Monday, June 29, 2015

సంతతము దుఃఖ మే కుల సతుల వలన

భార్య  గయ్యాళి దియగుచో భర్త కుమఱి
సంతతము దుఃఖ మే కుల సతుల  వలన
నెడ్డె  మనినచో ననునామె తెడ్డె మనియు
సర్వ  నాశన  మగునార్య !  సదరు గృహము 

పద్య రచన -సైంధవ వధ

తాను జేసిన శపధమ్ము దలచె నరుడు
హరియు  చక్రము సూర్యున కడ్డు పెట్టె 
కవ్వ  డి యలుగు  సంధించి  కాగ  యస్త 
మయము చంపెను సైంధవున నయము గాను 

Sunday, June 28, 2015

కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ

పకపక నవ్వుట కొఱకై
కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
రకరకముల  పై  కూతలు
సుకరముగా చదువు చుంటి  సుజనులు మెచ్చన్ 

పద్య రచన -చీరలు

 చీరలు చీరలు చీరలు 
హారతి మఱి దెచ్చె నటకు  నమ్ముట కొఱకు
న్నేరా ,రాములు  ! కొనుముర 
మీ రా  ధకు నొక్కటైన మెచ్చును నిన్నున్ 

Saturday, June 27, 2015

దత్తపది -శివ ,హర ,భవ ,రుద్ర (విష్ణు స్తుతి )

భవ హ ర !శివమ  ణి ధరుడ ! వరద !భువిని 
రుద్ర  భూమిగ జేసెడి  క్షుద్ర జనము 
నణచి కాపాడు మమ్ముల యభయ మిచ్చి 
నిన్నె సేవించు కొందును నిరత మయ్య !

పద్య రచన -వ్యాస పపీ ఠము

చిత్ర మయ్యది  చూసియు  చెప్పు చుంటి 
వ్యాస భగవా ను  డా దిగా  వ్రాసి నట్టి 
పరమ పావన  మైనట్టి  ప్రతుల మోయు 
వ్యాస పీ ఠమునకు సేతు  వంద నములు 

శ్రవణా నందమ్ము గూర్చె రాసభము సభన్

కవితా గానము మీయది
శ్రవణా నందమ్ము గూర్చె, రాసభము సభన్
రవములు సేయుచు దిరుగగ
నవసరమగు వస్తు తతులు నప్పడ మయ్యెన్ 

Friday, June 26, 2015

పద్య రచన -ఉరుములు మెరుపులు

ఉరుములు మరియును  గనబడె
మెరుపులతో గగన మంత మెరయుచు మిగుల
న్నరయగ శ్రావణ మాసము
నరుదెంచెనుననుచుదెలిసె యార్యా! మాకున్


సంతాపసభల్ జనులకు సంతసమొసగున్వింతగఁబల్కిరి యార్యులు
సంతాపసభల్ జనులకు సంతసమొసగున్
కొంతైనఁగలదె న్యాయ మ
వంతీ మరిచెప్పునీవు భయమదిలేకన్

Thursday, June 25, 2015

పద్య రచన -వరదలో మొక్కకు నీరు

పిచ్చి వాడేమొ  చూడగ నచ్చట తడు 
భూమి యంతయు వరదతో  మునిగి యుండ 
పోయు చుండెను నీటిని  పుష్ప పొ దకు 
నవునొ  కాదోమ  ఱి పరి కిం చువన  జయట 

హరుని వక్షస్థ లమ్మున నమరె లక్ష్మి

హిమ గిరీశుని బుత్రిక యిమిడె  సామి !
హరుని  వక్షస్థ లమ్మున ,నమరె లక్ష్మి
విశ్వ  మాడించు  బోషించు విష్ణు నెదను
హరిహ  రులకు నే  వందన  మాచ రింతుWednesday, June 24, 2015

పద్య రచన -గులాబ్జా ములు

చిత్రము  జూడగ బెదవులు 
నాత్రుతతో కదులు చుండె హర్షము తోడన్ 
మిత్రమ ! తెమ్ముము  నాకొక 
పత్రము నగులా బుజాము  వందన మిడుదు న్ 

Tuesday, June 23, 2015

కన్న బిడ్డ కంట గా రమిడెను

కన్న బిడ్డ కంట గా రమిడెను నొక
తల్లి  దయయ  నునది దరిని లేక
పేగు  బంధ మునకు ప్రేమయిం  చుకయును
లేదు గదమ  ఱి ధర  లీల ! కంటె !

పద్య రచన -హరిహరులు

చిత్ర మయ్యది  జూడుము  సీత ! నీవు 
హరుడు మఱియును  గనిపించె హరియు కూడ 
భిన్న రూపాలు గలిగిన  పెన్నిధు లిల 
వంద  నంబులు సేతును  వారి కిపుడు 

Monday, June 22, 2015

వానకురియ మురిసె బడక టిం ట

    శోభ నంబు రాత్రి  సూర్యనా  రాయణ
    వానకురియ మురిసె, బడక టిం ట
   క్రొత్త యైన పెళ్లి  కూతురు తోడను
   మదన కేళి యందు మరులు గొలిపె
   

పద్య రచన -కార్ల రద్దీ

   రాత్రి ,పగలు కూడ రయ్యుమనుచు కార్లు
    బళ్ళు ,కాలి  నడక  వారు పోవు
   చుండ్రి  చూడు  మచట  చోద్యము  గాలేదె
    వారి  వేగ మాప  నేరి తరము ?

మద్యము సేవించి నడపుమా వాహన మున్

విద్యా ! యెప్పుడు  బలుకకు
మద్యము సేవించి , నడపుమా  వాహన ము
న్మద్యముద్రాగక  నెప్పుడు
మద్యము  మఱి  హానిజేయు  మానవుల కిలన్ 

Saturday, June 20, 2015

సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్

   అన్నా ! యేమివి  చిత్రము ?
   సున్నమిడవె  యన్నమేల  చుట్టంబునకు
   న్నెన్నడు  పలికితె  యిటులుగ
   మిన్నగ  మఱి  చూడవలెను మేదిని  వారిన్
    

పద్య రచన -గంపలో బాలుడు

    తల్లి ప్రేమకు సాటిది  ధర ణి  గలదె ?
    కన్న  కొడుకును  నునిచియు  గంప లోన 
    దాటు చుండెను  వాగును  దరము తోడ 
   అమ్మ ! యోయమ్మ ! వందన  మందు కొనుము 

Friday, June 19, 2015

పద్య రచన -వాలుజడలు

    విరుల  దండలు జూడుము వివిధ ములగు 
    రంగు  లకలయి  కలుగల్గి  రమ్య ముగను 
    వాలు  జడల రూప మ్మున  భామినులను 
    ముగ్ధు  లనుజేయు  చుండెను   మూర్తి ! కాదె ?

ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని

       కాదు కాదయ్య వినుమార్య ! కాదుకాదు
       ధర్మజుని తల్లి గాంధారి , తాత శకుని 
      కాదు ముమ్మాటికి నసలే కాదు  నమ్ము 
     ధర్మజుని  తల్లి  కుంతియ  తాత భోజ్డు 

పొన్న గంటి వారు

పుణ్య పురుషుడ వీవెగా  పొన్న గంటి !
వ్రాయు చుంటివి  వాల్మీకి  వ్రాసి నట్టి 
తనరు  రామాయ ణ మ్మును  దెనుగు  నందు 
నర్హ తగలదే  సవరించ నార్య ! నాకు ?

Thursday, June 18, 2015

పద్య రచన =గణపతి -వీణ వాయించుట

    వీణ  వాయించు చుండెడి  విఘ్న నాధ !
    కరుణ తోడన గాపాడు  ధరణి  జనుల
     బొజ్జ  నిండను  నుండ్రాళ్ళు  పోయుదు రట
    కాదు  కూడద నకనిక   కనికరించు 

నంద మూరి రామారావు నటుడు గాడు

నటన యందున  శ్రే  ష్టు డు  నటికు లందు
నంద మూరి రామారావు  ,నటుడు గాడు
గాన  మాధుర్య  ముగల యా  ఘంట సాల
కాన నొక్కరి  కొక మేటి  కళ యుండు

లక్ష్మణు డా నంద మందె లంకకు రాజై

ఆ క్ష్మా సుతపతి జూడగ
లక్ష్మణు డా నంద  మందె  ,లంకకు రాజై
లక్ష్మకము లేక  ధరణిని
సూక్ష్మత  నవిభీ ష ణుం డు సుమతిని  నేలెన్

Wednesday, June 17, 2015

ప ద్యరచన -గొంగళి పురుగు

గొంగళి  పురుగును జూడుము 
కంగారుగ నెక్కు చుండె గనబడు కొమ్మన్ 
రంగులు మారుచు  చివరకు 
సింగారపు సీతకోక చిలుకగ మారున్ 

Tuesday, June 16, 2015

దత్తపది -కాకి -కోయిల -నెమలి -కోడి (భారతార్ధము )

    నాకు  కోడిగ  మిచటనా ? నాధ ! చెపుమ
   యెందు  కోయిల  బ్రదుకగ నిపుడు నేను 
   నేనె  మలినమై  తినిమఱి  నెమ్మది గను 
   నూర కుండుటకా  కిరీ    టీ ర  భసము ?

పద్య రచన =చక్కిలాలు

    చిత్ర మయ్యది  జూడుము  చిత్ర ! నీవు
    చక్కిలములను  జూడగ  చక్క నుండె
    కార మెక్కువ  గలవేమొ ? యేరి  యొకటి
   తీసి కొనిరమ్ము  దయతోడ  తిందు నిపుడు 

Monday, June 15, 2015

కన్ను లుండి కూడ కాంచలే రు

కన్ను లుండి కూడ కాంచలే రుగమఱి
చుట్టు  ప్రక్క  జరుగు నట్టి  పనుల
మనసు బాగు లేక  మధనప  డునపుడు
నెంత వారి కైన  నిట్లె యుండు

పద్య రచన -బోసి నవ్వుల బాబు

స్నాన  మాడించు చుండగ  చంటి కుఱ్ఱ
    డమ్మ  మోకాళ్ళ మధ్యన  హాయి నుండి 
బోసి  నవ్వుల తోడను ముద్దు లొలికె 
చిత్ర మందున  జూడుము  శేష సాయి !


     

అక్షరములు నేర్చి భిక్ష మెత్తె

సాటి  కవుల  యందు  మేటియ  య్యెధరను
అక్షరములు  నేర్చి ,భిక్ష మెత్తె
చివర దశ యందు శ్రీ నాధ  కవివరు
డుతను,  దిండి  లేని  కతన నపుడు 

Sunday, June 14, 2015

పద్య రచన -చెక్క వడలు

చెక్క వడలు జూడ  జక్కగా నుండెను 
దినగ  దినగ  నవియ  తీ య గుండు 
వేడి నీటి  లోన  బియ్యపు పిండిని 
ముద్ద  వోలె  గలిపి పెద్ద చేయు 

ఆహ్వానము

చిమ్మ పూడి తిలక ! శ్రీరామచంద్రుడ !
మేటి కవివి  నటివి  సాటి యెవరు 
కాన బడరు  భువిని  గాయక శ్రే ష్టుడ !
వంద నంబు  లివియ యందు  కొనుము 

పుణ్య పురుషుడు జీవించర ణ్య మందు

    సాటి  మనిషిని  మనిషిగా  సాకు నతడు
   పుణ్య పురుషుడు, జీవించర  ణ్య మందు
    అడవి  జంతువు లన్నిటి కధిక మగుచు
   రాజు వోలెను  ఠీ విగ  రమ్య ! కంటె ?
    

గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్


తరుణీ ! వింటివె దీనిని
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
ధరణిని నెచట ను జరిగినె ?
పరువము నుందీ య సబబె ! వ్రాయుచు నిటులన్

Saturday, June 13, 2015

పద్య రచన -పిల్లలు అమ్మా నాన్న ఆట

పిల్ల లచ్చట  మనసున  నుల్ల మలర
యాడు చుండిరి  చక్కగ నమ్మ నాన్న
యాట  లచ్చట చూడుము  హరిత ! నీవు
గూడ  పోయియా  డుకొనుము వీడి  నన్ను 

పద్య రచన -అతివలు గోరింటాకు

చిత్ర మయ్యది జూడుము  చిత్ర ! నీవు 
అతివ లచ్చట గుమి గూడి  యందముగను 
నొకరి  కినొకరు  ముదమున  నొప్పు గాను 
దనరు  గోరింటాకు ను బెట్టు  కొనుచు  నుండె 

Friday, June 12, 2015

చెల్లని నోట్లు (RBI వారి సర్క్యులర్ )

రెండు  తదుపరి యేక్యూ లు నిండి యున్న 
మఱియు  నెనిమిది యే సీల మయము గలుగు 
వెయ్యి రూపాయి  నోటులు  వెంకటేశ ! 
దొంగ నోటుల  నిదెలిసి   భంగ వడితి

ఇంటి కంటె మఠ ము హితమొసంగు

          ఇంటి కంటె మఠ ము  హితమొసంగెడుమాట
      యక్షరాల నిజము  హర్ష ! వినుమ
    యింటి లోన పోరు లెక్కువ యైనచో
    నదియ మార్గ మునిక నందరకును
    

Thursday, June 11, 2015

పసుల గొల్చు జనుల భద్రమమరు

    పసుల గొల్చు జనుల భద్రమమరు నిల
    పసులు శివుని  కిమరి  వాహనములు
    మనకు  పూజ నీయ మనుటలో సందియ
    మువల  దులలి  త ! నిజ  ముగను  నమ్ము 

పద్య రచన -బాల కృష్ణుడు తలుపు చాటున

       తలుపు చాటున నుండియు  దైవ మచట 
      చూచు చుండెను వెన్నకై చోద్య మరయ 
    జగము గాపాడు  పోషించు శక్తి యుతుడు 
    దొంగ వోలెను నుండుట రంగ ! కంటె ?

Wednesday, June 10, 2015

పద్య రచన -అరిసెలు

అరిసెలు సేతురు విరివిగ
నరయంగా బెళ్లి జరిగి నపుడు వనితలే  
యిరవుగ  నీయగ  సారె గ 
పొరపుచ్చెము తొలగ కొఱకు పోడిమి తోడన్పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే

పద్యము వ్రాయుట  నేర్చుకు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే !
హృద్యముగ వ్రాయువారిని
నాద్యంతము మెచ్చు కొండ్రు  హర్షము తోడన్ 

కాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?

భీముని  సందియ మిదియే 
కాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?
కామము గలిగిన వారలె 
యీ మాదిరి తలతు రెపుడు నీయది  నిజమే 

Tuesday, June 9, 2015

పద్య రచన -అమ్మ

మొదటి చిత్రము జూడగ మోద మయ్యె
కన్న ప్రేమను  దెలిపెను మిన్న గాను 
దిగువ చిత్రము  జూడగ తెలివి కలిగి 
పెంచు ప్రేమకు  వందనం బిత్తు సామి !


అమ్మను మించిన దైవ
మ్మిమ్మహిలో గానరాదు నెందు వెదకిన
న్నమ్మయె మన తొలి గురువయె
నమ్మకు జేజేలు గొట్ట హాయిని గూర్చున్.


పద్య రచన -వాస్తు

వాస్తు దోషము లేకుండ  వనజ ! నీవు 
కట్టుకొనినచో  నింటిని గట్టి గాను 
నాయు రారోగ్య  సంపద లన్ని గలిగి 
జీవనమ్మును గలుగున  జేయ ముగను 

పతివిడ నాడిన సతికి శుభమ్ములు గలుగున్

అతలా కుతలమె బ్రదుకులు
పతివిడ నాడిన సతికి ,శుభమ్ములు గలుగు
న్బతినిల  సేవించు సతికి
సతతము సంతసము గూడ సలుపగ వచ్చున్

Sunday, June 7, 2015

పగలు ముగిసి నంత సెగలు రేగె

గుండె నిండ నిదుర  మెండుగ  పోదును
పగలు ముగిసి నంత, సెగలు రేగె
గ్రామ  మందు పగల గారణం  బుగమది
పగలు గలుగు గృహము  భస్మ మగును 

పద్య రచన - గవ్వలు

గవ్వల జూడగ బటమున 
రివ్వున మఱి వా  లనటకు  రెప రెప లాడెన్ 
అవ్వా ! నామది  నిజమిది 
గవ్వల రుచి జెప్ప దరమె ? కన్నడి  కైనన్ 

Saturday, June 6, 2015

గీత నిస్సారమని చెప్పె కృష్ణు డౌర !

గీత నిస్సారమని చెప్పె కృష్ణు డౌర !
యనుట కాదుస  మంజస  మార్య ! మీకు
గీత బోధించె గ్రీడికి కృష్ణుడు గద
మనకు  గాదె ప్రా  మాణిక మైన  దదియ ?

Friday, June 5, 2015

అందఱ కును గీడు గల్గు యాగము జేయన్

మందుల గల్తీ గలిపిన
నం దఱ కును గీడు గల్గు యాగము జేయన్
వందనములు నే  జేతుబ
సందుగ నాసోమయాజి శర్మకు  నెపుడున్


Wednesday, June 3, 2015

కవులు గాంచని వెల్లను రవియె కాంచు

కవులు గాంచని వెల్లను రవియె కాంచు
నిజము  ముమ్మాటి కీ మాట  విజయ ! నమ్ము
రవికి  కాంచలే  నటువంటి యవని గలదె ?
యన్ని చోటుల వ్యాపించు నతని కాంతి 

Tuesday, June 2, 2015

సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే

కాముని దహియించెను గద
సోముడు, నిప్పులను గురిసె సూర్యుని వలెనే
సోముడ  నంగుని  గాంచగ
కామము మఱి గౌరి పైన  గలుగుట వలనన్ 

గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్

ఉరగములు పాఱి పోవును
గరుడుని గని, సంతసించు గద భుజగమ్ముల్
కరముం బిల్లన గ్రోవిన
బరగను నా దస్వరమ్ము  పాడగ నపుడున్ 

పద్య రచన -పిల్లలు మొక్క నాటుట

భావి భారత  యింతులు  భవ్య ముగను 
ముద్దు లొలికించు  మొగముతో ముద్దు గాను 
నాటు చుండిరి మొక్కను  నగవు తోడ 
చూడ  ముచ్చట  గగలరు  చూడుమార్య !