Tuesday, January 27, 2015

స్వగతం

పిచ్చి సన్నాసి కొడుకునా , ప్రేమ తోడ
పిలువ  వచ్చితి మోయమ్మ ! ప్రియము గలుగ
రాక మాయది నీకేమొ  రవ్వ యంత
యిష్ట మాయది లేదుగా యింతి ! యరయ

కారణం బును  లేకనే కఱకు దనపు
మాట  లవలన మాయొక్క మదిని మిగుల
గాయ పర చితి  వోయింతి !కనుక నీవు
అనుభ వింతువు రాబోవు దినము లందు

పెంచు కొంటివి మామీద  ద్రెంచు విధము
వెంట్రు ముక్కకు సాటినీ  వెఱ్ఱి  చేష్ట
రాజ మార్గము మాయది  రమణి ! యికను
దెలియ లేనిచో మునుముందు దెలియు నీకు .

 శుద్ధము గానిది పృధివి న
శుధ్ధముగా బరిగ ణిం త్రు సుజనులు వింటే ?
శుద్ధము లేమిని నీలో
శుద్ధముగా బలుకరింత చోద్యమ యగునున్

నీవు పలికిన మాటలు నిజము గాను
బాధ గలిగించె  మాకవి బహు   విధముల
మానసికముగా గ్రుంగితి మనుట నిజము
దేవు డనునత డుం డుచో  దినము దినము
ననుభవింతువు రోగము లలము కొనుచు

నీదు పిల్లలు   మాతోడ  నిబ్బరముగ
నొండు మాటైన మాట్లాడ కుండు నటుల
మంచి తరిఫీజు నిచ్చితి నంచు మిగుల
కులుకు చుంటివి గాబోలు కుత్సితముగ
నకట ,యేమికా  రుగ వార  లరయ మాకు

ఆయె నిచ్చట యెటులనో  యాఱు  నెలలు
శివుని సాక్షిగ మఱి యిక  జెప్పు చుంటి
నాదు కొడుకుపై   నొ ట్టే సి  ,నాదు ముఖము
నీకు జూపించ జన్మలో  నిజము నమ్ము
పరగ మనపరి స్థి  తి చక్క బడువరకును

నీదు పిల్లల మీదన నేను మఱి ని
జెప్పు చుంటిని  నొ ట్టే సి  యెప్పు డికను
నీదు ముఖమును జూపించ నీ యకమ్మ !
యిదియ యాఖరు మనకిక  నింక  సెలవు





No comments:

Post a Comment