Saturday, January 17, 2015

దత్తపది - 64 (వల-వాన-వెల-వేగు) పైపదాలను ఉపయోగిస్తూ సీతాన్వేషణకు హనుమంతుని పంపుతున్న రాముని పలుకులను గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

వలపు లన్నియు సీతపై బరగి యుండె
వేగు జామున లేవగ వెలవె ల నయి
పగలు  మనసంత కలవర బడుచు నుండె
వాయు వేగాన పరుగిడి వానరుండ !
వెదకి భూజాత  జాడను విశద బరచు

No comments:

Post a Comment