Sunday, October 12, 2014

ఆకు మారు కాలము (అమెరికాలో )

ఆకు రంగు మారె నాకస్మికముగను
చెట్ల జూడ నిచట చిత్ర ముగను
నాకు లన్ని యొక్క యాకు కూ డమిగుల
కుండ యెరుపు రంగు మెండు గయ్యె

ఆకు లన్ని దోర గా కని  పించుచు
నంద గించి కనుల విందు జేసె
నిటులె నుండు ననిరి యీ నెల యంతయు
పిదప యొకటొ కటిగ విడుచు నాకు

వరుస వరుసగ నాకులు  వటము నుండి
రాలి పూర్తిగ ,మోడుగా మారి యుండు
నేప్రిలు నెల వ  రకుగాను నిట్ల నెయట
పిదప చిగురించి యాకులు పిందె ,ఫలము


అక్టోబరు నెల వచ్చిన
నా కులు తమ రంగు మార్చి యందము నిచ్చు
న్ని క్కడ గల చెట్లన్నియు
నేకముగా మోడు లగును నేప్రిలు వరకున్ .

No comments:

Post a Comment