Tuesday, March 31, 2015

పద్య రచన -భిక్ష గాండ్రు

భిక్ష గాం డ్రను  జూడుము , భీకరముగ
నెంత మందియుండి రియట !యంత మంది
లోన నిజముగ   వారలు  మాన నీయ !
భిక్ష  గాం డ్రయి  యుందురె ?లక్ష ణ ముగ 

కరటక దమనకుల కంటె కలరే సుజనుల్

కరటక  దమనకు బేరన
సరళ ము  గానీ తినుడివె సకలజ నులకున్
పరికించగ మన మదిలో
కరటక దమనకుల కంటె కలరే  సుజనుల్ 

భీ ము డింద్ర కుమారుజంపెను ర ణ మున

పార్ధుని దపమునకు నిచ్చె పాశు పతము
భీ ము ,డింద్ర కుమారుజంపెను ర  ణ మున
ననుట కాదుస  మంజస మార్య !వినుము
పార్ధు  నిన్జంప నేరికి వలను గాదు 

పద్య రచన -మానిని దీ ర్ఘా లోచన

మట్టి కుండను జేబుని మానిని యట 
భర్త గూరిచి గాబోలు బహుళ ముగను 
శోక తప్తయై చింతించు  చుండె నా? య 
నునటు  లుండెను  మఱి యామె  నుగను  మార్య !

Sunday, March 29, 2015

అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞాన మునన్

శివునే నమ్మిన వారికి
అవలీలగ  మోక్ష మబ్బు , నజ్ఞాన మునన్
శివ భక్తుల దీక్షను మఱి
యవహేళ న  జేయకెపుడు  హాస్యము కొఱకున్


పద్య రచన -పావురములు -బియ్యము -చేట -బాలుడు

పావురంబుల జూడుము పటము నందు
ఏరు కొనుచును దినుచుండె నిమ్ము గాను
చేట  నున్నట్టి బియ్యము న్జిత్ర ముగను
దొంగ వోలెను బాలుడు తొంగి జూడ 

Saturday, March 28, 2015

మత్తేభమునకు గణములు మసజస తతగల్

అత్తా ! సభరనమయవలు
మత్తేభమునకు గణములు  మసజస తతగల్
పొత్తగు శార్దూల మునకు
మత్తున మఱి జెప్ప వలదు మార్చుచు  వాటిన్ 

పద్య రచన =మూడు మంగళ సూత్రములు

మూడు  మంగళ సూత్రముల్ ముచ్చట గను
గట్టె  రాముడు సీతకు బిట్టు గాను
పెళ్లి రోజుకా  రణముగా బెద్ద లలర
మంగ ళ మగును  మనకది మాన్యు లార !

మూడు కట్టుట కారణం బునెఱు  గుమిక
నొకటి  మగపెళ్లి  వారిదిం  కొకటి యాడ
పెళ్లి వారిది  మూడవ  తాళి  రామ
దాసు మొదలుగా గలయట్టి  యీ శు భక్త
 కోటిది  యనుచు జెప్పిరి మేటి కవులు
ఒక్క  రామునికే యిది  తక్కు లేదు
అని చెప్పిరి శంకర ! యార్యు లపుడు
ఉర్వి  జనములు సుఖముగ  నుండు గాక !

అంశం- రామకథ. ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక. పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.

శ్రీ క  రుండగు రాముడు చిన్మ యుండు
సీత జాడను  కొఱ కునై వాత సుతుని
తా ను గానంపె నోరమ ! త్వరిత గతిని
రామ సీతను కనుగొని  రమ్య మైన
ముద్దు టు o గర  మిమ్మని ముదల నిచ్చె
లక్ష్మ ణుం డును  వెడలెను రాము నా జ్ఞ
కుదిరె  నెయ్యము హనుమంతు గుంపు తోడ
వంద లకొలది  సైన్యముల్ వంది పలుక
దక్షి ణం బున కేగెను దండు తోడ
నమ్మ కంబుగా  బోవగ నమ్మ సీత
ముదము గలుగంగ గనబడ మోడు క్రింద
లుప్త మయ్యెను శోకము  నాప్తు లకును


Friday, March 27, 2015

పద్య రచన -భారత రత్న

భరత దేశపు మణి యౌట వాజ పేయి 
రహిని నొందె ను  భారత రత్న బిరుదు 
సత్య శీలుడు నుపకృతి సలుపు నతడు 
సకల సద్గుణ వంతుడు  చారు శీలి 

ఆహ్వానము

నవ్య నాటక సమితిచే దివ్య ముగను 
మఱి వ  సంతోత్సవము పేర వరలు నట్లు 
బరగ సాహిత్య సేవను బ్రముఖు లెదుట 
చేయు చుండగ మఱి నాదు చిత్త మలరె 

Thursday, March 26, 2015

పద్య రచన -గాంధీ -మోడీ -బైకు

మోడి  పైగల బ్రేమతో ముసలి  గాంధి 
మోడి  బొమ్మను  బైకుకు  ముందు  పెట్టి 
పోవు  చుండెను  నెచటికో  పోయి  పిలువు 
విశ్ర  మించికొ  లదిసేపు  వెళ్ళును మఱి 

Wednesday, March 25, 2015

దారము లేకుండ పుష్ప దామము లల్లెన్

ఔరా ! యెంతటి  నేర్పరి ?
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్
వారికి జేతును నతులను
వారెవరో తెలుపుడా ర్య !వడివడి గమఱి న్

పద్య రచన -ఎడ్ల బండి

   ‘ఎడ్లబండ్లు లేవాయెను..దొడ్ల లోన 
వాటి స్థానము బూరించె  బవలు రేయి
నేక ధాటిగా దిరుగుచు నింజ నుగల
బండ్లు ,మఱి గన్మ  ఱ గు నయ్యె బండ్లు ధరను


పద్య రచన -శంకరాభరణం

శంకరాభరణము  బ్లాగు వంక జూచు
వారు  నిరతిశ యానంద భరితు లగుట
నిజము ,కారణం బేమన నీతి నియమ
ముగల   వారలు మాత్రమే సుగమ రీతి
రచన గావింత్రు మఱి యందు  రమ్య ముగను

సున్న మున్న జాలు నన్న మేల ?

సున్న మున్న జాలు నన్న మేల ?యనియా
సామి ! నీదు ప్రశ్న సరియె యౌను
సున్న మున్న తీర దెన్నగా  నాకలి
యన్న మునకు సాటి సున్న మగునె ?

Tuesday, March 24, 2015

యతుల రకములు

యతుల రకములు దెలిపిరి యార్య ! యిచట
చదువ వీటిని నాశ్చర్య  మొదవు చుండె
నన్ని  రకముల యతులను నాకళిం పు
జేసి కొనియధా  శక్తిని జేతునమలు

Monday, March 23, 2015

పద్య రచన - 858 కవిమిత్రులారా, నేటి పద్యరచనకు అంశము... “ఆకాశ రామన్న”

వచ్చు నుత్తర ములుమఱి హెచ్చు గాను
గనగ నాకాశ  రామన్న యనుచు మిగుల
తప్పు చేసెడు వారల యొప్పు గోరి
వినిన రక్షింప  బడుదురు వినని యెడల
శిక్ష యేగతి యగునార్య ! కక్ష తోడ

దత్తపది - గాలి - నీరు - నిప్పు - నేల పైపదాలను ఉపయోగిస్తూ ఆకాశాన్ని

పంచ భూతము  లీయివి పరగ వినుము
నీరు గాలియు నేలయు నిప్పు  మఱియు
నాకసంబును గూడను నార్య ! వినుము
మనుగడకు ముఖ్య  ములుగద  మానవులకు

Sunday, March 22, 2015

తేటగీతి యయ్యె నాటవెలది

తేటగీతి యయ్యె నాటవెలది యార్య !
పద్య పాద మపుడు బాగు చూడ
కుదర  లేదు   రాత్రి  కునుకుప ట్టు  కతన
నటుల  మారె , నింక   నట్లు  వ్రాయ 

పద్య రచన -మేధావులనగా నెవరు ?

స్వార్ధ మనునది లేకుండ సర్వు లకును
చేత నైనంత యుపకృతి జేయు నతడు
తనదు  ధీశక్తి  వలనన దనరు నట్లు
దేశ మభివృధ్ధి  దిశగా ను  దెచ్చు నతడు
పిలువ  దగునుమే  ధావిగ నిలను  సుమ్ము

Saturday, March 21, 2015

పద్య రచన -క్రొత్త రాష్ట్రము ,క్రొత్త సంవత్సరము

క్రొత్త రాష్ట్రము వచ్చెను గ్రొత్త గాను ,
మన్మధం బను  బేరున మానితముగ
క్రొత్త వత్సర మునువచ్చె జిత్త మలర
భాగ్య  మెటు లుండు  నోజూ డ వలయు  నార్య !

వీడియో లో గురువుల దర్శనము

కంటిని  గురువుల  వీడియొ
వింటిని మఱి  గానమతని  వీనుల విందౌ
కంటను  వచ్చెను బాష్పము
లంటె ను  నవినాదు మదిని  నానం దముగాన్

Friday, March 20, 2015

కరిము ఖుని జన్మ దినమె యు గాది గాదె

భాద్ర పదమాస  పుచవితి భవ్యు డైన
కరిము  ఖుని జన్మ దినమె, యు  గాది గాదె
చైత్ర మాసపు పాడ్యమి  శర్మ !తెలియు
మీవి  షయములు ప్రతియేట  యిదియె క్రమము

పద్య రచన -ఉగాది

సకల శుభముల నీయగ  సర్వులకును
జయను  బోద్రోచి యీరోజు సాదరముగ
వచ్చె  మన్మధ నామసం వత్సరమ్ము
అమ్మ ! మన్మధ !కాపాడు మమ్మ  మమ్ము

మియాపూర్ కవి సమ్మేళనము

కవులను జూడగ  గలిగెను
నవిరళ మగు  సంతసమ్ము నార్యా ! నాకు
న్నవనత  వదనంబున మఱి
కవులకు నేనిడుదు  నతులు  గారవ మొప్పన్

Thursday, March 19, 2015

కవి సమ్మేళన మనంగ గడు భయ మగురా

కవి సమ్మేళన మనగను
కవులందఱు గూడి యచట కావ్యా లాప
న్జవు లూరగ జేయుట గద
కవి సమ్మేళన మనంగ గడు భయ మగురా !


పద్య రచన -వీడ్కోలు

పలుకుదు వీ డ్కోలునునిక 
పలుకుదు జయ వత్సరంబ ! బాధను దోడన్
పలురకముల జయములనే
బలముగ మఱి  యిచ్చితీవు వత్సర మంతన్

Wednesday, March 18, 2015

జయ నా మాబ్దమున జయము సాధించితివా ?

జయమను నబ్దము గడచెను
జయ నా మాబ్దమున జయము సాధించితివా ?
జయమప జయములు రెండును
జయవత్సర మిచ్చె నాకు శంభుని నాజ్ఞన్

పద్య రచన -రకరకముల మందులు

మందులు మందులు  మందులు
మందుల  నేజూ  చియిపుడు మత్తున బడితిన్
కందువ వోలెను, బొడవుగ
నందముగా నుండె జూడ నార్యా !యవియున్

Tuesday, March 17, 2015

భామను వేధింప దగును పదుగురు మెచ్చన్

మామా ! పాపము కలుగును
భామను వేధింప ,దగును పదుగురు మెచ్చన్
భామల నిడుమలు దీర్చగ
నేమముతో గృషిని జేయ నెమ్మది తోడన్

పద్య రచన -శివుడు -వాగు దరిన

వాగు దరిన వెలసి భక్తజ  నమ్ముల
గావ దీర్చి యుండె  గరళ  కం ఠు
డా ర్య ! వంద నంబు  లాభవు నకుజేయ
బోయి వత్తు నటకు బొరి పొరిగను

Monday, March 16, 2015

ఆరోగ్య మె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్

ఆరయ నిజమిది యార్యా !
యా రోగ్య మె  భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్
వారెవరైనను సరియే
వేరుగ మఱి మాటలాడు విధములు  గలవే ?

అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి మృతికిలేవు  లేవాయె  యిక మాకు  లేవు  నీ వు
ఎచట  కేగితి వ వధాని !  యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కొఱ కి చ్ఛ తోడ .


కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో సామి ! చింత  నుండి
రమ్ము  వేవేగ మఱి నీవు  రాళ్ల బండి !


సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను


మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము

ఉగాది పచ్చడి

వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చెరకు ముక్క
లాది గకలిపి యీదిన మార్య !చేయు
దురట పచ్చడి సుఖము బొం  దుకొఱకునిల .

Sunday, March 15, 2015

తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

మ్రోగదు గదమఱి  యార్యా !
తీగలు లేనట్టి వీణ , తీయగ మ్రోగెన్
రాగము యుతముగ జక్కగ
తీగలు మఱి   యుండు వీణ  దీటుగ  రవికిన్

పద్య రచన -దోసావ కాయ

దోస  కాయ ముక్కలుగను గోసి యపుడు
కారముప్పు నా వపొడి యు కలిపి సమము
గాను నూనెను బోసియు గలుప ముక్క
లపుడ యగునార్య ! రుచిగ దో సావకాయ

Saturday, March 14, 2015

దత్తపది - 70 (కాకి-జాజి-పాపి-వావి) కవిమిత్రులారా! కాకి - జాజి - పాపి - వావి. పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో.

 వావి  వరుసలు జూడక పాపి యైన
సైంధవుడు కామ ముగలిగి  సాధ్వియుమ‘ఱి
జాజిపూ వంటి సతిపైన మోజు గలిగి

కాకి రూపు డా  సైంధవ  ఖలుడు  వలచి
ద్రౌపదిని మఱి  చెందెను దుర్గతి నిల

పద్య రచన -సింహము -బ్రాహ్మణులు

విద్య నేర్చిన పిమ్మట వెఱ్ఱి బాప
లస్థి  పంజరమును జూచి యాశ తోడ
తాము   నేర్చిన విద్యను  తారు  జదువ
సింగ ముగ మారి  వారిని మ్రింగ దలచి
దూకు చుండెను  వారిపై  తోయ జాక్షి !

Friday, March 13, 2015

పద్య రచన -శంకరుడు -సముద్ర తీరము

సంద్ర పుదరిన  ఠీ విగ  శంకరుండు
తిష్ఠ వేసుకు కూర్చుండె  తేజ ! చూడు
కంటికిని  రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మనలను జల్ల గాను

రమ్ము జనుల కుశ ర ణమ్ము గాదె

రమ్ము జనుల కుశ ర  ణమ్ము గాదె యనుచు
నిజము  పలికి రార్య ! నీదు మాట
యక్ష రాల నిజమ, యదియ లే  నియె డల
పనులు జరుగ విపుడు  ప్రభుత యొద్ద

Thursday, March 12, 2015

పద్య రచన--రామకృష్ణ పరమ హంస

పరమ హంసగ బే రొంది ప్రజల కితడు
భక్తి  భావంబు  గలుగగ రక్తి తోడ
బోధ జేసిన  మహితుండు పుడమి యందు
రామ కృష్ణుడు నాముండు రమ్యు డా ర్య !

గానము సేయంగ నొప్పు గాడిదల కడ న్

వీనుల విందగు పాటలు
గానము సేయంగ నొప్పు,  గాడిదల కడ న్
గానము జేయుట యనునది
గానమునే గించ పఱఛు గానగు బుడమిన్

Wednesday, March 11, 2015

పద్య రచన -అఱచేతిలో చెట్టు

చిత్ర మచ్చట జూడగ  జిత్ర మయ్యె
బెరుగ  సాగెను  పిడికిట వృక్ష మదియె’
చూడ నేపుగ  నవనవ లాడుచుండె
నమ్మ బుద్ధిగా లేదది  నాకు సామి !


Tuesday, March 10, 2015

కర్ణ హస్తాభరణ మయ్యె గాం డివమ్ము

నీదు పుట్టుక గడుశోచ  నీయము గద
కర్ణ! హస్తాభరణ మయ్యె గాం డివమ్ము
పార్ధున కనుట యబ్బురం బాయె మదిని
శత్రు సంహార మొనరించె సామి ! యతడు

పద్య రచన -ముదుసలి -అద్దము

అవ్వ తనమోము  జూచుచు నద్దమందు
ముడుత ముడుతలు  గానుండ , ముసలి ముండ
వోలె గన్పడు చుంటిని  భూరి గాను
ననుచు వాపోవు చుండెను దనదు  భర్త
యొద్ద కూర్చుండి ముదుసలి తద్దయు నట

మంచి యద్దము కాదిది మగడ ! నీవు
తెచ్చి యిచ్చిన దీ యది తేరి జూడ
ముసలి దానిగా గనబడె  ముఖము నా ది
యేల దెచ్చితి విటువంటి బోల సరుకు

Monday, March 9, 2015

పద్య రచన -పక్షులు పాత్రలోని నీరు త్రాగుట

పక్షుల కొఱకుగ నచ్చట
నిక్షిప్తము జేయు కతన నీటిని పాత్రన్
పక్షులు ద్రాగుచు నున్నవి
యక్షయ మగు పున్నె మబ్బు నందుల కార్యా !

Sunday, March 8, 2015

పద్య రచన -కీర్తి ,శేషుల వివాహము

వధువు కీర్తి  మఱియు వరుడు శే  షులకు వి
వాహ మనుచు వ్రాయ వారి కిగల
భావ మనుచు  మనము  భావించ  వలయును
పటము నందు తప్పు  వ్రాసి రార్య !

Saturday, March 7, 2015

వంకాయను చెఱకు రసము వడియుచు నుండెన్

బొంకులు బలుకుట మానుము
వంకాయను చెఱకు రసము వడియుచు నుండె
న్నింకను  నెందున  నేమియు
సంకరములు కారు  చెపుమ ,శర్మా ! నాకున్

పద్య రచన -శకటా సుర వధ

శకట రూపాన  నసురుడు సరగు చేర
కృష్ణు జంపగ, నంతట  కేళి వలెను
తాపు  తన్నగ చచ్చెను  తక్ష ణం బె
దుష్ట శిక్షణ  యాతని కిష్టము గద

Friday, March 6, 2015

పద్య రచన -జా డీ లు

ఊర గాయల జాడీ ల సౌరు జూడ
నంద  మొలికించు  చుండును  నంద ఱకును
భద్ర పఱతురు  పచ్చళ్ళు భామిను లిల
నిల్వ యుండుట కొరకునై నీ ర జాక్షి !

అమ్మా యని పిలిచి నంత నాగ్రహ మందెన్

నెమ్మనమున నాశిసు లిడు
అమ్మా యని పిలిచి నంత నాగ్రహ మందె
న్నమ్మను గాదని వేరొక
యమ్మను నే బిలిచి నంత నఱచుచు   నాపై

Thursday, March 5, 2015

స్త్రీ లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్

పాలసు డగు నిల నార్యా !
స్త్రీ లోలుడె, సజ్జనుడని చెప్పెదరు బుధుల్
బాలుర వృద్ధుల నింతుల
మేలును గాంక్షించు వాని మెప్పును దలచిన్

పద్య రచన -ఇంతి పక్షపాత బుద్ధి

ఇంతి  మాటలు నాయమే  సుంత యైన /
కూతురి కొకవి  ధమ్మును గొడుకు నకొక
విధము , జగమంత యిటులనే  వే ఱు   వే ఱు
భావ  ములతోడ  నిండెను  భవ్య  చరిత !

Wednesday, March 4, 2015

పద్య రచన =హోలీ పండుగ

భస్మ మైనట్టి తన భర్త   భవుని దయను
దిరిగి  బ్ర దుక ర తీదేవి పరమ సంత
సమున బంధు వర్గము రాగ జరుపు కొనెను
హోళి  నాబ డు  పండుగ హొయల తోడ

కృ త జ్ఞతలు

నాదు  శుభమును గోరుచు  నాకు మీరు
ప్రేమ మీరగ దీవనల్  ఫేసు బుక్కు
నందు వ్రాయుట మిగులయా  నంద మయ్యె
నందు లకుగాను మీకునా  వంద నములు

గ ట్రా చూలికి తనయుడు కాముండు గదా

వ ట్రు వ యు ద ర పు  గణపతి
గ ట్రా చూలికి  తనయుడు, కాముండు గదా
గ  ట్రా  చూలికి పతియగు
ఖట్వాంగునిచేత తనువు కాలిన నతడున్


Tuesday, March 3, 2015

మాట లన్ని నీటి మూట లయ్యె

‘ఎన్నికల సమయము నెన్నియో. వాగ్దాన
ములను  బలికి  పిదప  ముఖము  కూడ
చూప బోరు  సామి ! చోద్యము  గద !వారి
మాట లన్ని  నీటి  మూట  లయ్యె

పద్య రచన -అంగ వైకల్యము -చిత్ర రచన

అంగ వైకల్య మయ్యును నతని  జూడు
గీయు చుండెను  జిత్రము  వాయి తోడ
కార్య దక్షుడు గావున  కరము లేమి
రాధ  మఱి యును  గృష్ణుని రమ్య ముగను
కుంచె తోడన  జిత్రించె కోమలముగ

Monday, March 2, 2015

పద్య రచన -కుమార స్వామి

వల్లి దేవసేనల నిరు వైపు లునిచి
నెమలి  వాహనా రూ డు డై   నెమ్మి తోడ
నిలను  వేంచేసి  యుండిన  నీ కు  మార
సామి  కిడుదును  వందన  శతము లిపుడు

హరిని పూ జింత్రు నాస్తికు లనవరతము

భక్తి యుతముగ నిరతము  భక్తు లవని
హరిని  పూ జింత్రు , నాస్తికు లనవరతము
దైవ దూషణ  గావింత్రు  దయ్య మనుచు
వారి  సంస్కార  మదియౌను  వారి జాక్షి !

మలమది రంజింప జేయు మన మనములనే

తలపగ సుమమన బహుకో
మలమది రంజింప జేయు మన మనములనే
సెల యేరుల సవ్వడి వలె
న లలల వలె దేలి యాడు నానందము తోన్

పద్య రచన -అర్ధ నారీ శ్వరుడు

సగము భాగము పురుషుడు సగము వనిత
గాను  రూపుది  ద్దబడెను గనుము  బాల !
అర్ధ  భాగము  పార్వతి యర్ధము మృ డు
నివలె చిత్రము  గలదట  నిజము గాను

అక్కఱకు రావు నీతి వాక్యములు మనకు

చెడ్డ కాలము దాపురిం  చెడు స  మయము
వచ్చు నెడలను ,నెవ్వరు  బాగు కొఱకు
నెంత చెప్పిన మనకవి యింత గూడ
అక్కఱకు రావు నీతి వాక్యములు మనకు