Saturday, March 28, 2015

పద్య రచన =మూడు మంగళ సూత్రములు

మూడు  మంగళ సూత్రముల్ ముచ్చట గను
గట్టె  రాముడు సీతకు బిట్టు గాను
పెళ్లి రోజుకా  రణముగా బెద్ద లలర
మంగ ళ మగును  మనకది మాన్యు లార !

మూడు కట్టుట కారణం బునెఱు  గుమిక
నొకటి  మగపెళ్లి  వారిదిం  కొకటి యాడ
పెళ్లి వారిది  మూడవ  తాళి  రామ
దాసు మొదలుగా గలయట్టి  యీ శు భక్త
 కోటిది  యనుచు జెప్పిరి మేటి కవులు
ఒక్క  రామునికే యిది  తక్కు లేదు
అని చెప్పిరి శంకర ! యార్యు లపుడు
ఉర్వి  జనములు సుఖముగ  నుండు గాక !

No comments:

Post a Comment