Saturday, October 11, 2014

హుధుడు తుఫాను

హుధుడు నామక  పెనుతుఫా ను ధర గలుగ
తీర వెంబడి గాలులు తి రము గాను
వీచుచుండగ చెట్లన్ని వీగి పోయి
నేల బారెను బూ ర్తిగ బాల ! చూడు

వచ్చెను హుధుడుతు  ఫా నిట
హెచ్చగు  వేగంబు తోడ నీ దురు గాలుల్
పచ్చని చెట్లనుమీదుగ
వీచుత  నవి కూలిపోయె వేవేగముగాన్

కూలి పోయెను చెట్లన్ని గూలి పోయె
మార్గ మంతయు నుండెను దుర్గమముగ
చెట్ల కొమ్మలు  రెమ్మలు  చిన్న చిన్న
పిందె లయ్యెను జిందర వందరగను

మార్గ మంతయు గజిబిజి మయమయాయె
రాకపోకల కాటంక  మెక్కువగుట
ప్రజల జీ వనంబంతయు వశము దప్పె
నేమి వారల దుస్థితి యేరి కెరుక

ఒక్క టొక టిగను దుఫాను లొక్క సారి
వచ్చు నెడలను జీ వించ  నిచ్చ గింతు
రొకొ జ  నంబులు మరణంబు నొందు టకును
నిశ్చ యింతురు మఱి వారు  నిక్కువముగ

అట్టి వారిని నాదుకు  న్నట్టి వారె
ధరను పుణ్యాత్ము లనగను వరలు దురట
నేను జేతును నిజముగ నిరతి తోడ
వంద నంబులు వారికీ వంద లాది

వారు వీరను గాకుండ మీరు మేము
కలిసి గట్టుగా మనముండి కలుగ జేయ
వలెను సుఖములు ,వసతులు వారి కిపుడు
 అదియ మనయొక్క కర్తవ్య మార్య ! వినుము

రండు వేగమే పోదమా  ర్తజనము దరి
కిప్పుడే మఱి మీకొఱ కి చ్చ  టుం టి
రాజ శేఖర ! భీమన్న ! రామ చంద్ర !
విఘ్న నాధుడ ! షణ్ముఖ ! వేంకటేశ !












No comments:

Post a Comment