Wednesday, December 31, 2014

క్రొత్త సంవత్సరము దెచ్చె కోటి వెతలు

మంచి గలిగించు గావుత ! మా న్యముగను
క్రొత్త సంవత్సరము , దెచ్చె కోటి వెతలు
పాత సంవత్సరము నిల పాడు బుద్ధి
గలుగు దుర్మార్గులకు నెల్ల ఖ చ్చితముగ


విష్యూ హ్యాపీ న్యూయ్యర్
పుష్యూ టూరీచ్ టువర్డ్సు ఫుల్ జాయ్ అండ్ పీస్
విష్యూ ఆల్ దా బెస్ట్, బ్యాడ్
ఇష్యూస్ విల్ నాటు రీచ్ యు, ఎవ్వర్ బీ గ్లాడ్.

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ...



ఇరువది,  యొకటి యు, నైదిది
నరయంగా  మంచి  సంఖ్య యన్నిటి  కంటెన్
తిరముగ  వత్సర మంతయు
సిరి రాసుల  నిచ్చి,  మనల శ్రీ పతి  జేయున్



Saturday, December 27, 2014

దక్షుఁడు శివపాదదాసుఁడు గద!

శివుని భంగ పఱు చ  జేసెను యజ్ఞము
దక్షుడు ,శివ పాద దాసుడు గద
కన్నడు నిల యతని కంటె భక్తి గ లుగు
వారు గాన బడరు వసుధ లోన

పద్య రచన -చిన్ని పాప గోమాతకు

చిన్ని బాలిక  బ్రేమను నెన్న దరమె ?
గోవు నోటికి రొట్టెను గోము గాను
బెట్టు చుండెను, నాపాప  చిట్టి మనసు
నెంత గొప్పదో యూహించు మీ శు పుత్ర !

అంశం- గుఱ్ఱం జాషువా ,నిషిద్ధాక్షరములు - శ, ష, స, హ. ఛందస్సు - తేటగీతి.

గబ్బి లమ్మును  రచియించి కవుల యందు
అగ్ర గణ్యు డ వైతివి యార్య ! నీవు
దళిత కులమున బుట్టిన ధరణి పుత్ర !
అందు కొనుమయ్య వందనా లందుకొ నుము

Thursday, December 25, 2014

చిన్నారులు హాలాహలము సేవింప దగున్

ఎన్నడు ద్రాగగ రాదిల
చిన్నారులు హాలాహలము, సేవింప దగున్
సన్నని చక్కె ర గలిపిన
జొన్నలతో జేయుజావ సుఖముగ నుండున్

అయ్యప్ప దీక్ష -చిన్న పాప

స్వామి యయ్యప్ప దీక్షలో చంటి  పాప
చూడ ముచ్చట గొలిపెను జూడు డా ర్య !
భక్తి భావము గలుగుట పాపకరయ
పూర్వ జన్మపు సుకృతము పొందె నేమొ ?

ఫ్లోరిడా ప్రయాణ ము

బఫులొ గ్రోవు నుండి మఱి ని  బయలు దేరి
ఫ్లోరిడా కును బోవంగ పొలుపు గాను
స్వాగ తంబును నిచ్చు చు సాదరముగ
పైను చెట్లవి యుండెను వరుస గాను

పురము పురములు దాటుచు బోవు చుండ
పెద్ద వైనట్టి నగరాలు పెంపు తోడ
నిటను బర్మింగు హామును నిండి యాన
పోలిసనె డు  నగరములు చాల గలవు

దారి పొడుగున వర్షమ్ము దడదడ యని
కురియు చుండగ సాగెను మఱి పయనము
ప్రకృతి యంతయు జలధార వైచు నటుల
చూడ ముచ్చట వేసెను జూచు కొలది

ఆల బామా న గలయట్టి యంద మైన
నగర మయ్యది యీ పేర నాబర గిన
సిటి య  బర్మింగు హామున శ్రీ ధరు డను
పేరు గలిగెడు నేస్తము భరతు లనెడు
వాని యింటను నుంటిమి వసతి కొఱకు

బయలు దేరితి మికమేము  దయపు పూట
ఫ్లోరి డాకును మఱి కుండ పోత గాను
కురియు చుండగ గణన లేకుండ యపుడు
బెస్టు వెస్ట రను హొటలు  వేగముగను
జేరితిమి యార్య !చివరకు క్షేమముగను

ఫ్లోరి డా రున   గలయట్టి చారు దృశ్య
 ములను నిక మేము జూడగ మొదలు పెట్టు
యత్నముల భాగమీ యది హర్షమునన
జూడ నేగుట సంద్రపు సొగసు లన్ని

చూసితి డేనోట బీచుని
చూసితి మఱి యలల తీరు చూసితి నచట న్
చూసితిని వైటు హౌసును
చూసితి నట వనధి చోరు చూపుల దోయిన్

చూసితిని దాడి చెట్లను
చూసితి మఱి యీ తచెట్లు చూసితి గెలలన్
చూసితి నగరపు సోయలు
చూసిన నిక హొటలు జేరి సుఖముగ నుంటిన్

లేచి యుదయా న డిస్నీకి వెళ్లి యచట
వివిధ రకముల విన్యాస వితతు లెన్నొ
గాంచి తిమిమేము కనువిందు కలుగు నట్లు
చెప్ప నలవి గా వవిమఱి  తప్ప కుండ
చూచి తీర వలసినదే చూడ్కి తోడ

జన సంద్రము నేజూడగ
దనరెను బుడమీని నటులు తద్దయు నచట
న్నను టను  గాద ద సత్యము
కని నమ్ముడు నాదు పలుకు కవి వరులారా !

బోటు మీదన వాహ్యాళి పొలుపు గాను
చేయు చుండగ నాకది చిత్రముగను
దోచె నెందుల కోమఱి  తుహినము లవి
నాదు దేహము సోకగ నర్మ  సఖుడ !

అట్లాంటా నేజూచితి
నట్లా O లంటను  గోకొ కోల యాగారమును
నట్లుగ సియన్ న్ సంస్థను
నిట్లుగ నిక చాల యచట నీ క్షించితినిన్

అట్రా క్షను పేరు తోడన
అట్రా క్షను జేసె మమ్ము నచ్చటి వింతల్
అట్రా క్షను జేసె  ముందుగ
వట్రు గ  నొక బొమ్మ యుండి  వస్త్రము లేకన్

నాషు వి ల్లను   గ్రామాన వాస ముండు
విఘ్న నాధుని బూజించి వినయముగను
భక్తి శ్రద్ధలతోడ న  భవుని దలచి
యానికానిచ పాపాని యనుచు నపుడు
చిట్ట చివరగ దిరిగితి చుట్టు గుడికి


చూడవలసిన  వింతల జూచి యికను
పయన మైతిమి యింటికి బ్రమద మలర
యాట విడుపుగ నాగుచు నక్కడకడ
చేరు కొంటిమి రాత్రికి  క్షేమ ముగను

దత్తపది - 61 (యేసు-చర్చి-సిలువ-మేరీ) పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ మతసామరస్యం గురించి

ఎంత చర్చిచ ఫలములు సుంత యైన
గాన మేరీతి  గావున కలిసి మెలిసి
యే సు  ఖముగనుం  డుకొరకు నిమ్ము నీదు
ఆశి సు లుమాకు గా సిలు వడయ కుండ

పద్య రచన -ఏసు ప్రభువు

పుట్టితి వట యీ రోజున
పుట్టిన యో యేసు ప్రభువ !పూర్ణిమ చంద్రున్
వట్టున  వెలిగితి వయ్యా !
యట్టులె కరుణిం చు  మమ్ము ననవర తమ్మున్

Tuesday, December 23, 2014

జాతకములు

జాతకములు బూ టకములు
జాతకములన మ్మకునికి  జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీతిని మఱి నమ్ముకొనుము నిరతము బడుగా !

శంకరుడన బార్ధ సారధి గద

వరము లొసగు నతడు భక్త కోటికినిల
శంకరుడన , బా ర్ధ సారధి గద
కదన రంగ మందు గాండీవి  కిని మఱి
రధము నడిపి నతడు రంజి  లంగ

Sunday, December 21, 2014

అడుగడుగున గండ మాయె నహస్కరునకున్

పుడమికి వెలుతురు నీయగ
కడుగొని యాసూర్యు డిపుడు గగనము నందు
న్న డయాడగ మేఘములే
య డుగడుగున గండ మాయె నహస్కరునకున్

యాయవారము జేసె లక్షాధి కారి

బ్రహ్మ లిఖితము బాగుగ బఱగు కతన
బీద దనమున నుండిన వీరమణిని
 యాయవారము జేసె లక్షాధి కారి
యెవరి యదృష్ట మెట్టిదో యెవరి కెఱు క !


పద్య రచన -సూర్యోదయము --చంద్రాస్త మయము

  ‘ప్రాగ్దిశన్ ప్రకృతి యందాల ప్రభలఁ గనుఁడు’
 తనదు బింబము నీటిలో తళుకు లీన‘
భాను డు దయించు చుండెను బ్రభలు తోడ
నదిరె  యందము చంద్రుని నస్త మయము‘



‘ప్రాగ్దిశన్ ప్రకృతి యందాల ప్రభలఁ గనుఁడు’

తనదు బింబము నీటిలో తళుకు లీన‘
భాను నస్త మ  యంబును  బ్రభలు  లేమి 
యదిరె యందము చంద్రుని  నుదయ  మచట 

యాయ వార వృత్తి యనుచి తంబు

యాయ వార వృత్తి యనుచి తంబనియన
వలదు, గురు కు లంబు వచ్చు నట్టి
వారు మఱి ని యాయ  వారము వలననే
పొట్ట నింపు కొండ్రు  బుధ్ధి గాను


యాయవారము వృత్తి హర్ష దాయకమౌను

దొంగ తనము జేసి దొరలుగ జీవించు
కంటె దినము నకొక యింటి కేగు
యాయవారము వృత్తి హర్ష దాయకమౌను
గురుకు లంబు లందు జరుగు నిదియె

Saturday, December 20, 2014

అంశం- సావిత్రిని యముఁడు భయపెట్టుట. ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల చివరి యక్షరములు వరుసగా ‘న, ర, క, ము’ ఉండవలెను. (పద్యంలో ఎక్కడా ‘నరకము’ అన్న పదాన్ని ప్రయోగించకండి)

సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైన
వినుము నామాట యోయమ్మ ! వినక ,నౌర
యె టుల  వత్తువు నాతోడ నిదియ నీక
సాధ్యము గద మ  ఱి యిక నీ  శంక విడుము

పద్య రచన -రోలు రోకలి

దంచ బడుచుండె నచ్చట దండి గాను
రోటి యందున దెల్లగ రోకలినన
దంచ  బడుచుండు నది యేమి  టంచు మఱి ని
బోధ రాకుండె  నిపుడు నా  బుధ్ధి కకట !

బ్రెడ్డు దినిన గలుగు వీరమర ణ మమ్మ

సావధాన ముగను సరి గను  వినుమిది
తొలగు నీ రసమ్ము తొయ్యలి !మఱి
బ్రెడ్డు దినిన, గలుగు వీరమర ణ మమ్మ !
కదన రంగ మందు కాటి కేగ .

Friday, December 19, 2014

ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు.

తఱచి  చూడ నార్య ! ధర్మ దూ రులుగద
ధార్త  రాష్ట్రు లెల్ల ,ధర్మ విదులు
పాం డవులిల మఱియు బలపరాక్రమములు
గలుగు వారు సుమ్ము కాద నృతము

పద్య రచన -బాలుడు -పొదుగు పాలు

బాలు డ చ్చట జూడుడు వహ్వ యనగ
పొదుగు పాలను ద్రాగుట పొందికగను
సాధు జంతువు గదమ ఱి  చక్క గాను
నిచ్చు చుండెను వానికి నిష్ట ముగను 

Thursday, December 18, 2014

పండిత పుత్రుండు మారె బహు శుం ఠ యుగాన్

దండన ననునది  లేకన
పండిత పుత్రుండు మారె బహు శుం ఠ యుగాన్
కండలు పెంచియు బాగుగ
భండనములు సేయు చుండె బ్రతి దివసంబున్

అంశం- ఉగ్రవాదము నిషిద్ధాక్షరములు - కవర్గ (కఖగఘఙలు) ఛందస్సు - తేటగీతి.

తీవ్ర వాదము ధ్యేయమై తీవ్ర వాదు
లుర్వి బ్రజలను హింసించు టొప్పటంచు
చంపు చున్నారు దయలేమి సామి ! వారు
ప్రభుత మీదున్న  రోషా న  ప్రబలి పోయి 

పద్యరచన -“మల్లెపూవు స్వగతము”

పూవు లన్నిటి యందున మురిపెములను
గలుగ జేతును బ్రతి యొక్క కాంతకు నిల
మత్తు నిత్తును  భర్తల‘మస్తకముల
క నుచు దనలోన మల్లెపూ వది య నుకొనె 
ననున  టు లచట గనబడె నార్య ! చూడు

Wednesday, December 17, 2014

పద్యరచన - కర్ణుడు లేనిభా రతము

రమ్య ! కర్ణుడు  లేనిభా  రతము నాకు
వినగ రాలేదు నెచ్చట వీను లకును
చిత్ర మందున జూడుము చిత్ర ము వలె
కర్ణు డచ్చోట నర్జును గాం చు  చుండె

మగని దూల నాడి మాన్య యయ్యె

పడక గదిని జేరి వలవల యేడ్చెను
మగని దూల నాడి ,మాన్య యయ్యె
మగని సేవ యందు మాలతి లగ్నమై
మంచి దియను  నట్లు మసలు కొనుచు

దుర్గమ్మకు బూ జజేయ దుర్గతి పట్టున్

దుర్గమములు సుగమములగు
దుర్గమ్మకు బూ జజేయ, దుర్గతి పట్టున్
దుర్మార్గుల కెల్లప్పుడు
దుర్మార్గము జేయుకతన దె లుసా   సామీ !

అన్నమయ్య మనకు నారాధ్య దైవమె?

అన్నమయ్య మనకు నారాధ్య  దైవమె?
శంక యేల కలిగె  శర్మ ! నీకు ?
భాగవతులు మిన్న  భగవంతు  గంటెను
అందు వలన దైవ మన్న మయ్య .

Tuesday, December 16, 2014

బీర - బెండ - కాకర - దొండ పైపదాలను ‘పరార్థంలో’ ఉపయోగిస్తూ భారతార్థంలో

బీరము గలయా యర్జును వీర్య మందు
బెండ యగునట్టి  గౌరవ వీరు లతని
కాక రగులుట కతనాన గాలి పోయి
రచట లేదొండ నదగు మా  టప్పు డునిక

పద్య రచన ఉడుత -ఉడుత పిల్ల

కాకి పిల్ల ముద్దు  కాకికి యటులనె
నుడుత పిల్ల ముద్దు నుడుత కహహ
చూడ చిత్ర మచట చోద్యము  గానుండె
నెంత జాగ రూక తెంత ముద్దు ?

పద్య రచన =మోహినీ భస్మా సురలు

పశుప  తిగురిచి  తపమును  భస్ము డనెడు
నసురు  జేయగ సంతసిం చిశివు  డతని
కీయ  వరమును , భస్మము జేయ దలచ
విష్ణు డంతట మోహిని వేషమునన
వచ్చి  యసురుని  గావించె భస్మ మటుల

కనులు కనులు గలిసి నంత గర్భ వతి యయెన్

ఇనుమడిగ బ్రేమ గలుగును
కనులు కనులు గలిసి నంత, గర్భ వతి యయె
న్నిన మడుగు సామి గరుణన
కనకమునకు దనువు పెరిగి కళకళ తోడన్


Monday, December 15, 2014

న్యస్తాక్షరి - 19 అంశం- దాఁగుడుమూఁతలు. ఛందస్సు- ఉత్పలమాల. మొదటిపాదం మొదటి అక్షరం ‘బా’ రెండవపాదం ఆఱవ అక్షరం ‘వే’ మూడవపాదం పదవ అక్షరం ‘దా’ నాలుగవపాదం పదునాఱవ అక్షరం ‘సం’

"బా"లలు నెల్లరున్ వరుస బారును తీరియు నిల్చి యుండియున్
లీలగ మూసి"వే"యుచును లెక్కగ కండ్లను నొక్క బాలకున్
తాలిమిచెప్పు మంచు తను "దా"కినదెవ్వరొ యంచు ప్రశ్నిడన్
బాలయె పేరుచెప్పుటది బంధుర మాటయు "సం"బరంబునౌ

సేకరణ 

Sunday, December 14, 2014

పద్య రచన -గోటీ బిళ్ళ ఆట

చిన్న దనమున నాడి తి మెన్నొ యాట
లందు లోనన  నొకటియీ యాట తేజ !
గోటి యందున బిళ్ళను గోడు నునిచి
గూటు దురు కఱ్ఱ తో శక్తి కొలది వారు

పద్య రచన -అప్పడాల కర్ర , రో కలి బండ

చిత్రము నందున జూడగ
చిత్రమయది యప్పడాలు సేసె డి కర్రే
చిత్రము మఱి యును  గనబడె
చిత్రము నట  రోలు బండ చేరువ గాగన్

పోతుకూచి సూర్య నారాయణ మూర్తి గారి జన్మ దిన శుభా కాంక్షలు ( 1-1-2015)


పుట్టితి వట యీరోజున
పుట్టిన యోపో తుకూచి ! పూర్ణిమ చంద్రున్
వట్టున  వెలిగితి వార్యా !
యెట్టుల  నినుగొలు  వగలను నిచ్చయు నుండన్?

నిన్న మొన్నటి వాడవె  యన్న !నీవు
వచ్చె  మఱి యెనుబదియవ  వత్సరమ్ము
కాల గమనంపు వేగము కనుగొ నంగ
దరమె  యోసామి ? తలవంచ దప్ప మనకు

 న్యాయ వాదులు పుడమి న  న్యాయములను
దూర మాపుదు రనుమాట దొలగ కుండ
నీయె  డలసా ర్ధ  కమునయ్యె నిజము గాను
నందు కొనుమయ్య  జోహార్ల నందు కొనుము

పత్రికా రంగమున నీదు ప్రతిభ నెన్న
దరమె యెవరి కైననునిల దప్పు గలుగు
చోట  నిర్భయముగ మఱి చాటి చెప్పు
గుణము నీ సొత్తు నిజమిది గురువ రేణ్య !

పరగ సాహిత్య రంగమున్ వదల కుండ
రచన లెన్నియో గావించి రచయి తలకు
మార్గ దర్శకు డైనట్టి మాన నీయ !
వంద నంబులు  నీకివే  వంద లాది

సూర్య నారాయ ణా ఖ్యుడ ! చూడు మిదియ
కాన బడలేని దూరాన నేన యుంటి
నిన్ను సేవించు కోరిక మిన్న గాను
నాకు గలదార్య ! మఱి యెట్లు  నాకు కలుగు ?

కాన  నర్పించు చుంటిని కాంక్ష దీర
సేవ పూర్వక పద్యాల శ్రేణి నీకు
కరుణ తోడన గ్రహియించి కరము  నాకు
నీదు దీవన లిమ్ముమా ! నెమ్మనమున

సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటి కినిరెప్ప  యట్లయి కాచు గాత !
నిన్ను  నోసామి ! నిరతము చెన్ను మీర
--------------

( రచన : పోచిరాజు సుబ్బారావు )



Saturday, December 13, 2014

విష్ణు శర్మ చెప్పె బిచ్చి కతలు

మంచి నీతి కధలు సంచిత మైనవి
విష్ణు శర్మ చెప్పె, బిచ్చి కతలు
చెప్పు దురట కధలు సెప్పుట నేర్వని
వారు  మనకు నెపుడు భామ ! వినుము

పద్య రచన శివుడు -నంది

ఈ శు మ్రోల బడిన నింతిని ధీటుగా
నంది  చూచు  చుండ నంది వాహ
నుడట  వీణ జేత  ను ధరి యిం  చిగరుణ
జూపె నామె  పైన జూడ్కి తోడ

చవులూరగ దినెను నతడు చచ్చిన పామున్

నవ కాయ పిండి వంటలు
చవులూరగ దినెను నతడు, చచ్చిన పామున్
రవములు సేయుచు గదలగ
నవనిం జనులపుడు ఫణికి  హా రతు లిచ్చెన్

Friday, December 12, 2014

తలచు కొనినంత గలిగెను దనయు డకట !

సూర్య భగవా ను నాకుంతి  జూచి యతని
తలచు  కొనినంత గలిగెను దనయు డకట !
కవచ కుండలముల తోడ కర్ణు డుగను
బుట్టి చేరెను గౌరవ పుట్ట లోన

వదనంబులు ముద్దులాడ బాలుడు పుట్టెన్

అదిరెను గాయీ వాక్యము
వదనంబులు ముద్దులాడ బాలుడు పుట్టెన్
వదనములు  గలుగు నెడల ని
కదనువు లయవస రమ మఱి గలుగక నుండున్

నిషిద్ధాక్షరి -ల ,(చలిబాధ ) తేటగీతిలో

శీత మిచ్చట దండిగా జేరు కతన
శీత బాధను నోర్చుట చేత కాక
నుష్ణ యంత్రము దగ్గరే  యుండి నేను
దీర్చు కొనుచుంటి  బాధను దేజ ! యిచట

పద్య రచన =పసి బాలుడు

కరుణ లేదాయె యేరికి కందు నచట
పండ బెట్టిరి సరుకులు దండి గాను
నుండు నచ్చోట ,పాపము , నొండు చోట
కు మఱి  నీవుగా గొనిపొమ్ము  కోమ లాంగి !

Thursday, December 11, 2014

కమలాప్తుం డగుచు శీత కరుడుద యించె న్

తిమిరం బులు దొలగించెను 
కమలాప్తుం డగుచు, శీత కరుడుద యించె న్
హిమగిరి తనయాధీ శుని
భ్రమ మగు నాజడ లనుండి భాసితు డగుచున్

పద్య రచన -భార్య వంటకము

భార్య వంటను దినుచును భర్త, యవియు
దల్లి వంటక ములవలె దనర గాను
దనదు  తం డ్రి స న్యాసుల దరిని కలిసి
పోవుటకు గల  కారణం  బునిదియె యనె


Wednesday, December 10, 2014

దత్త పది =పాప -బాల -పిల్ల -పోరి

పాప గతులను వెదుకక పాండవులకు
బాల మునువిడ  నాడుచు వారి భాగ
ములను  నిమ్ము మా  యోమామ !ముందు గానె
కాని యెడ ల బో  రిత ము  లు  గలుగు సుమ్మ
నుచును బిల్లన గ్రోవిని నూ దె   జక్రి

పద్య రచన -కోతి కొమ్మచ్చి యాట

బాల్య  మందున చెట్లెక్కి పత్రము లిల
రాలు నట్లుగ నూపుచు రయము గాను
కోతి కొమ్మచ్చి యాటను గొప్ప గాను
నాడె  వారము గురువుల నా జ్ఞ మేర

పద్య రచన -ఫ్రిజ్జు లో బాలుడు

శీత  లీక ర  ణి మొదట జి న్ని బాల
కుండు "ఛాకు లై   ట్లను వెద కుకొను  చుండ
చూచు  చుండెను గ్రిందన చోద్య మతని
యక్క  ,గనబడు చుండెనా  నార్య !మీకు ?

Tuesday, December 9, 2014

యతిమైత్రి

అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నత చరితా!

అభేద యతి -ర ల రాళ ల ళ  ల డ ల ళ డ వ ప ప బ


1) ప్రాసమైత్రి హల్లులకే కాని అచ్చులకు కాదు.
2) ప్రాసాక్షరం సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, అనుస్వార యుక్తాలైతే మిగిలిన పాదాలలోను అలాగే ఉండాలి.
౩) ప్రాస పూర్వాక్షరం గురు లఘువులలో ఏది ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండాలి.
4) ర-ఱల భేదం పాటించడం లేదు కనుక ఈ రెంటికి ప్రాసమైత్రి కూర్చవచ్చు.
5) ప్రాసాక్షరం ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అరసున్న ఉండే పదాలను వేసే ప్రయత్నం చేయండి. అలా వేయకున్నా దోషం కాదు.



హెచ్చరికను పుఫుబుభులకు
నచ్చపు మాకొమ్ములే మహాకవులాదిన్
మెచ్చులుగ నిలిపి రచ్చట
నచ్చటను ముకారయతు లటంచును గృతులన్. 

 
అయహలు, చఛజఝశషసలు
నయసంయుత నణలు రేచనా సరసగుణా
ప్రియ యవి యొండొంటికి ని
శ్చయముగ వల్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా! (కవిజనాశ్రయము, 1-74)
ఆ.వె.

ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
నయహ లమరియుండు హస్తివరద
శషస లొందునండ్రు చఛజఝంబులతోడ
సరసయతు లనంగ జలధిశయన! 

 
పరగు న్నణ లొండొంటికి
సరవిన్ శషసలు దనర్చు చఛజఝములకున్
పరికింప నయహ లేకము
సరసవిరామంబు లవి నిశాకరమకుటా!

హయ లత్వమునకు, శషసలు
నయవర్తన చఛజఝలకు, నలి మధ్యమ వ
ర్గయుతానునాసికము ని
శ్చయముగ ద్రుతమునకుఁ జెల్లు సరసవళు లన్న్. 


 1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో

పద్య రచన -ఏనుగులు

పూల గుత్తులు చేబూని పురుష దంతి
యిచ్చు చుండెను దనదైన నింతి కచట
జన్మ దినముకా  బోలును  జల్ల గాను
బ్రదుకు  మాయను న టు లనా బగిది దోచె

పద్య రచన -కుక్క కాటుకు చెప్పు దెబ్బ

కుక్క కాటుకు సరియైన కిక్కు నిచ్చు
మందు ,చెప్పుదె  బ్బయ యని నందు రుగద
నిజము నరయగ  నదియే య   నిదెలి  సినది
చెప్పు దేవతా ! మఱి నీకు జేతు  నతులు

పసి బాలుని బెండ్లి యా డె బడతి ముదమునన్

కసరక పెం చగ వలయును
పసి బాలుని, బెండ్లి యా డె బడతి ముదమునన్
దెస లెల్ల గీర్తి నొందిన
నసదృ శుడగు రా మునిలను  నమరులు వొగడన్

Monday, December 8, 2014

న్యస్తాక్షరి ;అయ్యప్ప దీక్ష ,తేటగీతిలో( మొదటి పాదము మొదటి గణము మొదటి అక్షరము =ధ ,రెండవ పాదము రెండవ గణము రెండవ అక్షరము =ర్మ ,,మూడవ పాదము మూడవ గణము మూడవ అక్షరము =శా ,,నాలుగవ పాదము నాలుగవ గణము మొదటి అక్షరము =స్

ధర్మ రక్షకు డయ్యప్ప ధరణి యందు
వెలసి  ధర్మ పాలజేసి ప్రజల గాచె 
భక్త గణములు దమశా యి  శక్తులపరి
దా ల్చి  సేవించి రతని వి  స్తా రముగను

 


పద్యరచన -బాలిక-పాము

పడగ విప్పిన నాగన్న పడగ జూచి
భయము లేకుండ నుండెను బాలి క యట
నవ్వు చుండెను పైగను నగము జూచి
యెంత ధైర్య మో1 యామెకు నీ వ  యసున .

రబ్బరు పామై యుండును
నబ్బా! ,యది   లేని యెడల నటులుగ నగుచు
న్నబ్బాలిక యుండునె  మఱి ?
యబ్బా యని యఱవకుండ హాయిగ నచట న్


Sunday, December 7, 2014

అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్

అగ్నులు రాపడ నేర్పడు
న గ్నిజ్వాలలు, జనులకు హాయిని గూర్చు
న్నగ్నియె  చలి కాలంబున
నగ్నియ మఱి కారణంబు నాహా రింపన్

పద్య రచన -భక్తి లేని పూజ

పూజ మొదలిడి యాభామ బుద్ధి గాను
నీళ్ళు మఱగెనొ  జూడుమ యే మర కగ 
పాలు  పోయుట కును వచ్చె బాల వాడు 
ననుచు జేయుట పూజను నబ్బు రమ్ము

నిలకడయె లేని మనమున 
నలవోకగ జేయవలదు హరితా ! పూజ
న్నిల జేయ ఫలిత ముండదు
చెలువుగ నిక  భక్తి తోడ జేయుమ యిపుడున్





Saturday, December 6, 2014

మొక్కలను బెంచు నాతడు మూర్ఖు డౌను

ధనికు డగునని ననుటలో దప్పు లేదు
మొక్కలను బెంచు నాతడు ,మూర్ఖు డౌను
పిందె ,పూత  పండ్లు గలుగు విటపము నిల
గొడ్డలికి బలిజేయు నా  కుజనుడు మఱి

నిషిద్ధాక్షరి ద్విత్వములు ,సంయుక్తాక్షరములు (కందములో సూర్యోదయ వర్ణన )

అరుణ కిరణము లు  గనబడె
నరయగ నుదయించె నిపుడు నా  ఖగ  పతియే
మెరిసెడి గాంతులు బాగుగ
కరముగ వికసించు బూలు కాసార మునన్









పద్య రచన -నూతన గృహా ప్రవేశము

క్రొత్త  దై నట్టి యింటికి కూర్మి తోడ
నేగు సూర్యనా రాయణ ! యిపుడ  నీకు
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆ యు రారోగ్య సంపద లన్ని యిడుత !

Friday, December 5, 2014

సాని పొందు మోక్ష సాధకమ్ము

వలదు వలదు నీకు వగలాడి యైనట్టి
సాని పొందు ,మోక్ష సాధకమ్ము
శివుని నామ జపము జేయుట  యేయిల
నెంత మంచి జేయ నంత మేలు

పద్య రచన -చేమంతి పూలు

కళ్ళు ముఖమును  నోరును గలిగి యుండి
చంద్ర బింబము బోలిన చంద మచట
పూయ  చేమంతి పూవులు  బ్రియము గలిగి
చూడ ముచ్చట గొలిపెను చూడు డా ర్య !

పుట్టుట గిట్టుట కొఱకే

పుట్టు మనుజుడు తప్పక గిట్టు భువిని
గిట్టు మనుజుని బుట్టుక నెట్టు లెచటొ ?
చెప్ప జాలము మఱి యిది చెప్ప గలము
పుట్టు మనుజుడు తప్పక గిట్టు ననుచు

రాచి రంపాన పెట్టు

రాచి రంపాన పెట్టి రి రమ్యను నట
సవతి తల్లియు పిల్లలు సరద యనుచు
నట్టి వారికి  యుండవు పుట్ట గతులు
మంచి జేసిన పుణ్యముల్ సంచిత మగు

పద్య రచన -రాముడు -కైక

దా శరధి యట పినదల్లి దరికి జేరి
నీదు పంపున నేగుదు నేన డవికి
నమ్మ !పిన్నమ్మ ! యాశిసు  లిమ్ము మికను
ననుచు జోడించి చేతులు వినతి జేసె

Thursday, December 4, 2014

దత్త పది --చీమ -దోమ -నల్లి -పేను (గోపికా వస్త్రాప హరణము )

చిన్ని దోమటి నీ కేల చిన్ని కృష్ణ !
చీమ యంతయు మమ్ముల జేదు కొనక
మగ్గముల పైన  పేనిన రగ్గు లివియ
యపహ రించకు హారము నల్లి యిత్తు

పద్య రచన సతీ సావిత్రి యముడు

చిత్ర మందున ధర్ముడు చిత్రముగను
చేతు లొగ్గియు దండముల్సేయు చుండి
 సత్య వంతుని బ్రాణాలు  సంత సమున
నిచ్చె సావిత్రి కాయన నిచ్చ వొడమె

Wednesday, December 3, 2014

పద్య రచన -పకోడీలు

ఆకు  నిండప  కోడీలు నలరి మిగుల
రెండు రకముల పచ్చళ్ళు నిండు గాను
నుండు పళ్ళెము జూడగ నూరె నోరు
తెచ్చి యీయవ ! మఱి నాకు దేజ ! నీవు

కోల కోలగ నున్నవి గొన్ని యచట
పోలె యవి పకో  డీలను బూర్తి గాను
గురువు లంటిరి యవి చిట్టి గారె లెయని
గురువు జెప్పిన మాటయే గురియ మాకు

చిన్న చిన్నగ నుండును చిట్టి గారె
లవియ ,యోసామి !యిష్టము హరున కెంత
 గా నొ ,నైవేద్య మిడుదురు గ్రామ ప్రజలు
శివుని కళ్యాణ శుభ వేళ చేరి గుడిని

ఆహ్వానము (తాతా సందీప్ అవధాని )

ఆహ్వానము నేగాం చితి
నాహ్వానిత గురువు పంప హా ! సందీ పా !
యాహ్వా  యనుచును జనములు
నూ హలలో దేలునటుల ,నొనరగ నీవున్

అవధానం బొ నరింపుము
అవధానపు చక్రవర్తి !యాశుగ నపుడు
న్నవధానము లన్నిట నీ
యవధానమె గొ ప్పదనుచు నందఱు బొగడన్

Tuesday, December 2, 2014

న్యస్తాక్షరి-- ‘ద - ది - దు - దె’ ( ప్రా సాక్షరాలు గా ; మయసభలో దుర్యోధనుడు )


అ  దరెను మయసభ  యచ్చట
య దిగదిగో గుంత  యిచట యచ్చట గోడన్
చదునైన నేల యిక్కడ
యదె  లేనిది యుండునటుల ననిపించె నుగా



పద్య రచన -పసుపు

పసుపు ముద్దను జూడుము భామ ! యచట
పసుపు ఘాటును దాళ క పారి పోవు
చుండె బురుగులు ,మఱియును శుభము కొఱకు
వంట కొఱకును గూడను వాడుదురుగ
గృహము లందున మనవారు నహరహమ్ము !

Monday, December 1, 2014

పద్య రచన -గ్రంధాలయము

గ్రంధము లుండిన చోటును
గ్రంధాలయ మండ్రు బుధులు గావ్యా ! వింటే ?
గ్రంధాలయము నకున్  మఱి
గ్రంధాదులు జదువ వెళ్ళు జ్ఞానము పెరుగున్ 




30-11-2014 -- మేము సైతము

మేము సైతమనుచు బ్రేమ మీరగ జిత్ర
రంగ మంత కదలి రమ్య మలర
టీవి వారు కూడ టీములో గలువగ
నాట పాట తోడ నలర జేసె

ఆదు కొన వలెనను దృష్టి  నార్తులనట
చిత్ర రంగము నేకమై చిత్ర చిత్ర
కార్య క్రమము ల జరుపుచు నార్య జనుల
నాశిసు లనందు  కొనియెను హర్ష మొలుక

ఆట పాటల తోడన హావ భావ
ములను గనబఱ చి మనము  ముదము గలుగ
నట్లు  గ బ్రదర్శ నలీయ నాకసమును
దద్ద రిల్లెను జూడుమా దద్ద రింత

ఝాన్సి సుమనలు పోటీగ సభను నడుప
సినిమ హీరోలు మఱి యును హీరొ యినులు
వారె కాకుండ టీవి క  ళాభి మాను
లెల్ల కూర్చుండె సముచిత స్థ లము లందు

టీవి  హీరోలు  మఱి యును  హీరొ యినులు
సదరు ప్రోగ్రాము నందును సహితు లగుచు
హావ భావాల చేతను నవని జనుల
హర్ష మొందించు చుండెను గరము వారు

ఆట పాటలు నృత్యము ల్లదరి పోగ
హాస్య మచట ను బాగుగ లాస్య మాడె
నాలి మొదలగు వారల హాస్య మచట
నవ్వు చిందించె కడుపుబ్బ నటన తోడ

జరుగు నీ యది యీరోజు నిర్వి రామ
ముగను బగలంత మఱి యును  సగము రాత్రి
వరకు నోయమ్మ !నీవును బయలు దేరు
చూడ దీనిని యిదియ నా  వేడుకోలు

ఇందు మూలము వచ్చిన యీ ధ  నమును
నార్త జనముల నందరి యార్తి నినిక
దూర ముండజే యుటకునై దురిత దూర !
ఖర్చు పెట్టుదు  రోసామి ! ఖచ్చితముగ

మానవత్వము గలిగిన మనుజు లార !
చేయి చేయిని గలపండి చెయిదములకు
నందరమ్మును గలిసియే యాదు కొనెద
మార్త జనమునట వి శాఖ పురము నందు