు వీరను గాకుండ మీరు మేము
కలిసి గట్టుగా మనముండి కలుగ జేయ
వలెను సుఖములు ,వసతులు వారి కిపుడు
 అదియ మనయొక్క కర్తవ్య మార్య ! వినుము

రండు వేగమే పోదమా  ర్తజనము దరి
కిప్పుడే మఱి మీకొఱ కి చ్చ  టుం టి
రాజ శేఖర ! భీమన్న ! రామ చంద్ర !
విఘ్న నాధుడ ! షణ్ముఖ ! వేంకటేశ !
పద్య రచన -హనుమ గుడి -ఆంజనేయుడు

ఆలయంబున జూడగ నాంజ నేయు
డాతని యెదుట బుధ్ధిగ హనుమ యుండె
నాహ !యే మది! ప్రత్యక్ష  మాయె  సామి
వంద నంబులు సేతును  వంద లాది

Friday, October 10, 2014

తేలు కొండి

తేలు కొండి వలెను మెలగెడు వారలు
లోక మందు గలరు లోక నాధ !
యేమి పనియు లేక నితరుల బాధింతు
రదియ సుమ్ము వారి లక్ష ణంబు

పద్య రచన -తాత --లేప్ టాప్

పట్టి మంచము మీదను బదిలముగను
తాత కూర్చుండి  యచ్చట దడుము కొనుచు
నొక్కు చుండెను లే ప్టా పు  నుమఱి చూడు
డార్య !చిత్రము గదయది  యా వ  యసున

కౌంతేయుల మేనమామ కర్ణుండు గదా

కాంతా ! శల్యుండు గదా 
కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా
కౌంతేయాగ్రజు నన్నయ
కౌంతేయులు నైదుమంది గౌరవ వంతుల్

తులసి వనములో గంజాయి మొక్క

తులసి వనము లో న  మొలచిన గంజాయి
మొక్క పగిది పెరిగి  నొక్క కణితి
కనక లక్ష్మి మనకు  గాకుండ జేసెను
నెంత ఘోర మాయె నింత లోన

Thursday, October 9, 2014

న్యస్తాక్షరి -అంశము విజయవాడ ,తేటగీతి నాలుగు పాదాలలో మొదటి యక్షరములు వరుసగా బె జ వా డ ఉండాలి

బెదురు భయములు లేనిది  విజయ వాడ
జనుల రక్షింప దుర్గమ్మ ననున యమున
వారవారము క్రిందకు  వచ్చు చుండి
డమరు  కమ్ముజే  బూనుప  రమశి  వుడును
నెల్ల వేళల జూచును జల్ల గాను

బెదురు  భయములు లేనిదా విజయ వాడ
జరుగు నెన్నియో పెండ్లిండ్లు సాయి మఠము
వారి యాధ్వర్యమున నట వారి జాక్షి !
డబ్బు లేకున్న ,నచ్చట యబ్బురమ్ము

పద్య రచన =పండ్ల అమ్మకము

పండ్ల బేరము రాకతొ భామ యచట
నిక్క  ముగదూ చు  చుండెదా  నిమ్మ పండ్లు
చూడ ముచ్చట  గానుండె  చూడు బాల !
షుగరు వారికి  మంచిది సుమ్ము  కొనుము


కూరల అమ్మకము

కొనుట కొఱకునై  వచ్చిన కోమలాంగి
తూచు  వస్తువు నేమిటో తొంగి చూడ
కూరగాయలు  తక్కెడ గూ రలమ్మి
దూచు చుండెను సరిగనే తూక మచట

Wednesday, October 8, 2014

గడ్డ ములబెంచి మురిసిరి కాంత లెల్ల

మురియు చుండిరి  భర్తలు ముదము తోడ
గడ్డ  ములబెంచి, మురిసిరి కాంత లెల్ల
భర్త  లయవతా  ర ముల కు   బాగుబాగ
టంచు  ,వారల  సంస్కార మదియ సుమ్ము

పద్య రచన - నెమలి వాహనుడు

నెమలి వాహను డా స్కంధు  డలరి మిగుల
పరుగు లిడుచుండె  గగనాన పణము దలచి
యాధి పత్యము కొఱ కునై  నాశ పడుచు
నెవరు గెలుతురి  రువురిలో ? యెఱు గు  శివుడు 

దీపావళి శుభా కాంక్షలు

రాక్ష సుండగు నరకుని గక్షతోడ
సంహ రించిన యాసతి సత్య భామ
శాంత రూపము వహియించి సంతసమున
బ్లాగు కవులకు నీయుత ! వరము  శతము


రాక్ష సుండగు నరకుని గక్షతోడ
సంహ రించిన యాసతి సత్య భామ
శాంత రూపము వహియించి సంతసమున
ఫేసు బుక్కున గలయట్టి ఫ్రెండ్సు కిడుత !
యాయు రారోగ్య సంపద లంచితముగ

Tuesday, October 7, 2014

పద్య రచన -చిలుక -గోరింక

చిలుక గోరింక వోలెను గలసి మెలసి
జీవ నంబును జేయుడు  శిష్యు లార !
ఆయు రారోగ్య సంపద లాభ వుండు
నిచ్చు గావుత !మీకుగా నినుమ డిగను

నిషిద్ధాక్షరి= కవర్గము ,చవర్గము ,తవర్గము ,పవర్గము వరుసగా నాలుగు పాదాలలో నిషేధ ము

భరత మాతను స్తుతియింతు బ్రతి ది  నంబు
గొప్ప కవులను గనెనుగా నిప్పుడమిని
పుట్టె  గాయకు  లుమఱి యు   బుట్టె వీరు
లందు వలననే నేనుగా  నాశ్ర యింతు

Monday, October 6, 2014

వేదము లేద (డ ) ని గణించె విజ్ఞుం డు సభన్

నాదమయమమే  గద యీ
వేదము , లేదని గణించె విజ్ఞుం డు  సభ
న్నా దరు  వనునది జగమున
వేదములే మూ లమార్య !విజ్ఞు ల కెల్లన్

వేదముల సంఖ్య గణనన
వాదములే వినగబడి యె   బండితు లందున్
వాదముల గార  వంబున
వేదము లేడని  గణించె  విజ్ఞుండు  సభన్


పద్య రచన -శ్రీ లంక లో హనుమంతుని గద -ఎత్తుటకు రెండు క్రేనులు సరిపోవు

తెలిసె  నొక వార్త  యీరోజు , తెలుపు చుంటి
ద్రవ్వు చుండగ  శ్రీలంక దీవి భువిని
దొరికె  హనుమంతు  గదయట  మురిపెముగను
రెండు    క్రేనులు  చాలవు  టం డి యెత్త .

డేవాన్ (USA)

డేవాను  నగర మందున
నేవస్తువు నైన నుండు నిది యది యనకన్
డేవా ను ననగ దెలియుము
డేవానే భరత ఖండ డీలరు సుమ్మీ

ఆ నగ రము  మా  యింటికి
కానగ  లేనంత దవ్వు  కారులొ  పోవన్
యానము గంటకు పైగా
నానందము గలుగు నచట నటు నిటు దిరుగన్

పిల్ల లకుగాను వారల తల్లి దండ్రు
లనగ  కొడుకును గోడలు న చట కొనిరి
మంచి విలువైన దుస్తులు నంచితముగ
నొకటి మించిన దొకటిగా నొప్పె నవియ

బీర కాయలు మొదలుగా గూర లెన్నొ
మఱియు నచ్చట వలయుసా  మాను  లుకొని
టి ఫిను దినియును   సేవించి టీని  పిదప
తిరిగి వచ్చితి మింటికి తిన్న గాను 

Sunday, October 5, 2014

పద్య రచన -బట్టల దుకాణము

బట్టల దుకాణ మయ్యది
బట్టల బేహారి యచట పట్టువి చూపన్
బట్టలు నచ్చక యాయవి
యిట్టట్టుగ జూచు చుండె నింతులు నచట న్

దత్త పది -గోలి ,గుండు ,మంద,మల్లెల =రామాయ ణా ర్ధము

మంద గమనము గలదియై మల్లె లసర
ముగర  మున బట్టు  కొనసీత ముదము తోడ
గుండు వలెనుండు ధనువును గోలి వోలె
నెత్తె రాముడు రాజులు నీ ర్ష్య బడగ

Saturday, October 4, 2014

పద్య రచన -బాలిక చదువు కొనుట

వర్ష మక్కడ ధారగా బడుచు నుండ
దాను నొక్కతే కూర్చుండి తన్మయతను
చదువు చుండెను బాలిక శ్ర ద్ధగాను
మంచి ఫలితము నిచ్చుత ! మాధ వుండు

దీపావళి

మరణించె నరకు  డనుచును
గరమగు సంతసము తోడ కర దీ పికలన్
గరమున బట్టుచు దిరిగిరి
పురజనములు వీ ధు లన్ని పోలగ బగలున్

మఱు చటి దినమున వారలు
వఱు వాతనె లేచి పిదప బాగుగ శుచియై
య రమరలు లేని భక్తిని
పరమాత్మకు బూజ జేసి  బ్రమదము తోడన్

దీపాలను వెలిగించిరి
దీపావళి పేరు పెట్టి దేదీ ప్యముగాన్
రూపాయలైన వెరవక
పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

వెలిగించిరి దీపాలను
వెలిగించిరి యగ్గిపెట్లు వేడుక తోడన్
వెలిగించిరి కాకరలను
వెలిగించగ వచ్చె నచట వెలుతురు మిగులన్

పేల్చిరి టపాసు కాయలు
పేల్చిరి నిక బాంబు లెన్నొ పేల్చిరి పిస్టల్
పేల్చిరి సీమ టపాసులు
పేల్చగ నట మారు మ్రోగె వెఱవగ నభమున్

తల్లి దండ్రులు బందుగు లెల్ల కలిసి
యొకరి నొకరును దమదమ యునికి దెలుపు
కొనుచు , ముచ్చట్ల తోడన కులుకు చుండ
నాడు చుండిరి పిల్లలు హర్ష మొదవ


Friday, October 3, 2014

న్యస్తాక్షరి -స రి గ మ నాలుగు పాదాలలో మొదటి యక్షరము గా ఉండాలి పద్యము "ఆటవెలది " సంగీతము గురించి

సరిగమ పద  యనుచు సావిత్రి పాడగ
రివురివు మని సోక చెవుల కుమఱి
 గగురు పొడిచి మేను  గగనాన విహరించె
మహతి ! నమ్ము నాదు మాట నిజము

పద్య రచన -ఉత్సవములలో విషాద ఘటనలు

ప్రభల తీర్ధము కొఱకునై బంధు గణము
తోడ పోవంగ నచ్చట తోపు లాట
జరిగి యిద్దరు మగవారు చనగ  యముని
పురికి ,భయపడి యింటికి మరలి  తిమఱి

అమ్మ స్మృతులు -ఆవేదన


అమ్మను మించిన దైవము
ని మ్మహిలో గానరాదె  యెం దున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .

అమ్మకు నాన్నకు నతులివె
అమ్మా! యన కరు ణ జూ పి నాదేవతయున్
కమ్మని మాటలు  రక్తిని
ని  మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .

అమ్మ ! నీమాట రామాజ్ఞ యనుచు దలచి
వేగ జేయుదు మఱి నీవు బ్రీతి తోడ
మమ్ము జూడగ నొకసారి రమ్ము దయను
నెదురు చూతుము నీకొఱ కి పుడు నిరతి .

ఎదురు చెప్పను నీ కెపు డెచట నైన
నీవు చెప్పిన దానినే , నిజము నమ్ము
మాచ రింతును దప్పక హర్ష మొదవ
కాన వేవచ్చి యొకపరి కనుము మమ్ము .

వేడు చున్నను నింతగా వీసమైన
గరుణ జూపవా ?మామీ ద పరుల మైతె ?
కాదు కాదమ్మ పరులము కాదు మేము
నీకు బుట్టిన వారమే నిజమునమ్ము

కనిక రంబేని మామీ ద కలుగు నెడల
సంతసంబది మాకును సంతు తతికి
నొప్పు విధముగ మఱి నీవు నిప్పు డిటకు
 వచ్చి పోవమ్మయొక తూరి ప్రమద మలర

ఇరువది యొకటవ తేదీ
మఱు వక యోమాత ! రమ్ము  మన గృహము నకున్
మరి నా  శక్తిని గొలదిని
నరిసెలు నిక జాల యెన్నొ నాహా రింతున్ .

నీవు రావేని యి క నేను  నిలుప జాల
బ్రాణ మిప్పుడు  ,మఱి నాకు పరమ శివుని
 నాజ్ఞ యొక్కటి శరణము యముని జేర
చింత జేయవ ?నాగూర్చి  సుంత యైన ?

అమ్మా! యె క్కడ నుంటివి?
యి మ్మా యి క నీ దు నాజ్ఞ  నిపుడే వత్తున్ 
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నిక నీవు లేక,  బాపల కిత్తున్  Thursday, October 2, 2014

పద్య రచన -రావణదహనము

రావణా సురుడ య్యె డ రాము చేత
 హతము గాబడ ప్రజలంత హర్ష మొంది
వాని బొమ్మను జిత్రించి వాడవాడ
దగ్ధ బరతురు  గ  విజయ  దశమి నాడు

ఒక్క మారు కాక నొక్క టొ  కటిగను
దలలు పదియు కాల ధరణి జనులు
ప్రమద మంది ,మనసు  పరవళ్ళు ద్రొక్కగ
నాడి పాడి రచట హాయి యనుచు .


పద్య రచన -రాక్షస సంహారము

మహిషా సురు డను రాక్షసు
డ హమను  గర్వంబు తోడ హద్దులు లేక
న్నిహమున బరమున గూడను
కుహనా మార్గంబు వలన గోలను జేయన్

అంత దుర్గమ్మ యాతని నంత రింప
కత్తి జేబూని  కోపాన ఖండ ములుగ
జేసె నాతని కం ఠ ము జిట్లు నటుల
బలికె నప్పుడు జేజేలు ప్రమధ గణము .

నరక సంహార ముదసరా నాడె జరిగె

ఆశ్వ యుజమున జరిగెగ  దార్య !భువిని
నరక సంహార ము,దసరా నాడె జరిగె
రాజ రాజేశ్వ రీ మాత  రంజి లంగ
కుంకు మార్చన  మాయూర గోటి మార్లు .

విజయ దశమి శుభా కాంక్షలు

విజయ దశమి నాడు వేకువ ఝామున
నిదుర లేచి శుచిగ నియమ నిరతి
బూ జ సేయ  నిచ్చు భువనేశ్వరి మాత
సకల సంప  ద లను సంతసమునగురువులు, శంకరయ్య గారికి

మన్నించు డండ్రు మమ్ముల
నెన్నగ మీరనగ నటుల నెట్టులొ యుం డున్
అన్నా !శంకర !కోరుదు
నె న్న డు నట్లనకు సామి !యీ మీ తమ్మున్

విజయము జేకూర్చు వారు విమతులు గారే ?

నిజమైన దేశ భక్తులు
విజయము జేకూర్చు వారు, విమతులు గారే ?
యజస్ర మనినిం జేయుచు
బ్రజ లం  దరిజం  పువారు ప్రమదము తోడన్

Wednesday, October 1, 2014

పద్య రచన -బతుకమ్మ పండుగ

బతుకమ్మను బూజింతురు
బతుకమ్మయె తమకు దిక్కు  భావన తోడన్
సతు లం  దరుమూ  కుమ్మడి
నతులన్గావించి పెట్టు  నైవేద్యములన్

నిషిద్ధాక్షరి --గ ,జ ,డ ,ద ,బ ., ఉపయోగించ కుండా గాంధీజీ స్తుతి

మోము పైనన మోమెత్తి మూ ర్కొ  నునత
నార్య !యిలకునే తాతయై  యలరి  మఱి ని
శాంతి పూర్వక సమరము సలిపి ,మనకు
పరుల పాలన తప్పించె వరలు నట్లు


మాములుగా :-

ముద్దు లాడు చుండు మోముపై మోమెత్తి
ధరణి పిలుచు నతని దాత యనుచు
చేతి దండ మూని సేనాధి పతియౌచు
తెల్ల వారి నుండి తెచ్చె ముక్తి 
  

నెల్లూరు -రాజ రాజేశ్వరి

నెల్లూరు పట్న మందున
నెల్లరు గుమిగూడి రాగ యీశుని గుడికి
న్ను ల్లము లలరింపగ మఱి
యల్లన వేంచేసి యున్న యాదేవత యౌ

రాజ రాజేశ్వరీ దేవి రంజిలంగ
కుంకు మార్చన  గావించె గోటి మార్లు
విజయ దశమి రోజునన  సవినయముగ ను
విశ్వశాంతిని గోరుచు విబుధ వరులు

పూజ లందు కొనిన మాత  భూరిగాను
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కాచు గావుత ! మనలను గనిక రించి
దసర శుభ వేళ నిమ్ముగ దనరు చుండి .