Saturday, January 10, 2015

అమ్మా నాన్నలు

అమ్మా నాన్నల గంటెను
నిమ్మహిలో గానరారు నెవరును సములు
న్నిమ్ముగ సేవించినమఱి
కమ్మగ మనజీ వనంబు గలుగును భువిలో

అమ్మను గొట్టిన దిట్టిన
వమ్మే నీ జీవితమ్ము వదులుము దాని
న్నమ్మను జూడుము  నీ లో
 అమ్మవు నిక యగుదువీవు  నాశ్చర్య ముగాన్

నాన్న పాత్రను బరికించ నలువ కేని
సాధ్య పడ దట  మఱి మీకు సాధ్య మగునె ?
తనదు నార్జన మంతయు ధారవోయు
కన్న వారల బాగుకే మిన్నగాను

ముదుసలి తల్లికి దండ్రికి
బ్రదుకుట కిల చాలినన్ని బట్టలు ,ధనమున్
బదలా యించును నెవ్వడొ 
నతడే మఱి మంచి కొమరుడ నిపించు కొనున్



No comments:

Post a Comment