Monday, August 31, 2015

కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్

కష్టంబని మది దలచక
యిష్టం బుగ పద్యములను హితము గలుంగన్
స్పష్టముగ  జెప్ప గలిగిన
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్ 

ఒకచో సూర్యుడును జంద్రు డొ ప్పిరి జంటన్


వికచాంభో రుహ   లోచని
భ్రుకుటుని  నేదిలక మిడగ  బోలెను  రవియు
న్వికసితమౌ  చంద్రుండును
నొ కచో సూర్యుడును జంద్రు డొ ప్పిరి జంటన్

Sunday, August 30, 2015

హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

పతితు  డు నైన  భర్తను గభాలు  నజూచి వైద్యు యొ  ద్దకు
న్హి తము గనంగ బ్రాణ విభు నింతియె  పంపెను, వేశ్య చెంతకు
న్స తతము బోవ నెంచుట నసభ్యము గాదలంచు మామది
న్వి తరణ శీ లియై  మిగుల వైభవముం ద నరం గా నుండుమా
------------
సతి యనసూయ చారుతమ సద్గుణ రాశి విశేష సాధుశీ
లి ,తపసి  యాత్రిమూ ర్తులను  లీలగ  బాలుర  జేసె జె చ్చెర
న్బతి పదసేవ  తత్పరత  బ్రాణ సమున్శి రమందు నక్కటా
హితము గనంగ బ్రాణ విభు నింతియె  పంపెను వేశ్య చెంతకున్

----------కామేశ్వర రావు -------

Saturday, August 29, 2015

పద్య రచన -బీటలు వా రిన భూమి

బీటలు వారిన  భూమిని
వాటముగా జేయదలచి బాలకు డొకడు
న్నీటిని  వెదకుట  కొఱకై
దాటుచు మఱి  పోవుచుండె దప్తుం  డగుచున్ 

Friday, August 28, 2015

పద్య రచన -రక్షా బంధనము


చిత్ర మందున జూడుము చెల్లె లచట 
కట్టు చుండెను రాఖీని గారవమున 
తనదు  సోదరు  నకుమఱి  తనకు  భువిని 
నండ  గానుండు  ననుభావ  మతిశయిల్ల 

రక్షా బంధనము సేయ బ్రాణము వోయెన్


రక్షగ  నుందురు  నిరతము
రక్షా బంధనము సేయ, బ్రాణము వోయె
న్గక్షను  పీకను  బిసుకగ
భిక్షము దావే యకునికి వేరొకడు దనన్ 

వ్రతకధచందో బధ్ధపు వ్రతకధ
నందముగా వ్రాసితీవు యార్యా! గుండూ!
వందనములునే సేతును
నందుకొ మరి నీవు సామి! యానందముగాన్

(క్షమించండి, ఇంటిపేరుతో సంభోధించినందులకు

Thursday, August 27, 2015

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ!ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)

ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)

కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)

తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)

కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)

తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)

ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)

కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)

తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)

కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)

తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)

తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)

తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)

కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)

--------Madhu sudan garu---------

తిరుగు ప్రయాణము (26-2-2015)

అమెరికా నుండి  వచ్చితి నార్య ! నేడు
అక్కడుండగ మఱి నేను నొక్క గంట
వ్యవధి లోపున పూరణ ల్వ్రాయ గలిగి
తినిక నాలస్య  మగునని దెలుపు చుంటి
భూరి దయతోడ జూడుమా  పుణ్య పురుష !

క్రిస్టినా జేయును వరలక్ష్మీ వ్ర తమ్ము


దైవ పూజను జేయుట త ప్పు లేదు
ఏమతము వారై నను,జేయ  నీయ  వచ్చు
ననెడి సిద్ధాంత మనదియౌ  య గుట వలన
క్రిస్టినా జేయును వరలక్ష్మీ  వ్ర తమ్ము

పద్య రచన -వరలక్ష్మీ దేవి

అమ్మా  వందన మమ్మా !
రమ్మా మాయింటి కిపుడు రయమున లక్ష్మీ !
కొమ్మా  పూజలు నాయవి
యిమ్మా  మఱి  శాంతి నాకు  నెప్పుడు భువిలోన్ 

Wednesday, August 26, 2015

వేంకట రమణా !

వింటిని  భాగవతమ్మును
వింటిని  మఱి  నీదు  కధలు వివరము  గాగన్
వింటిని  నీ సాహసములు
వింటిని  నిక నెన్నొ  యెన్నొ  వేంకట  రమణా    1

కంటిని  నీ రూప మ్మును
కంటిని  నీ భక్త కోటి   గణముల  వారిన్
కంటిని  నీ మహి    మంబులు
వింటివె   యీ నాదు  ఘోష  వేంకట  రమణా !   2

ప్రేమను నింపుము నాలో
ప్రేమను బూజింతు నిన్ను ప్రేమికుడ ననై
ప్రేమకు సాటిది లేదుగ
ప్రేమే మఱి  దరిని జేర్చు  వేంకట  రమణా !   3

సుమములు దెచ్చితి నీకై
సుమబాణు ని  యొద్ద నుండి   సౌమ్యతతోడన్
సుమములు     దాల్చియు సామీ !
విమలంబగు  మనసునిమ్ము  వేంకట  రమణా !   4

వేడెదను  సాయి  బాబును
 వేడెద నిక  సాంబ శివుని   వేడెద  హనుమాన్
వేడెదను   నాగరాజును
వేడెద మఱి  నిన్నుకూడ   వేంకట   రమణా !   5

విడుతును జెడు నలవాట్లను
విడుతును  దుర్జనుల  నెపుడు  విడుతును సామీ !
నిడుములు పెట్టెడు వారిని
విడువను నిన్నెపుడు  మదిని  వేంకట  రమణా !   6

అమ్మా నాన్నలు లేరయ
యమ్మైనా నాన్న యైన నన్నియు నీవే
యమ్మను జూతును నీలో
పేర్మిని నను జూడు సామి ! వేంకట  రమణా !   7

ఆలుం  బిడ్డల  బంధము
నేలాగున బోవునయ్య ! యిపుడున్నాకున్
మేలము లాడక జూడుము
వీలగు నుపకృతి ని నాకు  వేంకట రమణా !   8

ఘంటా పథముగ జెప్పుము
కంటిని తడి బెట్టకుండ గాచుదు ననియున్
బంటును మ్రొక్కుచు నుంటిని
వింటివ ?    మఱి లేద ? నీవు  వేంకట   రమణా !   9

గంటను గొట్టితి రయ్యా !
వంటలు  నట     పూర్తి యయ్యె భావము తోడన్
మంటలు దీరగ కడుపున
వెంటనె  నేనేగి తిందు వేంకట  రమణా !   10

అంటీ  యంటని  విధముగ
నుంటవ! మఱి   నాదు  యెడల నుండిన యడ లన్
కంటికి  నిదురే  రాదుగ
వింటివే యీ నా  దుమాట  వేంకట  రమణా !   11

పాలను గలిసిన నీటిని
నేలాగున  రాజ హంస వేరుగ  జేయు
న్నాలా గున  నాలోగల
పేలవమును బార ద్రోలు  వేంకట రమణా !   12

వేలకు వేలుగ నీయగ
జాలను మఱి నేను సామి ! చదివిం పులుగా
నాలయము జుట్టు దిరుగుదు
వీలగునని సార్లు వినుమ, వేంకట  రమణా !   13

వేంకట రమణా యనుచును
లెంకను  నేబిలువ నిన్ను లీ లగనైన
న్నంకము నిడి  లాలించవ !
బింకమ !  యదియేల నీకు  వేంకట రమణా !   14

నానుడు  బేరము  వదలుచు
నాననమున  మోదమొంది యానందము తోన్
దీనుని నను గాపాడిన
వినితిం తును  వేయి నోళ్ళ  వేంకట రమణా !   15

అనుదినమును నీ నామమె
మననము నేసే తునయ్య ! మాన్యుడ వనియు
న్విని పించ  నాదు చర్యను
వినికిడి  మఱి యాయె సామి ! వేంకట  రమణా !   16

ముదుసలి వారమ యైతిమి
యదు వంశపు రత్న పురుష !హా శ్రీ నాథా !
సదయను జూడుమ  మమ్ముల
పెదరాయుడ ,సుగుణ శీల !వేంకట రమణా !   17

వితరణ  బుద్ధిని గలిగియు
సతతము దా జేయ నీవి సద్గతు లొం దున్
శతముల  వర్షం బులు మఱి
వింటివె  యీమాట నీవు  వేంకట  రమణా !   18


వచ్చీ రానీ  మాటల
నిచ్చటనే  వ్రాయు చుంటి బేరిమి తోడన్
మచ్చున కొక్కటి జదువుచు
పిచ్చగ నది యున్నదనకు   వేంకట  రమణా !   19

భక్తుని  మాటను నిలుపగ
రక్తిని మఱి వచ్చి తీవు రావము తోడన్
యుక్తిగ గంబము జీల్చుకు
బిత్తర బోవంగ రాక ? వేంకట రమణా !   20

తేజో మూర్తులు మీరలు
జాజులు చేమంతి యాది సరముల తోడన్
పూజలు సేతును నిరతము
వేజామున లేచి మీకు  వేంకట రమణా !   21

అన్నము కొఱకై మఱి యీ
యన్నార్తుల గోడు వినుమ ,యార్యా రమణా !
మిన్నగ మది బూజింతురు
విన్నపమది యాలకించు  వేంకట రమణా !   22

అందరము కలిసి యిచ్చట
యందముగా విఘ్న నాథునా వాహనము
న్జిందిల  మంగళ వాద్యము
విందులతో జేతు మయ్య వేంకట రమణా !   23

వచ్చితి  నిన్ను  జూడగ
హెచ్చగు కష్టంబు లొంది యీ శా !మఱి నే
మచ్చునకు నైన జూడవు
బిచ్చకుడుగ దలచియేమొ ,  వేంకట రమణా !   24

అయ్యవు నీవే యనుచును
దియ్యటి యొక లడ్డు నీకు దెచ్చితి నిపుడే
యియ్యగ రానా ?యికనే
వెయ్యవ ?యా మోద ముద్ర  వేంకట రమణా !   25

అనుదినము భజన జేతును
వినయముగా నీదు గూర్చి వేవే రకము
ల్నను జూడుమ గృప తోడన
వినుచుంటివె నాదు మాట వేంకట రమణా !   26

ఎపుడో జూచితి నినునే
నిపుడా యెను జూడ బుద్ధి యెపుడె పు డనుచు
న్జెపుమా  దర్శన మిత్తువ ?
విపులముగా నడుగు చుంటి వేంకట రమణా !   27

సవినయముగ నిను దలతును
నవిరళ మగు  భక్తి తోడ నాసా యంబు
న్బవలును రే యియు సహితము
వివరముగా దెలుపు చుంటి  వేంకట రమణా !   28

ఆలుం బిడ్డల బంధము
నేలాగున బోవునయ్య !యిప్పుడు నాకు
న్మేలము లాడక జెప్పుము
వీ లగునే  బంధ మూడ వేంకట రమణా !   29

అన్నా ! వినుమా నామొఱ
యె న్నాళ్ళను  నీదు గురిచి యెదురుం జూ డ
న్నున్నావా నీ వసలు
న్విన్నావా  నాదు ప్రశ్న వేంకట రమణా !   30

కయ్యము లాడను నీతో
నయ్యవుమఱి యమ్మ గురువు  నన్నియు  నీవే
యయ్యా ! నీదరి జేరగ
వియ్యము నే గోరుకొందు  వేంకట రమణా !   31


కయ్యము జేయను నెప్పుడు
కయ్యమునకు గాలుద్రువ్వ  కలలో నైన
న్నయ్యా కనుమీ నిజమును
వియ్యమునే గోరుకొందు  వేంకట  రమణా !   32

అనగనగా నొకరాజని
వినువానికి జెప్పు కధలు వేవేలుగ గాన్
విననొల్లని నాకేలకొ ?
వినిపింతువు కధలు నాకు  వేంకట రమణా !   33

ఎన్నో రోగము లాయవి
తన్నుకు మఱి వచ్చి  నాదు తనువును డాసె
న్గన్నంతనె యా మచ్చలు
వెన్నున నిక బుట్టె వణకు వేంకట రమణా !   34

వేడుదు నిను బలుమారులు
పాడుదు నీపాట లెన్నొ పరవశ మగుచున్
వేడిన బలుకగ యుండిన
వీ డుదునా ?నిన్ను నేను వేంకట రమణా !   35

అలకా పురమున నీ గుడి
పలువురి చందాల వలన  బ్రహ్మాండ ముగన్
చలువల రాతిని దెచ్చియు
విలసిల్లం గట్ట దలతు వేంకట రమణా !   36

వడ్డాది కులము వారల
బిడ్డను గాపాడు మనుచు వేలకు వేలున్
వడ్డీ గా వారిచ్చిరి
విడ్డూర మ్మిదియ కాదె  వేంకట రమణా !   37

అక్షయమౌ సిరి యుండగ
భిక్షకుని గ మారితీ వు పెండ్లికి కొఱకై
భిక్షకులే ధన వంతులు
భిక్షాటన వారి వృత్తి వేంకట రమణా !   38

ఇంటిని నిల్లాలిని నిల
కంటికినే రెప్ప వోలె కాచుచు నటులన్
బంటును నను గాపాడుము
వింటివె  యీ నాదు మాట వేంకట రమణా !   39

పిల్లా పాపల తోడను
చల్లంగా నుండ గోరి సతతము నిన్నే
యుల్లమ్మున నే గొలుతును
పిల్లల పై దయను జూడు వేంకట రమణా !   40

పంచుము సిరి సంపదలను
పంచిన సంతసము గలిగి పరవశ మగుదున్
పెంచుము నీపై భక్తిని
పెంచిన నిక నిన్నె దలతు  వేంకట రమణా !   41

అత్తరువులు సాంబ్రాణి యు
దెత్తును మఱి యగరుబత్తి తెత్తును బూలన్
దెత్తును హారతి బిళ్ళలు
విత్తమ్మును బోగుజేసి వేంకట రామనా !   42


ఎన్నో రాత్రులు గంటిని
కన్నుల పండువుగ నిన్ను కంస విరోధీ !
యన్నువ నను దరి జేర్చుము
విన్నాణం బిదియ నాది వేంకట రమణా !   43

అప్పా !యేమని జెప్పుదు
గొప్పలు నే జెప్పలేను గొండంతలు గాన్
తిప్పలు బెట్టక మమ్ముల
విప్పారగ జేయు కళ్ళు  వేంకట రమణా !   44

పంజరపు జిలుక వలె నా
సంజయు నా చీక టిం ట సత మత మగుచున్
రంజిల జేతువు కతనన
వింజామర వీతు నీకు  వేంకట రమణా !   45

అంబను జూడగ నేగుచు
తంబురమున్మీ టు గొనుచు దళితుం డొ కడున్
అంబా !యంబా !యనగను
వెంబడి నేనుంటినపుడు  వేంకట రమణా !   46

ఇచ్చను హద్దులు దాటను
కచ్చలు నిక బెంచు కొనను కాపురు షులతోన్
చిచ్చును నెవరికి బెట్టను
విచ్చల విడి దిరుగ నేను వేంకట రమణా !   47

కాజాలు బూత రేకులు
నాజూకుగ మెరయు నాపనస తొన లన్నిన్
రాజా నాయుడు  చేసిన
పీజా నైవేద్య మిడుదు  వేంకట రమణా !   48

తాటకి గల యడవులలో
బాటముగా బెద్ద పులులు గలవండ్రు జనుల్
వేటకు వెడుదు ను గానీ
వేటాడగ రాదునా కు  వేంకట రమణా !   49

అజ్ఞానుండను సామీ !
జిజ్ఞాసను నిన్ను దలతు జేదుకొ  నన్నున్
విజ్ఞత గలిగిన వాడవు
విజ్ఞాపన మిదియ నాది వేంకట రమణా !   50

అమలమగు మనసు లేమిని
మమకారము సుంత గూడ మదికింగరువై
సమతా భావము లేకన
విముఖుడ నేనైతినికను వేంకట రమణా !   51


విశ్వాస ముండు వానికి
నశ్వర మగు శాంతి సుఖము లా నందంబు
ల్వి శ్వ మున న్లభి యించును
విశ్వాసము గొప్పగాదె ,వేంకట రమణా !   52

మొర్రో పులియది వచ్చెను
కర్రల తోరండి యనుచు కామిని బిలువ
న్జర్రున బో లేరెవరును
వెర్రిగ నేనమ్మితదియ వేంకట రమణా    53

భస్మా సురుడను నాతడు
విస్మయమగు వరము కోరి వెనువెంటనె దా
న్భస్మం బగుటను జూడగ
విస్మయ మున్గలిగె నాకు  వేంకట రమణా !   54

ఆ ర్మీలో నుద్యోగము
కార్మికునిగ రాగ నాకు గాలుని దయచే
న్గూ ర్మిని జేతును మఱి నను
పేర్మిని నిక జూడు సామి ! వేంకట రమణా !   55

వారలు వారల నియుబలు
మారులు వారి గురిచి యిక  మాట్లా డకు డీ
వారలు సెప్పితి  రని,నను
వేరుగ నిక జూడ బోకు వేంకట రమణా !   56

అక్షయ మగు నీ కాంతిని
నక్షులతో జూడ నాకు నద్భుత మయ్యె
న్బక్షుల గమనపు హొయలను
వీక్షించగ మో దమయ్యె  వేంకట రమణా !   57

అనుదినము నిన్ను గొలుతును
నినుడవు గామదిని దలచి యీ శా  రమణా !
యనయము గాపాడుము మము
వినయముగా వేడు కొందు  వేంకట రమణా !   58

విరజాజులు సంపెంగలు
సరములు గాగ్రుచ్చి  నిన్నుసాలం కృ తిని
న్నిరవుగ జేతును సామీ !
విరజాజుల మోము వాడ ! వేంకట రమణా  !   59

పిన్నలు పెద్దలు వృ ధ్ధులు
చెన్నుగ నొక చోట చేరి శ్రీ కర ముంగా
న్నిన్ను న్గూ ర్చిన కధలను
బిన్నల కున్జె  ప్పు చుండ్రి వేంకట రమణా !   60


ఎన్నో కీర్తన లయ్యవి
యన్నువగా నన్నమయ్య హాహా యనగ
న్మిన్నగ వ్రాసెను నీపై
విన్నావా వాటి నీవు వేంకట రమణా !   61

శిక్షింతువు దుర్మార్గుల
రక్షింతువు సాధుజనుల రంజిలు గాగన్
రక్షణ శిక్షణ నీవే
వీ క్షకుడను  నేను సామి ! వేంకట రమణా !    62

ఒక్కొక యవతారంబున
నొక్కొక రాక్షసుని జంపి నుర్విని దివినిన్
మిక్కిలి సంతస బరచగ
పిక్కటి లెయా ది శలెల్ల  వేంకట రమణా     64


అవతా రంబుల యందున
నవతారము నీదె ముఖ్య మార్యా ! జగతి
న్నవనిని గల జను లందఱు
వివరముగా ననిరి యిట్లు  వేంకట రమణా !   65

కలియుగ దైవము నీవని
నిలనున్గల జనులు నిన్ను నెదలో గొలువన్
దలపున సంతస మాయెను
వెలయింతని గట్ట లేను  వేంకట రమణా !    66

విశ్వాసము మేలైనది
విశ్వాసము గలుగు నెడల విశ్వము లొంగు
న్వి శ్వాస మనగ  నదియే
విశ్వాసము నిమ్ము నాకు  ! వేంకట రమణా !    67

వీ డుదు జెడు సహవాసము
వీ డుదు నే దుష్ట జనుల వీ డుదు  భవము
న్వీ డు దు  నీ జగమును  సరి
వీ డను నీ పా దములను వేంకట రమణా !   68

ఎన్నో నిడుముల జిక్కితి
నన్నియు బోగొట్టు సామి !యాప్యాయత తోన్
సన్నుత !దేవా ! మాయీ
విన్నపముల నాలకించు వేంకట రమణా !   69

ఇంతగ బ్రార్ధించిన మఱి
సుంతైనా బలుక వీవు జోగుచు నుంటే ?
పంతము బట్టితి వేమో
వింతలలో భాగమ యిది వేంకట రమణా !     70

ద్విజులును ఋషులును నమరులు
బ్రజలును భువి జీవ కోటి పరి పరి విధము
ల్లజరా మరుడవు ననుచును
విజయము జేకూర్చు మండ్రు వేంకట రమణా !        71

ఇందుగల వందు లేవను
సందేహము నాకు లేదు సామీ నీవు
న్నిందును నందును నుందువు
బిందువులో గూడ మరిని  వేంకట రమణా !    72

అవమానమ్ము లు హా రతు
లవిరళ ముగ జేయు చుందు రవనీ  పతినిన్
భువనైక పతివి నీ యెడ
వివశత జూపించ నోర్వ వేంకట రమణా !       73

మన్నున మనుగడ లేకను
మిన్నునకే నేగ దలచి మేమంద ఱము
న్దిన్న గ  వచ్చితి మిచటకు
విన్నపమును జేయ మీకు వేంకట రమణా !        74

గాలిని నింపిన బుడగలు
దేలికగా నెగురును గద దివికి న్దలప
న్నా లాగున మా  యసువులు
వీ లగునే బైకి బోవ  వేంకట రమణా !       75

పగ్గములు లేని మనసును
దగ్గరగా లాగ మనకు  దరమే వసుధన్
దగ్గరగా వచ్చుట కును
బిగ్గరగా నరువ వలె నె ?వేంకట రమణా !       76

అనయము నిను బ్రా ర్ధిం తును
వినయముగా సామి నేను వీడని భక్తిన్
కను రెప్పలు గంటిని వలె
పెను భద్రత గావుమయ్య  వేంకట రమణా !         77

చుర్రు మని చేయి కాలగ
మొర్రో యని బాలు డేడ్వ  మోడును వలెనే
బిర్ర బిగుసుకు న్నుం టివి
వెర్రినిగా దలతు వేమి వేంకట రమణా !        78

దశరధ నందనుడై యిల
దశ కం ఠుని  సంహరించి డా లోకములన్
దశ కంఠు వలని బాధలు
వీ శము  లేకుండ జేసె  వేంకట రమణా !         79

నీరును బాలును గలువగ
వేరుగనే జేయు హంస వేటికి దానిన్
ఆరవ ప్రాణము నీవే
వేరుగ నను జూ డబో కు వేంకట రమణా         80

తీరము వెంబడి గాలులు
జోరుగ వీ చంగ  జెట్లు శోషిలి బడగ
న్నారావము చెవి సోకగ
పేరురమున్సాగి పోయె  వేంకట రమణా !........81

కనుమా  చెడుకున్మూ లము
 ధనమే, మోక్షము గడించు దారిని జూపు
న్ననయము శంభుని ధ్యానము
విను మఱి యీ నాదు మాట  వేంకట రమణా !.......82

గంటులు బడియెను దేహము
కంటికి నిక జూపు లేదు కానగ నెటులో
నంటీ యంటక నుండకు
వింటివె  యీ నాదు మాట  వేంకట రమణా !........ 83

ఇత్తును దీపము ధూపము
నిత్తును నైవేద్య మయ్య ! యిష్టము కొలది
న్నిత్తును మంగళ హారతి
విత్తము నేగో రనిన్ను వేంకట రమణా !........... 84

అన్నలు దమ్ములు సెల్లెలు
నన్నున్నిట  నొంటి జేసి నర్మపు బుద్ధి
న్దిన్నగ బోయిరి యెటకో
విన్నప మిది యాలకించు వేంకట రమణా !.......... 85

లజ్జను విడిచియు  మఱి నీ
పజ్జనె నేనుండ గోర వాం ఛిం చితినే
సెజ్జన నుండగ నిత్తువె ?
వెజ్జవు  మఱి నీవె నాకు వేంకట రమణా !......... 86

ఉల్లము నీయది యెరు గుదు
మల్లియ వలె దెల్ల గుండు  మమతల తోడన్
జల్లగ నుండగ నుబటిక
బెల్లము నైవేద్య మిడుదు  వేంకట రమణా !......... 87

ఎట్టులొ  నిను సే వింతు ను
గట్టడి జేయంగ నీకు కనగను సబుబే
యట్టులు గాదని మొండిగ
బెట్టును జేయంగ నేల ? వేంకట రమణా !..... 88
దుస్స సేనుని యర్ధాంగి ద్రుపద తనయ


దుస్స సేనుని  యర్ధాంగి  ద్రుపద తనయ
లిరువు   రొ కయింటి   వారుగా  నిలను దనరి
సాటి  వారల  యందున  మేటి  యగుచు
బేరు  పొందిరి  యుత్తమ  నారు  లుగను
 

పద్య రచన - బాలుడు బర్రె నెక్కుట

బాలు డొక్కడు  కూర్చుండి  బర్రె పైన
పోవు  చుండెను జూడుము  భువన తలము
చుట్టి    వచ్చు నే  మో మఱి  చూడ  వలయు
నతని  పయనము   సాగునో  నెంత  వరకు ?

Tuesday, August 25, 2015

ముండను వీ క్షించి మగడు మోదము నందెన్

పండుగ  రోజున  ద నసతి 
మెండుగ నాభరణ ములను  మెడనున్మ  ఱి యు
న్నిండుగ బూలను  గలిగిన
ముండను  వీ క్షించి  మగడు  మోదము  నందెన్ 

పద్య రచన - కెమేరా


మాయా  మంత్రము  లెఱుగని 
యా యంత్రము దీ యుమనల నపురూ పముగాన్ 
ఛాయా గ్రాహక పరికర 
మేయది మఱి చూడు డా ర్య ! మీకన్ను ల తోన్ 

Monday, August 24, 2015

బొట్టు

బొట్టు ముఖ్యము  హైందవ  పొలతి  కెపుడు
మంగళ ప్రదము మఱియు మాన నీయ
మిలను  సౌభాగ్య మిచ్చును  నెంత గానొ
పెట్టు కొనుడమ్మలార! యీ  బొట్టు నెపుడు

బొట్టు లేనిచో  నర్హత పుట్ట దెచట
శకున  ములకుగా  ని,శుభము జరుగు  చోట్ల
కేగ ,బిడియమ్ము బొందుదు రెపుడు మీరు
పెట్టు కొనుడమ్మ లార ! యీ బొట్టు  నెపుడు


అంద మిచ్చును ముఖమున  కందఱి కిని
బొట్టు కలిగిన ముఖమున  బొమ్మ వ్రాయు
మంచి జీవన మొందుత !  మంది లోన
పెట్టు  కొనుడ మ్మ  లార! యీ బొట్టు నెపుడు

బొట్టు  పెట్టెడు  వారికి  పుడమి యందు
పెరుగు నాయువు  , శుభములు  పేర్మి తోడ
బొట్టు లేనిచో విధవతో బోల్చు దు ర ట
పెట్టు కొనుడ మ్మలా ర ! యీ బొట్టు నెపుడు

ఆడ  వారునే  గాకుండ  నరయ గాను
పురుష పుంగవు లనబడు నరులు కూడ
పెట్టు కొనిననీ  బొట్టును  బిట్టు గాను
గలుగు శుభములు  శంకరు గరుణ వలన 

లంగా - లుంగీ - చీర - దోవతి( భార తార్ధము )

ఖాండవ వనము  నదరులం  గాల్చి  మిగుల
మేటి  వీరుడై చీరగ సాటివారి
వార  లుం గీడు జేయగ   బా  ర్ధుడం త 
దోవతి ని నూర డిం చెను  దోడునగుచు 

పద్య రచన -కంబము

చిత్ర మందున  కంబము  చిత్రముగను
నెట్టి  యా ధార ము  నులేక యిలను  బైన
నెట్లు  నిలబడి  యుండెనో ? నింతి  యొకతె
తనదు  చీరను  జాపుచు  దాని యడుగు
నకును ,చూచుచుండెను వింతను కుతు  కమున 

Sunday, August 23, 2015

పడుచున్నను పెండ్లి యాడు వారే లేరే

నడివయసు పైబడి వ్యధ
పడుచున్నను పెండ్లి యాడు వారే లేరే
వడిగా స్థిర బడ దలచితి
బడలేనిక సవతితల్లి  బాధలు సామీ !

పద్య రచన -ఇతర దేశాల వారలు

భరత  దేశపు  సం స్కృతి  న్భవ్యముగను 
నితర   దేశాల వారలే   యిష్ట పడుచు 
నుండ  మనవార   లరయగా  నొకరు మించి 
యొకరు   ధరియింత్రు  వస్త్రముల్నొప్ప  నవియ


Saturday, August 22, 2015

బాణమ్ములు గ్రుచ్చు కొనగ భామిని మురిసెన్

వా ణీ  హరిణము చచ్చెను
బాణమ్ములు గ్రుచ్చు కొనగ భామిని మురిసె
వీణా  నాదము వినగను
బ్రాణ మ్మును  లేచి వచ్చు బరులకు నైనన్

 

పద్య రచన - కుమ్మరి ,కుండలు

కుమ్మరి కుండలు సేయగ
నమ్మట్టిని జదునుజేసి యటునిటు వట్రు
న్నిమ్ముగ జేసియు చేయును
సమ్మెట తో గొట్టు చుండు  సరిగను రాగన్ 

కుక్కకు దలబ్రాలు వోయుకుతుకము గలిగెన్

మక్కువగ జేయ పెండ్లిని
కుక్కకు, దలబ్రాలు వోయుకుతుకము గలిగె
న్జక్కని శునకము తోడన
మిక్కిలి సంతసము  గలుగ మీరా ! వింటే !

 

పద్య రచన -వర్షపు నీరు

బోరున వర్షము పడుట న
పారగ జలమంత యచట  బాహా టము గ
న్జేరెను  వీధుల  లోనికి
కారుల గమనము నకదియ  కష్టం బా యెన్ 

Thursday, August 20, 2015

పద్య రచన -బాలలు -చక్రాలు

కల్ల  కపటమ్ము నెరుగని నుల్ల మలర 
బాల లిద్దరు  మోదాన  పరుగు లిడుచు 
నాడు చుండిరి చక్రాల యాట నచట 
యొకరి కొకరుగా రెట్టింపు నుత్సుకతన 

శేషమే చాలు నెనలేని సిరులు గురియు

వేంకటేశ్వర !నీకునే  వేయి మార్లు
పూజ  చేయగా  జాలను  బూల తోడ
నీదు నామము స్మరియింతు నిరత మయ్య !
గారవంబున  నీవిచ్చు  కరుణ రసపు
శేషమే చాలు నెనలేని  సిరులు గురియు 

Wednesday, August 19, 2015

కరంటు వాడు

ఎన్ని మారులు బిలిచిన నన్ని సార్లు 
వచ్చు చున్నాను  ననుచును బలుకు గాని 
వచ్చు నటువంటి జాడలు  మచ్చు కైన 
కాన బడుట లే  దున గే షు  గారు ! నాకు  

అఖిల కవి మాన్యమై యలరారు బూతు

మంచి కావ్యము వ్రాసిన  నంచితముగ
అఖిల కవి మాన్యమై యలరారు, బూతు
పెండ్లి  సమయాన వచ్చు చు  బ్రేమ మీర
క్రొత్త జంటకా శీ సుల నిత్తు రార్య !

పద్య రచన -పుట్టలో పాలు

నాగుల చతుర్ధి రోజున
త్రాగుటకై నాగరాజు తరుణులు బాలన్ 
వేగమె పోతురు పుట్టన 
బాగని దామదిని దలచి ప్రతివ ర్షమునన్ 

పనసపండు

పనసపండు కోసి పంచిపె ట్టితి నార్య !
తొనలు దినగ మిగుల దనరె తీపి
యింత తీపి తొనను నెచటను దినలేదు
భద్ర పఱచి గింజ పాతు డ య్య !

Tuesday, August 18, 2015

భారత యుద్ధమున నయ్యొ పా ర్ధుం డో డెన్

కౌరవ పక్షపు యోధుడు
బీ రముతో బోరు సలుప  భీష్ముడు రాగ
న్బోర న్నిలువగ  బార్ధుడు
భారత యుద్ధమున నయ్యొ పా ర్ధుం  డో డెన్ 

పద్య రచన -నిధుల దుర్వినియోగము

ప్రభుత యిచ్చును నిధులను బ్రజల కొఱకు
నంచె  నంచెలు  గాగను ,నదియ వచ్చు 
బడుగు  ప్రజలకు పిసరంత  భాగముగను 
గొల్ల కొట్టుదు రధి కారు లెల్ల నిధిని

నిధుల రాకను జూడుమా  నీరజాక్షి !
ప్రభుత నుండి యమాత్యుల  వారి  కచట
నుండి యధ్యక్షు నకునట నుండి యాక
మీ షన రువారి  కటనుండి ,మిగులు సొమ్ము
బడుగు ప్రజలకు  గోరంత  వచ్చు నమ్మ !

Monday, August 17, 2015

కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట

విశ్వ రూపమ్ముదానుగా  వీ క్షణ మ్ము
కొఱకు ధృ తరాష్ట్రుడు హరిని  గోర నతడు
తనదు రూపమ్ము జూడ  న   యన ము  లీయ
కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట


పద్య రచన -ఝాన్సీ లక్ష్మీ బాయి

చిత్ర మయ్యది చూడగ జిత్ర మాయె 
ఝాన్సి లక్ష్మి బాయి యచట శత్రు మూక 
నువధి  యించుట కొఱకు త  నూజు వెంట 
బెట్టు కొనివచ్చె నోయమ్మ !బిట్టు గాను 

Sunday, August 16, 2015

చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

వింతగ నుడివితి రార్యా !
చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసె
న్నెంతో మేలగు రచనలు
సంతుల కవి సాయబడును  సరసపు రచనన్ 

పద్య రచన -నీలి చిత్రము

నీలి మబ్బులు గగనాన నిండు కతన 
కొండ లన్నియు మఱి యును కువలయమును 
వారి సహితము నీ లమై  మారె నచట 
యెంత యందము ? వర్ణించ  యెవరి తరము ?

Saturday, August 15, 2015

తేజ డేన్సు( ఆగస్టు 15 సందర్భముగా )

సభికు లందరు మౌనము నభినయించ
తేజ చేసెను నృత్యము దివ్యముగను 
ప్రేక్ష కజనము జేజేలు  ప్రియము తోడ 
పలికి రప్పుడు మఱి యును  బహుమ తులను 
నంద జేసిరి వారలా  నంద మొంది

చక్కని యాసభన్మిగుల సాహస మొప్పగ నృత్యముం సదా
చొక్కపు ధైర్యమున్గలిగి  జోడయి సంతస మప్పుడున్ దగ
న్నక్కున జేర్చియా నటన నచ్చెరు వందగ జేసెనో గదా
యక్కట యెంతగా నెదిగె  నమ్మరొ మీరును గంటిరే  గదా

ఆడి పాడి నంత యలసిపో తివిగద
తెచ్చి యిత్తు పాలు  తేజ ! నీకు
త్రాగి నిదుర పొమ్ము తాతమం  చముమీద
యేసి  వేసికొనుమ యిష్ట మైన

ఎంత చక్కని  నృత్యము యేమి హావ
భావములవియ బహు చిన్న వయసు లోన
వర్ణ నీయము గాద ది పరమ పురుష !
చూడ వలయును నానాటి వేడుకను


సకల శుభములు గలిగించు  శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటి కినిరెప్ప  యట్లయి కాచు గాత !
యెల్ల వేళల తేజును జల్ల గాను


పద్య రచన - కొండ నెత్తుట

వాన పడుచుండె జూడుము పటము నందు
తడవ కుండగ  నుంటకై తమ్ము డొకడు 
కొండ నెత్తెను దనకొన గోటి తోడ 
బలము గలవాడు గాభావ  మలరె నాకు
భర్తృ రహిత సంతు బడసి మురిసె

ఉంచు కొనిన  వాని  కొడలిని చ్చి యొ కతె
బిడ్డ గనగ నంత ప్రేమ మీర
చూఛి  మురియు  చుండె  సోయగంబునకు ను
భర్తృ  రహిత సంతు బడసి మురిసె 

Friday, August 14, 2015

ఆహ్వానం!రాజరాజనరేంద్రుని పట్టాభి షేక సంచిక

రాజ రాజ నరేంద్రుని రాజ్య వైభ 
వమును గూ రిచి  రచియించు  ప్రముఖ  పుస్త 
కమును నావిష్కరణ  మును ముమ్మరముగ
జేయు కారణం బునదఱి  శిరము వంచి 
వంద నంబులు సేతును వారి కిపుడు 

మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

అవ్వా ! చూడుమ యచ్చట
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరె
న్బువ్వుల వర్షము గురియుచు
నెవ్వడు మఱి యెగురవేసె  నిప్పుడు దానిన్ ?

Thursday, August 13, 2015

Suryanarayana Rao Ponnekantyస్వాతంత్ర్య మందెనన్ సంబరంబే కానీ- భారత నారికి భద్రతేది?
 ఆంగ్లేయ పాలన అంతమొందెనెగాని- అన్నవస్ర్తమ్ముల కాశ గలదె? 
మనవారి పాలనన్ ఘనము చెప్పుటె గాని-- ధర్మంబు రక్షించు దాత గలడె?
 నీతికి దేశంబు నిలువెత్తు సాక్ష్యమ్ము- అక్రమాలవియేల ఆగవయ్యొ?--
దిద్దు కొనరండు యువకధీరులార! ధిషణ జూపించి మీదగు తిరుగు లేని-
 దేశ భక్తిని సత్క్కార్య దిశను జూపి- మానవత్వంబు చిగురింప మమత పండ!

రాము డుండు చోట గాము డుండు

సకల సంప దలును సమకూరు ధర లోన
రాము డుండు చోట, గాము డుండు
నాడ మగనొ కదరి యడయాడు చుండిన
నమ్ము డా ర్య ! మీరు నాదు మాట

Wednesday, August 12, 2015

ఒప్పుల కుప్పవు వలదను టొ ప్పదు నీకున్

అప్పల రమణుని కూతుర !
యొ ప్పుల కుప్పవు, వలదను టొ ప్పదు నీకు
న్విప్పారిన గన్నులు గల 
చప్పిడి నాగయ్య నీకు సరియగు నుమఱి న్ 

Tuesday, August 11, 2015

పసిబాలుడు పెండ్లి యాడి పడసె గుమారున్

ముసిముసి నవ్వుల లలరెను
పసిబాలుడు ,పెండ్లి యాడి పడసె గుమారు
న్గొసరాజు వారి  తనయుడు
వసుదేవుని గూ తురైన  వాసవి నెలమిన్ 

పొన్న కంటి వారు

దేశభక్తి మిగుల దీపించె మీలోన
 భరత మాత యనెడు పదము విన్న
 పారవశ్యమంది  పద్యాలు పొంగెగా
పోచిరాజవంశ పూర్ణచంద్ర!Monday, August 10, 2015

ఆగష్టు 15

ఈ రోజే మన పండుగ
మీరందరు వచ్చిరిటకు మీరని భక్తిన్ 
గారవపు నతుల నిడుదును 
వీరుల మది దలచు చుండి వీడని భక్తిన్ 

ఆంగ్ల పాలకు లవశమై యష్ట కష్ట 
ములను  భరియించు బ్రజలకు ముక్తి కొరకు 
గాంధి  మొదలగు వారలు గలసి గట్టు 
తనము తోడన పోరాడి తనర దెచ్చె 
దేశ మునకు స్వరాజ్యము దేజరిలగ 

ఖైదు  లోపల మ్రగ్గియు కఠిన మైన 
దెబ్బ లెన్నియో భరియించి ,తెలివి పోయి 
బ్రతికి రార్యులు  జీ వ చ్ఛ వంబు వోలె 
చెప్ప  లేమయ్య  వారల చిప్ప కూడు 

అట్టి  మహితాత్ము  లగురిచి గట్టి గాను 
నెంత జెప్పిన మఱి యది  సుంతె  యగును
వంద నంబులు వారికి వంద లాది
చేయుటే మన  కర్తవ్య మార్య !యికను

భరత మాతకు పలుకుడు భవ్యు లార !
జైభ  రతమాత !యిక నీకు  జయము జయము
సేవ జేతును నిరతము శిరము  వంచి
దయను జూడుమా నాపైన ధాత్రి  జనని !

దేశ  మునకునై ప్రాణాలు దీ సికొనిన
నాయ  కులయాత్మ శాంతికై నలువ గురిచి
చేయ బ్రార్ధన నేనును  జేతు నార్య !
సెల  వొ  సంగుడు నాకిక  సేతు నతులు


జై భారత్ .......... ....... జై హింద్ 
మన్మ ధుండు హైమవతికి మగడు గాదె

ప్రేమికుల మధ్య  ప్రేమను  బెంచు నతడు
మన్మ ధుండు, హైమవతికి మగడు గాదె
సకల శుభములు గలిగించు  శంకరుండు
నాది పితరుడు  జగమున కతడె  సుమ్ము 

Sunday, August 9, 2015

శ్రీ రమణీ లలామ నెద జేర్చినవాడు శివుం డె శంభుడే

ఆరయ   విష్ణువు న్హృదిని దాల్చిన వాడట  యౌనుగా మఱి న్
శ్రీ రమణీ లలామ నెద జేర్చినవాడు శివుం డె,  శంభుడే
పారము ని చ్చువాడు  నిల పామర భేదము నించు కైనను
న్భా రముగా దలంపకను బంధు గణం బును  బ్రోచునే గదా 

పద్య రచన -ఇడ్లీ -పెసరట్టు

ఇడ్లీ ,పూరీ,వడలును
ఇడ్లీ సాంబారు మరియు ఇడ్లీ చట్నిన్
ఇడ్లీ లు పెసర యట్టుల
ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?

చిత్ర మందున జూడుము పత్రమందు
వేరు వేరుగ   నిద్లీ లు  ప్రీతి గలుగ
సిద్ధ పఱచిరి   దోసెను  శుద్ధ ముగను
 చూడ చక్కగ  నున్నవి సొబగు తోడ 

Saturday, August 8, 2015

బట్టలు లేకుండ దిరుగువాడె సుజనుడౌ

చుట్టా లబ్బాయే యా
బట్టలు లేకుండ దిరుగువాడె, సుజనుడౌ
కట్టడి జేయగ  దుష్టుల
నట్టిటు నిక మారకుండ నందరు మెచ్చన్ 

పద్య రచన -చిన్న పిల్ల ,నాట్యము

పెద్ద పెద్దగ గన్నులు ముద్దు గొలుప 
చేయు చుండెను నాట్యము చిన్న పిల్ల 
యెంత జక్కగ నున్నదో యంత చిలిపి 
దనము తోడన నొప్పెను దన్వి ! చూడు

Friday, August 7, 2015

పండితుడన నెవడు పరమ పామరుడు గదా

మెండుగ జదువులు జదివియు
నిండుగ  మఱి  మంచి సూక్తి  నేర్పక యెపుడున్
దండిగ  దర్పము  కలిగిన
పండితుడన నెవడు పరమ పామరుడు గదా 

పద్యరచన -ఉల్లిపాయ -అన్నము

ఉల్లి పాయ  ధరలు నుడుమార్గ మునుజేర 
పామ రుం డొకండు  భద్ర ముగను 
నుట్టి వోలె పైన నోలలా డగ  జేసి 
చూచు  చన్న ము దిను  చుండె  సామి !

Thursday, August 6, 2015

పద్య రచన -ట్రాక్టరు -ఏనుగు

చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
గజము నెక్కించు కొనిబోవు కరణి జూడ
నద్భు తంబుగ నుండెను నాహ ! యదియ
నతుల నొనరింతు గజరాజు నమ్ర  తకకు 

మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్


ఏనాతియు నిల బ్రదుకదు
మానము వీడిన ,సుఖమని మానిని చెప్పె
న్నేనాడు గోపగించక
పానముగా జూచు కొనెడు  భర్తలు దొరకన్ 

జగన్నాధ శాస్త్రీ జీ

సకల శాస్త్రాలు సదివిన శాస్త్రి వర్య !
జగము నంతను నెరిగిన జగను సామి 
వేద సారము దెలిసిన వేద విదుడ !
యందు కొనుమయ్య ! దండాల నందు కొనుము 

యజ్ఞ యాగాదు లెన్నియో విజ్ఞత నన 
నియమ నిష్ఠ ల తోడన  నిర్వ హించ
సోమ యాజిని జేసిరి సుజన గణము 
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

కంచు  కంఠము  నీయది కమ్మ గుండు 
యాగ  మధ్యన మంత్రాల  నర్ధములను 
విశద పఱతువు మాకయ్య విపులముగను 
సంత సించితి రెల్లరు  సంతు తోడ 

సకల శుభములు గలిగించు శంక రుండు 
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి 
కంటికిని  రెప్ప యట్లయి  కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను Wednesday, August 5, 2015

న్యస్తాక్షరి - 32 (ప్ర-మా-ద-ము) అంశం- వాహనములు... ప్రమాదములు. ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘ప్ర - మా - ద - ము’ ఉండాలి.

ప్రజలు తమవాహ  నంబులు వడి వడి గను
మార్గ మంచున  నడిపిన  మైమరచుచు
దరిని  జేరగ  గష్ట మై ధరను బడు ను
ముప్పు రాకుండ  నడుపగ  ముదము కలుగు

పద్య రచన -తాంబూలము

తమల పాకులు వక్కలు తమము తోడ 
కదళి ఫలములు బెట్టియు కాంత లచట 
యిత్తు రెపుడును దాం బూ ల మిచ్చా కలిగి 
తనర సౌభాగ్య మయ్యది తమకు కోరి 

ఆహ్వానము - రాయలవారి పట్టాభి షేకము

రాజ్య పట్టాభి షేకమ్ము రమ్యముగను 
జరుపు కొనునట్టి రాయల వారి కిడుదు 
వందన శతములు మఱి నేను  భక్తి తోడ 
నంద జేయుడు దయజేసి  యార్యులార !

Tuesday, August 4, 2015

పద్య రచన -మురికి కూపము -నివాసము

ముఱి కి  పారె డు  గొట్టపు  ముఖము  నందు 
వాస  మున్నట్టి  యాతల్లి ,బడికి పంపు 
చుండె దనదుకూ  తుమురిపించు చునును  నట 
యెంత చక్కని  తల్లియో వింత గొలిపె 


సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

అంజని  సుతుడే దెచ్చెను
సంజీవని ,నంగదుండు సరగున దెచ్చె
గంజ దళాక్షుని గొలువగ
రంజిత కుసుమాల నెన్నొ రాగము తోడన్ 

పద్య రచన -బాలుడు -లేప టాపు

చిన్న బాలుని జూడుము చిత్ర మందు
లేపు టాపును జూచుచు, లేవకుండె
బాలు ద్రాగుట కైనను వాహ ! యేమి
శ్రద్ధ? యాతని ధీశక్తి  చాట తరమె !
మాధవుడు సారధి యయె సుయోధనునకు

పార్ధు  రధమునకు రమణ !బావ యైన
మాధవుడు సారధి యయె, సుయోధనునకు
నంగ రాజైన  కర్ణుడు నాప్తు డగుట
పాండవుల పైన గక్షను బలపరచెను 

సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము

కోరు కొందురు శాంతిని కువలయమున
సాధువులు ,గోరుచుంద్రు  సంసార సుఖము
రక్తి గలిగెడు మనుజులు ముక్తి కాక
రక్తి  యున్నచో  టన మఱి  ముక్తి యుండు 

Monday, August 3, 2015

భార్య మరణించినంత సంబరము గలగె

మోడు గామారు జీవిత  ముగద ,మనకు
భార్య మరణించినంత ,సంబరము గలగె
నాలు  బిడ్డలు మనుమలు నంద రార్య !
యొక్క చోటున నుండంగ జక్క గాను 

Sunday, August 2, 2015

పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్

అరయుము లోకపు తీరిది
పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియె
న్వెరవుంగా ననిపించిన
ధరలో కలియుగ మహిమలు దనరును నిటులన్ 

రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము

మంచి పనియగు నెల్లెడ మానవులకు
రక్త దానమ్ము సేయుట, రాక్షసమ్ము
మనిషి మనిషిని జంపుచు మనుగ డనిల
నేర మౌనుగా మఱి యది  నిజమరయ గ 

పద్య రచన -కొండ పైన బస్సు

భయము  గలిగించు  దృశ్యము బహుళ ముగను 
కొండ మార్గము  వెంబడి గుబులు కొలుప 
బస్సు పయనము ,గుండెద  బదబ కొట్టు 
కొనియె  నిప్పుడు నాకుగా , మేను గూడ 
జలద రించెను జూడుమా వలపు రాణి !

శంకరార్యుల ఇంటర్వ్యూ

తెలుగు  సాహిత్య రంగము  దేజరిలగ
శంకరాభరణ బ్లాగు  సంతరించి 
నివురు గప్పిన  నిప్పుగా నెగడి నట్టి 
శంక రార్యుల కిడుదు  శతపు నతులు 

Saturday, August 1, 2015

వరుని జూచి నంత భయము కలిగె

ముఖము  ఖేదము నన  ముడుచుకొ  నె రమకు
వరుని  జూచి నంత , భయము కలిగె
వికృతి  చేష్ట  తనది వీక్షించ  సూటిగ
తుళువ  వాని  వలెను దోచె  నేమొ ?

వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను

సర్వ సంపదలును సర్వనాశ నమగును
వేశ్య వలన, బ్రతుకు  వెలుగు లీను
సకల శుభము లిచ్చు శంకరు న్వేడగ
మోక్ష మబ్బు  మనకు ముఖ్య ముగను 

పద్య రచన -బ్రాహ్మణుడు అర్ఘ్య మిచ్చుట

భక్తి  శ్రధ్ధల తోడన  బ్రాహ్మ ణుండ
యి చ్చు చుండెను  నర్ఘ్యము నింపు మీర 
చూచి తిరె మీరు?  శంకర !చోద్య మదియ 
యీవి  ధమ్ముగ బ్రతియొ  క్క  రీయ  వలయు 

వనమే మానవ జాతి యున్నతికి సర్వ శ్రేష్ఠ మూ లంబగున్

వనమే మానవ జాతి యున్నతికి సర్వ శ్రేష్ఠ మూ లంబగు
న్ననగా  సత్యము ,సందియంబునకు నీయంగా సమాధానము
న్వినగా నోపను నార్యులార ! యిక మీ విజ్ఞాప నాలా పము
న్వినిపించంగను యత్నముం, మాపేట న్గనం గా వలెన్ 

ఈగ పడిన పాలు హిత మొ సంగు

ఈగ పడిన పాలు హిత మొ  సంగు ననుట
తప్పు నందు కలియు  దాని మలము
సకల రోగ ములును   సంభవించుమనకు
త్రాగ వలదు సామి ! త్రాగ  వలదు