Friday, January 16, 2015

అంశం- గాలిపటము ఛందస్సు- ఉత్పలమాల మొదటిపాదం మొదటి అక్షరం ‘గా’ రెండవపాదం ఐదవ అక్షరం ‘లి’ మూడవపాదం పదకొండవ అక్షరం ‘ప’ నాల్గవపాదం పదునాఱవ అక్షరం ‘టం’


‘గా’లులు స్వేచ్ఛగా విసరు కాల మిదే యని పిల్ల లెల్ల దా
రాలకు మే‘లి’మై వరలు రంగుల కాగితముల్ లయించి దూ
రాల గమించు రీతిగ సురా‘ప’గహంసలవోలె నాడఁగా
వీలగురీతితో నెగురవేతురు గాలిప‘టం’బు లెల్లెడన్.

(గురువులు  శంకరయ్య గారి పూరణ )

No comments:

Post a Comment