Saturday, May 30, 2015

నిటలాక్షుడు శివుని గాంచి నివ్వెఱ బోయెన్

నిటలపు ట క్షుడు  మామా !
నిటలాక్షుడు, శివుని గాంచి నివ్వెఱ బోయెన్
జటలును బూడిద గలుగుత
నటవిని దిరుగాడు వనిత హాహా  యనుచున్ 

పద్య రచన - చలివేంద్రము

దప్పి దీర్చుట కొఱకు నై  ధర్మ ప్రభులు 
మట్టి కుండల యందున  మంచి  నీరు 
వీధి వీధుల  నడుమన బెట్టు చుండి 
తీర్చు చుండిరి దాహము  దెరువరులకు 

Friday, May 29, 2015

పద్య రచన -పచ్చి మిరప బజ్జి

పచ్చి మిరప కాయ  బజ్జి జూడ మిగుల
యూరు చుండె జూడు  నోరు నాది
యొక్క బజ్జి  నోట జిక్కగా  చుర్రు మ
నియెను  నబ్బ !  నీవు తినుము 

కొరవిని గౌగిటను జేర్చు కొనుము లతాంగీ !

నరహరి ! దరి రానీయకు
కొరవిని, గౌగిటను జేర్చు కొనుము లతాంగీ !
విరహము తోడను రగిలిన
హరి కృష్ణకు నూ తమిచ్చి  యనురాగమునన్ 

పద్య రచన -బుర్ర కధలు

బుర్ర కధలను బేరున పూర్వ  గాధ 
లెన్ని  యోచెప్పు  చుండిరి  మిన్న గాను 
బుర్ర కధలకు బే రొం దె  పూసపాటి 
వేంక  టేశ్వర రావార్య ! వింటె మీరు ?

బండ పైన జొన్న పైరు పండె

గ్రామ  పెద్ద  తీర్పు  గారవ మొప్పునా
బండ పైన , జొన్న పైరు పండె
బాగు గాను  మాకు  పరమేశు   ని దయను
జొన్న  కంకి  సౌరు  జూడ తరమె !

Wednesday, May 27, 2015

జగ ద్వ్యాప్తము లయ్యె నిరులు ఖర కరు డుం డన్

అద్వానీ సూక్తు లట జ
గ ద్వ్యాప్తము లయ్యె ,నిరులు ఖర కరు డుం డన్
ఖద్యోతము  సరి జూడగ
నాద్యంతము మాయమగుచు నహము న్వెలిగెన్

పద్య రచన -హనుమ- రావణు శయన మందిరము

రావ ణుం డచట దనదు  రాణి తోడ
నిదుర  బోవుచుం డ హనుమ  నెలతు లొక్క
రొకరి  నిగనుచు మెల్లగా నొక్క రొకరి
ని మఱి  దాటుకొ  నుచునుబో   నిర్ధ రించె 

Tuesday, May 26, 2015

పద్య రచన -తాటి కల్లు

తాటి కల్లును దీయగ తాత  యొకడు 
తాడి  చెట్టును నెక్కెను వీడి  భయము 
చలువ జేయును వేసవి  సమయ మందు 
పల్లె టూరుల యందున పల్లె జనము 
త్రాగు  దురు ముఖ్య ముగనునీ  తాటి కల్లు 

పామర కవిత్వమును మెచ్చె బండి తుండు

పరి హసిం చ కూడదు మఱి పామరుణ్ణి
పామర  కవిత్వమును ,మెచ్చె బండి తుండు
పామర కవిత్వ  మైనను భావ మరసి
శిష్ట పదములు జోడించి పుష్టి జేసి 

పద్య రచన -కజ్జి కాయలు

కజ్జి కాయలు  జూడుము  కమల ! నీవు 
ఎంత  చక్కగ  నుండెనో  నంత రుచిని 
నిచ్చు ననుటలో  సందియ  మించు కైన 
వలదు ,నేర్వుము  నీవును  వాటి జేయ 

Monday, May 25, 2015

రమ్ము జనాళి కి గడు మధుర మ్మగును గదా

తమ్ముడ ! మమ్ముల జూడగ
రమ్ము ,జనాళి కి గడు మధుర మ్మగును గదా
కమ్మటి నీ గానమ్ములు
వమ్మును నిక సేయ కిపుడు పాడుము వరుసన్ 

న్యస్తాక్షరి = అంశం- గ్రీష్మతాపము. ఛందస్సు- ఆటవెలది. నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా ‘వ - డ - గా - లి’ ఉండాలి.

వేస వివిడి  దులను వెదుకుచు సరివోవ
కానిపించె పెద్ద  గాలి మేడ
పోయి చూడ యుండె పూర్వీకు  లయది గా
సంధ్య  వేళ  వీచె చల్ల గాలి 

పద్య రచన -కొబ్బరి బొండ ము ద్రాగుట

ఎండ  వేడిమి యధిక ముండె గతన 
దేహ  మందలి తాపము దీర్చు కొనగ 
చిత్ర మందున  బాలుడు  చేత బట్టి 
త్రాగు చుండెను  బొండము  దనివి దీర 

Sunday, May 24, 2015

, తీపు - కారము - పులుపు - చేదు. పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో

వలపు తీ పున  కీచకుం  డలమ  టించి
డెంద మందు వి  కారము  చేదు కొనగ
పులుపు  చేతను  జేరెను బొలతి యైన
ద్రోవ దేకాం త  ముననుండ దుష్ట మతిని 

Saturday, May 23, 2015

పద్య రచన -శ్రీ కృష్ణుని రోటికి కట్టుట

చిత్ర  మయ్యది జూడుము  చిత్ర ముగను
వనజ  గర్భా దులకు మఱి  పట్టు వడని
కృష్ణ  భగవాను డ చ్చట  రజ్జు చేత
కట్ట బడుచుండె  రో టికి  గట్టి గాను


Friday, May 22, 2015

పద్య రచన -జెండా వందనము

జరుగు చుండగ  గణతంత్ర  సంబరములు
బాలు రందఱు  నిలబడి వంద నములు
చేయు చుండిరి జెండాకు జిత్త మలర
చూడ  ముచ్చట  గానుండె జూడు డా ర్య !



కడుపు నొప్పి తెచ్చె గడుసు ఖమ్ము

పరగ డుపున  నాకు  బ్రా ణా o తకమ్మును
కడుపు నొప్పి తెచ్చె,  గడుసు  ఖమ్ము
రాత్రి వేళ లందు రామగానము జేయ
రక్తి  భుక్తి  మఱియు  ముక్తి  కలుగు 

మారుతి యే తెంచె సీత మాయం బయ్యెన్

ఆ రామా మణి గాంచను
మారుతి యే తెంచె,సీత మాయం బయ్యెన్
మారుతి గాడని య నుకొని
ఆ రావణు మాయ దలచి నార్తిని  దోడన్

Thursday, May 21, 2015

పద్య రచన -సిగరెట్టు

సూర్య !చూడుమా సిగరెట్టు  సొగసు ధనము 
నెంత  యందము  గలదియో  యంత  హాని 
గలుగ జేయును  ద్రాగిన ,కనుము పొగను 
వలయ  వలయము లుగ బైకి బయలు వెడలె 

Wednesday, May 20, 2015

పద్య రచన -కుబ్జ - భిక్ష

కుబ్జ యొకతె భిక్ష  కొఱ కుగా  నిలబడ 
ప్రేమ మీర బిలిచి వేసె భిక్ష 
కృష్ణు  డచట చూడు కృష్ణయ్య ! మఱి నీవు 
దీన జనుల బ్రోవు  దినము దినము 

కోర్కె తీ రిన భక్తుడు గొల్లు మనెను

సంత సంబున మునిగెను  సంతు జూచి
కోర్కె తీ రిన భక్తుడు, గొల్లు మనెను
జన్మ నొందిన  బాలుడు  చనుట వలన
చనుట యనగను నర్ధమ్ము చచ్చు ట గద 

Tuesday, May 19, 2015

కుంభ కర్ణ దశాననుల్ కుంతి సుతులు

కశ్యప మహాముని సుతులు కమల ! వినుము
కుంభ కర్ణ దశాననుల్ ,కుంతి సుతులు
ధర్మ  జుం డును  బార్ధుడు కర్ణుడు  భీమ
సేను డు గదార్య !పాత్రులు  శివుని కృపకు

పద్య రచన -చిన్న పిల్ల రాళ్లు మోయుట

పాప మాపిల్ల రాళ్లు జే  బట్టి దలను 
బెట్టి  మోయు చుండెను నార్య !పెద్ద బండ 
మోయ  లేకుండె  జూడుడు ముఖము  తనది 
సకల  సంపద  లిచ్చుత ! శంక రుండు 

Monday, May 18, 2015

మాంస భక్షణ చే ద్విజుల్ మాన్యు లైరి

మొరటు  వారగు  దురుగద  నరులు  భువిని
మాంస భక్షణ చే,  ద్విజుల్  మాన్యు లైరి
శాస్త్ర  ప ఠ నము  వలనన ,చదువు   సంధ్య
లొరుల కు గఱపు  మూలాన నొజ్జ  లగుచు 

పద్య రచన -సీత ,జనకునకు నాగేటి చాలులో

దున్ను చుండగ  భూమిని దొరకు  కతన
సంత  సంబున  జనకుడు సంతు కపుడు
పేరు పెట్టెను  సీతగా బ్రియము తోడ
మాత  భూసుత  ,సీతమ్మ  మాన్యు రాలు 

Sunday, May 17, 2015

కన్నులన్మూ సి దృశ్యమ్ము గాం చవలెను

దైవ ప్రార్ధన జేయుము తన్మయతన
కన్నులన్మూ సి, దృశ్యమ్ము  గాం చవలెను
మనసు  నేకాగ్ర  తనిలిపి మనన జేసి
దైవ రూపును ,కళ్ళార  దనివి దీర 

పద్య రచన -ఆంజనేయుడు సంజీవని పర్వతము

చిత్ర మందున గనిపించె చిత్ర మదియ 
యాం జ నేయుడు  గొనివచ్చె నద్భుతముగ 
మూలి  కగలయా  నగమును మూర్ఛ దొలగ 
దనర  లక్ష్మణు  నకచట తలిరు బోడి !

Saturday, May 16, 2015

పద్య రచన -పేక ముక్కలు

భార్య కోరిక మన్నించి  భర్త  మరిని 
ముక్క లనగను  సరి పేక  ముక్క లనట 
వేచు చుండెను  నె ఱ్ఱ గా  విడివి  డిగను 
నాసు రాజులు  మొదలగు  నట్ట లన్ని 

జందె మ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్

కందుల వారల  యింటను
జందె మ్మును  విడిచి యజ్వ జన్నము జేసెన్
జందెపు విలువలు దెలియని
కొంద ఱు  మఱి  జేటుర టుల  కువలయ మందున్ 

Friday, May 15, 2015

మ ఠ మున సన్యాసి యొకడు మానిని గూ డెన్

మఠ మున నుందురు  భిక్షులు
కఠి నంబగు  నియమ  నిష్ఠ గలుగుచు నెపుడున్
శ ఠ గోప మిత్తు నేనని
మ ఠ మున  సన్యాసి యొకడు మానిని గూ డెన్ 

పద్య రచన - హంస -బాతులు -కాకులు

అగ్ర మందున గలయట్టి హంసకు నట 
పైన  కాకులు దిగువన బాతు  లుండి 
హంస చెప్పిన  పలుకుల నాల కించు 
నటుల  గలదార్య !చిత్రము  నరయ నాకు 

పద్య రచన -వాలి సుగ్రీవులు

వాలి సుగ్రీవు లిరువురు పగను నొంది
యొకరు పైనొకరు  దలబడి నొండొరు లట
గుద్దు పోటుల  యుధ్ధాన  గుంజి కొనగ
కలుగు చుండెను భయములు  కంటె  మీరు ?

గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్

మాడుగుల   రామ చంద్రుడు
వీడక  మద్యమును  నెపుడువె ఱ్ఱి గ  బలికెన్
కూడలి  యొద్దన  జూచితి
గాడిద పైనెక్కి  హరుడు కాశికి  నేగెన్ 

Thursday, May 14, 2015

శ్రద్ధాంజలి


లేవు లేవమ్మ ! యిక మాకు లేవు నీవు
నె చటి   కేగితి వమ్మ నీ  విచటి నుండి 
కళ్ళు  మాయవి  కాయలు  కాచె  నమ్మ !
రమ్ము  వేవేగ మమ్ముల రక్ష జేయ 

జ్ఞాప కంబులు  నీయవి  జ్ఞప్తి  కలిగి 
ఉన్న లేకున్న  నున్నట్టు  లుండె  మాకు 
అమ్మ ! చూతుము  నొ కపరి యమ్మ రమ్ము
 మునుపు వోలెను ,నీ రాక  ముదము మాకు 

ఎవరు వచ్చిన విసుగక నెందు కనక 
కడుపు నిండుగ  బెట్టుట  కలదు నీకు 
నాన్న కూడను నిందుకై నమ్మి నిన్ను 
నుత్స హించును గదమ్మ !యుత్సు కతన 

అమ్మ! ప్రేమను  బంచితి వమ్మ నీవు 
మరువ జా లము మరి మేము మరువ మమ్మ !
మాట లాడుచు నుండంగ మరణ మగుట 
దైవ నిర్ణయ మీ యది , దరమె దా ?

 లేదమ్మ ,నీ కిల యాశ లేదు 
ఉన్న దానితో సంతృప్తి నొంది తీ వు 
సా టి రారమ్మ యెవరును సాటి రారు 
అందు కోవమ్మ ! జోహార్ల నందు కొనుము 

నాన్న ,యమ్మమ్మ యిచటనే హాయి గాను 
వెళ్లి పోయిరి మమ్ముల విడిచి మరిని 
నీవు కూడను  వారికి నేస్త వైతి 
దిక్కు లేనట్టి మాకిక  దిక్కు సాయి 






అమర  లోకము జేరితి వమ్మ నీవు 
అమరు  లందరు  నినుజూచి యాద రించ 
మసలు కొనుమమ్మ యచ్చట  మాన్యు రీతి 
నాదు కొనగను  నమరులు , హాయి కలిగి 

చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు 
జన్మ లేకుండ జేయను  సమ్మ తించి 
సకల  శుభములు గలిగించు శంక రుండు 
నీ దు నాత్మకు శాంతిని నించు గాక !


( ది .3-5-2015 తే దీన మా అమ్మ గారు ,రాపాక సీ తా  మహలక్ష్మి  గారు పరమ పదించిన  సందర్భముగా
అశ్రు పూర్వక నయనాలతో ... ............. కుమార్తెలు  మఱియు  కుటుంబ సభ్యులు