Saturday, January 31, 2015

ఆత్మ హత్య వలన నబ్బు ముక్తి

పాప మొదవు భువిని పరమాత్మకును నైన
ఆత్మ హత్య వలన ,నబ్బు ముక్తి
భక్తి శ్రద్ధ తోడ బరమేశు  బూజించ
సంది యంబు వలదు సుంత యైన

నిషిద్ధాక్షరి - అంశం- శిశుపాలవధ. నిషిద్ధాక్షరము - శ. ఛందస్సు - తేటగీతి.

రాజ సూయయా  గంబున రాజు లెదుట
చేది రాజట  కృష్ణుని వేదనలకు
భూరి గురి జేయు   కతనన నూఱునైన
తప్పులకును ఖం  డించె న  తని త  లనట 


పద్య రచన -మార్కం డే యుడు

యముని పాశము దనయొద్ద  నగు బడంగ
దనర భక్తు డైన మృకండు తనయు డప్పు
డా శ  శిధరుని బ్రార్ధించ , యముడు మరిని
కాలు సాక్షాత్క రమ్మును గనుల గాంచి
యంజ  లిం చెను భక్తిని   హర్షమునన

Friday, January 30, 2015

రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీ సెన్

అసువుల మఱి నిల బెట్టును
రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీ సె
న్నసమాన నాయకుండును
బసగల వైయస్సు మృతియ  వగపులు గలుగన్ 

పద్య రచన -బీరకాయలు

చిత్ర మందున బెట్టిరి చెలువు గాను
బీరకాయలు లేతవి యాఱు  చూడు
నచ్చి , వాటిని కసకస నమలి  మ్రింగ
నూరు చున్నది నానోరు మేరి ! కంటె



Thursday, January 29, 2015

దత్తపది - 66. కల్లు - నీరా - సారా - సుర పైపదాలను ఉపయోగిస్తూ మద్యపాన నిషేధం గురించి

మద్య పానము మానుము మాన వుండ !
దాని వలనన  గలుగును హాని మనకు
కల్లు సారాయి నీ రాల గలుగు మత్తు
సురను  గూడను ద్రాగుట మరచి పొమ్ము
బాగు పడునిక  నిజమునీ  భాగ్య రేఖ

మనసారా నేగోరుదు
ననయము నీ సురను   మఱియు  హానౌ కల్లున్
వినుమవి  దరి రానీయకు
తనువిది నీరా  కకొఱకు  తహతహ లాడెన్

పద్య రచన గాంధీ జీ


జాతిపితగనుబేరొంది జగమునందు
సత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె రాజ్యము మనకు గా  దెగువతోడ

అంగ వస్రము ధరియించి యచట యుండి
వడకు చుండెను దారము బాపు    మిగుల
శ్రద్ధ తోడన గనుడా ర్య ! చక్ర మునట
ద్రిప్పు చుండగ గిరగిర  దిరుగు చుండె


Wednesday, January 28, 2015

బ్లాగు కవులకు విన్నపము

బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !
సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను
నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
మాటలాడుట వీలగు మంచి మాట
మఱియు దీ ర్చుకొం దునునను  మానములను

నాదు నంబరు జెప్పుదు మో దమలర
తొమ్మిదెనిమిది  యరువది తోడ గూడి
యాఱు మఱియు రెం డె నిమిది యైన పిదప
మూడు మూడునునెనిమిది ముందు గలిగి
నాలు గంత్యము గలదిగా నమ్ము డా ర్య !






దీపము పెట్టె నింట యువతీ మణి భళ్ళున తెల్ల వారినన్

మాపటి వేళ యయ్యె నని మామయ గారుడు వంగ నప్పు డు
న్దీ   పము పెట్టె నింట యువతీ మణి భళ్ళున తెల్ల వారిన
న్బా  పను లేపి యామె మఱి పాలను దెమ్మని నానతీ యగ
న్నా  పని జేయలేననిన నేపని జేతువు ? చెప్పుమా యనెన్

పద్య రచన =పిల్ల ద్రాటిపై నడచుట

పిల్ల యొక్కతె  యచ్చట బిడికి లందు
చేతి కఱ్ఱను  జేబూని చిత్రముగను
నడచు చుండెను ద్రాటిపై నాగ ! జూడు
మబ్బురంబును గలిగించ నందఱకును

Tuesday, January 27, 2015

పద్య రచన -శివుని విశ్వ రూపము

విశ్వ రూపమ్ము శంభుని వీ క్ష జేయ
సరగు బులకించె నొ డలంత  సంతసమున
నాది దేవున కర్పింతు  నహరహమ్ము
వంద నంబుల శతమును వరుస గాను

పద్య రచన -శ్రీ మహా విష్ణుని సాక్షాత్కారము

శ్రీ మ హావిష్ణు  వచ్చట శీ ఘ్రముగను
దనదు రూపాలు జూపించి తన్మయు లను
జేసె మమ్ముల నెంతయో చిత్ర మందు
వంద నంబులు శ్రీ కృష్ణ ! వంద లాది

న్యస్తాక్షరి - 24 అంశం- పుస్తకము ఛందస్సు- ఉత్పలమాల మొదటిపాదం మొదటి అక్షరం ‘పు’ రెండవపాదం ఏడవ అక్షరం ‘స్త’ మూడవపాదం పదమూడవ అక్షరం ‘క’ నాల్గవపాదం పదునేడవ అక్షరం ‘ము’

పుస్తక మాయెగా భువిని పూర్వపు గాధలు నెన్నియో మఱిన్
నేస్తమ యౌను హ  స్తమున నేర్వగ  నీ యది గాదె చె ప్పుమా
వాస్తవ మేగ దా ర్య మఱి  పైసల కన్నను గొప్పదే సుమా
వస్తువు లేవియం గనవు వాసిగ దీనికి సాముగా నిలన్

స్వగతం

పిచ్చి సన్నాసి కొడుకునా , ప్రేమ తోడ
పిలువ  వచ్చితి మోయమ్మ ! ప్రియము గలుగ
రాక మాయది నీకేమొ  రవ్వ యంత
యిష్ట మాయది లేదుగా యింతి ! యరయ

కారణం బును  లేకనే కఱకు దనపు
మాట  లవలన మాయొక్క మదిని మిగుల
గాయ పర చితి  వోయింతి !కనుక నీవు
అనుభ వింతువు రాబోవు దినము లందు

పెంచు కొంటివి మామీద  ద్రెంచు విధము
వెంట్రు ముక్కకు సాటినీ  వెఱ్ఱి  చేష్ట
రాజ మార్గము మాయది  రమణి ! యికను
దెలియ లేనిచో మునుముందు దెలియు నీకు .

 శుద్ధము గానిది పృధివి న
శుధ్ధముగా బరిగ ణిం త్రు సుజనులు వింటే ?
శుద్ధము లేమిని నీలో
శుద్ధముగా బలుకరింత చోద్యమ యగునున్

నీవు పలికిన మాటలు నిజము గాను
బాధ గలిగించె  మాకవి బహు   విధముల
మానసికముగా గ్రుంగితి మనుట నిజము
దేవు డనునత డుం డుచో  దినము దినము
ననుభవింతువు రోగము లలము కొనుచు

నీదు పిల్లలు   మాతోడ  నిబ్బరముగ
నొండు మాటైన మాట్లాడ కుండు నటుల
మంచి తరిఫీజు నిచ్చితి నంచు మిగుల
కులుకు చుంటివి గాబోలు కుత్సితముగ
నకట ,యేమికా  రుగ వార  లరయ మాకు

ఆయె నిచ్చట యెటులనో  యాఱు  నెలలు
శివుని సాక్షిగ మఱి యిక  జెప్పు చుంటి
నాదు కొడుకుపై   నొ ట్టే సి  ,నాదు ముఖము
నీకు జూపించ జన్మలో  నిజము నమ్ము
పరగ మనపరి స్థి  తి చక్క బడువరకును

నీదు పిల్లల మీదన నేను మఱి ని
జెప్పు చుంటిని  నొ ట్టే సి  యెప్పు డికను
నీదు ముఖమును జూపించ నీ యకమ్మ !
యిదియ యాఖరు మనకిక  నింక  సెలవు





Monday, January 26, 2015

కన్నులు గ్రుడ్డివే యయిన గానగ వచ్చు సమస్త వస్తువుల్

కన్నులు గ్రుడ్డివే యయిన గానగ వచ్చు సమస్త వస్తువు
ల్న న్నువ జెప్పగా మరిని మన్నన తోడన జూడగ ల్గుట
న్మి న్నగ వచ్చునే నికను సన్నుతి నెప్పుడు జ్ఞాననే త్రము
బన్నుగ జూడగా వలయు  పండిత సూక్తుల నిజ్జగంబునన్

మాఘ మాసపు స్నానము నఘము నీయు

సకల శుభములు గలిగించు సర్వు లకును
మాఘ మాసపు స్నానము ,నఘము నీయు
గంగ యందున మలినము ల్రంగ రించ
గనుక నెన్నడు జేయకు కాని పనులు

పద్య రచన -పద్మరేకులు

పద్మ రేకుల మధ్యన బాగు గాను
తేనె గలయట్టి  పుప్పొడి రేణువు లట
చూడ ముచ్చట గొలిపెను జూడ్కు లకవి
తెల్ల రేకుల కందమై యుల్ల సిల్లె
బ సుపు పచ్చని యండము భవ్య ముగను

Sunday, January 25, 2015

నిషిద్ధాక్షరములు - తవర్గాక్షరములు (తథదధన) ఛందస్సు - తేటగీతి.అంశం- రథసప్తమి.

మాఘ మాసపు పండుగ మనకు నయ్యె 
భాస్కరుడు పుట్టనేడవ పగలు  వలన 
ఏడు  గుఱ్ఱాల బండిపై  నేగు సామి !
యాల కించుచు   మా గోడు  హర్ష మీయు 

పద్య రచన -సైనిక వందనము

వంద నంబులు సేయగ వంద లాది
సేన యంతయు నచ్చట శ్వేత ప్రభున
కుమఱి  సంతస మాయెను కుసుమ  ! నాకు
నెంత  ముచ్చట  వేసెనో ,  వింత జూడ



జనగణ తంత్ర దేశముగ చక్కగ మారిన భారతావనిన్
జనవరి యిర్వదా రనిన సైనిక పాటవమున్ గ్రహించగా
మన కొక గొప్ప వేడ్క గద మాన్య సిపాయి లవక్ర విక్రమ-
మ్మును చవి జూపి శత్రువుల మూల్గును పీల్చెడి సాధనమ్ములన్
గని మురియంగ మేన పులకాంకురముల్ జనియించు సోదరా!
.
సర్వ సత్తాక లౌకిక సామ్యవాద
దేశ మందున గణతంత్ర దినము నేడు
రాజధాని ఢిల్లీ లోని రాజపధము
నందు జరగు చుండె నానందముగను

రామ దండును నిర్జించె రావణుండు

పంపె రాముడు రావణు వధను గొఱకు
రామ దండును, నిర్జించె రావణుండు
తనభు  జబలము  జాటంగ  ధరణి  మఱి యు
నన్ని లోకాలు ,దానవు ల్సన్ను తింప

Saturday, January 24, 2015

చావు వార్త తెచ్చె సంబరమ్ము

నిండు సభను మధ్య నేనుండ  నౌకరు
చావు వార్త తెచ్చె , సంబరమ్ము
మిగుల కలిగె నాకు మిత్రుని కళ్యాణ
మనెడు వార్త చెవుల వినగ రాగ

పద్య రచన -నంది

కాళ  హస్తిన గలయట్టి  గరళ  కం ఠు
నెదురు  గానంది  వాహన మిచట  రమ్య
మలరె ,చూడగ  జాలవు హర్ష ! వేయి
కళ్ళు , చూడుమా  నీవును కనక  మణిని

పేగు బంధము

తల్లి దండ్రుల నుండియు  దనయు లకును
వారి నుండియు మఱి యును వారి   బిడ్డ
లకును  నిట్లు త  రతరము లకును బేగు
బంధము  కొనసాగు  చు నుండు  వదల కుండ

పేగు బంధము మూలాన బ్రేమ గలుగు
బంధ  మదియలే  నియెడ ల భవుని కైన
కలుగ వెన్నటి కియనురా  గములు దనదు
సంతు పైనను నిజమిది  శంక రార్య !

సంజీవని వలన హాని జరుగును నెపుడున్

అంజీ ! బ్రదుకును మృతుడిల
సంజీవని వలన, హాని జరుగును నెపుడు
న్గంజ దళాక్షుని గొలువక
సంజను నిద్రించు నట్టి జడునకు భువిలో

Friday, January 23, 2015

దత్తపది - 65 (కక-గగ-తత-నన) పైపదాలను ఉపయోగిస్తూ కర్ణుని దానశీలాన్ని గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

కక గ గ తత నన లు  గర్ణుని  దానగు
ణమును దెలుపు టక్క  రములు గాని
వ్రాయ జేత గాదు  వ్రాయలే  నిప్పుడు
దయను  జూడు నన్ను  దాన కర్ణ !

గగన మందలి దేవత ల్గారవించ
నాననము నందు సంతస మగుపడంగ
జంకక యెపుడు సతతము జరిపి  యతడు
దాన కర్ణ గ బేరొందె మాన నీయ !


పద్య రచన =సోడా కాయ

అన్న మర గుట  కొఱ కునా  యాలినన్ను
కోర సోడాను ,దేవగ  కువల యాక్షి !
యేగ  బడ్డిద  రికినట  యీయ బడ్డి
సామి సోడాను జేరితి  సరగు గృహము

Thursday, January 22, 2015

గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్

తలపులు వలపులు గలరం
గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండు
న్నిల యాసంక్రాంతి యెగద
కలలను నిక నిజము జేసి కనకము నిచ్చున్

పద్య రచన -శివ లింగము -నంది -పాము

చిత్ర మందున నచ్చట శివుని లింగ
మునెదు  రుగ నంది  మఱియు పా  ముగన బడుట
పూర్వ జన్మలో జేసిన పుణ్య ఫలము
గాదె ? చెప్పుడు  నిజమని కవి వ  రేణ్య !

కొంద ఱుo దురు

కొంద ఱుo దురుజనముపై జిందు లాడు
చునిర  తము కార  ణంబులు జూడ కాన
బడవు నేమియు ,మనసులు  వారి వెపుడు
బాధ పడునార్య ! తెలియని బాధ వలన

Wednesday, January 21, 2015

న్యస్తాక్షరి - 23 అంశం- భగీరథప్రయత్నము ఛందస్సు- తేటగీతి. మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’ రెండవపాదం రెండవగణం మొదటి అక్షరం ‘గీ’ మూడవపాదం మూడవగణం మొదటి అక్షరం ‘ర’ నాల్గవపాదం నాల్గవగణం మొదటి అక్షరం ‘థి’

భాగ్య వశమున గంగను భవుని నుండి
ఋ షి భ  గీ రధు డు భువికి హర్ష మొదవ
 తీసి కొనగను రయమున తేరు మీద
 బయలు దేరెను జూడుమా   ధియుత  లేమ !



భావితరములకాదర్శ ప్రాయుడై ని
లచె భగీరథుడు పితరులకొనగూర్చె
నాత్మశాంతి తా రప్పించి యవనిపైకి
త్రిపథగనదియె భాగీరథిగ ప్రతీతి

(  చంద్ర మౌళి వారి పూ రణ )

పద్య రచన -కవి సమ్మేళనము

కవుల సమ్మేళ నమయది ,కాన బడియె
గురువు మధ్యగా నిరువైపు  లరయ వారు
నొకరు మించిన నొకరుగా నుండి రచట
జయము నా బడు   వత్సర చర్చ కొఱకు


అవధానంబులొనర్తు పద్యరచనా వ్యాపారసంసిద్ధతన్
కవిరాజేంద్రులు పృచ్చకోత్తములుగా కావ్యంబులంశంబులై
నవసాహిత్య వివేచనాగరిమచేఁ నానాప్రకారంబు ప
ద్యవివాదంబులు కర్ణపేయములుగానత్యంత దివ్యంబుగా.

(సంపత్ కుమార శాస్త్రి గారి పూ రణ )

Tuesday, January 20, 2015

పద్య రచన -త్యాగరాజు

చిత్ర మందున జూడుడు  చిత్రముగను
రామ చంద్రాదు  లచ్చట  రమ్య మలర
త్యాగ రాజున కిచ్చిరి  దర్శ నమ్ము
దైవ తుల్యుడే గదమఱి  త్యాగ రాజు

నభము నందఱు పున్నామ నరక మండ్రు

భోగముల కది యిరవని పొ గడు దురిల
నభము నందఱు, పున్నామ నరక మండ్రు
పుత్రు వలనన దాటంగ బోవు నరక
మునిల యనియండ్రు పెద్దలు మూర్తి ! వినుము

Monday, January 19, 2015

నిషిద్ధాక్షరి ; అంశం- హిమాలయములు. నిషిద్ధాక్షరము - మ ఛందస్సు - కందము.

భారత దేశపు టె ల్లగ
నారయ తుహినా చలంబు నట గల దా ర్యా!
పేరొందిన వడ యే యది
పార్వతి నిన్గనిన తండ్రి  పర్వత రాజే .

దుర్మార్గుని బొత్తువలన దొలగు నఘమ్ముల్

మర్మము మాయలు దెలియును
దుర్మార్గుని బొత్తువలన, దొలగు నఘమ్ముల్ 
కర్మను ఘాటున వెలసిన
వర్మా ! యా యాం జనేయు భక్తిని గొలువన్

Sunday, January 18, 2015

పద్య రచన -శ్రవణ కుమారుడు

చిత్ర మందున జూడుడు చెన్ను మీర
‘శ్రవణు డాకావడిని బక్తి శ్రద్ధల నిరు...
వైపుల  దలిదండ్రు లు నుండ పయన మయ్యె
దీ ర్ధ  యాత్రల కోరిక దీర్చ దలచి






నారాయణునకు నతులనె నాస్తికు డెలమిన్

వీరయ   శైవుడె  యైనను
నారాయణునకు నతులనె ,నాస్తికు డెలమిన్
మారగ  మఱి యా  స్తికుడుగ
కారెవరును నాస్తికులుగ కమలా భువిలో

 

Saturday, January 17, 2015

దత్తపది - 64 (వల-వాన-వెల-వేగు) పైపదాలను ఉపయోగిస్తూ సీతాన్వేషణకు హనుమంతుని పంపుతున్న రాముని పలుకులను గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

వలపు లన్నియు సీతపై బరగి యుండె
వేగు జామున లేవగ వెలవె ల నయి
పగలు  మనసంత కలవర బడుచు నుండె
వాయు వేగాన పరుగిడి వానరుండ !
వెదకి భూజాత  జాడను విశద బరచు

పద్య రచన -అరిసెలు

చిత్ర మందున న రిసెలు జెన్ను మీరి
కాన బడుచుండె  జూడుము  కన్ను గవను
నీకు జేయుట వచ్చునా ?నిజము  చెప్పు
వచ్చు నెడలను జేయుము వారి జాక్షి !

Friday, January 16, 2015

గాన సుధారసము గ్రోలెగద బధిరుండే

ఆనతి నీయగ నిటులను
గాన సుధారసము గ్రోలెగద బధిరుండే
వీనుల వినదగు గానము
వీనులు బనిచేయ నపుడు వినగా నగునే?

పద్య రచన -కబడీ యాట

చిత్ర మందున బాలలు చెలిమి తోడ
కబడి కబ్బడి యనుచును గట్టి గాను
నాడు చుండిరి గకబడి  యాటను నట
చూడ ముచ్చట గానుండె జూడు  తేజ !

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.


గురువుగా విజ్ఞాన తరువుగా విశ్వాన
....ఘనకీర్తి బొందిన ఘనుడెవండు ?
ప్రాక్పశ్చిమంబుల  పండితారాధ్యుడై
....విభవమ్ము వడసిన విభుడెవండు ?
రాయబారములందు రాజకీయములందు
....రాణించి మెరిసిన రత్నమెవరు ?
భారత రత్నయై పరతత్వ వేత్తయై
....ధర్మ కోవిదు డైన దక్షుడెవరు ?

పదవులకు వన్నె దెచ్చిన ప్రభువెవండు ?
సత్య సారమ్ము నెరిగిన సాధువెవరు ?
రాష్ట్రపతియెసర్వేపల్లి రాధ కృష్ణ
పండితుడతండు విజ్ఞాన మండితుండు !!

 

అంశం- గాలిపటము ఛందస్సు- ఉత్పలమాల మొదటిపాదం మొదటి అక్షరం ‘గా’ రెండవపాదం ఐదవ అక్షరం ‘లి’ మూడవపాదం పదకొండవ అక్షరం ‘ప’ నాల్గవపాదం పదునాఱవ అక్షరం ‘టం’


‘గా’లులు స్వేచ్ఛగా విసరు కాల మిదే యని పిల్ల లెల్ల దా
రాలకు మే‘లి’మై వరలు రంగుల కాగితముల్ లయించి దూ
రాల గమించు రీతిగ సురా‘ప’గహంసలవోలె నాడఁగా
వీలగురీతితో నెగురవేతురు గాలిప‘టం’బు లెల్లెడన్.

(గురువులు  శంకరయ్య గారి పూరణ )

కనుమ నాడు

పాడి పంటల వృద్ధికై  పశు గణమును
కర్ష కులు మ ఱి  పూ జింత్రు కనుమ నాడు
పసుపు కుంకుమ యక్షత ల్బరగ  మిగుల
సంత సంబున బ్రతి యేట  సంతు గూడి

Thursday, January 15, 2015

పద్య రచన -బసవన్న -పూజ

చిత్ర మాయెను జూడగ జిత్రమునట
పూల మాలను జేబూని పూవు బోడి
పచ్చ గడ్డిని గరమున పడుచు పిల్ల
పట్టు కొనియుండి రచ్చట పశువు గనుచు


పాడి పంటల వృద్ధికై  పశు గణమును
కర్ష కులు మ ఱి  పూ జింత్రు కనుమ నాడు
పసుపు కుంకుమ యక్షత ల్బరగ  మిగుల
సంత సంబున బ్రతి యేట  సంతు గూడి

ఓ మానవుడా !

ఎపుడు పోవునో  యీ ప్రాణ  మెవరి కెఱు క ?
ప్రాణ ముండంగ జేయుచు బరుల కీవి
బ్రదుకు నన్నాళ్ళు  దృ ప్తిగ  బ్రదుకు డ య్య !
దాని వలనన గలుగును దైవ  యయువు

 మమకారమ్మును  వదులుము
మమకారము కలిగి యుండ మఱి మఱి జన్మ
ల్లమరుచు నే యుండును
మమకారము మించు జబ్బు మహినిన్గల దే ?

నొప్పించకు మదినెవరిది
నొప్పించిన దిరిగి నీవు నొవ్వగ వలయున్
నొప్పించుట కును  బదులుగ
నెప్పుడు సంతసము జేయు నెవరికి నైనన్

మౌనము భూషణ మెయ్యెడ
మౌనము మఱి యాయుధమ్ము మైత్రికి నెపుడున్
మౌనము కాదస మర్ధత
మౌనులకు న్మహిమ గలిగె మౌనమె చేతన్

కండ్లుండెను గాననుచును
గండ్లను నిక బెద్ద జేసి కనకుమ యన్ని
న్గం  డ్లకు గనబడు న  న్నియు
కం డ్లె దుటనె మాయమగును గనుమీ నిజమున్


 

Wednesday, January 14, 2015

కష్టములను దెచ్చు మకర సంక్రాంతి మనకు

దుష్ట జనముల స్నేహము దురితములను
గ ష్టములను దెచ్చు, మకర సంక్రాంతి మనకు
సకల సంపద లొనగూ ర్చి సతతము నిల
వెలుగు కాంతుల నీయును వేదినములు

పద్య రచన -సంక్రాంతి ముగ్గులు

క్రొత్త రకముల ముగ్గులు కోరి కోరి
బాల బాలిక లందఱు  బ్రమద మలర
వేయు చుండిరి లోగిళ్ళ  వేకువనన
నేర్చు కొనినట్టి ముగ్గులు నెలతులునట

శ్రద్ధాంజలి -రామలక్ష్మి

లేవు లేవమ్మ!యి కమాకు లేవు నీవ
యె  చటి  కేగితి? వోయమ్మ !యి పుడు నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

 చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు
తల్లి  వైనను  నీవెగా దండ్రివైన
మఱు వ జాలము నిన్నమ్మ ! మఱు వ లేము

 జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి
ఉన్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ ! చూతుము నొకపరి యమ్మ  రమ్ము
 మునుపు వోలెను నీ రాక ముదము మాకు .

ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు
నాన్న కూడను నిందుకై నమ్మి నిన్ను 
నుత్స హించును గదమ్మ !నుత్సు కతన

 అమ్మ ప్రేమను బంచిన యమ్మ వీ వు
మఱు వ జాలము మఱి మేము మరువ వ మ్మ !
జలుబు కారణ మయ్యెనా శ్వాస యాగ ?
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

 ఆశ లేదమ్మ ! నీ కిల యాశ లేదు
ఉన్న దానితో  సంతృప్తి నొంది తీవు
సాటి రారమ్మ యె వరును సాటి రారు
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .

 అమ్మ !  తాతయ్య బాబయ్య మామ కూడ
వెళ్లి పోయిరి మమ్ముల విడిచి నిచట
నీవు కూడను వారికి నేస్త మైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు డా డి

మామ తాతయ్య బాబయ్య మరణములకు
కోలు కో లేక  ననిశము   కుములు చుండె
నచట యమ్మమ్మ , నీ మృత్యు వకట యెంత
దారు ణం బును గలుగంగ  దారి తీయు ?

గోరు ముద్దలు దినిపించి గోము గాను
నలుపు సలుపులు లేకుండ ననున యించి
కంటి కిని రె ప్ప  యట్లయి కనుచు మమ్ము
పెంచి పెద్దచే  సితివమ్మ ! మంచి గాను


 అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
నా దు కొనగను  నమరులు , హాయి గుండు .

 చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయగ  సమ్మతించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీదు నాత్మకు శాంతిని నించు గాక !

( ది . 13-1-2015 తేదీన పరమ పదించిన  మా అమ్మ గారికి
అశ్రు పూర్వక నయనాలతో ...... రాజా , బిందు ,సౌజన్య మఱి యు
కుటుంబ సభ్యులు )

రచన = పోచిరాజు సుబ్బారావు



Tuesday, January 13, 2015

నిషిద్ధాక్షరములు - మొదటి పాదంలో కవర్గాక్షరములు (కఖగఘఙ) రెండవ పాదంలో చవర్గాక్షరములు (చఛజఝఞ) మూడవ పాదంలో టవర్గాక్షరములు (టఠడఢణ) నాల్గవ పాదంలో పవర్గాక్షరములు (పఫబభమ) ఛందస్సు - తేటగీతి.అంశం- భోగిమంటలు.

పల్లె టూరుల యందున పల్లె ప్రజలు
 భోగి మంటలు వేయుట  భోగి నాడు
వచ్చు చున్నది యాచార మచ్చువలెను
కీట కాదుల సంహార క్రియను దెలియ




పద్య రచన -గంగిరెద్దు

గంగి రెద్దును జక్కగ రంగు రంగు
వస్త్ర ములతోడ  ముస్తాబు బఱచి మిగుల
గంగి రెద్దుల వారలు గడప గడప
కుమఱి  వెళ్లి య  డుగుకొందు రు, మహ  రాజ !
యీయ గోరుదు  వస్త్రము ల్  యీ ధవ ళకు

 రాసి రాసి తిరిగి రవి వచ్చె నేడెగా
భోగి తెచ్చె మరల భోగములనె
యుత్తరాయణమున నుప్పొంగి సంక్రాంతి
కన బసవడు వచ్చె కనుమ నిపుడు.

రంగగు వస్త్ర సంచయము రమ్యముగా ధరియించి మేనిపై
ఖంగున మ్రోయ గంటలును కమ్మగ శబ్దము జేయు మువ్వలున్
హంగుగ పాడ వంత తను హాయిగ నాడును తెన్గు లోగిటన్
ముంగిట గంగిరెద్దు గన ముచ్చట లేరికి నైన పల్లెలన్.



సంక్రాంతి శుభా కాంక్షలు



భోగ భాగ్యములు గలుగు  భోగి నాడు
సిరియు సంపద లువిరియు శివుని గృపను
పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
పాడి పంటల వృద్ధియు బాగు గాను
కనుము  దినమున మొదలిడు ననుట నిజము .

సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

Monday, January 12, 2015

రామపాదమ్ము రమణిని రాయిఁ జేసె.

స్త్రీగ మార్చినద లనాడు శీ ఘ్రముగను
రామ    పాదమ్ము  రమణిని ,  రా యి  జేసె
శీత లంబగు  బెట్టె లో జేర్చ బడిన
పాల  సంచుల  నన్నిటి   జాల వరకు


పద్య రచన =బామ్మగారు -పిల్లలు


ముద్దు లొలికించు పి ల్లలు ముందు  గలుగ
తిష్ట  వేసి కొ  నియునట తీరుబడిగ
జెప్పు చుండెను  వారికి  చిన్ని కధలు
బామ్మ  యచ్చట చూ డుడో   యమ్మ లార !

Sunday, January 11, 2015

దత్తపది - 63 (కలి-చలి-చెలి-బలి) పైపదాలను ఉపయోగిస్తూ కుచేలుని గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

బలిమి నున్నట్టి  యాకలి బాధ కోర్వ
జాల కకుచేలు డంతట  యాలి బుజ్జ 
గించి  చెలికాడు కృష్ణుని నంచితముగ
వేడు కొనగను నరిగెను విచ లి  తుడుగ

పద్య రచన -ఏనుగు --ఆశీర్వాదము

అరటి   పండును దానుగా  నందు కొనిన
యేను  గచ్చట తొండము నింతి శిరము
నందు నెట్టుల బెట్టుచు  నాశిసులను
నిచ్చు చున్నదో  జూడగ ముచ్చటయ్యె 

పావురంబులు క్రిములకు బరమ హితము

చూడ ముచ్చట గగనిపిం చు గద జంట
పావురంబులు , క్రిములకు  బరమ హితము
పేడ కుప్పలు మఱి యును జీడ పట్టు
చోటు ముఖ్యము గనివసిం చు టని ననిల

Saturday, January 10, 2015

ఘనుడు తిక్కన యష్ట దిగ్గజము లందు

 ఉభయ భాషల యందున నుచిత రీతి
గద్య పద్యము ల్రచి యించ  గలుగు నట్టి 
ఘనుడు తిక్కన, యష్ట దిగ్గజము లందు
ఆంధ్ర కవితాపి తామహు డ ల్ల సాని
పెద్ద నా మాత్యు డుగదా ర్య ! పెద్ద లనిరి

పద్య రచన =పచ్చ గడ్డి మోపు

పచ్చ గడ్డి మోపు భామకు దలపైన
పెట్టు చుండె భర్త బిట్టు గాను
మోపు బరువు నామె  మోయగ లేదేమొ ?
 తాత ! యెత్తు కొనుము  దయను నీవు

అమ్మా నాన్నలు

అమ్మా నాన్నల గంటెను
నిమ్మహిలో గానరారు నెవరును సములు
న్నిమ్ముగ సేవించినమఱి
కమ్మగ మనజీ వనంబు గలుగును భువిలో

అమ్మను గొట్టిన దిట్టిన
వమ్మే నీ జీవితమ్ము వదులుము దాని
న్నమ్మను జూడుము  నీ లో
 అమ్మవు నిక యగుదువీవు  నాశ్చర్య ముగాన్

నాన్న పాత్రను బరికించ నలువ కేని
సాధ్య పడ దట  మఱి మీకు సాధ్య మగునె ?
తనదు నార్జన మంతయు ధారవోయు
కన్న వారల బాగుకే మిన్నగాను

ముదుసలి తల్లికి దండ్రికి
బ్రదుకుట కిల చాలినన్ని బట్టలు ,ధనమున్
బదలా యించును నెవ్వడొ 
నతడే మఱి మంచి కొమరుడ నిపించు కొనున్



రామ భక్తుని సేవించ బాము లొదవు

సంత సించును రాముడు నెంత గానొ
రామ భక్తుని సేవించ  ,బాము లొదవు
గురువు మాటలు వినకుండ గొడవ జేయ
దల్లి దండ్రుల పిమ్మట దైవ మతడె

Friday, January 9, 2015

న్యస్తాక్షరి - 22 అంశం- వెన్నెల ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి.

చంద మామయే యిచ్చును జల్లనౌ హృ
దయరంజిక చంద్రికల్ ధరణి యందు
మామ యత్రిమ  హర్షికి మర్కు నంశ 
మ!నిజ మిదినమ్ము  డా ర్యులు మాట నాది



పద్య రచన ఫణి ద్వయము

తల్లి పాముతో బాటుగ బిల్ల పాము
పడగ విప్పుచు నిలబడ భయము గలిగె
పాలు పోయుదు బుట్టలో పడగ రేడ !
యేమి చేయకు  మానన్ను నిప్పు డిచట

రామ పాదము సోకగ రాయి యగును

తేరు కొనుచును నహల్య స్త్రీగ మారె
రామ పాదము సోకగ ,రాయి యగును
శీతల మధిక మగుటన శీత పెట్టె
నగల పాలసంచులు మఱి తగువి  ధముగ

Thursday, January 8, 2015

షణ్ము ఖాత్మజుండు చంద్ర మౌళి

షణ్ము ఖాత్మజుండు చంద్ర మౌళి యుకాదు
చంద్ర మౌళి కొడుకు  షణ్ము ఖుండు
రెల్లు గడ్డి యందు  రేతస్సు మూలాన
పుట్టి నట్టి శివుని పట్టి యార్య !

పద్య రచన -శ్రీ మహావిష్ణువు -లక్ష్మీ దేవి

శ్రీ మహావిష్ణు   వచ్చట సిరియు   తోడ
లోక ప్రజలకు నాశీ సు   లునిడు  తకును
తిష్ఠ వేసుకు నుండెను  తిన్నె మీద
రండి యచటకు బోదము ,దండిగాను
నందు కొనుటకు నాశీ సు లందరమును

గణతంత్రము దివసపు శుభాకాంక్షలు

మూడు రంగుల  జెండాను  ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది   నేత లపుడు 
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును  బంచిరి  జనవ రి యిరు
వదియ   యారు తే దియుదయా న దిశ లెల్ల
మారు మ్రోగంగ రవములు  మదిని  నిండ

ప్రజల కొరకును నింకను బ్రజల చేత
బ్రజల వలనను మఱియును బ్రజల గూర్చి
యేర్ప డెను నీగ ణ న తంత్ర మప్పు డచట
సాటి నాయక గణముల సమ్ము ఖమున
 

 ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రము చిక్కి వోయె గణ నీ  యముగాన్ 

 గణనీయుల త్యాగముల
న్గు ణహీనులు ప్రభువు లగుచు  కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ! నీకు నతులు కాదన కమ్మా !


తృణభుక్కులు, స్వార్ధపరులు,
గుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయిన  భరతమాతకు
ననయము నిక యిచ్చు మోడి యా నందంబున్


 గణతంత్ర శుభాకాంక్షలు
వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గుణవంతుల నెన్ను కొనుడు కూరిమి తోడన్ 

సకల శుభములు గలిగించు శంకరుండు
గణన తంత్రపు దివసాన గుణము లాఱు
కలుగు నటులుగ దీవించి కరుణ తోడ
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళలీ వృద్ధుల చల్ల గాను .

( ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఇవి షడ్గుణములు.)
రచన = పోచిరాజు సుబ్బారావు



Wednesday, January 7, 2015

అంశం- కైక వరములు. నిషిద్ధాక్షరము - క. ఛందస్సు - తేటగీతి.

రాము  నివనవా  సముమఱి  రాజ్య మరయ
భరతు హస్తగ తముజేయ వలయు నధిప!
యీ వ  రంబుల నడుగంగ నీ శు నామె
దారి లేమిని యి చ్చెను  దశ రధుండు

పద్య రచన -పంచదార చిలుకలు

పంచదార చిలుక లంచితముగ నట
బెట్ట బడెను  వరుస ,చిట్టి చూడు
తీ సికొనుమ  యొకటి ,తీసికొ నుమనాకు
కూడ ,నుం డు చీకు కొలది తీపి

చంద్ర మౌళి యనగ షణ్ము ఖుండు

శిరము నందు చంద్రు చిహ్నము గలవాడు
చంద్ర మౌళి యనగ , షణ్ము ఖుండు
రెల్లు పొదల యందు రేతస్సు మూలాన
పుట్టి నట్టి శివుని ప ట్టి యతడు

Tuesday, January 6, 2015

సిద్ధు డైనవాడు బుద్ధి జెఱచు

సిద్ధి బొందు విధము  శుద్ధ ము  గజెపును
సిద్ధు డైనవాడు, బుద్ధి జెఱచు
మంచి వాని జేరి మాయమా  ట లచేత
దుష్ట బుద్ధి గలుగు దుష్టు డకట ,

పద్యరచన --సురసి ,ఆంజనేయుడు

సీత జాడ తెలిసికొనశీఘ్ర ముగను
ఆకసంబున బరువిడు హనుమ జూచి
రక్క  సిసురసి మ్రింగగ  నొక్కసారి
వచ్చె బయటకు రయమున వానరుండు

Monday, January 5, 2015

దత్తపది - 62 (రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న) పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో

రామ భక్తులై పాండవు ల్రాత్రి పగలు
 భరతు వోలెను బెదతండ్రి పాదములకు
వంద నంబులు సేయుచు బ్రమద మలర
లక్ష్మణుం డును  శత్రుఘ్ను సాక్షి గాను
నన్న దమ్ముల ప్రేమకు వన్నె దెచ్చె


పద్య రచన -ఆది శంకరులు

ఆది శంకరా  చార్యుల కభిము ఖముగ
కుక్క గమి తోడ  బోయవా  డొక్క డచట
వంద నంబులు సేయుట యంద గించె
వంద నీ యుడె యెపుడు ను భర్గు సముడు

Sunday, January 4, 2015

తెలవా ఱ గ దూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్

గలగల బొంగెను సంద్రము
తెలవా ఱ గ దూర్పు దెసను, దిమిరము గ్రమ్మె
న్నల యా  సూర్యుని గాంతులు
మెలమెల్లగ దగ్గిపోవ మేదిని యందున్

కోడి పుంజు పెట్టు గ్రుడ్లు ధరను

గ్రుడ్లు పెట్టు క్రియకు కోడి కండగ నుండు
కోడి పుంజు, పెట్టు  గ్రుడ్లు ధరను
కోడి దినము దినము మూడు నాలుగుదాటి
కోడి గ్రుడ్డు తినిన గూడు బలము

Saturday, January 3, 2015

ముక్కు మూ సుకొనిన మోక్ష మబ్బు

చావు గలుగు సుమ్ము చయ్యన నిజముగ
ముక్కు మూ సుకొనిన, మోక్ష మబ్బు
భక్తి శ్రధ్ధ తోడ భర్గుని బూజించ
నెవరి కైన బుడమి నెప్పు డైన

నోరు మూ సుకొనిన గారగట్టును బళ్ళు

వినుడు నొక్క మాట వివరింతు నోజను
లార ! కాన బడవు  పార పళ్ళు
నోరు మూ సుకొనిన, గారగట్టును బళ్ళు
తమల పాకు నమల తఱచు గాను

మనుగడకే ముప్పు వచ్చు మద్యము లేమిన్

అనిశము ద్రాగె డు వారికి
ననువుగ మఱి లేనియెడల నహరహమునున్
వినుమీ నిజమును దప్పక
మనుగడకే ముప్పు వచ్చు మద్యము లేమిన్

Friday, January 2, 2015

పతితల ఖండించె సతి యె పదుగురు మెచ్చన్

సతతము ద్రాగుచు వచ్చెడి
పతితల ఖండించె సతి యె పదుగురు మెచ్చ
న్నతనిని  కర్కశ దనమున
సతులను గాపాడ కొఱకు చంపెను  నటులన్


Thursday, January 1, 2015

మద్యపానరతుడు మాన్యు డగును

ఎల్ల వేళల మఱి యుల్లాసముగనుండు
మద్యపానరతుడు , మాన్యు డగును
మంచి బుధ్ధిగలిగి మానవత్వము తోడ
మసలు  గొనెడు నతడు ‘మహిని నెపుడు’