Saturday, February 21, 2015

పద్య రచన -హిరణ్య కశిపుడు -ప్రహ్లాదుడు

‘అసురు డైనట్టి యా హిరణ్యకశిపుండు
తనదు  కొమరుని చదివించ దలచి గురున
కొప్ప గించెను బ్రహ్లాదు  నొప్పు మీర
చిత్ర మందున జూడుము చిత్ర !  నీవు

తనదు కొమరుడు  నిత్యము దనకు దాను
మనసు నందున మాట్లాడు మాట బట్టి
విష్ణు  నామము జపియించు  విధము తోచ
మనసు మళ్ళించు కొఱ కునై మాన నీయు
డైన గురువును రప్పించి యప్ప గించు
నటుల యుండెను చిత్రము   హర్ష ! చూడు

No comments:

Post a Comment