Thursday, December 31, 2015

అవధానంబుల నుండ రాదనె సమస్యా పూ ర ణ ల్

అవహేళం బును జేయు వారలట హాహాకారము ల్జేయుచో
అవధానంబుల నుండ రాదనె, సమస్యా పూ ర ణ ల్
కవనంబందున నుండుగా యవియ యాకా త్యాయనీ మాతయే
యవధానమ్ముల బ్రోత్స హించెగద  యాయా చోటులన్ దాసుమా

పద్య రచన -నూతన ఆంగ్ల సంవత్సరాది శుభా కాంక్షలు


వచ్చెను వత్సర మయ్యది
యిచ్చకమును మనకుజేయ యీవత్సరమున్
మెచ్చుచు జెప్పుచు నుంటిని
నెచ్చెలులకు శుభములిడుత నీరజ భవుడున్


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు
ననుట యందు సంది యంబు వలదు
అనవ రతము నీశ్వరా నుగ్రహ మ్ముండు
మనకు సామి! చింత మాను డిపుడు

షణ్మాసములనగనొక్క సంవత్సరమే

షణ్ముఖుడ ! యారునెలలే 
షణ్మాసములనగ, నొక్క సంవత్సరమే
షణ్మాసపురెండింతలు
షణ్మతములుజెప్పెనిట్లు సరియా?కాదా?

పద్య రచన =విప్రుడు -రాజు

విప్ర జనముల మనములు విమల మగుచు
పలుకులయ్యవి కఠినమై బరగు చుండు
విభుల యందున నీయవి వేరుగుంట
మార్చ నోపడు శాపము మహివి భుండు

అ వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్


అవసరమా యిట్లనుటకు
న  వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
భువిలోగల  రాజులలో
నెవరును మరి నిజము పలికె యీశులు లేరా?

పద్య రచన -మిర్చి తోట


మిర్చి తోటను జూడుడు మిలమిలమరి
మెరయు చుండెను నచ్చట మెరుపువోలె
పండ్ల తోడను గాయల వరుస తోడ
చెలువు మీరగ వ్రేలాడ గలుగు  నార్య!



Monday, December 28, 2015

భజనాదులనిష్టపడడు,పరమాత్ముండే


నిజమైన భక్తుడెప్పుడు
భజనాదులనిష్టపడడు ,పరమాత్ముండే
సుజనుల భక్తికి మెచ్చుచు
నజరామర ముక్తినిచ్చి యాహ్వానించున్

పద్య రచన -చలి


చలిగా నున్నది ప్రేయసి
గిలిగింతలు బెట్టబోకు గీరల తోడ
న్నలుపుగ మారును దేహము
లలనా! మరి చెప్పుచుంటి లాస్యంబేలా?

యాగ మనగ గడుభ యమ్శు కలిగె


మఖము నాశ నంబు మారీచుడేచేయ
తెలిసి నాదు మనసు తెలివివోయి
యాగ మనగ గడుభ యమ్శు కలిగెనార్య!
ప్రజల మేలు కొరకు వలయు చేయ

Sunday, December 27, 2015

పద్య రచన -శునకము



రక్ష కభటుని వోలెను రమ్యముగను
నాల్గు మార్గాల మధ్యన గల్గునట్టి
యున్నతంబగు గద్దెపై యూరుసింహ
మద్భుతంబుగ గూర్చుండె నార్య! కంటె?


దినదినముగండమాయెను


దినదినముగండమాయెను
తినవెప్పుడు భోజనంబు తేజా! నీవు
న్దినిపించుట నే నేరను
వినవమ్మా నాదు మాట వీనులు సోకన్

ప్రద్యుమ్నుండొకడు ,పంచపాండవులందున్


విద్యా! పాండవ కులమున
ప్రద్యుమ్నుండొకడు ,పంచపాండవులందున్
విద్యలనన్నిటినేర్చెను
ప్రద్యుమ్నునిమామయైన పార్ఢుడె సుమ్మీ


నాగఫణిగారు

నాగఫణిశర్మగారికి నతుల నిడుచు
నీసమస్యను నిత్తునునిపుడు నేను
సభికు లందరు మెచ్చగ సబబురీతి
పూరణంబును గావించు డార్య! మీరు

Saturday, December 26, 2015

అవధానము(నాగఫణి శర్మ గారు )


అవధానము లన్నిటమీ
యవధానమెహాయి గొల్పు నందరకుగదా
యవధానంబున బాల్గొని
నవిరళమగు నీదుధార నాస్వాదింతున్




Friday, December 25, 2015

దత్తపది -మసి -కసి -అసి -నుసి (సూర్యోదయము )


మసిబో సినటుల మేఘము
కసికసి గానుంట మిన్నుకానక రవియు
న్నసిబో లుచునా మింటను
నుసిజే సెను దనదుకాంతి నోముల రాజా!



పద్యరచన -ఇందు గల డందు .......


ఎందున వెదకిన తండ్రీ!
యందండే యుండు చక్రి యనుమానంబున్
డెందమునకు రానీయక
వందనములు సేయుమయ్య! పరమాత్మునకున్



క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి


గొడ్ల సాలన నొకరోజు గోముగాను
క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి
శిలువ వేసిన సమయాన చేత లుడిగి
సిక్త మగుటఃను నాక్రీస్తు రక్త మందు

కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో


కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
నిక్కము జెప్పుమా రమణ! నీయదిచేష్టలుజూడగామరిన్
మక్కువ తోడనుంటినిట చక్కనివంశము నందుపుట్టియు
న్నిక్కరణిన్ భుజించుటయ యెట్లుగ దోచెనునీకునక్కటా!

Wednesday, December 23, 2015

పద్య రచన -సీతాకోక చిలుక

రంగు రంగుల తోడను  రమ్య మలరి 
చూడ ముచ్చట గొల్పును  జూప రులకు 
చెలువు గలదిసీ  తాకోక  చిలుక యార్య !
దశ లు  దశలుగ మారును  దనర యదియ 

పద్య రచన ...ఇంతలు కన్నులుండ దెరువెవ్వరివేడెదు


ఇంతలు కన్నులుండ దెరువెవ్వరివేడెదు నాదుసోదరా!
సుంతయులేద నీకుదెలివింతగ చింతనుబొందనెలనో?
వింతగ నుండెనీయునికి సాంతమువీనుల విందుజేయుమా
యంతయు నాకుదెలిపి హాయిగ నుండుము లేకదుఃఖముల్




శివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడు

సీత నుద్వాహమాడగ శీఘ్రతతిని
నిండు సభలోన రాముడు నెమ్మితోడ
శివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడు
రామ బంటుగ జగతిని రాణ కెక్కె

Monday, December 21, 2015

పద్య రచన -చింత కాయలు

చింత చెట్టును వ్రేలాడె  చిత్ర మందు
చింత కాయల గుత్తులు చిత్ర ముగను 
కోసికొని రమ్ము  పచ్చడి కొఱకు గాను 
పప్పు లోకూడ వేతును  బాల ! వెళ్ళు 

మార జనకు డతడె మార వైరి

భస్మ ధారు డతడు  వసియించు కాటిలో
సకల శుభము లీయు  శంకరుండు
నాగ భూష ణుండు  నగజప  తియు ను ,కు
మార జనకు డతడె మార వైరి 

ధనమునమ్మి ధనముదారకొసగె


కన్న వారి కతడు కడుపు నిండుగ గూడు
పెట్టలేక తనదు కొట్టమందు
గున్న వోలెనుం డుగోమాతదూడను
ధనమునమ్మి ధనముదారకొసగె

పామునుదినగోరికప్ప బారెడు సాగెన్


ఏమో యనుకొంటినిమరి
పామునుదినగోరికప్ప బారెడు సాగెన్
పాములుకప్పల,కప్పలు
పాముల వలె నుండు వాన పాముల ను దినున్ 

చేదుతీయనగుచుక్షేమ మొసగు


చేదుతీయనగును జేదగుదీపియు
నొడలు కుదురు లేక యుండు నపుడు
క్షేమ మొసగునుగద చేదు మాత్రలు వాడ
చేదుతీయనగుచుక్షేమ మొసగు 

అ ర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ముల్


శర్వర! నిజమే యయ్యది?
య  ర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ము
ల్లుర్వికి మొదటే గలవని
సర్వులకున్దెలియునయ్య! సంపూర్ణముగన్

దైవము గొల్వరాదనుచుధర్మవిధుల్ వచియింతురెల్లెడన్


దైవము గొల్వరాదనుచుధర్మవిధుల్ వచియింతురెల్లెడన్
దైవముగొల్వరాదనుట ధర్మవిరుధ్ధముగాదలంచుమా
దైవము, దల్లిదండ్రుల పదంబులుమ్రొక్కెడువారికెప్పుడు
న్నీవసు ధన్గలుంగునట యిబ్బడిగామరి మోక్షముల్సదా

Sunday, December 13, 2015

రామచంద్రుని రక్షించు రావణుం డు

తండ్రి యా జ్ఞను బాటించు తనయు డగుట
రామచంద్రుని రక్షించు, రావణుం డు
పరమ శివుని నా రాధించు భక్త వరుడు
వేయి శివలింగ  ములకుదా జేయు బూజ 

Saturday, December 12, 2015

కొ ట్టెడు పతిసుజనుడను చు గోమలి పలికెన్

ఎట్టుల నగునయ్య ధరను
కొ ట్టెడు పతిసుజనుడను చు గోమలి పలికె
న్బిట్టుగ నది పరికించిన
నట్టులె గద నామెమాట యన్నా! సత్యా!

Friday, December 11, 2015

గంగాసుతుడాలమున శిఖండి ని చంపెన్


మంగా! భీష్ముడెగద మరి
గంగాసుతుడాలమున శిఖండి ని చంపెన్
చెంగావిములుకుతోడన
గంగాసుత! కావుమనుచుగలవర మొందన్

కలిమి వివేక శీలురకు గల్గగ జేయు ను...........


కలిమి వివేక శీలురకు గల్గగ జేయు ను శాంతి సౌఖ్యముల్
చెలిమిని గూర్చు వారలకు సేమమునిచ్చును నెంతయోయికన్
కలిమి వివేక హీనులకు గల్గగ జేయును దర్పమున్ భువిన్
మెలకువ తోడనుండుచు ను మిక్కిలి యో ర్పును గల్గియుండుమా

పె ద్దవాడు దగడు వృధ్ధు డనగ

తల్లి క ర్మ కాండ తనరగ జేయంగ
పె ద్దవాడు దగడు, వృధ్ధు డనగ
వయసు మీరునతడు , పనిపాటు లే వియు
చేయలే ని వాడు,క్షితిని బరగు

ఇడుములు వచ్చును పోవును.........

ఇడుములు వచ్చును పోవును
దడవక మరి వాటికెపుడు ధైర్యము తోడన్
కడగండ్ల నధిగమించుచు
కడవరకుంసాగునతడు గమ్యము చేరున్

కటకట యెంతమాట..............


కటకట యెంతమాట ననుగాదనియాతడు వీడునే రమన్
పటుతరమైనబంధము నుబాయుట నాయముగాగ దోచెనే?
కటువుగ నేలయైతివి? బకాసురుమేనమరందివే యిలన్ ?
చిటికెన వ్రేలితో నిపుడుచీల్తునుగాహృదయంబునీయదిన్ 

మిరియములకుదీయదనము మిరపకు వలెనే


మిరియము మిరపను రెంటిని
నిరవుగ మరిపోత బోయ ని క్షుర సంబున్
న్న రమరలు లేక యంటగ
మిరియములకుదీయదనము మిరపకు వలెనే

Thursday, December 10, 2015

సోనియా గాంధి మోడీకి చుట్ట మగును


సోనియా గాంధి మోడీకి చుట్ట మగును
నవును రాజకీయము నందు నగుదురుగద
చుట్టములుశత్రువుగను సుమ్ము వార
రాజకీయపు చతురత రమ్య! యదియ

హృత్పద్మ ము వికసించును.........


హృత్పద్మ ము వికసించును
తత్పదముల శరణుగోర ధార్మిక బుద్ధిన్
తత్పురుషోత్తము డయ్యొడ
సత్పురుషుని జేయుకతన జక్కగ మనకున్

విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్


విస్కీ బ్రాండీ లిరువురు
కస్కంభటు యొద్ద వారు గరపియు విద్యన్
తస్కిసు రచనలు జేయగ
విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్

జననీ జనకులపదములు..........


జననీ జనకులపదములు
కని మ్రొక్కని వాడు భువిని కఠినాత్ముండే
వినుమరి యాతని ప్రాణము
కననొల్లని దూరమేగు గడచిన పిదపన్

మావిచివురుదినెను , మధుకరమ్ము


కోయిలమ్మ చూడు కొమ్మ మీదనయుండి
మావిచివురుదినెను , మధుకరమ్ము
చక్కగానుగ్రోలె చిక్కని తేనెను
పూల పైన వ్రాలి పూజ! యచట

తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె


బాధగలిగించు సరిగదా పైకముడుగు
తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె
మరణ మొందిన తండ్రిదా మరల బ్రదికె
ననగ సుతునకు నయ్యెడ నాననమున

కూడుగుడ్డలేల మేడలుండ


కూడుగుడ్డలేల మేడలుండయనుచు
నుడువ రాదు మేడ లుండు నెడల
కూడు గుడ్ఢలకును కొదవగలదె యిల?
నార్య! చెపుమ ,మీరు నవునొ ,కాదొ ?

వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్

అదియేమి చిత్రమో యది
వదినను ముద్దాడె మరది పదుగురు చూడ
న్నదియా , బాలున కప్పుడు
పదిమాసములే గద మరి వయసున్జూడన్

క్రోధ లోభమోహములు సద్గుణము లండ్రు



పాపమునకివి హేతువుల్ భరణి యందు
క్రోధ లోభమోహములు సద్గుణము లండ్రు
పుణ్య మార్జన కొరకునై భువినిజేయు
కర్మ లన్నిటిని బుధులు వర్మ! వినుము

నన్నెచోడుడు రచియించ, నైషధమును


స్కంద చరిత మగుకుమార సంభవమును
నన్నెచోడుడు రచియించె, నైషధమును
వ్రాసి శ్రీనాధు డలరెను వాసి కవిగ
భువిని నాచంద్ర తారార్క ముగను సుమ్ము

కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో


కుసుమము వెనుకన పురువది
కసికసిగా దినుచురేకు కాపుర ముండన్
విసమునుగానక తుమ్శెద
కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో

జూదమాడువారు సుజనవరులు


పరమ దుష్టు లార్య! భాగవతులునైన
జూదమాడువారు, సుజనవరులు
సాటివారి కెపుడు సాహాయ్య మొనరించు
గుణము కలుగు నట్టి గొప్ప వారు

చనుబాలను తండ్రితీయ సంతసమందెన్

వినయా! కంటికి వాడుము
చనుబాలను, తండ్రితీయ సంతసమందెన్
తనయనుగుంబిడ్డనునపు
డనురాగముతోడ పిలిచి యాడించంగన్

కమలములు వికసించె చంద్రకాంతులు సోకన్

కమలాప్తుని గాంచగనే
కమలములు వికసించె , చంద్రకాంతులు సోకన్
కమలంబులు ముకుళించియు
విమలంబుగ గలువ పూలు వికసించునుగా

రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్


నాధా! వింటివె యీయది
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
రాధేయుడు కురురాజులు
నీధరణిన్నేలిరార్య! యిచ్చను జెలిమిన్

యరటి పండు ప్రాణహరము విషము


చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
యరటి పండు ప్రాణహరము విషము
కుళ్ళినట్టి పండు కొంచెమై నదినకు
మా,యెపుడును గలుగు మైకముయును

Saturday, November 28, 2015

సిరియు వాణియునొక్కచో జేరరెపుడు

సిరియు వాణియునొక్కచో జేరరెపుడు
నటుల ననవల దు నెపుడునార్య! మీరు
నాదు గ్రామపు యాసామినమ్ముడు మరి
సిరియు వాణియు రెండునుజేరె నతని

కార్తిక పూర్ణిమ

కార్తిక పూర్ణిమ రోజున
నా ర్తిని శ్రీసాంబశివుని నారాధించన్
పూర్తిగ నిచ్చును శుభములు
కార్తీకా,నీవుకూడ కాలుని కనుమా

గఠిన చిత్తులుగద కన్న వారు

ఆడ పిల్ల యనుచు నాయా తెలుపగానె
యింటి దగ్గరగల యేరు లోన
పారవైచెను మరి పాపనునిర్దయ
గఠిన చిత్తులుగద కన్న వారు

Friday, November 20, 2015

పద్య రచన -నమ్మితి ని నామనమున సనా తనులగు

నమ్మితి ని నామనమున  సనా తనులగు
పార్వ తీ పర మేశ్వరు పాద పద్మ
ములను గడు గాఢ మగు బ్రేమ ముట్టి వడగ
నాది దంపతు లేగద, యార్య !వారు 

Thursday, November 19, 2015

కావ్య మునులి ఖించె గత్తి తోడ

నవర సముల తోడ  నన్నెచోడు డిల ను
కావ్య మునులి ఖించె, గత్తి తోడ
పనస పండు కోసి  పంచుము తొనలను
దినగ  నవియ యుండు దీ య గాను 

Wednesday, November 18, 2015

లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

బంగరు వన్నెల గూడిన
రంగని సతియైన యా మె  రక్తిని గనగా
నంగనల మనమ్ములు విమ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్



పద్య రచన -పరి పరి విధముల ...

పరి  పరి విధముల జెప్పితి
నరుడా ! యది వినని యెడల  నరకమె గలుగున్
నరుడ నుకొని  రాముని మఱి
 పరునిం గా  జూడ కెపుడు  ,పరమా త్ముండే

మానము పోవలె నటంచు మానిని తలచెన్

మానినుల కెపుడు ముఖ్యము
మానము, పోవలె నటంచు మానిని తలచెన్
మానిను లసత్య వాదులు
గాననుట ను బుడమి యందు కలకా లంబున్

Tuesday, November 17, 2015

పద్య రచన -బాలుడు -మూడు నామాలు

విష్ణు బూజించు వారిని వైష్ణవులుగ
బరిగ ణిo తురు  గద మఱి   బాలు డచట 
మూడు నామాల తోడన  ముద్దు లొలుకు 
చుండె జూ డుడా  చిత్రము  సూరి !మఱియు 
వార్చు చుండెను  సంధ్యను  బాగు గాను 

పద్య రచన ---నేనొక పూలమొక్క కడ ...

నేనొక  పూలమొక్క కడ నిల్చి సుమమ్ములు గోసి యీ శు ని
న్వేనకు వేలు మంత్రములు వేగము తోడను నుచ్చ రించుచు
న్నానన మందు సంతసము నా రడి  గొల్పగ బూజ జేయగా
మానస మందు  గల్గె మఱి  మాయని దృప్తియు గారవంబులున్ 

కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్

ధరనుండు ప్రజలు నిరతము
విరసముగా నుండ బోక బ్రియమును దోడ
న్నొకరికి మఱి యొక రిడుసహ 
కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్


వీరావేశముజెందుచు
నేరినిమరి తూలనాడకెప్పుడుగూడన్
వీరా! యెరుగుము నీసహ
కారమ్శే భూజనులకుగడుహితమొసగున్



Sunday, November 15, 2015

జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్


ఇలమంచు మిగుల గలుగుత
జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్
మలమలమాడుచుదరువులు
పలుమారులుధగ్ధమయ్యె బగలునురేయున్

పద్య రచన -వరవీణామృదుపాణీ

వరవీణామృదుపాణీ
సరసిజములబోలునయన చదువుతల్లీ
మరినానాలుకమీదన
నిరతము వసియించుమమ్శ నెయ్యము దనరన్




పద్య రచన బాలల దినో త్సవము


చాచా పుట్టిన రోజును
నాచారముగా జరుపుకొందుమానంద ముగాన్
చాచాకు జయముబలుకగ
నాచావడి మారుమ్రోగి యంబరమంటున్




పద్య రచన -ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు ననుచు ...

ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు  ననుచు
గలలు గనకుమ యెన్నడు కాంత ! నీవు
కీడు చేయువాం  డ్రే గాని  గేలు నీయ
రుగద  యెవరును  నోయమ్మ ! యుర్వి యందు 

కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ

భీకరముగ నుడి వితిరే
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
కాకర చేదుగ నుండక
యేకర ణి ని  దీయ నుండు నీ శా ! చెపుమా . 

Friday, November 13, 2015

నేటి బాలలే రేపటి నేర గాండ్రు

చదువు సంధ్యలు లేకుండ చవట లవలె
గ్రామగ్రామాలు  దిరుగుచు గనక దారి
జీవ నోపాధి కొఱకు నై  చేయ దొంగ
తనము ,నగుదురు కదమఱి  తప్ప కుండ
నేటి బాలలే రేపటి నేర గాండ్రు 

పద్య రచన -బాలల దినోత్సవము


పుట్టితి వట యీ రోజున
బుట్టిన యో నెహ్రు !నీవు పూర్ణిమ చంద్రు
న్చట్టున వెలిగితి విప్పుడ 
య ట్టులె  యొకసారి రమ్ము హర్షము గలుగన్

నీదు పుట్టిన రోజును నేడు మేము
జరుపు కొనుచుంటిమి మఱి బా సు రముగాను 
బం డు గనువోలె ,మనసార పంచి పెట్టి
చాకు లైట్లను బాలలు సంతసించ 

Thursday, November 12, 2015

పద్య రచన -ఐసు ఫ్రూ టు లు

ఐసు ఫ్రూ టు లు  గలవట యార్య !చూడు 
మెంత చక్కగ నున్నవో యంత చెడును 
జేయు మనకవి  నిజముగ  చీక వలదు 
సంత సంబును నొందుట సరియ చూసి 

ముద్దు మగని ప్రాణముల హరించె

ముద్దు లధికము గను  ముదిత యొ కతెతన
భర్త కీయ న తడు వాయి చొంగ
నోప కపుడు నయ్యె నుక్కిరి బిక్కిరి
ముద్దు మగని ప్రాణముల హరించె 

Wednesday, November 11, 2015

శివుని జంపె భీమ సేను డలిగి

భక్తి తోడ నెపుడు బ్రార్ధించ వలయును
శివుని, జంపె భీమ సేను డలిగి
యుద్ధ రంగ మందు బద్ధ శ  త్రువులను
ధర్మ యుద్ధ మెయది  వర్మ ! తెలియు 

పద్య రచన -అట జని కాం చెను .......

అట జని కాం చెను ప్రవరుడు
నిట లాక్షుని మామ నగము ,నిర్మల ఝరులన్
కుటజపు మెలికల సొగసులు
నటనల తోనింపు గొలుపు నడవి నెమళ్ళ న్ 

పద్య రచన -తిమిరము బా ఱద్రోలుటకు దీ పము ....

తిమిరము  బా ఱద్రోలుటకు దీ పము లెల్లెడ దేజ రిల్లగా
ప్రమిద లలోన దైలము ను బాగుగ ,నిండుగ బోయు చుందురే
ప్రమదు లు నింట ,,చక్కగను భావము నింపెసలార పాడుచున్
తిమిరము నందు,, వెల్తు రది తెల్లటి కాంతిని నింపుచు న్నదే 

Tuesday, November 10, 2015

దత్త పది --తాప -పాప -దీ ప -రూప (దీ పావళి )

తాప మణ గను బుడమికి దనరు నట్లు
పాప కర్ముడు  నరకుని బ్రతిమ జేసి
దగ్ధ పఱతురు ,రూపము దహన మగుట
గనెఱి  గి ముదము  తోడన గ్రామ ప్రజలు
దీప ములవెలి  గింతురు  దీ ప్తు లొలుక


Monday, November 9, 2015

ఒక మంచి మాటె చాలును

ఒక మంచి మాటె చాలును
నొకరిని నిల బాగుజేయ నో గురు వర్యా !
యకళం క  మనసు గలిగిన
నొక నేస్తమె  చాలు వాని నూరడి జేయన్ 

కల్లు పాకలో పురుష సూక్తము పఠిం చె

తప్ప త్రాగును నిత్యము తంగ వేలు
కల్లు పాకలో, ,పురుష సూక్తము పఠిం చె
గర్భ గుడిలోన రమభావ  గర్భి తముగ
భక్తు లందఱు మెచ్చగ రక్తి గాను 

పద్య రచన -పూ మాలల్ గడు భక్తి .......

పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూ జార్ధినై దేవరా !
యీ మాలల్  యి క  నీకు సాదరముగా యీ నీ శిరంబందు నే
బ్రేమంబొ ప్పగ వైతు నో శివ ! మరిన్బ్రీ తిన్ ననున్ గావుమా
నామాట ల్  సరియౌను గా దలచి నా కోరికన్  మన్నించవే ?

Sunday, November 8, 2015

శవ పూజల వలన జన్మ సార్ధక మగురా

శవ మనగ నండ్రు శివుడని
శివు డెప్పుడు దప్పకుండ సేమము గూర్చున్
శివ శవములు నొక్క ట గుట
శవ పూజల వలన జన్మ సార్ధక మగురా 

నీతుల్ జెప్పెడి వారలు


నీతుల్ జెప్పెడి వారలు
జేతలలో జూపరార్య! చెప్పుటవరకే
నీతులనుపయో గింతురు
నీతినిబాటించకున్న నేరముగాదే?

కష్టముకద గవితలల్ల గందమునందున్

శిష్టులు కొందరు పలికిరి
కష్టముకద గవితలల్ల గందమునందున్
కష్టముకాదుగ నాకది
యిష్టముగావ్రాయుచుందునెప్పుడునేనున్

భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్


అరకొర సంసారంబది
భరణమ్శునునీయలేని బ్రదుకులె యగుటన్
భరమైనను నీయగమరి
భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్

కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన

కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన దాని యర్థమే
కాలము దాపురించెనని , కాలయముండును బంపుచుండునా
గేలమువంటి రజ్జునును.కాలముదీరెను నీకునింకనో
బాలుడ! రమ్ముమా యిటకుపాపము బుణ్యము లెక్కజూతునే

ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్

అండాళూ ! వింటివ యిది
ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
ముండాపదమదిపలుకుట
రండలకేజెల్లుగాని రాదది మనకున్

పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా

పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా
గద్యము గూడనావిధము హృద్యముగా మరియుండినొప్పినన్
అద్దిర యంచు నెప్పుడును నందరు మెత్తురుగాదెయయ్యదిన్
పద్యము లన్నియున్ మరియుగద్యములున్ జదువంగనేర్తురే

రామయననిననోరు రాతిరోలు

పావనంబు నగును బ్రత్యహమునునిల
రామయననిననోరు రాతిరోలు
బొత్ర ముండెనుగద పూర్వకాలమునందు
గృహము గృహమునందు కృష్ణ ! వింటె?

వనితయు గవితయు రెండును

వనితయు గవితయు రెండును
నెవరికినిన్ బోధపడవు నిసుమంతయును
న్నవగత మగుటకు గావలె
నవిరళమగు నోర్పు మనకునార్యా గురువా

పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్
ఎన్నడువింటిమేయిదియ పిన్నలు పెద్దలునేగిరా మరిన్
పిన్నలునెట్లుగానపుడు వెళ్లిరి యెన్నడులేనిపెండ్లికిన్
అన్నదయాకరా చెపుమ యాతృతగామదియుండెనిప్పుడున్

చుక్కలు మిలమిలమెరిసెను

చుక్కలు మిలమిలమెరిసెను
చక్కగనాకాశమందు చంద్రుని తోడన్
చిక్కటి రాతిరి యగుటన
అక్కాయది సహజమమ్శ యాలోచింపన్



Tuesday, November 3, 2015

పద్య రచన -దైవము పై ........

దైవము పై న భారమిడి ధర్మము దప్పక జీవనం బును 
న్నెవ్వడు జేయునో నతని నేడు తరంబుల వారికి న్దగన్ 
లావుగ సర్వ సంపదలు లాస్యము గామఱి యీ శు  డి చ్చుత
న్వేవురు సంతసంబడగ,వీడని బ్రేమను గల్గి యుంట చే 

Monday, November 2, 2015

అంగదుని జంపె నర్జును డా హ వమున

రాయ బారిగ పంపెను రాము డా ర్య !
 యం గదుని, జంపె నర్జును డా హ వమున
వేల కొలదిగ రిపులను వేటు వ ఱఛి
యుద్ధములు లేక యుండుట యొప్పు ధరను

Sunday, November 1, 2015

పద్య రచన ---- విసమును మ్రింగి నట్లు ....

 విసమును మ్రింగి నట్లు కడు వేదన బొందగ  నేలభా మినీ !
రుస రుస లాడు చుండు నుగ రోజును  నీపతి  దప్ప ద్రాగుచు
న్వ్య సనపు మైకమే యది యు బాధలు దప్ప వుగాక !నీ కుపా
యసమును దెత్తు నే దిన ప్రియంబని నీకు లలామ !యిప్పుడున్ 

ధనమే మోక్షము గడించు దారిని జూపున్

కనుమా  చెడుకున్మూ లము
 ధనమే, మోక్షము గడించు దారిని జూపు
న్ననయము శంభుని ధ్యానము
విను మఱి యీ నాదు మాట  వేంకట రమణా !

భరతభూమిరక్షబడులుగుడులు

భరతభూమిరక్షబడులుగుడులుగాదు
మంచిశిక్షణగల మాన్యు డైన
సైనికుండునగును శర్మ తెలియు
బడులు గుడులు బుధ్ది వడయు మిగుల

బ్రాహ్మణుండు మాంస భక్ష కుండు

యజ్ఞ యాగ ములను విజ్ఞత గా జేయు
బ్రాహ్మణుండు ,మాంస భక్ష కుండు
బ్రాహ్మ ణే త రుడగు పార్ధ సారధి గారు
మాంస భక్ష ణ మ్ము  మంచి గాదు 

Friday, October 30, 2015

పద్య రచన - ఆకలి దప్పులన్ మఱచి .......

 ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తు వచ్చెనే
యీ  కబడిన్గ  నంగ మఱి యీ యది సంతస మొప్పె యిప్పుడు
న్భీ కర  మైన యాట యిది వేగమె రమ్మిక రామజోగి !నే
వేకువ జామునే యిటకు వేగమె వచ్చితి దీని జూడగన్


యోగము భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకున్

తీగను బోలుయు  వతిసం
యోగము భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకు
న్భోగ ములు గలుగు నెడలను
రోగములకు వశము లగుచు రోదిం తురుగా  

Thursday, October 29, 2015

భార్య -భర్త

భరియింప బడుట గావున 
భ రణిని మఱి పిలువబడును  భార్య యనంగ
న్భరి యించు వాని నందురు 
నరయంగా భర్త యనుచు నార్యా ! వినుమా 

జింక చంపి తినును చిరుత పులి ని

జింక చంపి తినును చిరుత పులి ని నట
తారు మారు గాను నార్యు లనిరి
చిరుత పులియ తినును జింకను ,నరయగ
పులిని జూడ పారి పోవు జింక 

పద్య రచన - సామాన్యుడు వీ డనుకొని ,,,

 సామాన్యుడు వీ డనుకొని
యేమాత్రము  విడిచి బెట్ట కీ  గది  నుండి
న్బాములచే గఱపించుచు
బాములకున్లోను జేయు వాలాయము గాన్




అన్నప రెడ్డి గారికి జన్మ దిన శుభా కాంక్షలు

సత్య నారాయ ణా గురు సముడ !నీకు
జన్మ దినపుశు  భదినాన శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటి కిని రెప్ప  యట్లయి కాచు గాత !

Wednesday, October 28, 2015

మత్స్య యంత్రమ్ము గొట్టెను మాద్రి సుతుడు

బాహు బలమున బాణా న  ఫల్గు ణుం డు
మత్స్య యంత్రమ్ము గొట్టెను, మాద్రి సుతుడు
సంత సంబున బలుకుచు  జయము రవము
అందు కొనుముర సోదర ! వందనములు

పద్య రచన -- ఎన్ని చదువ బ్రయోజన .......

ఎన్ని చదువ బ్రయోజన మేమి గలదు
దొంగ బుధ్ధు లు  గలుగుచు దోచు కొనగ
చావ బాదిరి యిసుమంత జాలి లేక
సార్ధ కంబును జేయుడు చదువు నిలను 

Tuesday, October 27, 2015

పద్య రచన -ఇదెకద పుణ్య కార్య మన .........

ఇదెకద పుణ్య కార్య మన నెల్లరు మెచ్చగ దైవ సన్నిధి
న్వదలక  భక్తి తోడ బలు భావములా హృది రంగ రించగా
నదుము గులాబి ,మల్లెలును నా శివు జూట ము నందు నొప్పగా
ముదమున నామనంబు క  డుమోదము నొందె నుజూ డుడత్త   ఱి న్ 

జనుల జంప గల్గు ఘన యశమ్ము

పాత కములు గలిగి పాపిగా బేరొం దు
జనుల జంప, గల్గు ఘన యశమ్ము
మంచి కార్య ములను మాత్రమే జేయంగ
చేత లుండ వలయు శ్రీ క రముగ 

Monday, October 26, 2015

కలడా విజ్ఞుం డు గన శకారుని కంటెన్

ఇల మాశంకరు కంటెను
కలడా విజ్ఞుం డు గన, శకారుని కంటె
న్ద ల చ న్దు ష్టుడు నెచట ను
కలనైనన్గా  నరాడు కంటే సామీ !

పద్య రచన -నవ వికచ సరసి రుహము .......

నవ  వికచ సరసి రుహము ను
తవశిరమున బెట్టు కొనుము దామర సాక్షీ !
నవ వధువు వలెను నుందువు
సవరము  నుం బెట్టు  కొనుము  చక్కగ నుండన్ 

కాశీ యాత్ర (శంకరయ్య గారు )

శంక రార్యుల పయనము జక్కగాను 
సాగు  గాకయ నుచునునే  సాగిల బడి 
కాశి విశ్వేశు బ్రా ర్ధిం తు  కరము మోడ్చి 
యార్య ! శంకర !యేగుమా  యమ్మ తోడ 
సకల శుభముల నిచ్చుత!  శంకరుండు  

Sunday, October 25, 2015

మన్మధుండు ముక్కంటికి మాతులుండు

భవుని కోపాన దగ్ధమై భస్మ  మయ్యె
మన్మధుండు , ముక్కంటికి మాతులుండు
నెరుగ  నెవ్వరో మరినేను నెరిగి తేని
జెప్పు డా ర్యులు  విందును దప్ప కుండ 

పద్య రచన -ఔరా కలయా నిజమా

ఔరా  కలయా నిజమా
యీ రోజున జరిగె వింత యీ శుని గుడిలో
కారుల హారను చప్పుడు
ఆ రాత్రియు జెవుల సోకె నార్యా !వినుమా

Saturday, October 24, 2015

బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

బుద్ధుని గనువా డె పుడును
బుద్ధిగ మఱి  యనడునటుల  బుద్ధిని గూర్చి
న్సి ధ్ధా ! నీవే చెప్పుము
బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్ 

పద్య రచన -వినుమిదె నాహిత వాక్యము

వినుమిదె నాహిత  వాక్యము
ననయము మఱియా డబోకు నా త్మీ యుల తో
న్గ నుముర యాజూ దమ్ములు
నినుజేయును దప్పకుండ నేర స్థుని గన్

Friday, October 23, 2015

పద్య రచన -కటకట యిట్టి మాట ----------

కటకట యిట్టి మాట   లనగా దగునే మఱి నీకు నిప్పుడు
న్గ టువుగ మాటలాడ నయగారమ యా రయంగ జెప్పుమా
పటుతరసాధు మాటలు ‘సభాస్థలిఁ బెక్కులుగాఁగఁ బల్కుమీ
యటుల గుచో బె రుంగున  ట యాయువు శ్రీలును సంతుయున్సదా



వాలమ్ములు గలవు రెండు బంట్రో తునకున్

పోలికలే లేకుండగ
వాలమ్ములు గలవు రెండు బంట్రో తునకు
న్నీ లాగున మఱి యిచ్చిన
చాలను నే వ్రాయ దీని  శంకరు సామీ ! 

Thursday, October 22, 2015

పద్య రచన -“బలము గలదేని నాతో...”

బలము గలదేని నాతో 
దలప డి  నను గెలువు మయ్య ! తల్లా ప్రగడా !
పలువిధపు కారు కూతలు 
కల నైన న్గూ యకెపుడు కాచును భవుడున్ 

అమరావతి రాజు చంద్రుడై శోభిల్లెన్

అమరావతి యనుచోటన
కమనీయపుపురముగట్టి కళకళలాడన్
కుమతుల గర్వమునణచగ
అమరావతిరాజుచంద్రు ఢైశోభిల్లెన్

Wednesday, October 21, 2015

కరి మహిషాసురుని జంపి కాచెన్ జ గతిన్

విజయ దశమి శుభాకాంక్షలతో .......
-----
వరగర్వా తిశ యంబున
సురలను బంధించి యతడు చుల్లర వెట్ట
న్సరగున దలబడి యాశాం
కరి మహిషాసురుని జంపి కాచెన్ జ గతిన్


విజయ దశమి

విజయ దశమి శుభాకాంక్షల తో ,,,,  

విజయ దశమి నాడు వీడని భక్తిని
జమ్మి చెట్టు పూజ సలుపు నెడల
కార్య సిద్ధి గలుగు ,కలుగువాడు ను నగు
సంది యంబు వలదు సత్య మిదియ

Tuesday, October 20, 2015

పద్య రచన - “వికసించెను ముఖపద్మము......

వికసించెను ముఖ పద్మము 
ప్రకటించగ నాదు తీర్పు బాహాట ముగా
న్సకలము  నాకే దక్కును 
నిక భయము న్లేదు నాకు నీశ్వరు కరుణన్ 

రాక్షసుడు ర చించె రామ కధను

కలహ భోజ నుండు గారవ మొప్పగ
బోధ జేయు కతన బుద్ధి నెఱి గి
రాక్షసుడు ర చించె రామ కధను మఱి
కావ్య మనగ నదియ గణుతి కెక్కె



రాక్షసుడు రచించెరామకధనటన్న
నొ ప్పుకొనుదురెమరియొండు మాట
పలుకకుండ యార్య! వాల్మీకి రచియించ
కావ్యమనగ నదియ గణుతికెక్కె



Monday, October 19, 2015

శ్రీ రావి రంగారావు

రావి వంశాన బుట్టిన  రావు  వర్య !
నీదు ధీశక్తి నెన్నగ  నాదు తరమె ?
వంద నంబులు సేయుట వంద లాది 
తప్ప వేరొక మార్గమ్ము దరిని లేదు 

లలిత మృదూ క్తులన్గవితల న్రచి యించిన మెచ్చ రెవ్వరున్

ఇలను జనంబు లందఱు సహేతుక మొప్పగ నెంచి మెత్తురీ
లలిత మృదూక్తులన్ గవితలన్ రచియించిన, మెచ్చ రెవ్వరు
న్నలతిపదాలతోడ ననయంబును సభ్యత నీతి లేనిచో
ములుకుల వంటి మాటలను మొండిగ బల్కెడివారి నత్తరిన్.



ఇలను జనంబు మెత్తురు విశేష సమంచిత పాండితీ విధిన్ ,
లలిత మృదూక్తులన్గవితల న్రచియించిన;  మెచ్చరెవ్వరు
న్నలతి పదంబు తోడన నయంబును నీతియు లేని గాటమౌ
ములుకుల వంటి మాటలను  మొండిగ జెప్ప జూచినన్ 

పద్య రచన -బతుకమ్మ

 బతుకమ్మను బూజింతురు
వెతలనికన్బా పుమనుచు  వెలదులు భక్తి
న్సతతము గాపా డుమ మఱి
బతుకమ్మా !నీ  కునిడుదు వందన శతముల్


గురుమూర్తి గారి సరస్వతీ పూజ

గురుమూర్తి గారి చేతన
 విరచిత యా పూజ జదువ భేషని పించెన్
గురుమూర్తి వర్య !మీకుగ
కరములు జోడించి యిడుదు కనకపు సుమముల్ 

“పద్య రచన -కలయో వైష్ణవమాయయొ...”

కలయో వైష్ణవ మాయయొ 
తెలుపంగా నిక జాలనేను దెఱపై  జూడ
న్దెల తెల్లటి తనభూ తిని
కలలో మఱి యిచ్చె నాకు కాలుడు దయతోన్ 

Sunday, October 18, 2015

కృష్ణు డా డె నట క్రికెట్టు క్రీడ

‘రాసక్రీడ లెన్నొ రహి సత్యభామతో 
కృష్ణు డా డె నట, క్రికెట్టు క్రీడ
యందు పేరు మోసె యాసచిను గదార్య !
యొక్క రొకొక యాట నొప్పుదు రిల





సరస్వతీ పూజ



సరస్వతీ పూజ
రచన - గురుమూర్తి ఆచారి



మ.
తరమే యెవ్వనికేని నిత్యము సమస్త౦బైన లోకావళిన్
దరహాసద్యుతి న౦ధకారమును విధ్వ౦స౦బు గావి౦చుచున్
కరపద్మస్థిత వైణికాస్వరతర౦గశ్రేణి నాన౦ద డో
ల రహి౦ప౦గ నొనర్చు త్వద్విమల లీలాకేళి వర్ణి౦పగన్.

చ.
లలితకళావితాన సమల౦కృత సౌమ్య ముఖస్థల౦బు, శీ
తల కరుణాసుధారస నిధాన సునేత్రయుగ౦బు, ధర్మ ని
ర్మల హృదయా౦శమున్, కవిసమాజ నుతా౦చిత పాదపద్మముల్,
గలిగి తనర్చు నిన్నెద దల౦చెద బ్రోవుము తల్లి భారతీ!

ఉ.
తల్లి! విప౦చికాస్వర సుధారసధారల మీరు పల్కులన్
చల్లని మ౦దహాస మృదుచ౦ద్రిక కన్నను శుభ్రమౌ మదిన్,
మెల్లని రాజహ౦స గతి మి౦చిన వర్తనమున్, సత౦బు రా
జిల్లగ నీ పదాబ్జముల చేరువ నన్నిడు మమ్మ శారదా!

సీ.
తేనియ లొలుక౦గ వీణియ మీటుచు
నాన౦దలహరిలో నలరుచున్న
చేరువ నాట్య౦బు జేయు మయూరమున్
గనుల ప౦డుగ గాగ గా౦చుచున్న
జలజాత స౦భవు చతురాననములతో
వేదవాదమ్ము గావి౦చు చున్న
చేత బూనిన ముద్దుచిలుక తేటపలుకు
వీనుల వి౦దుగా వినుచునున్న
తే.గీ.
ఆ సరస్వతీ జనని నా కనవరతము
సర్వ లోకోన్నత౦బైన జ్ఞానధనము
మరియు దానితో కైవల్య మార్గ మొసగి
బ్రోచు చు౦డగ నాకి౦క లోప మేది?

Saturday, October 17, 2015

పురుష పుంగవునోడించిపొలతినెగడె


  1. యుధ్థమందున నాసత్య యోధురాలె
    రక్కసుండగు నరకుని రయముతోడ
    సంహరించెనుగావున సాహసాన
    పురుష పుంగవునోడించిపొలతినెగడె

పద్య రచన -ఒౌరా యెవ్విధి నమ్శుదు


ఒౌరా యెవ్విధి నమ్శుదు
బేరమ్శులు రాకపోయెబీడులునగుటన్
ఊరునబ్రదుకుట కష్టము
రారాయికపోదముమరి రాచనగరికిన్

Friday, October 16, 2015

పద్యరచన- అంశము... “సూర్యోదయ వర్ణనము” ఛందము - సీసము.

కావుకా వుమనుచు కాకుల రవములు
              వినబడం  గమరిని  వీనులకును
ప్రాగ్ది శా  భాగాన భానుండు   రధముపై
              బయలుదే రంగను  బ్రభలు వెలుగ
వేకువ జామున వేలకొ  లందిగ
                  నడకకై మార్గాన  నడచు చుండ
చీకట్లు మాయమై చిరువెలుం  గులుదోప
                  పుడమితల్లి యపుడు  పులక రించ
యంధ  కారము  మాయమై యచట యచట
కాంతి వెలుగుల తోడన  కానుపించ
తెల్ల వారెను జూ డుడు మెల్ల మెలగ
శంక రార్యుడ ! వందన మింక మీకు 

చేత కాని వాడు సేసె సృష్టి

ముందు సిద్ధ మగును నందరి కంటెను
చేత కాని వాడు, సేసె సృష్టి
సకల జీవ కోటి  నికమనీ యముగను
ముఖము నందు వ్రాసి పూర్వ ఫలము 

ష ష్టి పూర్తి(కృష్ణయ్య గారు )

పుసులూరి వంశ  మండన !
పసగల మొనగాడ  వార్య ! పావన కృష్ణా !
మిసమిస లాడుచు నుంటివి
యరుదెంచెనె? నరువది మఱి యపుడే నీకున్ .

నిన్నుజూడగ లేవయ్య నిజము గాను
వత్స రంబులు నరువది వచ్చి నటుల
కాన బడుచుంటి  విప్పుడు కన్ను లకును
పడుచు కుర్రాడు నుండెడు పగిది నీవు

ఇటులె కాపాడు కొనుమయ్య ! యీ స్థి  తినిక
జన్మ యున్నంత వరకును ,సైయ నంగ
పిన్న పెద్దలు చెలికాండ్రు పేర్మి తోడ
నయ్య ! కృష్ణయ్య! జనములు హాయనంగ.


తనర హనుమాయి నీకిల  దగిన  భార్య
యగుచు  కంటికినే  రె ప్ప  యైన విధము
ఎల్ల  వేళల మీ బాగు నినుమ డించ
శ్రధ్ధ జూపును నిజమిది సజ్జ నుండ !


నీ దు  మాటయే ప్రజలకు వేద వాక్కు
నిన్ను నమ్మిన వారికి నీడ నిచ్చి
యాదు కొంటివి   నిక్కము  సాదరముగ i
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?


వయసు దాటుట తప్పదు   ప్రతి యొకరికి
చింత గూడదు దానికై  సుంత యైన
చీకు   చింతలు  లేకుండ  శేష జీవి
తంబు సాగించు   కృష్ణయ్య ! తనర   యీవు


ష ష్టి పూర్తిని  నీ  రోజు జరుపు కొనగ
చింత నొందక మఱి నీవు  శివుని మదిని
స్మరణ జేయుచు గడుపుము జరము దనుక
ముక్తి  గలుగును దప్పక  ముదము గలుగ

సకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య  సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

( ది  5-11-2015 తేదీ న   కృ ష్ణయ్య గారి ష ష్టి పూర్తి  సందర్భము గా }

రచన ; పోచి రాజు   సుబ్బారావు

విజయ దశమి

విజయ దశమి నాడు విష్ణు బూజనుసేయ
సకల సంపదలును,సంతునిచ్చు
రాముడటులజేసి రావణువధియించె
అర్జునుండు గెలిచె నరి గణమును

Thursday, October 15, 2015

యేశు ని నమ్మిన ద్రి నేత్రు డిచ్చును సిరులన్

ఈ శుని దూ తయె కావున
యేశు ని  నమ్మిన ద్రి నేత్రు డిచ్చును సిరుల
న్యీ  శును నేసుయు గృష్ణుడు
నా శార్వరి ,యాదిశక్తి యంశము లేనౌ

పద్య రచన --కమలముల వంటి కన్నులు

కమలముల వంటి కన్నులు
నమలంబగు బాలనిచ్చు నతివకు చంబు
ల్గనులకు గనబడినన్ నీ
మనమును దిగజారనీకు  మనుజుడ ! యెపుడున్ 

Wednesday, October 14, 2015

పద్య రచన - మగడా !పోటుమగండ వీ వెయని సంభావింప

మగడా !పోటుమగండ వీ వెయని సంభావింప లేకుంటి నే
ప్రగతిం జెందెద వంచు నే  నిచట సంభ్రంబొం  చుం మంటిగా
నగవా  నీకిది యేమిటిం దలతు లేనా నీ  కు?నేనుంటి గా
పగవాడైనను నీవలె న్నిటుల జంపంగా దొడంగూ ర్చునే ?



దత్త పది =కారు-జీపు -వ్యాను -లారి (రామాయణా ర్ధము }

కారు బలహీను లమిత విక్రములు కపులు 
వార లారీతి యుండుట కారణంబు 
రామ రాజీ పు డ మియందు రాజ్య మేలు 
కతన  నాతని దివ్యాను గ్రహము నొంది 


Tuesday, October 13, 2015

పదములు -జిజ్ఞాస -విజ్ఞానము -వివేకము -మానవత్వము

జిజ్ఞాస వివేకంబులు 
విజ్ఞానము మానవత్వ  వివరములు దగ
న్సుజ్ఞాతము నగు విధముగ 
విజ్ఞాపన జేసిరార్య ! వీనుల విందౌ . 

దత్తపది =కారు ,లారి ,జీపు వ్యాను (భారతార్ధము )

కారు మొయిలవి గగనాన గ్రమ్ము కొనెను 
కనుమ దివ్యాను భవమును గౌర వేంద్ర !
ధర్మ రాజీ పు  డమికిని దగిన   పతిగ 
నుండ యేలా రిపుల మాట యుండు ననఘ !


పద్య రచన -కవి కలమున కున్న మహిమ

కవి  కలమున కున్న మహిమ
వివరింతును మీకు నిపుడు  వివరము తోడ
న్ర వికా ననిచో  టులయు
న్గ వికాంచును సత్య మిదియ  కందివ రేణ్యా !

Monday, October 12, 2015

సజ్జనులు చేరుదురు యమసదనమునకు

పుణ్య లోకాల కేసామి ! పొలుపు గాను
సజ్జనులు చేరుదురు ,యమసదనమునకు
పాపు లందఱు పోదురు పాపములను
జేయు కతన నిజము గ నే  జెప్పు చుంటి 

పద్య రచన -ఎక్కడదాగినాడొ ......

ఎక్కడ  దాగినాడొ  కనిపించడు నాకిల దేవదే వుడు
న్మక్కువ తోడ నుంటి ని ట మాన్యుడ ! చెప్పుము నిన్నునే  మన
న్దక్కువ జేసి , యా ప్రభువు  దర్శన మిచ్చెనె ? చెప్పుమా మఱి 
న్నక్కున జేర్చు భక్తు డొకడ క్కడ నుం డెను సామి, నీ కనిన్

Sunday, October 11, 2015

బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్

సతతము బిల్లా పాపల
యుతముగ సంతోష ముండ యువతులు నచట
న్గతలను బాడగ ముదమున
బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్ 

పద్య రచన -మహాలయ అమావాస్య

ఈమ హాలయ పితృ దిన మెన్న  భువిని
అన్ని కులముల వారలు మిన్న గాను 
తర్ప ణ మ్ములు  శ్రధ్ధగ దమతమ పిత 
రులకు నిత్తురట మఱి యా  ర్యుల యె దుటన 

Saturday, October 10, 2015

పద్యరచన - “నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు...”

నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
వత్తు దప్పక దరికినీ  వారిజాక్షి !
యాలయంబుల దర్శన మవస రమ్ము 
మనకు మఱి యీవ  యస్సున మాన్యము గను 

శ్రీ రామాయని పిలిచిన శివు డే తెంచెన్

ఆరయ నొకరే  యగుటను
శ్రీ రామాయని పిలిచిన శివు డే తెంచె
న్నారాముడు నీ శివుడును
బారంగతు జేయు నెపుడు  భక్తుని  దయతోన్ 

Friday, October 9, 2015

పురుషుడు పసుపాడి ముడిచె బూ మాల నొగిన్

విరజాజులతో రా,దన
పురుషుడు పసుపాడి  ముడిచె బూ మాల నొగి
న్నరవింద ముఖము గలిగిన
వర లక్ష్మీ శాస్త్రి  యపుడు ప్రమదము తోడన్ 

పద్యరచన - “భర్త భరించెడివాఁ డఁట...

భర్త భరించెడివాఁ డఁట
భర్తను మఱి సరిగ  జూడు భార్యయు గలదే ?
కర్తవ్యము, బాధ్యత లవి
భర్తయు భార్యయు నరయుచు    బ్రదుకగ వలయున్


Thursday, October 8, 2015

పద్య రచన -అనిశము సర్వ భూతముల .......

 అనిశము సర్వ భూతముల  యందిల దైవము జూచు చుండియు
న్దనరగ  బ్రేమ భావము లు తప్ప క వర్తిలు చున్మ నం గగా
న నయము  శాంతి సౌఖ్యము లె యాయత రీతి నొప్పవే ?
యనుపమ ! నీవె దెల్పు మది యాయువు గూడను వృధ్ధి చెంద దే ?

కాంత గోరగ తానె యేకాం తు డయ్యె

పెండ్లి యాడెను గుడిలోన పేరి శాస్త్రి
కాంత గోరగ తానె ,యేకాం తు డయ్యె
కట్న మేదియు లేదను గార ణమున
నియ్య గవిడాకు లామెకు నిష్ట మౌట 

Wednesday, October 7, 2015

దుర్భర దారిద్ర్య పీ డితుడవు కుబేరా

అర్భక ! శని వలనైతివి
దుర్భర దారిద్ర్య పీ డితుడవు కుబేరా!
నిర్భాగ్యుని గాజేయకు
దర్భా శ్రీరామ చంద్రు దయతో నీవున్  

పద్య రచన -ఇద్దరు భార్యలు గలిగిన

ఇద్దరు భార్యలు గలిగిన
ముద్దులు మురిపెంబు లవియు మోదము గూర్చు
న్నిద్దరు తగవులు బోయిన
నద్దిర సంసార ముండు నధమ స్థి తిలోన్ 

Tuesday, October 6, 2015

చీమ కుట్టె జచ్చె సింహ మయ్యొ

కన్న మందు నేను కరమును బెట్టగ
చీమ కుట్టె ,జచ్చెసింహ మయ్యొ
రోగ పీడితమయిరోదుచు జంతు ప్ర
దర్శన తల  మందు దారు ణ ముగ

పద్య రచన -ఎంత సుదినమిద్ది

ఎంత సుదినమిద్ది యేమని వివరింతు
నాదు కొడుకు నేడు నార్తు అమెరి
కాన బయలు దేరి కన్నుల పండువ
జేయ వచ్చు  చుండె శీఘ్ర ముగను 

Monday, October 5, 2015

రాము డేలి నాడు రోము ప్రజల

కన్న బిడ్డ లవలె కాపాడి ప్రజలను
రాము డేలి నాడు, రోము ప్రజల
కనుల యందు  సుఖము గనబడు నట్లుగ
పాల నమును జేసె ప్రభువు రోము 

పద్య రచన -“పుడమిఁ గల జనులు పొగడఁగ...”

పుడమి గల జనులు పొగడగ
గడగడ లాడించె రిపుల కఠినపు రీతి
న్నడవుల దిరుగుచు శ్రీ రా
ముడుదగు శౌర్యంబు తోడ మునులను గావన్

Sunday, October 4, 2015

కావేరీ తీర మందు గలదట డిల్లీ

ఓ వాణీ ! వింటి వయిది
కావేరీ తీర మందు గలదట డిల్లీ
నీవును నమ్మితె? యోయమ !
పావన మగుగుడులు గలవు పరమా త్ము నివిన్

పద్య రచన -ఏమని వర్ణింతును నీ ......

ఏమని వర్ణింతును నీ
నామము నో శంకరార్య!నా మంబరయ
న్నా మా శంకరు నామము
మేముగ నర్చింతు మిమ్ము మీదయ కొఱ కున్ 

Saturday, October 3, 2015

పద్య రచన - “నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై...”

నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై శుభం బు గా
ధ్యానము జేయుచుం శివుని  మానస  మందున నప్పు డా తడే
యానన  మందునన్నగవు నంచిత రీతిని గన్పడం గనా
మా నసమందునన్మి మిగుల మాన్యత నొప్పెను నా క్షణం బునన్



స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్

ఘనమగు దాపము నోర్వక
యనుమతి  పతివలన బొంది యాహా యనుచు
న్ద నహర్మ్యము లోన నుపరి 
స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్

(మామ =చందమామ )





Friday, October 2, 2015

ఆర్యా ! ఆర్య భట్ల !

తప్పు లుండ వచ్చు ,దాముగా నెవరును 
గొప్ప వారు కాదు నె ప్పటికిని 
గురువు నొద్ద  నేర్చు  కొనగవ లయు సుమ్ము 
అరయు మీ నిజమ్ము నార్య భట్ల !

పద్య రచన --కటకట యెన్ని కష్టములు ........

కటకట  యెన్ని కష్టములు గల్గెను మాకిపు డా ర్య !యే మనన్
నటనలయందు నేర్పరి యనంద గు మాచె లికాడు  మొన్న రే
యట మఱి ద్రాగి దూలుచు రయంబున నూతిని డాసి దూ కెనా
డటనిక నా తడ య్యెడ భయంబున కేకలు వేసె నత్తరిన్ 

తెలివి లేని వాడె దేశి కుండు

ముష్కరులను నమ్మి మోసపో  యెడి వాడు
తెలివి లేని వాడె , దేశి కుండు
తనదు శిష్య గణము  దనరారు  నట్లుగ
బోధ జేయు నెపుడు భూరి గాను 

కవి మిత్రులకు నమస్కారములతో .....-

కవి మిత్రులకు  నమస్కారములతో .....-
----

జయమును బలుకగ వలయును
దయతో నిక శంకరార్యు  దత్పురుషునకు
న్లయకారుని గృప  వలనన
జయమున్సా ధించు కతన సాకాం క్షత తోన్


Thursday, October 1, 2015

జాతిపిత


జాతిపితగనుబేరొంది జగమునందు
సత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె నుసురాజ్య ముమనకు  దెగువతోడ

సెలవు


సెలవు  గాబ్రకట ననుని  చ్చిరి గురువులు
కవిత లకికను శంకర ! కారణంబు
దెలియ కుండెను , సెలవది దేని కొరకొ ?
యేండ్ల కొలదిగ  సాగెడి యీ కృ  షినిట
యాపి వేయుట  ధర్మమా ? యజ్ఞ పురుష !

ద్రుపద రాజ కన్య ద్రోణు వలచె

పార్ధు వలచి యతని బరిణయ మాడెను
ద్రుపద రాజ కన్య ,ద్రోణు వలచె
గృపుని భగిని యైన గృపి యను  నాయింతి
సంత సమ్ము మదిని సంత రిల్ల

Wednesday, September 30, 2015

పద్య రచన -గురు శబ్ద వాచ్యు డెవ్వడు ......


గురు శబ్ద వాచ్యు డెవ్వడు
మరి తెలియదె మీకు సామి !మాన్యుడు గురువే
గురువే జ్ఞానము నిచ్చును
గురువను శబ్దమ్ము భువిని గురుతర మయ్యెన్ 

Tuesday, September 29, 2015

తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

తారా పథమున మబ్బులు
తా రాడుచు నుండ మిగుల తమమున్గలుగ
న్బాఱి న  మబ్బుల దాగిన
తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్ 

పద్య రచన -ఇనుము సూదంటు రాయి ....

ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
మేన క సొగసు  జూచియు  మిగుల వగలు 
జెంది  యా గాధి తనయుడు  చేరి దనను 
భంగ మొనరింప  జేసెను  దనత  పసును

ఇనుము సూదంటు రాయికై  యెగయు నట్లు
భార్య పొందుకై తపియించు భర్త యెపుడు
క్రొత్త గాబెండ్లి  యగుటన  కోర్కె లుండు
సహజ మయ్యది  క్రొ త్త దౌ  జంట కిలను  

Monday, September 28, 2015

ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా !


నట రాజు ప్రతిమ యుండెను 
ఘటమున, నేనుగుల గుంపు గలదు ముకుందా !
యటవీ ప్రాంతపు హద్దుల 
జటిలంబగు  మార్గమగుట జనశక్యంబే ?

పద్య రచన -చనుబాలు ద్రాగు బిడ్డడు ........

చను బాలు  ద్రాగు బిడ్డడు
ఘనమగు రక్కసుల జంపె గనుగొను చుండన్
వినయముగా నే జేతును
వన మందలి పూల దెచ్చి భక్తిని బూజన్ 

అష్టావధానము ప్రభావతి గారిచే

అవధానము లన్నిట మీ
యవధానమె  గొప్పదౌను నమ్మా ప్రాభా !
యవధానం బొ నరింపుమ
యవనిన్గల ప్రముఖ గణము హాహా యనగన్



పద్య రచన -----కవివర!నీ కవిత్వము ........

కవివర!నీ కవిత్వమునగాం తుము చక్కని సూక్తులెన్నియో
యువతకు  పట్టుకొమ్మలయియొప్పును  బాగుగ నుంట జేసి యే
యవ  గుణముల్ త్యజించియును  హాయిగ జీవన మార్గ మెంచగా
నవిరళ జీ వనంబును నయం బుగ జేయుచు హాయి గొల్పెడిన్

Sunday, September 27, 2015

దత్తపది -ఈగ -దోమ -పేను -నల్లి (భారతార్ధము )


జడను బేనుకొ  నుమయిక జాయ ! నేను 
ఈ గ  దాదండ మునవాని  సాగనంపి 
కురుల  నల్లి నీ  యవియిక  గూర్తు ముదము 
మంచి గామఱి  మనగదో  మగువ !యిపుడు 

Saturday, September 26, 2015

పద్య రచన -గణేశు నిమజ్జనము


చిత్ర మయ్యది జూడగ జిన్న పెద్ద 
లంద ఱచ్చట  గుమిగూడి యందముగను 
నీటి లోపల  గణపతి నిబ్రమ  దమున 
ముంచ నుద్యుక్తు లయ్యిరి మూర్తి ! చూడు 

వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్


అనుదినము బూజ జేసియు
ననువుగ నిక దశమి రోజు హాహా యనుచు
న్ననుపమ , సారధి తోడుగ
వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

Friday, September 25, 2015

.పద్యరచన -ఎక్కడ కేగువాడ నిపుడెవ్వని ........

ఎక్కడ కేగువాడ నిపుడెవ్వని వేడుదు  నేమి చేతు నే
మ్రొక్కిన దైవమే ననిల మోడుగ జేసెను నెవ్వడిం క యీ
చిక్కుల బారి న్గృపను బ్రోవును నీశ్వరు డే గతంచు నే
మక్కువ తోడ నుంటినయ మాన్యుడ ! నన్నిక గావుమా మఱిన్


పదునె నిమది పదునెనిమిది పదునెనిమదియే


హృదయపు చప్పుడు వోలెను
మదికిన్మఱి  సంతసంబు మాన్యా ! కలిగె
న్బ దముల యల్లిక యీ యది
పదునె నిమది పదునెనిమిది పదునెనిమదియే 

టా బ్లెట్టు కానుక


మిత్రు డొక్కడు ప్రేమతో చిత్ర మైన 
టా బ్లెటు నునీయ సంతసంబ బ్బె మామ
నంబునకు నార్య ! మఱి వందనంబు జేతు 
వంద లాదిగ నతనికి కంది వర్య !

నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

అలకా పురమున జరిగెడి
పలురకముల సభలయందు ప్రమదము తోడ
న్గలగల మాటలు బలుకుచు
నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే 

Thursday, September 24, 2015

పద్య రచన -తమ్ముడా ! యిట్లొనర్చుట ధర్మ మగునె.....

పూట పూటకు ద్రాగుచు  పొట్ట నిండ
యిం టి నిల్లాలి బిల్లల  నొంటి జేసి
యిలబ లాదూ రు గదిరుగ నెగ్గు లేదె ?
తమ్ముడా !  యిట్లొనర్చుట ధర్మ మగునె.....

Wednesday, September 23, 2015

మూత్రపిండము - రాయి

మూత్ర పిండపు రాళ్ళను మొదట గానె 
తెలిసి కొనుచును గ రగించి తీయ వలయు 
మందు దానికి తెలియుడు ముందు గాను 
ద్రా గ  వలయును నీటిని దనివి దీర 
యార్య ! శంకర ! ద్రాగుడు నీరము మఱి 
కరగి పోవును రాళ్లన్ని , కనబ డవిక . 

అన్న దానమ్ము సేయువా రధము లిలను


సర్వ సౌభాగ్యములతో డ వర్ధిలుదురు
అన్న దానమ్ము సేయువా ర,ధము లిలను
బనియు పాటలు లేకుండ బ్రతుకు వారు
వారు బ్రదుకుట  వ్యర్ధము వారి జాక్ష !

Tuesday, September 22, 2015

కోడలా నాపతియె నీకు కొడుకు గాదె


మామయగునమ్మ మఱి నీకు మఱచి తీవ ?
కోడలా! నాపతియె, నీకు కొడుకు గాదె
సోమ శంకర నా ముండు  సుచరి తుండు
మఱపు  వచ్చిన దోయమ్మ ! మందు వాడు

Monday, September 21, 2015

పద్య రచన -బొంగరాల ఆట

ఆడుచుండెను బాలుడు చూడు మచట 
యుంగ రమ్మును వోలెను  బొంగ రమును 
ద్రిప్పు చుండెను  గిరగిర  తిరుగు నటుల 
తనదు నఱ చేతి పైనను దన్మయతన 

రతిపతి మన్మధు డు గాడు బ్రహ్మయె తలపన్


అతివా ! వినుమీ మాటను
రతిపతి  మన్మధు డు గాడు ,బ్రహ్మయె తలప
న్సతి భా  రతికి న్బెనిమిటి
సతి పతుల న్నెంచ వలయు  సరియగు రీతిన్ 

Sunday, September 20, 2015

పద్య రచన -మనసిజ పుష్ప బాణములు ...........


మనసి జ పుష్ప బాణములు  మాటికి గ్రుచ్చగ  సంత సంబున
న్దనరగ  గోపకాంతలు నెద న్బుల కాం కితు  లౌచు వారలు
న్దనువు  గగుర్పొడం గను నెద న్గ ల  చంగ దృ గంచిత బుధ్ధి దా
నెనరగ గృ ష్ణు డప్పుడట యెన్నడు  లేని విధంబు గన్పడె న్

రాము లందు గొప్ప రాము డతడు


పరశు రాము డొకడు బలరాము డొక్కడు
వీర్య వంతు లుమఱి  ధరణి యందు
రాజ ! యా  ద  శరధ  రాముడే యెన్నగ
రాము లందు గొప్ప రాము డతడు 

పద్య రచన -చెరువు

రంగు రంగుల కాంతిని రంగ రించి
కలువ పూలతో చెఱువది కానిపించె
ప్రకృతి మాత యందమచట ప్రస్పుటముగ
ద్యోత మయ్యెను జూడుడు తోయలార!



వాసుదేవుని, గంసుడు పట్టి జంపె



పూజ జేయుడు నిత్యము పూల తోడ 
వాసుదేవుని, గంసుడు పట్టి జంపె 
సప్త వశువులు ననబడు సప్త శిశుల 
ప్రబల మగుటన నతనిలో ప్రాణ భీతి

పద్య రచన -గణపతి -లాపుటాపు

పూజ లందు కొ  నంగను  ముదము కలిగి 
లాపు టాపున  సౌందర్య లహరి చదువు 
చుండె ను శివుని  మదిలోన చూచు కొనుచు 
పరమ  శివునిపై  గలయట్టి  భక్తి తోడ 

ఆడు వారు బొంకు లాడు వారు

ఆడు వారు బొంకు లాడు వారనుటను
మంచి కాదు మనకు మాన నీయ !
తిరగ బడుదు రుమఱి  దినముది  నమ్మును
కూడు దొరక దండి కొంచె మైన 

Thursday, September 17, 2015

పద్య రచన -వలదు వల దన్న వినక ..........

సా హసంబులు  సేయక సంయమనము
తోడ మెలగుమా యనుచును దుదిని వరకు
వలదు వలదన్న వినక యీ  పనులొ  నర్చి
కోరి లోనయ్యె  యాపద గురిచి  సీను

కొఱవి తోడను ద లగోకి కొనుట మేలు

కాని పనులను జేయుచు కాంత యొకతె
యూరి వారల చేతను నూరి నుండి
వెలువ వేయించు కొనగను వీలు కన్న
కొఱవి తోడను ద లగోకి కొనుట మేలు

పద్య రచన -కురు నృప ! పాండు నందను లకుం ఠిత............

కురు నృప ! పాండు నందను లకుం ఠిత భక్తిని ,ధర్మ బుద్ధితో
నిరత   ముసేవ  జేయుదు  రునీ చ రణాల  కుగాదె  ? వారి
న్నరసి   ముదంబు నొప్పగ ,దయన్గలు గంగ, సగర్వ ముగాగ
న్నిరవుగ వారి భాగపు మహిన్దగ నిమ్ము సుబుద్ధితో నికన్



భక్షించెను గోవు జంపి పాప మెటులగున్

రక్షించ వలయు గోవుల
భక్షించెను గోవు జంపి పాప మెటులగు
న్వీ క్షింతుము  నరకంబును
నక్షయముగ  బాపమొదవి  యార్యా ! వినుమీ

పద్య రచన -గణపతి


చిత్ర మందున గణపతి చిత్ర చిత్ర
వర్ణ  ములతోడ శోభిల్లె బంధురముగ
వేయి కళ్ళును జాలవు  వీ క్షితులకు
చూడ  రారండియందరు శుభము  కలుగు

ఏక దంతుని వాహన మెలుక కాదు


ఏక దంతుని వాహన మెలుక, కాదు
నా న  ననగను  భావ్యమే  నార సింహ !
యెలుక యే వాహ   నము గద  యీ శు సుతున
కు మఱి సంశయ మువలదు  కొంచె మైన

Tuesday, September 15, 2015

శిశుపాలుని జంపినట్టి శివునకు జేజే


పశువుల కాపరి చంపెను
శిశుపాలుని ,జంపినట్టి శివునకు జేజే
దిశలెల్ల దద్ద రిల్లగ
నిశినిం జరియించువారి  యు క్క డరంగన్ 

Monday, September 14, 2015

పద్య రచన -పట్టీలు


పట్టీలను నేజూచితి
బిట్టుగ నవి మెఱయు చుండె  వెండివి కతన
న్బ ట్టీ ల  తోడ  పదములు
చిట్టీ ! మఱి యందగించె జి గిజిగి  వోలెన్ 

Sunday, September 13, 2015

రామ కధ విని మురిసెను రాక్షసుండు

తనదు పిల్లల నోటన తల్లి సీత
రామ కధ విని  మురిసెను,  రాక్షసుడగు
నా  హిరణ్య కశిపు డు దా  ననుమ తించె
దనదు కొమరుడు ప్రహ్లాదు దండ జేయ
విష్ణు భక్తుడు నగుటన  విసుగు జెంది



Saturday, September 12, 2015

భీము డతి భీ కరమ్ముగ భీము జంపె

భీము డనుపేర న సురుడు భీకరముగ
భక్తు  డైన సు  దక్షిణు వెతల బఱు ప
తనదు  మూడవ కంటిని నెనర దెఱచి
భీము డతి భీ కరమ్ముగ భీము జంపె 

పద్య రచన -వరమయ్యొ శాప మయ్యెను

వర మయ్యొ  శాప మయ్యెను
నిరవుగ భస్మాసురుండు నీశుని వరము
న్దిరమగు  బుద్ధిని దలపక
వర గర్వము జేత నతడు  భస్మం బగుటన్ 

Friday, September 11, 2015

ధర్మ మార్గము దప్పడు దానవుండు


మానవత్వము గలిగిన మానవుండు
ధర్మ మార్గము దప్పడు, దానవుండు
దమన మార్గాన జనులపై దాడి జేసి
చంపి భక్షించు నది వాని జాతి వృత్తి 

పద్య రచన -గేదె మీద కుక్క


శునక మొక్కటి నిదురించె సుఖము గాను 
మహిషి మీదను జక్కగా  మాననీయ !
జంతు ప్రేమను జూచియు  జనులు మనము 
నేర్చు కొనవల యును వాటి నెనరు ప్రేమ 

పద్య రచన -ఎందుల కిన్ని బాధలు ,,,,,,,,,,,

ఎందుల కిన్ని బాధలు సహింతువు వద్దను కొన్న వారు దా 
నిందలు మోపగా మరిని బందుగు లౌటను సైచుటొ ప్పుగా 
డెందము నందలం  చియిక మందుడు వోలెను నుంట గా దగ
న్నందరి సౌఖ్యము ల్నరసి యుంటకు నేమని జెప్పగా వలెన్ 

అనుభవ మ్మన రానిది యనుభ వమ్ము


స్వప్న   మందున గాంచితి స్వామి శివుని
పార్వ తీదేవి శ్రీరాము డుర్వి సుతను
నేమి భాగ్యము నాయది యిదియ యరయ
య నుభవ మ్మన రానిది యనుభ వమ్ము 

Wednesday, September 9, 2015

రామున కెచెందు నెల్లప్డు రాధ వలపు

అవని పుత్రిక సీతమ్మ యార్య ! వినుము
రామున కెచెందు నెల్లప్డు ,రాధ వలపు
చెందు నాకృ ష్ణ  పరమాత్మ డెంద మునకు
వలపు గలిగించు నాతడె వలచు మఱియు 

పద్య రచన -గాలి మేడలు

ఉన్న దానితో దృప్తిని నొందు చుండి 
జీవ నంబును సాగించు నెవరు  నైన 
సుఖము శాంతుల తోడన శోభి లుదురు 
కాక  యూహను గాలిలో కట్టు నట్టి 
మేడ  లన్నియు గూలును మిగలదేది 
కాన గాలిమే  డల నిక  కట్ట కెపుడు 

Tuesday, September 8, 2015

కాంతా రమ్మనెను మోక్ష కాముడు తమిన్


సాంతము  వినునా మాటను
కాంతా! రమ్మనెను మోక్ష కాముడు తమి
న్యాం త్రిక జీవన పరిధిని
మాం త్రికముగ దాటు కొఱకు మదినిం పలరన్ 

పద్య రచన -ముసలి దనము ,చేతి కర్ర


ముసలి దనమున కుగు ఱు తు , ముఖము వడలు
కాళ్ళు సేతులు బనిచేయ వెల్లపుడును
కఱ్ఱ యుండును జేతికి కాటి కరుగు
వరకు  హాహత  విధి,పగ  వా డికినిల
నుండ కూ డ దీ  యవస్థ  యొజ్జ లార !

Monday, September 7, 2015

పద్య రచన -విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్

చోరుల కశక్య మైనది
గౌరవ మున్బుష్టి నిచ్చు క్రూ రత  తొలగు
న్భారము గాదెప్పు  డుమఱి 
యారయ యిది గొప్ప ధనము నన్నిటి కంటెన్ 

దేవు డే లేడ నెడువాడు దేవు డ య్యె


నాస్తికు డనబ డును గదా   నరుడు భువిని
దేవు  డే లేడ నెడువాడు  ,దేవు డ య్యె
మానవాకార  మందుండి మహితు డగుచు
రాక్షసుల జంపిన కతన  రాము  డరయ



Sunday, September 6, 2015

ఏనుగు చిట్టెలుక గాంచి యెంతొ భయ పడెన్


కానగ బోలును గొండను
నే నుగు, చిట్టెలుక గాంచి యెంతొ భయ పడె
న్సీ నయ  దాపున బోవగ
వీనుల నారవము వినుచు వివశత తోడన్  

పద్య రచన -నాట్యము


ముద్దు గుమ్మలు  నాట్యము ల్ముద్దు లొలుక 
చేయు చుండిరి  చూడుము చిత్ర మందు 
వారి  నృత్యభం  గిమము ల  నా ర యంగ 
కూచి పూడిని దోచెను కోమ లాంగి !